నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
వైద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వైద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఫిబ్రవరి 2020, శనివారం

ప్రాచీన ఆయుర్వేద విధానంలో ఇంజక్షన్ ద్వారా వైద్యం - Healing by injection in the ancient Ayurvedic system



ఆయుర్వేదం నందు ఇంజక్షన్ ద్వారా వైద్యం చేసే ప్రాచీన విధానం

మన ప్రాచీన ఆయుర్వేదం నందు ఔషధాలను నోటి ద్వారా కాకుండా ఒక సూది ద్వారా లొపలికి ఇచ్చే వైద్య విధానం ఒకటి ఉన్నది. కొన్ని పరిస్థితులలో రోగి నోటి ద్వారా ఔషధాన్ని గ్రహించలేకున్నప్పుడు అనగా అపస్మారము, మూర్చ, సన్నిపాతము, పాముకాటు, మెదడు వ్యాధి , యాక్సిడెంట్స్ , మెదడు నితినే ensplosis ఉన్మాదము వంటి వ్యాధుల యందు , స్మృతి లేని పరిస్థితుల యందు (COMA) రోగి రక్తం నందు ఔషధము ను ప్రవేశింప చేయుట . 1906 వ సంవత్సరంలో మద్రాస్ గవర్నర్ గా ఉన్న జార్జ్ ఏప్రెల్ గారు భారతీయ మెడికల్ అసోసియేషన్ ముందు ఉపన్యాసం ఇస్తూ " టీకా "( వాక్సినేషన్) మరియు ఇంజక్షన్ విధానం మున్నగు పద్ధతులు డాక్టర్ జన్నర్ మహాశయుని కంటే పూర్వమే భారతీయులు వైదిక యుగము నుండియే టీకా విధానం వాడుచున్నారు అని డాక్టర్ కర్నల్ గారు నిరూపించారు అని సూచించిరి. డాక్టర్ కర్నల్ గారు ఋగ్వేదం , యజుర్వేదం , అధర్వణ వేదం నందలి ఒక మంత్రం ఈ విధంగా తెలియచేసారు .
   మస్త్వాజ్జః ప్రసర్పఖంగా మంగం పరుశ్పరూహ్
   తతో యక్షం వివాద్య స ఉగ్రో మధ్యమ శిఖి

        దీనిలో " ప్రసర్పన్ " " ప్రవిశ్యా " " అంతః " శిరాముఖ వ్యాపనోచి అంజనా గల శీలద్రవ్యం అంగ ప్రత్యంగం లో ప్రవేశించుగాక . ఈ భావమునే వైజ్ఞానికులు తెలుపుతున్న వాక్సినేషన్ మరియు ఇంజక్షన్ పద్దతులను తెలుపుతుంది.  ఈ సూచీ విధానం గురించి ఈ క్రింది గ్రంథాలలో వివరణ కనిపిస్తుంది.
  • 🍀 ధన్వంతరి సంహిత.
  • 🍀 రస కామధేనువు.
  • 🍀 రసరాజ వసంతము.
  • 🍀 బృహన్నిఘంటు రత్నాకరం .
  • 🍀 రసేంద్ర చింతామణి.
  • 🍀 యోగ చింతామణి.
  • 🍀 రసప్రకాశ సుధాకరము .
  • 🍀 శారంజ్గాధర సంహిత.
  • 🍀 బృహత్ యోగ తరంగిణి.
  • 🍀 రససైకత , కామ్కా ఉల్లాసం .
           రక్త భేషజ విధానం అనగా ఔషద విశేషమును రక్తం నందు ప్రవేశింప చేసి వ్యాధిని నిర్మూలించే విధానం . మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను .
  • ۞ సన్నిపాత ( typoid ) రోగి సృహ తప్పి పళ్ళు బిగించుకు పొయిన దశలో ఔషధమును నోటి నుండి గాని ముక్కుపుటము నుండి కాని లొపలికి పంపుటకు వీలుకాని దశలో కపాలమును పదునైన కత్తితో చీరి సిద్ధ ఔషధములు ను సూదిమొనకు వచ్చినంత మాత్రమే అందులో వేసి రుద్ది రక్తంతో కలిసిన వెంటనే మస్తిష్క నాడీకేంద్రం చేతనం పొంది వారు లేచి మాట్లాడతారు.
  • ۞ తేలు కుట్టిన వెంటనే ఆ విషం పైకి ఎక్కకుండా గట్టిగా బిగించి కట్టి కుట్టినచోట బ్లేడుతో కాని కత్తితో కాని చీరినప్పుడు రక్తంతో పాటు విషం కూడా కారిపోవును . రక్తం తీయలేని వారు పొటాషియం పర్మాన్గానేట్ ఆ చోట వేసి చింతపండు నీటిలో తడిపి ఆ గుజ్జుని దానిపైన వేసిన కుతకుతమని పొంగి విషముని కాల్చివేయును. లేదా తెల్ల ఉల్లిగడ్డ మెత్తగా దంచి దానిపై వేసి కట్టు కట్టాలి. లేదా ఉత్తరేణి ఆకు రసముని గంటె లొ వేసి ఆవిరి పట్టేది.
  • ۞ ప్రాచీన కాలంలో కొన్ని రకాల చెట్ల పసర్లుని సూదులు గుంపుగా కట్టి మొండి కీళ్ల నొప్పుల పైన ముసలివాళ్లు పచ్చ పోడిపించుకునే వారు . అడివి జాతుల యందు ఈ విధానం ఇప్పటికి అలవాటు ఉంది.
  • ۞ పాము కరిచినప్పుడు రావిఆకులు తో చికిత్స చేస్తారు . రావిఆకుల చిన్న మండ తీసుకొచ్చి ఆకులు తుంచిన పాలు వచ్చును. పాము కాటువేసిన వ్యక్తి యెక్క రెండు చేతులు వెనకకి విరిచి కట్టి పాలుకారే ఆకు యెక్క తోడిమని కదలకుండా ఒక చెవ్వు రంధ్రములో కొంతవరకే దూర్చవలెను . చెవిలొ కర్ణ బేరికి తగలకుండా ఉండునట్లు జాగ్రత్త వహించవలెను. రెండొవ ఆకు తోడిమని మరొక చెవి రంద్రములో జాగ్రత్త వహించవలెను. అలా ఆకులని దూర్చగానే రోగి మూర్చ నుండి లేచి భాధతో కేక వేయును.అతనికి పూర్తిగా విషం దిగినదా లేదా అని తెలుసుకొనుటకు వేపాకు రోగిచే నమిలి తినిపించవలెను . పూర్తిగా చేదు ఉన్నట్లయితే విషం దిగిపోయినట్లు గుర్తించవలెను. లేనిచో మరియొక సారి చేయవలెను .
  • ۞ తేనెటీగల కొండిలోని విషముతో కూడా వైద్యం చేయవచ్చు . శరీరాంగములు లో పొట్ట ఊది నీరు నిండి మెరుస్తూ ఉంటుంది. దానిలో పూర్తిగా నీరు నిండి ఉంటుంది. దీనినే జలోదరం అంటారు. ఇది చాలా కష్టసాద్యం అయిన వ్యాధి . శరీరం పై చర్మం మైనం లాగా అయిపొతుంది. మూత్ర పిండాలు పనిచేయవు . అట్టి సందర్భాలలో ఈ చికిత్స అధ్బుతంగా పనిచేస్తుంది . ఇది ప్రయోగించగానే మూత్రం అధికంగా వచ్చి శరీరం అంతా నీరు వాపు దిగి పొతుంది.
               చిన్నపిల్లలకు వచ్చు మెదడు క్షయ లొ పిల్లవాడు తెలియకుండానే పడిపోతాడు. తల అటుఇటు కదల్చ లేడు కేకలు పెడతాడు. లేచి పడతాడు , తలనొప్పితో ఏడుస్తాడు , శరీరం ఒక పార్శ్వం చచ్చు పడుతుంది. పక్షఘాతం అర్ద భాగం లొ కొట్టుకుంటాడు , కండ్లు తిరుగుతూ దృష్టి ఉండదు. నాడి వేగముగా కొట్టుకుంటుంది. మూత్రం తక్కువై మెదడులో నీరు చేరుట చేత తెలివిహీనుడు అగును. అట్టివారికి ఈ మందు పనిచేయును .

