నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Monday, May 7, 2018

పూర్వం పల్లెల్లో వైద్యం - Pallello Vaidyam - Health System in Villages

పల్లెల్లో వైద్యం
అప్పటికింకా ప్రభుత్వ ఆస్పత్రులు పల్లె వాసులకు అందు బాటు లోకి రాలేదు. వచ్చినా పల్లెవాసులకు వాటిని అవగాహన చేసుకొని ఉపయోగించుకునే తెలివి వారికి లేదు.

ఎక్కడో పట్టణాలలో వుండె ఆస్పత్రులకు ఈ మారు మూల పల్లె వాసులు పోలేరు. పోగలిగినా అక్కడి వారితో ఎలా వ్వహరించాలో తెలియక ఎం మాట్లాడితో ఏం జరుగు తుందో అవమాన పడవలసి వస్తుందో అనే అనుమానం ఎక్కువ.

ఆనాటి పల్లె ప్రజలు రైతులు చాల నిజాయితి పరులు, నిక్కచ్చి మనుషులు, ఆనవసరంగా ఎవరైనా ఒక మాట అంటె పడరు. ఆంచేత ... పరాయి వూరికెళ్లి ఎవరినో బతిమాలి బామాలి మందులు తెచ్చుకోవడమేమిటని దాని పై శ్రద్ధచూపరు. తమకు తెలిసిన వైద్యమో తమ ఇంటి ముందుకు వచ్చిన వైధ్యమో దాన్నే ఆశ్ర యిస్తారు.

అది పల్లె వాసుల నైజం. ఇది ప్రభుత్యం గ్రహించడం లేదు. అప్పటికి ప్రభుత్వం తమ స్థానాలల్లో పూర్తిగా కూర్చొని సర్దుకోలేదు. ఇంత చిన్న విషయాన్ని ఎలా పట్టించు కోగలదు. అందు చేత అప్పటికి ఎంతో కాలం ముందు నుండే అమలలో నాటు వైధ్యుల సహకారం ఇంకా ఉపయోగించు కుంటున్నారు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »