నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

27, మే 2018, ఆదివారం

రుద్ర నమక చకము మరియు సైద్ధాంతికం - Rudra Namaka Chamakamu

రుద్ర నమక చకము మరియు సైద్ధాంతికం - Rudra Namaka Chamakamu
రుద్ర నమక చకములలో ప్రత్యేకించి చమకములోని పనసలను చదువుతూ ఉంటే సంఖ్యా పరమైన సూచకములు కనబడతాయి. ఈ 11 వ అనువాకం లో ఒక రహస్యం దాగి ఉంది ఇందులో వరుసగ సంస్కృతంలో అన్నీ బేసి సంఖ్యలే వస్తాయి ఈ అంకెలు ఒక క్రమ పద్ధతిలో వచ్చునవి కావు ఇవి దేవ సంఖ్యలు.

కాని వాటి ముందు ఉండు సంక్య తో కూడి వర్గ మూలము లను అపాదించిన ఒక క్రమ పద్ధతిలో గల మనుష్య సంఖ్యలు( వరుసక్రమం లో వచ్చు సంఖ్యలు) కలుగుతాయి.

ఉదాహరణకు:
 • అందులో (ఏకాచమే అనగా 1,
 • త్రిసస్చమే అనగా 3,
 • పంచచమే = 5,
 • సప్తచమే 7,
 • నవచమే 9,
 • ఏకాదశచమే 11 ఇలా 1,3,5,7,9,11....బేసి సంఖ్యలే వస్తాయి ).
కాని వాటి ముందు ఉండు సంక్య తో కూడి వర్గ మూలము లను అపాదించిన చో ఇగో ఇలా వస్తాయి....ఏకాచమే అనగా:
 • ఒకటి =1, 
 • త్రిసస్చమే అనగా 3+1 = 4 కి వర్గమూలం =2, 
 • పంచచమే = 5+4=9 కి వర్గమూలం = 3, 
 • సప్తచమే = 7+9=16 కి వర్గమూలం = 4, 
 • నవచమే = 9+16=25 కి వర్గ మూలం = 5, 
 • ఏకాదశచమే = 11+25 =36 కి వర్గ మూలం = 6, 
 • త్రయోదశచమే = 13 + 36 = 49 కి వర్గ మూలం = 7, 
 • పంచ దశచమె = 15 + 49 = 64 కి వర్గ మూలం = 8, 
 • సప్త దశచమే = 17 + 64 = 81 కి వర్గ మూలం = 9, 
 • నవ దశచమే = 19 + 91 = 100 కి వర్గ మూలం = 10, 
 • ఏకవిగుం శతిస్చమే = 21 +100 = 121 కి వర్గ మూలం = 11, 
 • త్రయోవిగుం శతిస్చమే = 23 + 121 = 144 కి వర్గ మూలం = 12, 
 • పంచవిగుం శతిస్చమే = 25 + 144 = 169 కి వర్గ మూలం = 13, 
 • సప్తవిగుం శతిస్చమే = 27+ 169 = 196 కి వర్గ మూలం = 14, 
 • నవవిగుం సతిస్చమే = 29 + 196 = 225 కి వర్గ మూలం = 15, 
 • ఏకత్రిగుం శతిస్చమే = 31 + 225 = 256 కి వర్గ మూలం = 16, 
 • త్రయోవిగుం శతిస్చమే = 33 +256 = 289 కి వర్గ మూలం = 17, 
 • పంచ విగుం శతిస్చమే = 35 + 289 = 324 కి వర్గ మూలం = 18, 
 • శప్తవిగుం శతిస్చమే = 37 + 324 = 361 కి వర్గ మూలం = 19,
 • నవవిగుం శతిస్చమే = 39 + 361 = 400 కి వర్గ మూలం = 20, 
 • రుద్ర చమకము లో ఈ 11 వ అనువాకము సృష్టి పరమాణు రహస్యము. 
కాణాద మహర్షి సిద్ధాంతము ఈ సమస్త సృష్టి అణు, పరమాణు సూక్ష్మ కణ స్వరూపమని వాటి లో గల సంఖ్యా భేదము అనుసరించి వివిధ ధాతువులు యేర్పడినవి అని. శివ తత్వము ఈ సృష్టి లోని, పరమాణు స్వరూపం ( ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ) ల స్థితి కంటెను అతీతమగు స్థితి. శివోహం శివోహం శివోహం,... ఓం శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


« PREV
NEXT »