  తేనెటీగల కొండి చికిత్సా విధానం:
         తేనెటీగల కొండి విషాన్ని ప్రత్యేకమైన సిరంజి ద్వారా చర్మము క్రింద ఇంజెక్ట్ చేస్తారు . మనకు కావలసినప్పుడు ప్రకృతి సిద్ధముగా తేనెటీగలు వచ్చి ఆయాభాగముల యందు కుట్టవు.కావున ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆ విషమును సేకరించి ఈ సూచి చికిత్స ద్వారా పంపుదురు. దీనివలన బ్లడ్ ప్రెషర్ , గుండె , చర్మవ్యాదులు , కీళ్ళనొప్పులు , ముద్ద కీళ్ళనొప్పులు , ఉదరవాతం , గాయాలు మున్నగునవి నివారించ బడును.

గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రచన: కాళహస్తి వెంకటేశ్వరరావు, ఆయుర్వేద వైద్యులు. - అనువంశిక ఆయుర్వేదం
సంప్రదించండి: 9885030034

7, మే 2018, సోమవారం

పూర్వం పల్లెల్లో వైద్యం - Pallello Vaidyam - Health System in Villages

పల్లెల్లో వైద్యం
అప్పటికింకా ప్రభుత్వ ఆస్పత్రులు పల్లె వాసులకు అందు బాటు లోకి రాలేదు. వచ్చినా పల్లెవాసులకు వాటిని అవగాహన చేసుకొని ఉపయోగించుకునే తెలివి వారికి లేదు.

ఎక్కడో పట్టణాలలో వుండె ఆస్పత్రులకు ఈ మారు మూల పల్లె వాసులు పోలేరు. పోగలిగినా అక్కడి వారితో ఎలా వ్వహరించాలో తెలియక ఎం మాట్లాడితో ఏం జరుగు తుందో అవమాన పడవలసి వస్తుందో అనే అనుమానం ఎక్కువ.

ఆనాటి పల్లె ప్రజలు రైతులు చాల నిజాయితి పరులు, నిక్కచ్చి మనుషులు, ఆనవసరంగా ఎవరైనా ఒక మాట అంటె పడరు. ఆంచేత ... పరాయి వూరికెళ్లి ఎవరినో బతిమాలి బామాలి మందులు తెచ్చుకోవడమేమిటని దాని పై శ్రద్ధచూపరు. తమకు తెలిసిన వైద్యమో తమ ఇంటి ముందుకు వచ్చిన వైధ్యమో దాన్నే ఆశ్ర యిస్తారు.

అది పల్లె వాసుల నైజం. ఇది ప్రభుత్యం గ్రహించడం లేదు. అప్పటికి ప్రభుత్వం తమ స్థానాలల్లో పూర్తిగా కూర్చొని సర్దుకోలేదు. ఇంత చిన్న విషయాన్ని ఎలా పట్టించు కోగలదు. అందు చేత అప్పటికి ఎంతో కాలం ముందు నుండే అమలలో నాటు వైధ్యుల సహకారం ఇంకా ఉపయోగించు కుంటున్నారు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

4, మార్చి 2017, శనివారం

ఆయుర్వేదంలో చర్మవ్యాధులు వాటి మూలాలు మరియు చికిత్స - Ayurveda Treatment for Skin Diseases

ఆయుర్వేదంలో చర్మవ్యాధులు వాటి మూలాలు మరియు చికిత్స - Ayurveda Treatment for Skin Diseases
పంచభూతాత్మకమైన ఈ శరీరానికి మూలం వాత, పిత్త, కఫాలనే త్రిదోషాలు! ఈ మూడింటిలో ఏది సమతౌల్యం తప్పినా వ్యాధి తథ్యం! అందుకే ఆయుర్వేదం వ్యాధులను త్రి దోష ప్రధానంగా నిర్వచిస్తుంది... దోష ప్రధానంగానే చికిత్స అందిస్తుంది. అందుకే వ్యాధులను స్వరూప స్వభావాల రీత్యా మూలాల్లోకి వెళ్లి అర్థం చేసుకోవటం.. దోషాలను సరిదిద్ది, సంపూర్ణ స్వస్థత చేకూర్చటం ఆయుర్వేద చికిత్సల విశిష్టతగా చెప్పుకోవచ్చు. శరీరంపైన బాహ్యంగా కనిపించే చర్మ వ్యాధుల విషయంలోనూ ఆయుర్వేదం ఈ అంతస్సూత్రాన్నే అనుసరిస్తుంది.అందుకే చాలా మొండి చర్మ వ్యాధుల విషయంలో కూడా చక్కటి ఫలితాలు సాధ్యమవుతాయి.  చర్మం మన శరీరానికి అతిపెద్ద రక్షణ కవచమే కాదు.. శరీరంలో అతిపెద్ద భాగమూ అదే. చర్మాన్ని ఆయుర్వేదంలో ‘త్వక్‌’ అంటారు. సాధారణంగా పైచర్మం, కింది చర్మం.. రెండే ఉంటాయని చెబుతుంటారుగానీ ఆయుర్వేద సిద్ధాంతకర్తల్లో ఒకరైన సుశ్రుతుడు చర్మాన్ని 7 పొరల (అవభాసిని, లోహిత, శ్వేత, తామ్ర, వేదిని, రోహిణి, మాంసధరా) సమాహారమని వివరించారు. చర్మ వ్యాధులు ఈ ఏడు పొరల్లో దేని నుంచైనా పుట్టుకురావచ్చు. వ్యాధి లోపలి పొరలకు వెళుతున్న కొద్దీ తీవ్రత పెరుగుతుంటుంది. పైపొరకు మాత్రమే పరిమితమైతే త్వరగా తగ్గే అవకాశాలుంటాయి.

ఆయుర్వేదంలో చర్మవ్యాధులను ‘కుష్ఠం’ అంటారు. తేలికపాటి చర్మ సమస్యల నుంచి కష్టతరమైన కుష్టు వ్యాధి వరకూ అన్నీ దీని కిందికే వస్తాయి. ఇవి చికిత్సకు ఎంత త్వరగా లొంగుతాయన్న సాధ్యాసాధ్యాలను బట్టి ప్రధానంగా వీటిని ‘క్షుద్ర కుష్ఠం’, ‘మహా కుష్ఠం’ అని రెండు రకాలుగా విభజించారు. క్షుద్ర కుష్ఠం రకాలు- సత్వరమే, అదీ మరీ అంత శక్తిమంతమైన మందుల అవసరం లేకుండానే నయమవుతాయి. ఇక చికిత్స చాలా కష్టసాధ్యంగా తయారై, అత్యంత ప్రభావవంతమైన మందులకు మాత్రమే లొంగే జబ్బులను మహా కుష్ఠ రకాలుగా పరిగణిస్తారు. క్షుద్ర కుష్ఠాల్లో 11, మహా కుష్ఠాల్లో 7.. ఇలా దాదాపు 18 రకాల చర్మవ్యాధులను ప్రధానంగా చెప్పారు. ఇవే కాకుండా శ్విత్రం (తెల్లమచ్చలు-బొల్లి), కళ్ల కింద మచ్చలను తెచ్చి పెట్టే వ్యంగం.. దురద, మంట, మచ్చలతో కూడిన ఉదర్దం, కోఠం కూడా చర్మ వ్యాధులే!

