ప్రాచీన ఆయుర్వేద విధానంలో ఇంజక్షన్ ద్వారా వైద్యం - Healing by injection in the ancient Ayurvedic systemఆయుర్వేదం నందు ఇంజక్షన్ ద్వారా వైద్యం చేసే ప్రాచీన విధానం

మన ప్రాచీన ఆయుర్వేదం నందు ఔషధాలను నోటి ద్వారా కాకుండా ఒక సూది ద్వారా లొపలికి ఇచ్చే వైద్య విధానం ఒకటి ఉన్నది. కొన్ని పరిస్థితులలో రోగి నోటి ద్వారా ఔషధాన్ని గ్రహించలేకున్నప్పుడు అనగా అపస్మారము, మూర్చ, సన్నిపాతము, పాముకాటు, మెదడు వ్యాధి , యాక్సిడెంట్స్ , మెదడు నితినే ensplosis ఉన్మాదము వంటి వ్యాధుల యందు , స్మృతి లేని పరిస్థితుల యందు (COMA) రోగి రక్తం నందు ఔషధము ను ప్రవేశింప చేయుట . 1906 వ సంవత్సరంలో మద్రాస్ గవర్నర్ గా ఉన్న జార్జ్ ఏప్రెల్ గారు భారతీయ మెడికల్ అసోసియేషన్ ముందు ఉపన్యాసం ఇస్తూ " టీకా "( వాక్సినేషన్) మరియు ఇంజక్షన్ విధానం మున్నగు పద్ధతులు డాక్టర్ జన్నర్ మహాశయుని కంటే పూర్వమే భారతీయులు వైదిక యుగము నుండియే టీకా విధానం వాడుచున్నారు అని డాక్టర్ కర్నల్ గారు నిరూపించారు అని సూచించిరి. డాక్టర్ కర్నల్ గారు ఋగ్వేదం , యజుర్వేదం , అధర్వణ వేదం నందలి ఒక మంత్రం ఈ విధంగా తెలియచేసారు .
   మస్త్వాజ్జః ప్రసర్పఖంగా మంగం పరుశ్పరూహ్
   తతో యక్షం వివాద్య స ఉగ్రో మధ్యమ శిఖి

