గడ్డలు , దద్దుర్లు , సెగ గడ్డలుకు గృహ చికిత్స - Vedi Gaddalaku chikista

0
గడ్డలు , దద్దుర్లు , సెగ గడ్డలుకు గృహ చికిత్స - Vedi Gaddalaku chikista
రక్తంలో ఆమ్లాలు పెరిగిన , acidity పెరిగిన శరీరంలో గడ్డలు , దద్దుర్లు , సెగ గడ్డలు వస్తాయి . వర్ష ఋతువులో ఎక్కువ మామిడి పండ్లు తినడము , కలుషితమైన నీళ్ళు త్రాగడం , స్నానము చేయడము వలన గడ్డలు వస్తాయి . గడ్డలు మొదట  ఎర్రగా , నొప్పిగా వుండును . కొద్ది రోజుల తర్వాత చీము , చెడు రక్తం వస్తుంది. మంటగా మరియు దురదగా వుండును .

*గృహ చికిత్సలు*  
 1. క్యారట్ రసం పూయ వలెను. 
 2. గంధంలో లవంగాలను బండ మీద నూరి , ఆ గంధమును పూయ వలెను . 
 3. కొద్దిగ పసుపు + తేనెలను కలిపి తినవ‌లెను . 
 4. ఆవాల నూనె + కొద్దిగ పసుపు + అరటి చెట్టు వేర్ల పొడిని కలిపి , గడ్డల పైన పూయ వలెను . 
 5. గంధం పూయ వలెను . తగ్గి పోవును .
 6. గోరింట ఆకులను + 1 గ్లాసు నీళ్ళలో మరిగించి , ఆ నీళ్ళను పూయ వలెను .
 7. ద్రాక్ష చెట్టు ఆకుల రసం పూయ వలెను . 
 8. కాకర కాయ ఆకుల రసం పూయ వలెను. 
 9. లవంగాలను బండ మీద నీళ్ళతో నూరి పూయండి .
 10. పసుపు + లవంగాలను కలిపి నూరి పూయ వలెను .
 11. వేప ఆకులు + ఇంగువ + ఎల్లిపాయలను బండ మీద నూరి పూయ వలెను . 
 12. బార్లీ పిండి + అతి మధురం పొడి + ఆవు నెయ్యి లను కలిపి ointment లాగా తయారు చేసుకొని  పూయ వలెను . 
పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి ఆరోగ్యాన్ని పొందండి .

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top