మూలాలెక్కడ?
విరుద్ధాహారం: కలిపి తినకూడని ఆహార పదార్థాలను భుజించటం విరుద్ధాహారం అంటారు. చేపలు లేదా పుల్లగా ఉండే వస్తువులతో పాలు కలిపి తీసుకోవటం, అతి వేడి మీద వేయించిన పదార్ధాలు (ఫాస్ట్‌ ఫుడ్స్‌ వంటివి) తీసుకోవటం, వండిన వాటిని తిరిగి మళ్లీమళ్లీ వేడి చేసి తినటం, కాచిన నూనెలనే మళ్లీమళ్లీ వేడి చేసి వాడుతుండటం.. ఇవన్నీ విరుద్ధాహారాల కిందకే వస్తాయి. తిన్నది జీర్ణం కాకముందే మళ్లీ తినటం, పెరుగు, పులుపు, ఉప్పులను అతిగా తీసుకోవటం.. వంటివన్నీ విరుద్ధాహారంగా భావించొచ్చు.
  • విహారం: ఎండలో ఎక్కువగా తిరగటం, ఆహారం భుజించిన వెంటనే సంభోగంలో పాల్గొనటం, రోజూ పగటి నిద్ర వంటివన్నీ చర్మ వ్యాధులకు కారణాలు కావొచ్చు.
  • మానసిక కారణాలు: తీవ్రమైన ఒత్తిడి, అమితమైన మానసిక శ్రమ, అధికంగా ఆలోచించటం.. ఈర్షా్యసూయల వంటి రాగద్వేషాలు.. ఇవన్నీ చర్మవ్యాధులకు దోహదం చేయొచ్చు.
  • సాధారణ కారణాలు: మలం, మూత్రం, ఆకలి, దప్పికల వంటి వేగాలను ఆపుకోవటం.
  • పాపకర్మలు: చెడు స్వభావం, నేర ప్రవృత్తి, అపరిశుభ్రత, విరుద్ధాచారాలను పాటించటం, గురువులను నిందించటం వంటివన్నీ పాపకర్మల కిందికి వస్తాయి. ఇవి కూడా చర్మ వ్యాధులకు కారణమవుతాయన్నది ఆయుర్వేద భావన.
  • సంసర్గ: శారీరక స్పర్శల (గాత్ర సంస్పర్శ) వల్ల కొన్ని చర్మవ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశముంది. వ్యాధి రసికారుతున్న దశలో వారితో సన్నిహితంగా మెలిగేవారికి వచ్చే అవకాశం ఎక్కువ. అయితే అవతలి వారి రోగనిరోధకశక్తి మీదా ఆధారపడి ఉంటుంది.
  • కులజం: కొన్ని చర్మవ్యాధులు వంశపారంపర్యంగా, కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా రావొచ్చు.
  • క్రిమిజం: క్రిముల వల్ల రావొచ్చు.
  • కాలజం: చలికాలం, ఎండకాలం.. ఇలా కాలాలు, వయసును బట్టి కూడా చర్మవ్యాధులు వస్తాయి, విజృంభిస్తాయి.
  • చికిత్సా విభ్రంశం: వ్యాధులకు సరైన మందులు వాడకపోవటం, సరిగా శుద్ధిచెయ్యని మందులు ఇవ్వటం వల్ల కూడా ఇవి రావొచ్చు.
దీర్ఘరోగాల్లో ప్రధానం
Ayurveda Treatment for Skin Diseases
కొన్ని రకాల చర్మవ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి (ఔపసర్గికం). చికిత్సకు త్వరగాకష్టతరో రోగం- చికిత్సకు కష్టంగా ఉంటుంది. జన్మప్రవృత్తి అనుబంధం- ఆయుర్వేదం ప్రకారం ఈ కుష్ఠ వ్యాధులు ఒక జన్మలో పోయినా పాపకర్మల ఫలంగా మరో జన్మలో రావొచ్చు. చర్మవ్యాధులను ‘స్పర్శ వాతం’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా వాత, పిత్త, కఫ దోషాల్లో వేటి మూలంగా వ్యాధి వచ్చిందో గుర్తించి చికిత్స అందించాల్సి ఉంటుంది. కొన్ని చర్మవ్యాధుల్లో త్రిదోషాలూ ఉంటాయి, అందుకే వీటిని మహావ్యాధులుగా గుర్తించారు. చికిత్స కష్ట సాధ్యంగా ఉండటానికి ఇదే కారణం. వాత దోషం వల్ల వచ్చే చర్మవ్యాధిలో మచ్చ పొడిగా ఉంటుంది. పిత్త దోషంతో కూడుకున్నది మంట పెడుతుంది. కఫంతో కూడుకుంటే దురద కనిపిస్తుంది. కొందరిలో ఒక దోషంతోనే వస్తే మరికొందరిలో రెండు, మూడు దోషాలూ ఉండొచ్చు. ఈ దోషాల కలయిక, వాటి నిష్పత్తులను బట్టి.. ఎంతకాలంగా వ్యాధి ఉన్నదాన్ని బట్టి చికిత్స మారుతుంది. ఒక దోషంతో కూడుకున్నదైతే చికిత్స తేలికవుతుంది. రెండు, మూడు దోషాలు కలిసినదైతే ఆలస్యమవుతుంది. ఈ లక్షణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్సా ఫలితమన్నది- ఔషధ నిర్ణయం, వ్యాధి తీవ్రత, వైద్యుడి నైపుణ్యం- వీటన్నింటి మీదా ఆధారపడి ఉంటుంది.
లొంగవు (మహావ్యాధులు). వీటిలో చర్మం, రక్తం రెండూ ప్రభావితమై ఉంటాయి. వ్యాధి నెమ్మదిగా పెరుగుతుంది, చికిత్సకు ఎక్కువ సమయం తీసుకుంటాయి (చిరక్రియైః). కొన్నిసార్లు స్పర్శ తెలియదు. కొన్ని క్రిములతో వస్తాయి. ‘కుష్ఠం దీర్ఘరోగానం ప్రధానం’ అంటారు. అంటే ఎక్కువ కాలం వేధించే జబ్బుల్లో చర్మవ్యాధి ప్రధానమైందని అర్థం.

క్షుద్ర కుష్ఠాలు
క్షుద్ర కుష్ఠాలు కొన్నిసార్లు సుఖ సాధ్యాలు. మరికొందరిలో కష్ట సాధ్యం కూడా. ఇది వ్యాధి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. 
ఇవి 11 రకాలు.
1. ఏక కుష్ఠం: మచ్చ ఏర్పడిన చోట చెమట పట్టదు. శరీరంలో ఎక్కువ భాగాలకు వ్యాపిస్తాయి. అక్కడి చర్మం చేప మాదిరిగా పొలుసులుగా, ఏనుగు చర్మంలా దళసరిగా ఉంటుంది. (ఒక రకంగా దీన్ని ‘సోరియాసిస్‌’ అనుకోవచ్చు.)
2. కిటిమ: ఇందులో నల్లటి మచ్చ కనబడుతుంది. దీనికి ఎత్తుపల్లాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక మచ్చలా చేతికి తగులుతుంటుంది.
3. వైపాదిక: ఇది చేతులకు, పాదాలకు వస్తుంది. ఇందులో కొంచెం బాధ, చర్మం పగిలి నీరు కారటం కనిపిస్తుంది.
4. అలసక: దురద ఎక్కువగా ఉంటుంది. దద్దు కనిపిస్తుంది.
5. దద్రుమండల: దురద ఎక్కువగా ఉండి బొబ్బలు వస్తాయి.
6. చర్మదళ: ఎర్రటి మచ్చలు, నొప్పి, దురద ఉంటాయి. ఈ భాగంలో చేయి పెడితే బాధ కలుగుతుంది.
7. పామా: మచ్చలకు దురద ఎక్కువ
8. కచ్చు: మచ్చ మందంగా ఉంటుంది.
9. విస్ఫోట: చర్మం బొబ్బలు బొబ్బలుగా లేచి మంట పుడుతుంది.
10. శతార: ఎరుపు రంగులో, పెద్ద సంఖ్యలో కురుపులు వస్తాయి.
11. విచర్చికా: మచ్చ నల్లగా ఉండి, చీము వస్తుంది.

ఇతర రకాలు
  • శ్విత్రం: ఇందులో తెల్ల మచ్చలు కనబడతాయి. వాడుక భాషలో దీన్ని బొల్లి అంటారు.
  • వ్యంగం: కళ్ల కింద తెలుపు మచ్చలు. ఆడవారిలో ఎక్కువ.
  • ఉదర్దం: కందిరీగలు కుట్టినట్టుగా శరీరంపై దద్దు వస్తుంది. సూదులతో గుచ్చినట్టుగా పోటు ఉంటుంది. ముఖ్యంగా నడుం దగ్గర చుట్టూ దద్దు ఏర్పడుతుంది. శిశిర రుతువులో ఎక్కువ.
  • కోఠం: శరీరంలో దురదతో కూడి ఎరుపు రంగులో చాలా దద్దుర్లు వస్తాయి. చికిత్స తీసుకోకపోయినా వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ బాధ పెడతాయి.
చర్మం - రసధాతువు
చర్మం - రసధాతువు
ఆయుర్వేదం ప్రకారం సప్తధాతువుల్లో ఒకటైన రస ధాతువుకు చర్మం ఉపధాతువు. అందువల్ల శరీరానికి బలాన్ని చేకూర్చే రసాయనాలన్నీ చర్మంపై బాగా పని చేస్తాయి. (‘ఆశ్రయ-ఆశ్రయీ’ భావ సంబంధం) రసధాతువును పెంచే వాటిల్లో ఆమలకి రసాయనం ముఖ్యమైంది. ఇది వ్యాధిని తగ్గించటమే కాదు, తిరిగి రాకుండానూ చేస్తుంది. సోరియాసిస్‌లో ఆమలకి రసాయనం పొడిని రోజూ రెండు పూట్లా అరచెంచా చొప్పున లోనికి తీసుకోవటం ప్రయోజనకరం. అలాగే ఆరోగ్యవర్ధని కూడా. పైకి నిర్గుండి తైలం, కరంజి తైలాన్ని రాసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.

చికిత్సలు
చర్మవ్యాధులకు ఆయుర్వేదం ప్రధానంగా రెండు రకాల చికిత్సలను నిర్దేశిస్తోంది. 1. శోధనం 2. శమనం. త్రిదోషాల్లో ఏయే దోషాల ప్రమేయంతో వ్యాధి సంప్రాప్తించిందన్నది గుర్తించి.. తదనుగుణంగా వమనం, విరేచనం, వస్తి వంటి పంచకర్మల ద్వారా ఆ దోషాలను తొలగించటాన్ని ‘శోధనం’ అంటారు. అయితే వృద్ధుల్లో, బలహీనుల్లో దీన్ని చేయటం కుదరదు. ఇలాంటి వారికి కేవలం శమన చికిత్సలే చేస్తారు. శమనానికి ఔషధ ద్రవ్యాలు, ఆహార ద్రవ్యాలు ఉపయోగపడతాయి.

వ్యాధి దీర్ఘకాలంగా వేధిస్తుంటే ‘రసౌషధాలను’ వాడతారు. రోగి బలహీనంగా ఉన్నా, జబ్బు ఇటీవలి కాలంలోనే వచ్చినా, తీవ్రత తక్కువగా ఉన్నా మూలికా ద్రవ్యాలు ఇస్తారు. చర్మవ్యాధుల్లో లోనికి వేసుకునే మందు (అంతః పరిమార్జనం), పైపూత లేపనాలు (బహిః పరిమార్జనం).. రెండూ ముఖ్యమే. అప్పుడే జబ్బు పూర్తిగా నయమవుతుంది. రెంటిల్లో ఏది మానేసినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.

ఔషధ ద్రవ్యాలు
  • * గంధక రసాయనం, దేవకుసుమ రసాయనం, ఖదిరారిష్ట, పంచతిక్త గుగ్గులు ఘృతం, సారస్వతారిష్ట, ఆరోగ్యవర్ధని.. ఇవన్నీ బాగా పనిచేస్తాయి. సోరియాసిస్‌ వంటి చర్మవ్యాధుల్లో ఇవి చక్కటి సత్ఫలితాలనిస్తాయి.
  • * రసౌషధాల్లో వ్యాధి హరణ రసాయనం బాగా పనిచేస్తుంది. దీన్ని నేరుగా ఇవ్వరాదు. గుడూచీ(తిప్పతీగ)లో గానీ, శారిబా(శుగంధిపాల) గానీ, ఆమలకి (ఉసిరిక)లోగానీ కలిపి ఇవ్వటం మంచిది.
  • * ఏకగుణ సింధూరం, షడ్గుణ సింధూరం రకరకాల చర్మవ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి.
  • * గుంజాదివటి కూడా మచ్చలకు బాగా పనిచేస్తుంది. కొన్ని రకాల చర్మవ్యాధుల్లో మధుస్నుహి రసాయనం ఉపయోగపడుతుంది. జపాకుసుమ తైలం, పునర్నవాసం కూడా ఉపయోగపడతాయి. భల్లాతకవటి, అమృత భల్లాతక లేహ్యం మంచి ఫలితాలనిస్తాయి. అయితే వీటన్నింటినీ కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
  • * నిర్గుండి తైలం పైన రాయొచ్చు, లోనికీ తీసుకోవచ్చు.
  • * కరంజ తైలం.. దీన్ని పైకి మాత్రమే వాడుకోవాలి.
  • * తాకితే చేతికి తగిలే మచ్చలకు సింధూరాది లేపం, లేదా బ్రాహ్మీ రసాయనాలు బాగా పనిచేస్తాయి.
అయితే... పైకి రాసుకునే తైలాలు, లేపనాలను ఒకట్రెండు సార్లు ఎక్కువగా వాడినా తప్పులేదు. ముఖానికి రాసుకునే లేపనాలను రాత్రి పూట వాడకపోవటం మంచిది. ఆసవ, అరిష్టాలను ఉదయం సాయంత్రం 30 ఎం.ఎల్‌. చొప్పున మాత్రమే వాడాలి.

ఆహార ద్రవ్యాలు
  • ఉసిరి, కాకమాచి (కామంచి) కూర, నెయ్యి, తియ్యటి పెరుగు, తియ్యటి మజ్జిగ.. ఆహార పరంగా బాగా ఉపయోగపడతాయి.
  • మూడొంతుల పెరుగు, ఒకవంతు నీరు కలిపి తయారుచేసిన మజ్జిగ (తక్రం) చర్మవ్యాధుల్లో ఔషధ రూప ఆహారంగా పనిచేస్తుంది.
  • పొన్నగంటి కూర చర్మవ్యాధులు పెరగకుండా, నివారణగా కూడా రక్షణనిస్తుంది.
పై పూతలు
  • గరిక రసాన్ని చర్మంపై రాస్తే చాలా చర్మవ్యాధులు తగ్గుతాయి. వ్యాధి తీవ్రతను బట్టి ఈ రసం కొంత లోనికీ తీసుకోవచ్చు.
  • మంచి గంధాన్ని అరగదీసి అరచెంచా లోపలికి తీసుకోవచ్చు. దీన్ని కొబ్బరినూనెలో కలిపి చర్మంపై రాస్తే మంచి ఫలితం కనబడుతుంది.
  • నల్ల జీలకర్ర ముద్దను కొబ్బరి నూనెలో కలిపి చర్మంపై రాయొచ్చు. ఈ ముద్దను నీటిలో కలిపి తాగొచ్చు.
  • మచ్చలపై మెంతుల పొడి, లేదా శతావరి పొడిని అద్దచ్చు. లోపలికీ తీసుకోవచ్చు.
  • కరక్కాయ గంధాన్ని కొబ్బరినూనెతో కలిపి రాయొచ్చు.
  • గుంట గలగరాకు రసంలో దూదిని ముంచి, దాన్ని మచ్చ మీద వేయాలి. ఇది తెల్లమచ్చలను తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది.
  • శెనగలు నానబెట్టి, అంతే పరిమాణంలో వెన్నతో కలిపి నూరి ముద్దగా చేయాలి. దీన్ని కళ్ల కింద నల్ల మచ్చకు (వ్యంగం) రాస్తే మంచి ఫలితముంటుంది.
  • శొంఠి, గైరికం కలిపి పైకి రాస్తే కోఠం తగ్గటానికి ఉపకరిస్తుంది. వీటిని పావు చెంచా చొప్పున లోనికి కూడా తీసుకోవచ్చు. దొండకాయ కోసినపుడు వెలువడే జిగురును రాసినా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీంతో మంట బాగా తగ్గుతుంది.
మహా కుష్ఠాలు
మహా కుష్ఠాలు నయం కావటమనేది- వ్యాధి ఎన్ని రోజుల నుంచీ ఉంది? సమస్య చర్మంలో ఏ పొర వరకూ విస్తరించి ఉందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. వీటికి ముఖ్యంగా రోగి బలం, రోగ బలం.. రెంటినీ అంచనా వేసి చికిత్స చేస్తారు.

