నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

17, ఏప్రిల్ 2018, మంగళవారం

విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది - Vishnu Sahasra Naamam

vishnu-sahasranamam
మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది! భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు.

మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?
అది 1940వ సంవత్సరం.

శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది" అని అడిగారు.

ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"
ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"

స్వామివారు:: "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"
మళ్ళీ నిశబ్దం.

స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు,
"ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్ఠిరుడు  అడిగాడు.

"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.

శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.
"అదేలా" అని అందరూ అడిగారు.

శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్ఫటికం వేసుకున్నాడు.

ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.

శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు.

ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

విష్ణు సహస్రనామ స్తోత్రము చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ⋗⋗

జయ జయ శంకర !  హర హర శంకర ! జయ జయ శంకర పాలయమాం!! 

శ్రీగురుభ్యో నమ:

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »