విఘ్నేశ్వర చవితి పద్యములతో ప్రార్థన - Vinyaka Chavithi Prardhanaవిఘ్నేశ్వర చవితి పద్యములతో  ప్రార్థన - Vinyaka Chavithi Prardhana

విఘ్నేశ్వర చవితి పద్యములతో  ప్రార్థన
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌  
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.  
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై  
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.  

తలచెదనే గణనాథుని  
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా  
దలచెదనే హేరంబుని  
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌   

అటుకులు కొబ్బరి పలుకులు  
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌  
నిటలాక్షు నగ్రసుతునకు  
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌. 

ఓం 

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top