వీటిల్లో ఏడు రకాలున్నాయి.
1. కపాల కుష్ఠం: చర్మం మీద విస్తృతంగా మచ్చలు వచ్చి.. అవి ఎర్రగా, కుండపెంకులా ఉంటాయి.
2. ఔదుంబర: ఇందులో మచ్చలు నొప్పీ, మంటా ఉంటాయి. అక్కడి చర్మం మేడిపండు రంగులో కనబడుతుంది.
3. మండల: మచ్చలు గుండ్రంగా ఉండి, ఎరుపు రంగులో ఉంటాయి.
4. రుష్యజిహ్వ: మచ్చలు దుప్పి నాలుక ఆకారంలో ఎర్రగా ఉంటాయి.
5. పుండరీక: తామరాకు మాదిరిగా గుండ్రంగా మచ్చలు ఏర్పడతాయి.
6. సిధ్మ కుష్ఠం: చర్మం తెల్లటి పిండిలా, పొట్టు పొట్టులా రాలుతుంది.
7. కాకణన్తికా: మచ్చలు గురివింద గింజలా కొంచెం ఎర్రగా, కొంచెం నల్లగా ఉంటాయి.

ఏక కుష్ఠం (సోరియాసిస్‌)
చర్మవ్యాధుల్లో ఏకకుష్ఠం, చర్మదళం, కోఠం, ఎక్కువగా కనబడతాయి. ఈ ఏక కుష్ఠం లక్షణాలు ఇప్పుడు మనం ప్రబలంగా చూస్తున్న సోరియాసిస్‌కు చాలా దగ్గరగా ఉంటాయి. దీని లక్షణాలు..
  • త్వచ వికృతి: చర్మం రంగు మారటం * త్వచ వైవిన్యం: చర్మం కుంచించుకపోవటం, దగ్గరకు రావటం, వ్యాకోచించక పోవటం, పొలుసులు రాలటం
  • మండలోత్పత్తి: గుండ్రంగా మచ్చలు ఏర్పడటం * పిడకోత్పత్తి: మచ్చలను చేత్తో తాకితే అంచులు తగులుతాయి.
  • కండు: దురద పెట్టటం.
పూర్వరూపాలు
చర్మవ్యాధులు రావటానికి ముందుగానే కొన్ని లక్షణాలు కనబడతాయి. వీటిని పూర్వరూపాలంటారు. ఇవే కొన్నాళ్ల తర్వాత వ్యాధి రూపంలోకి మారతాయి. ఇందుకు ఆహార, విహారాల వంటి వాటితో పాటు శరీరతత్వమూ దోహదం చేస్తుంది. ఈ దశలో చికిత్స తీసుకుంటే అది వ్యాధిగా మారకుండా చూసుకోవచ్చు. కొన్నిపరిస్థితుల్లో వీటినే వ్యాధి రూపాలుగానూ పరిగణించాల్సి ఉంటుంది.
  • చర్మవ్యాధి వచ్చే భాగంలో చేత్తో తాకితే నునుపుగా గానీ గరగరగా గానీ ఉంటుంది.
  • అధికంగా చెమట పట్టొచ్చు, లేదా చెమట పట్టకపోవచ్చు.
  • రంగు మారటం, మంట, దురద
  • స్పర్శ సరిగా ఉండకపోవచ్చు.
  • సూదులతో పొడిచినట్టుగా పోటు ఉండొచ్చు.
  • కందిరీగలు కుట్టినట్టుగా దద్దు, చికాకు ఉండొచ్చు.
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

పంచ‌క‌ర్మ‌ అంటే యేమిటి ? - What is PanchaKarma

పంచ‌క‌ర్మ‌ అంటే యేమిటి ? - What is Pancha Karma
పంచ‌క‌ర్మ‌ అంటే యేమిటి ?
నాతన వైద్యవిధానమైన ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కానీ పంచకర్మలంటే ఏమిటి? చాలామంది మర్దనం.. అభ్యంగనం.. వేడికాపడం వంటివే పంచకర్మలని భావిస్తుంటారు. నేడు వీటికే విస్తృత ప్రచారం కూడా జరుగుతోంది. కానీ వాస్తవానికి ఈ మర్దన, అభ్యంగనం వంటివి ఆయుర్వేదంలో పంచకర్మ క్రియలకు ముందు చెయ్యాల్సిన పూర్వకర్మలు మాత్రమే. ఈ నేపథ్యంలో అసలు పంచకర్మలంటే ఏమిటి? వీటి గురించి ఆయుర్వేద శాస్త్రకారులు ఏం చెప్పారన్న ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తెస్తోంది  మన ఆరోగ్యం!

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం.. సృష్టిలోని ప్రతి వస్తువుకూ ఈ పంచ భూతాలే మూలాధారం. అందుకే శరీరాన్ని కూడా పంచభూతాత్మకంగా నిర్వచించింది ఆయుర్వేదం! ఈ పంచభూతాలు మన శరీరంలో వాత, పిత్త, కఫాలనే మూడు దోషాల రూపంలో ఉంటాయి. అందుకే ఆయుర్వేద వైద్యం యావత్తూ ఈ త్రిదోషాల ఆధారంగానే సాగుతుంది. మన శరీర రక్షణకు- రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రములనే ఏడు ధాతువులు; స్వేదం, మూత్రం, పురీషాలనే మూడు మలాలు.. వాత, పిత్త, కఫాలనే త్రిదోషాలు... ఇవన్నీ కూడా సాధారణ స్థితిలో ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే చక్కటి రక్షణ సాధ్యమవుతుంది. కానీ వీటిలో వాత, పిత్త, కఫాలనే త్రిదోషాలకు స్వతహాగా చెడిపోయే స్వభావం ఉంది. అంతే కాదు, మిగతా వాటినీ చెడగొడతాయి. అందుకే వీటిని దోషాలన్నారు. ఈ దోషాలు సమానస్థితిలో ఉంటే శరీరాన్ని రక్షిస్తాయి. అవి వికృతి చెందితే వ్యాధులను కలిగిస్తాయి. అయితే ఈ దోషాలు ఎంత ప్రకోపించినా.. సప్త ధాతువులు బలంగా ఉంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు తక్కువ. అందుకే ధాతు పుష్ఠి ముఖ్యం. దోషాలు వికృతి చెందటమే వ్యాధులకు మూలం కాబట్టి.. వ్యాధులు రావటానికి మూలం దోషాలే కాబట్టి... వ్యాధి చికిత్స అన్నది మూలాలను సరిచేసేదిగా ఉండాలన్నది మౌలిక సూత్రం! ఇలా మూలాలను సరిచేసేదే శోధన చికిత్స. దీని గురించి కాస్త వివరంగా చూద్దాం..
shirodhara-ayurvedic-treatment in panchakarma 2
ఆయుర్వేదం ప్రకారం చికిత్సలు రెండు రకాలు..
1. శోధన చికిత్స 2. శమన చికిత్స. శోధన చికిత్స వ్యాధికి కారణమైన దోషాలను తొలగించి, వాటిని సమావస్థకు తీసుకువచ్చేందుకు ఉద్దేశించినది. ఈ శోధన చికిత్సలో ముఖ్యమైనవే పంచకర్మ చికిత్సలు! ముందు ఈ శోధన చికిత్స చేసి, దోషాలను తొలగించిన తర్వాత అప్పుడు.. ఔషధాలతో శమన చికిత్స చేస్తే- ధాతువులు వృద్ధిపొంది.. వ్యాధి నుంచి సంపూర్ణమైన స్వస్థత చేకూరుతుంది. ధాతువులకు ధారణశక్తి పెరిగి, వ్యాధి తిరిగి రాకుండా ఉంటుంది.