        దీనిలో " ప్రసర్పన్ " " ప్రవిశ్యా " " అంతః " శిరాముఖ వ్యాపనోచి అంజనా గల శీలద్రవ్యం అంగ ప్రత్యంగం లో ప్రవేశించుగాక . ఈ భావమునే వైజ్ఞానికులు తెలుపుతున్న వాక్సినేషన్ మరియు ఇంజక్షన్ పద్దతులను తెలుపుతుంది.  ఈ సూచీ విధానం గురించి ఈ క్రింది గ్రంథాలలో వివరణ కనిపిస్తుంది.
 • 🍀 ధన్వంతరి సంహిత.
 • 🍀 రస కామధేనువు.
 • 🍀 రసరాజ వసంతము.
 • 🍀 బృహన్నిఘంటు రత్నాకరం .
 • 🍀 రసేంద్ర చింతామణి.
 • 🍀 యోగ చింతామణి.
 • 🍀 రసప్రకాశ సుధాకరము .
 • 🍀 శారంజ్గాధర సంహిత.
 • 🍀 బృహత్ యోగ తరంగిణి.
 • 🍀 రససైకత , కామ్కా ఉల్లాసం .
           రక్త భేషజ విధానం అనగా ఔషద విశేషమును రక్తం నందు ప్రవేశింప చేసి వ్యాధిని నిర్మూలించే విధానం . మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను .
 • ۞ సన్నిపాత ( typoid ) రోగి సృహ తప్పి పళ్ళు బిగించుకు పొయిన దశలో ఔషధమును నోటి నుండి గాని ముక్కుపుటము నుండి కాని లొపలికి పంపుటకు వీలుకాని దశలో కపాలమును పదునైన కత్తితో చీరి సిద్ధ ఔషధములు ను సూదిమొనకు వచ్చినంత మాత్రమే అందులో వేసి రుద్ది రక్తంతో కలిసిన వెంటనే మస్తిష్క నాడీకేంద్రం చేతనం పొంది వారు లేచి మాట్లాడతారు.
 • ۞ తేలు కుట్టిన వెంటనే ఆ విషం పైకి ఎక్కకుండా గట్టిగా బిగించి కట్టి కుట్టినచోట బ్లేడుతో కాని కత్తితో కాని చీరినప్పుడు రక్తంతో పాటు విషం కూడా కారిపోవును . రక్తం తీయలేని వారు పొటాషియం పర్మాన్గానేట్ ఆ చోట వేసి చింతపండు నీటిలో తడిపి ఆ గుజ్జుని దానిపైన వేసిన కుతకుతమని పొంగి విషముని కాల్చివేయును. లేదా తెల్ల ఉల్లిగడ్డ మెత్తగా దంచి దానిపై వేసి కట్టు కట్టాలి. లేదా ఉత్తరేణి ఆకు రసముని గంటె లొ వేసి ఆవిరి పట్టేది.
 • ۞ ప్రాచీన కాలంలో కొన్ని రకాల చెట్ల పసర్లుని సూదులు గుంపుగా కట్టి మొండి కీళ్ల నొప్పుల పైన ముసలివాళ్లు పచ్చ పోడిపించుకునే వారు . అడివి జాతుల యందు ఈ విధానం ఇప్పటికి అలవాటు ఉంది.
 • ۞ పాము కరిచినప్పుడు రావిఆకులు తో చికిత్స చేస్తారు . రావిఆకుల చిన్న మండ తీసుకొచ్చి ఆకులు తుంచిన పాలు వచ్చును. పాము కాటువేసిన వ్యక్తి యెక్క రెండు చేతులు వెనకకి విరిచి కట్టి పాలుకారే ఆకు యెక్క తోడిమని కదలకుండా ఒక చెవ్వు రంధ్రములో కొంతవరకే దూర్చవలెను . చెవిలొ కర్ణ బేరికి తగలకుండా ఉండునట్లు జాగ్రత్త వహించవలెను. రెండొవ ఆకు తోడిమని మరొక చెవి రంద్రములో జాగ్రత్త వహించవలెను. అలా ఆకులని దూర్చగానే రోగి మూర్చ నుండి లేచి భాధతో కేక వేయును.అతనికి పూర్తిగా విషం దిగినదా లేదా అని తెలుసుకొనుటకు వేపాకు రోగిచే నమిలి తినిపించవలెను . పూర్తిగా చేదు ఉన్నట్లయితే విషం దిగిపోయినట్లు గుర్తించవలెను. లేనిచో మరియొక సారి చేయవలెను .
 • ۞ తేనెటీగల కొండిలోని విషముతో కూడా వైద్యం చేయవచ్చు . శరీరాంగములు లో పొట్ట ఊది నీరు నిండి మెరుస్తూ ఉంటుంది. దానిలో పూర్తిగా నీరు నిండి ఉంటుంది. దీనినే జలోదరం అంటారు. ఇది చాలా కష్టసాద్యం అయిన వ్యాధి . శరీరం పై చర్మం మైనం లాగా అయిపొతుంది. మూత్ర పిండాలు పనిచేయవు . అట్టి సందర్భాలలో ఈ చికిత్స అధ్బుతంగా పనిచేస్తుంది . ఇది ప్రయోగించగానే మూత్రం అధికంగా వచ్చి శరీరం అంతా నీరు వాపు దిగి పొతుంది.
               చిన్నపిల్లలకు వచ్చు మెదడు క్షయ లొ పిల్లవాడు తెలియకుండానే పడిపోతాడు. తల అటుఇటు కదల్చ లేడు కేకలు పెడతాడు. లేచి పడతాడు , తలనొప్పితో ఏడుస్తాడు , శరీరం ఒక పార్శ్వం చచ్చు పడుతుంది. పక్షఘాతం అర్ద భాగం లొ కొట్టుకుంటాడు , కండ్లు తిరుగుతూ దృష్టి ఉండదు. నాడి వేగముగా కొట్టుకుంటుంది. మూత్రం తక్కువై మెదడులో నీరు చేరుట చేత తెలివిహీనుడు అగును. అట్టివారికి ఈ మందు పనిచేయును .

  తేనెటీగల కొండి చికిత్సా విధానం:
         తేనెటీగల కొండి విషాన్ని ప్రత్యేకమైన సిరంజి ద్వారా చర్మము క్రింద ఇంజెక్ట్ చేస్తారు . మనకు కావలసినప్పుడు ప్రకృతి సిద్ధముగా తేనెటీగలు వచ్చి ఆయాభాగముల యందు కుట్టవు.కావున ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆ విషమును సేకరించి ఈ సూచి చికిత్స ద్వారా పంపుదురు. దీనివలన బ్లడ్ ప్రెషర్ , గుండె , చర్మవ్యాదులు , కీళ్ళనొప్పులు , ముద్ద కీళ్ళనొప్పులు , ఉదరవాతం , గాయాలు మున్నగునవి నివారించ బడును.

గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రచన: కాళహస్తి వెంకటేశ్వరరావు, ఆయుర్వేద వైద్యులు. - అనువంశిక ఆయుర్వేదం
సంప్రదించండి: 9885030034

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top