దోషాఃకదాచిత్‌ కుప్యంతి జితా లంఘన పాచనైః 
జితాస్సంశోధనైయేతు నతేషాం పునరుద్భవః

అని చెప్పారు సూత్రకారులు. అంటే వ్యాధి మూలాలను సరిచేసే శోధన చికిత్స చేయకుండా కేవలం ఔషధాలిచ్చి శమన చికిత్స మాత్రమే చేస్తే ఆ ఔషధ ప్రభావంతో వ్యాధి లక్షణాలు తాత్కాలికంగా సద్దుమణిగినా.. మళ్లీ వ్యాధికారక పరిస్థితులు ఎదురైనప్పుడు తిరిగి వ్యాధి లక్షణాలూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందు శోధన చికిత్స చేసి.. దోషంలోని వికృతత్వాన్ని పోగొట్టి, అప్పుడు ఔషధాలతో శమన చికిత్స చేస్తే మళ్లీ వ్యాధి రావటానికి అవకాశం ఉండదు. ఈ కోణం నుంచి చూసినప్పుడు శోధన చికిత్సకు, దీనిలో భాగమైన ‘పంచకర్మ’ చికిత్సలకు ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

పంచకర్మలు చేసేదేమిటి?
బహ్వితి కర్తవ్యతాయోగి దోష నిర్హరణ జ్యాయస్త్వం’ అని చెప్పారు శాస్త్రకారులు. అంటే పంచకర్మ చికిత్సల్లో భాగంగా ఇచ్చే ఔషధాలు శరీరంలోకి వెళ్లి.. అక్కడ అనేక విధాలైన రసాయన మార్పులు తీసుకొచ్చి... దోషాలు తేలికగా తొలగిపోయేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తాయి. అందుకే ముందు ఈ శోధన చికిత్సలు చేసి, తర్వాత శమన చికిత్స చెయ్యాలని సూచించారు.

‘పంచకర్మ’లంటే? 
  • వమనం (వాంతి చేయించటం) 
  • విరేచనం (విరేచనం చేయించటం) 
  • వస్తికర్మ (ఔషధాలతో ఎనిమా ఇవ్వటం) 
  • ఆస్థాపన వస్తి 
  • అనువాసన వస్తి 
  • నశ్య కర్మ (ముక్కులో ఔషధ చుక్కలు వేయటం) 
  • రక్తమోక్షణం 
ప్రధానంగా కాయ చికిత్సకుడైన చరకుడు వస్తికర్మలను రెండుగా (ఆస్థాపన/అనువాసన) విభజించి పంచకర్మలను ప్రతిపాదించాడు. అయితే తర్వాత వచ్చిన సుశ్రుతుడు వస్తికర్మలు రెంటినీ ఒకటిగానే ప్రతిపాదించి.. ఐదో పంచకర్మగా ‘రక్తమోక్షణం’ (నెత్తురు తీయటం) అనే దానిని ప్రతిపాదించాడు.

ఈ తేడా ఎందుకు వచ్చిందంటే కాయచికిత్సకుడైన చరకుడి దృష్టిలో వాతానికి అన్నింటినీ ప్రదూషింపగలిగిన బలీయమైన శక్తి ఉంది కాబట్టి దానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, రెండు రకాల వస్తికర్మలు చెప్పాడు. వీరు రక్తదోషాన్ని కూడా పిత్త దోషం కిందే పరిగణించి, దానికి ప్రత్యేకించి చికిత్స అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే స్వతహాగా శస్త్రకారుడైన సుశ్రుతుడు రక్తాన్ని కూడా దోషంగా పరిగణించి, దీనిలో వికృతి వచ్చినప్పుడు రక్తమోక్షణం అవసరమని ప్రతిపాదించాడు.
full body abhyangam part potli shiro abhyangam and paad abhyangam
పంచకర్మ: దేనికేది?
పక్షవాతం వంటి వాత ప్రధానమైన వ్యాధులు దాదాపు 80 రకాలు, అజీర్ణం వంటి పిత్త ప్రధానమైన వ్యాధులు 40 రకాలు, కఫ వ్యాధులు దాదాపు 20 రకాలున్నాయి. వీటిలో
  • కఫ వ్యాధులకు వమనం
  • అజీర్ణం వంటి పిత్త ప్రధాన వ్యాధులకు విరేచనం
  • పక్షవాతం వంటి వాత ప్రధాన వ్యాధులకు వస్తి కర్మలు చెయ్యాలన్నది సూత్రం.
గొంతు నుంచి ఆమాశయం వరకూ ఉండేది కఫస్థానం. చిన్నపేగు, గ్రహణి వంటివన్నీ ఉండేది పిత్త స్థానం. పెద్దపేగులు, నాభి, గుదం వంటివన్నీ వాతానికి స్థానాలు. కఫవాతపిత్తాలకు ఉండే సహజ స్వభావాలకు తోడు ఈ స్థానాలను అనుసరించి కూడా వీటికి ఈ పంచకర్మలను సూచించారు.

స్వస్థులకు : పంచకర్మ వంటి శోధన చికిత్సలను కేవలం వ్యాధిగ్రస్థులకే కాదు, రుతువులను అనుసరించి ఆరోగ్యవంతులు కూడా అనుసరిస్తే దోషాలు వికృతి చెందకుండా ఉండి.. అసలు వ్యాధులు తలెత్తకుండా చూసుకోవచ్చని, ఇది ఉత్తమమని చెప్పారు సూత్రకారులు. ఎందుకంటే దోషాలకు ఆరు అవస్థలున్నాయి. 1. సంచయం. 2. ప్రకోపము. 3. ప్రసరము 4. స్థానసంశ్రయము 5. వ్యక్తీభావము 6. భేదము. దీనిలో మొదటి ఐదు దశలు దాటి.. ఆరో దశలోకి వెళితేనే మనకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వీటిలో మొదటి మూడూ దోషాలకు సంబంధించిన అవస్థలు, చివరి మూడూ వ్యాధికి సంబంధించి అవస్థలు. కాబట్టి సంచయ దశలోనే మనం దోషాలు గతి తప్పకుండా చూసుకోవటానికి ఈ శోధన చికిత్సలు ఉపకరిస్తాయి. అందుకే రుతువులను అనుసరించి:

హేమంత శిశిరాల్లో కఫ ప్రకోపం ఎక్కువ కాబట్టి దానికి ముందే వమనం, వర్ష రుతువులో వాత ప్రకోపం కలుగుతుంది కాబట్టి వేసవి చివర్లో వస్తి కర్మ, వర్షరుతువు చివరి రోజుల్లో పిత్త ప్రకోపం ఎక్కువ కాబట్టి దానికి ముందు విరేచన చికిత్స తీసుకుంటే వ్యాధులు రావన్నది సూత్రం. ఇది స్వస్థులకు పంచకర్మ!

పంచకర్మల తర్వాత శమన చికిత్స : వ్యాధులేవైనా ప్రధానంగా అవి కఫ, వాత, పిత్త ప్రధానమైనవే. కాబట్టి ఏ వ్యాధి గ్రస్తుడికైనా సంపూర్ణంగా వ్యాధి నయం కావాలంటే వారికి పంచకర్మల్లో తదనుగుణమైన క్రియ చెయ్యాలన్నది ఆయుర్వేద విధానం. పూర్వకర్మ చేసి, ఈ పంచకర్మల్లో అవసరమైన శోధన చికిత్స చేసిన తర్వాత.. అప్పుడు ఔషధాలతో శమన చికిత్స చెయ్యాలని చెప్పారు. రోగి బలవంతుడిగా ఉండి, దోషాలు కూడా బలవంతంగా ఉన్నప్పుడు ఎక్కువ విరేచనాలు/వాంతులు అయ్యేలా చేసేది ప్రవర శోధన. అలాగే రోగి పరిస్థితిని బట్టి మధ్యమ శోధనం, చాలా తక్కువగా ఒకటి రెండు మాత్రమే అయ్యేలా చేసే అవర శోధనం కూడా ఉన్నాయి. రోగి, వ్యాధి పరిస్థితిని బట్టి ఏవిధమైన చికిత్స చెయ్యాలో ఉంది. స్నేహస్వేదాల వంటి పూర్వకర్మలు చేసిన తర్వాత ఒక రోజు పంచకర్మల్లో ఏదో ఒక కర్మ చేస్తారు. దీంతో జఠరాగ్ని అస్తవ్యస్తమవుతుంది కాబట్టి పంచకర్మ అనంతరం ఏడు రోజుల పాటు పద్ధతి ప్రకారం పల్చటి ఆహారం నుంచి క్రమేపీ పెంచుకుంటూ ఘనాహరం ఇస్తారు. దీంతో దోషాలు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి అప్పుడు శమన చికిత్స ఆరంభించి ఔషధాలతో చికిత్స చేస్తే వ్యాధి సమూలంగా తొలగిపోయి పూర్తి స్వస్థత చేకూరుతుందన్నది సూత్రం. అయితే జీవితంలో వేగం పెరిగిపోయిన ఈ ఆధునిక కాలంలో ఇంతటి సమయం కేటాయించే అవకాశం, వనరులు, వెసులుబాటు కొరవడిన నేపథ్యంలో వ్యాధులకు ఔషధాలతో శమన చికిత్స చేస్తూనే అదే సమయంలో పంచకర్మ ప్రభావాలను రాబట్టేందుకు కూడా విరేచనంవంటివాటికి ఔషధాలు ఇవ్వటం పరిపాటిగా మారింది. మొత్తమ్మీద వమనం చేయించటం కొంత తగ్గినా విరేచన, వస్తికర్మలకు చాలా ప్రాశస్త్యం ఉంది. పంచకర్మల్లో ఏవైనా కూడా పూర్తిగా సుశిక్షితులైన వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. వీటితో అతియోగం, అయోగం, మిధ్యాయోగం వంటి ప్రభావాలు వచ్చినప్పుడు వాటిని అధిగమించే మార్గాలు తెలియటం ముఖ్యం.

మర్దనం, ధార పూర్వకర్మలే : ఇప్పుడు పంచకర్మల పేరుతో విస్తృతంగా ప్రచారంలో ఉన్న మర్దన, శిరోధార వంటివి వాస్తవానికి పంచకర్మలు చెయ్యటానికి ముందు ఆచరించాల్సిన పూర్వకర్మలు మాత్రమే. ఇవి దోషాలు తేలికగా బయటకు వెళ్లిపోయేందుకు అనుకూలంగా తయారు చేస్తాయి. దోషాలు పంచకర్మ చికిత్సలకు తేలికగా ప్రతిస్పందించేలా చెయ్యటం ఈ పూర్వకర్మల ఉద్దేశం. అంతేగానీ వీటికి ఇవేగా వ్యాధులను తగ్గించలేవు. పూర్వకర్మల్లో ప్రధానమైనవి- స్నేహ స్వేదాలు. వీటినీ కొందరికి మాత్రమే చెయ్యాలి.
 స్నేహం : స్నేహ చికిత్సల్లో 23 రకాలున్నాయిగానీ ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రెండు. 1. బాహ్య స్నేహం. అంటే ఔషధ తైలాలు మొదలైన వాటితో మర్దన, కాపడం వంటివి. వేడిగా ఉండే పదార్థాల దగ్గర ఉంచటం, ఆవిరి పట్టటం వంటివి (సాగ్ని స్వేదాలు), వ్యాయామం, శారీరక కదలికల వంటి (నిరగ్ని స్వేదాలు) దీనిలో భాగమే. 2. ఆభ్యంతర స్నేహం. నెయ్యి, తైలాల వంటి వాటితో చేసిన ఔషధాలను లోపలికి తాగించి లోపల వేడి పుట్టించటం. వీటిని ఎవరికి, ఎలా చేయించాలన్నది స్పష్టంగా ఉంది. మొదట్లో స్నేహం, తర్వాత స్వేదం చేయించిన తర్వాత అప్పుడు శోధన చికిత్స.. అంటే పంచకర్మలు చేస్తారు. శరీరంలోని దోషాలన్నీ కూడా శోధన కర్మకు అనుకూలంగా తయారవటం దీనిలో ప్రత్యేకత. బాహ్యస్నేహం వల్ల అంగాలన్నీ మృదువుగా తయారవుతాయి. ‘స్నేహో అనిలం హంతి మృదూకరోతి అంగాన్‌’ అని చెప్పారు శాస్త్రకారులు. గట్టి కర్రను నీటిలో నానబెడితే ఎలా మృదువుగా మారుతుందో దీనితో కూడా అటువంటి ఫలితాలుంటాయి.

ధార : శిరస్సులో ఉండే దోషాలను పోగొట్టి వాటికి పోషకాలను అందించేందుకు చేసేది ధార చికిత్స. కేంద్రనాడీమండల వ్యవస్థకు చెందిన పక్షవాతం, ఉన్మాదం, మూర్ఛ, అపస్మారం వంటి సమస్యల్లో ధార చికిత్స ప్రత్యేకంగా చెప్పారు. వాతానికి సంబంధించిన వ్యాధులన్నింటికీ శిరస్సు కేంద్రంగా ఉంటుంది. కొన్నింటిలో దీనికి ప్రాధాన్యం ఎక్కువ. మిగతా చికిత్సలతో పాటు ధార చికిత్సా చేస్తారుగానీ కేవలం దీన్నే చికిత్సగా భావించటానికి లేదు. స్నేహ స్వేదాలన్నవి పూర్వకర్మలు మాత్రమేగానీ ఇవే పూర్తి చికిత్సలు కావు. దీనితో చికిత్స ఆగదు. ముఖ్యంగా పక్షాఘాతం వంటివాటిలో మాత్రం స్నేహస్వేదాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇవి పంచకర్మలకు అంగములు మాత్రమే. కొన్నింటిలో మాత్రం వీటికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
full body panchakarma massage
7 పంచకర్మలు ఏ కర్మ ఎందుకు?
1. వమనం: కఫానికి సంబంధించిన 20 వ్యాధుల్లో వమనం చేయిస్తారు. దీనికోసం మంగకాయ, వస, కొడిశపాల, సైంధవలవణం, పిప్పళ్లు, చేదుబీర వంటి వమనోపయోగ ఔషధాలను తీసుకుని దాన్ని తాగిస్తారు. దాంతో వాంతి అవుతుంది. ప్రధానంగా శ్వాస (ఆస్థమా), హిక్కా (ఎక్కిళ్లు), కాస (దగ్గు), చల్ది (విసర్పం) వంటి వ్యాధుల్లో దీనికి ప్రాధాన్యం ఉంటుంది.
స్నేహస్వేదాల వంటి పూర్వకర్మలు చేయించి, కఫాన్ని బయటకు తీసుకురావటానికి దోహదం చేసే పాల వంటి ద్రవ్యాలు తాగించి, కొద్దిసేపటి తర్వాత ఈ వమన ద్రవ్యాలను ఇస్తారు. వాంతులు ఎక్కువై (అతియోగం) ఏం చెయ్యాలో, సరిగా కాకపోతే (అయోగం) ఏం చెయ్యాలో కూడా స్పష్టంగా చెప్పారు.

 2. విరేచనం: పిత్త వికార జన్యమైన 40 వ్యాధుల్లో విరేచనానికి ప్రాధాన్యం ఉంది. విరేచనానికి సునాముఖి, ఏరండ తైలం (ఆముదం), త్రిఫల, కరక్కాయ వంటివి, ఇచ్ఛాభేదిరసం, త్రిఫల, కరక్కాయ వంటి ఔషధాలతో చేయిస్తారు.కాలేయ, ప్లీహ (యకృత్‌, ప్లీహ) వ్యాధులు, చర్మ వ్యాధులు, రక్తవికారంతో వచ్చే గడ్డలు, కురుపుల వంటివాటిలో దీన్ని చెప్పారు.
వస్తి:  వ్యాధిని బట్టి ఔషధాన్ని నిర్ణయించి దాన్ని గుదమార్గం ద్వారా ఎనిమా ఇవ్వటమే వస్తికర్మ. దీనిలో చాలా రకాలున్నాయి. వాతానికి సంబంధించిన వ్యాధులు పెద్దపేగుల వంటివాటిలో ఎక్కువ కాబట్టి వాటిని అరికట్టేందుకు వస్తి ఉపయోగపడుతుంది.

3. నిరూహ/ఆస్థాపన వస్తి : నిరూహ వస్తిలో భాగంగా ఎనిమా ఇచ్చే ద్రవంలో కషాయ భాగం ఎక్కువ, తైల లేదా ఘృత భాగం తక్కువ ఉంటుంది. కషాయాలతో చేసిన ఈ నిరూహ వస్తిలో 640 ఎం.ఎల్‌. వరకూ ఇస్తారు. నిరూహ వస్తిలో ఎనిమా ఇచ్చిన తర్వాత 40, 45 నిమిషాల్లో అది బయటకు వచ్చేయాలి. లేకపోతే అది హాని చేస్తుంది. కాబట్టి మళ్లీ యవక్షారం, త్రికటు, ఆమ్లద్రవ్యాల వంటి వాటి ఇచ్చి అయినా దాన్ని బయటకు తెప్పిస్తారు. వాత ప్రధానమైన వ్యాధుల్లో పక్షాఘాతం (పక్షవాతం), ఆక్షేపక వాతం (కాళ్లుచేతుల వణుకు) కటిశూల (నడుము నొప్పి), అశ్వరి (మూత్రపిండాల్లో రాళ్లు) వంటి వాటిలో, 80 వాత వ్యాధుల్లో దీనికి ప్రాధాన్యం ఉంది. వస్తికర్మ ఎలా చెయ్యాలన్న దానిపై స్పష్టమైన ప్రకరణం ఉంది.

4. అనువాసన వస్తి : కషాయం మొత్తాన్ని తైలంలో ఇంకింపజేసి తైలభాగం ఎక్కువగా ఉండేలా చేసి దాన్ని ఎనిమా ఇవ్వటం అనువాసన వస్తి. దీనిలో మారేడు (బిల్వం), దేవదారు, రాస్న (దుంపరాష్ట్రం), మంగఫలం (మంగకాయ) మొదలైన వాటితో కషాయం తయారుచేసి, దాన్ని తైలాల్లో ఇంకిపజేసి అప్పుడు ఎనిమా ఇస్తారు. ఇది బయటకురావాల్సిన పని లేదు. ఇది శరీరంలో ఇంకిపోతే బలాన్ని కలిగిస్తుంది. దీన్ని ముఖ్యంగా రసాయనం (బలవర్ధకం), వాజీకరణం, వంధ్యత్వం వంటివాటిలో ఉపయోగిస్తారు. వాత ప్రధాన వ్యాధుల్లో తైలాలు, బలానికి-పిత్తప్రధాన వ్యాధులకు ఘృతం ఉపయోగిస్తారు.

5. ఉత్తర వస్తి : పురుషులకు, స్త్రీలకు జననాంగాల ద్వారా లోపలికి ఔషధాలను పంపించిచేసే ‘ఉత్తర వస్తి కర్మ’ను ఆయుర్వేదంలో ప్రశస్తంగా చెప్పారు. మూత్ర సంబంధమైన 13 వ్యాధుల్లో, ప్రోస్టేటు గ్రంథి వ్యాధుల్లో, 20 రకాల గర్భాశయ, యోని సంబంధ వ్యాధుల్లో ఈ వస్తికర్మ సూచ్యం. సందర్భాన్ని బట్టి వాజీకరణం, వంధ్యత్వం వాటికీ ఇస్తారు. విరివిగా వాడకంలో లేకపోయినా కొన్నికొన్ని వ్యాధుల్లో వీటికి ప్రాశస్త్యం ఉంది.

head massage in panchakarma6. నశ్య కర్మ (శిరో విరేచనం) : ‘నాసాయ శిరసో ద్వారం.’ అంటే శిరస్సుకు ముక్కు ద్వారం వంటిది. నశ్యకర్మ అంటే శిరస్సు నుంచి వాతపిత్తకఫ దోషాలకు సంబంధించిన వికృతులను తొలగించటానికి ఔషధ తైలాలను చుక్కల రూపంలో ముక్కు రంధ్రాల్లో వేయటం! ఇందుకు అపామార్గము, పిప్పలి, విడంగం వంటి దోషహర ద్రవ్యాలను, అణుతైలం, నారాయణతైలం, పీనసతైలం వంటి తైలాలను సూర్యావర్తం (సైనుసైటిస్‌), జలుబు, శిరశ్శూల వంటి వ్యాధుల్లో తైలాలను చుక్కలా వేస్తారు. చూర్ణాలను కూడా పీల్పిస్తారు. ఇది ఎండ ఎక్కువగా లేని ఉదయ సమయంలో ఉత్తమం. తల వెనక్కి వాల్చినట్టు ఉంచి, అప్పుడు గోరువెచ్చటి తైలాలు వేస్తారు.

7. రక్తమోక్షణం : సుశ్రుతుడు ప్రత్యేకంగా చెప్పిన కర్మ రక్తమోక్షణం. రక్తవికారం వల్ల వచ్చే పిత్తప్రధానమైన విసర్పం, కుష్టం, భగందరం, మధుమేహ పిటికల (కార్బంకుల్‌) వంటి వ్యాధుల్లో రక్తమోక్షణం చెప్పారు. దోష రక్తాన్ని తొలగించే ఈ ప్రక్రియలో ప్రధానంగా జలూకలు (జలగలు) వంటివి వాడటం జరుగుతోంది. వీటిలోనూ నిర్విషజలూకలను ఉపయోగిస్తారు. జలగను పట్టించి కొద్దిసేపు వదిలిస్తే అది అక్కడి రక్తాన్ని పీల్చుకుంటుంది, తర్వాత పసుపువేస్తే అది వదిలేస్తుంది.

16 రకముల బాహ్య స్నేహం రకరకాలు:
  1. అభ్యంగము: శరీరానికి మర్దన చేయటం
  2. లేపము: ఔషధాలను శరీరానికి పుయ్యటం 
  3. ఉద్వర్తనము: నలుగుపెట్టటం 
  4. పాదాఘాతం: ఔషధాన్ని పట్టించి కాళ్లతో రుద్దటం
  5. పరిషేకము: వెచ్చటి నీటిలో తైలాలు వేసి వాటితో స్నానం 
  6. గండూషము: ఔషధాలను పుక్కిట పట్టటం 
  7. మూర్ధతైలము: శిరస్సుకు నూనెలు పట్టించటం 
  8. శిరస్సేకము: శిరస్సుకు కాపడం 
  9. తక్ర ధార: మజ్జిగతో ధారా చికిత్స
  10. తైల ధార: ఔషధాలతో తయారు చేసిన తైలాన్ని తల మీద ధారగా పడేలా చేయటం
  11. పిచు: పత్తి నూనెలో ముంచి శిరస్సు, శరీర భాగాల మీద ఉంచటం
  12. శిరోవస్తి: తలకు గుడ్డ వంటిది కట్టి దానిలో ఔషధాలనుంచటం
  13. అక్షితర్పణము: కళ్లలో వెచ్చటి నెయ్యి మొదలైనవి వేయటం
  14. నాసాతర్పణము: ముక్కులలో చుక్కలు వెయ్యటం
  15. కర్ణపూరణము: చెవులలో నూనెలు మొదలైనవి వేయటం
  16. స్నేహ అవగాహనము: నీళ్లలో తైలాల వంటివి వేసి దానిలో పడుకోబెట్టటం
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

పంచ‌క‌ర్మ‌ అంటే యేమిటి ? - What is Pancha Karma