Page Nav

HIDE

Grid

HIDE_BLOG

పాకిస్తాన్‌లో 100 ఏళ్ల నాటి హనుమాన్ మందిరం కూల్చివేత - 100 year old Hanuman mandir demolished in Pakistan

లా క్డౌన్ సమయంలో ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుండగా, పాకిస్తాన్లోని ఇస్లామిక్ శక్తులు మైనారిటీ హిందువులను వేధించటమే లక్ష్యంగా ప...

పాకిస్తాన్‌లో 100 ఏళ్ల నాటి హనుమాన్ మందిరం కూల్చివేత - 100 year old Hanuman mandir demolished in Pakistan
లాక్డౌన్ సమయంలో ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుండగా, పాకిస్తాన్లోని ఇస్లామిక్ శక్తులు మైనారిటీ హిందువులను వేధించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. పాకిస్తాన్లోని లియారి జిల్లాలో దేశ విభజనకు పూర్వం నుంచీ వున్న ఒక హనుమాన్ మందిరాన్ని ఒక బిల్డర్ ఆదివారం కూల్చివేసినట్లు ఒపిండియా తెలిపింది. ఈ ఆలయం కరాచీలోని లియారిలో గల ఫిడా హుస్సేన్ షేక్ రోడ్‌లో ఉంది.

దీంతో ఆగ్రహించిన హిందువులు సోమవారం ఆలయ స్థలంలో సమావేశమై ఆలయం కూల్చివేతపై తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన తరువాత కరాచీ పోలీసులు ఆ స్థలాన్ని సీలు చేశారు. పాకిస్తాన్ వార్తాపత్రిక ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లో వెలువడిన ఆగస్టు 18 నాటి సమాచారం మేరకు పోలీసులతో సైట్‌కు చేరుకున్న లియారి అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ కరీం మెమన్ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఆలయాన్ని కూల్చివేసినవారు అక్కడ ఒక నివాస భవనాన్ని నిర్మించ తలపెట్టినట్లుగా సమాచారం.

హీరా లాల్ అనే స్థానిక హిందువు మీడియాతో మాట్లాడుతూ దుర్ఘటనపై తన ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ ప్రాంతంలోని హిందువులకు ఆలయానికి హాని జరగదని బిల్డర్ హామీ ఇచ్చారు. కానీ ఆయన మాట తప్పి హిందువులను మోసగించారు.” అని హీరాలాల్ అన్నారు. ఆలయం సమీపంలో నివసిస్తున్న 18 హిందూ కుటుంబాలలో హీరా లాల్ ఒకరు. ఆదివారం సాయంత్రం ఈ కూల్చివేత జరిగిందని ఆయన తెలిపారు.

ఘటనకు స్థానిక ప్రత్యక్ష సాక్షి మొహమ్మద్ ఇర్షాద్ బలూచ్ ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌తో మాట్లాడుతూ, “ప్రార్థనా స్థలం ధ్వంసం చేయడం అన్యాయం. ఇది పాత ఆలయం. మేము చిన్నప్పటి నుంచీ చూస్తున్నాం.” అన్నారు.

హరేష్ అనే మరొక స్థానికుడు మాట్లాడుతూ “లాక్డౌన్ సమయంలో దేవాలయాన్ని సందర్శించడానికి ఎవరినీ అనుమతించలేదు. అతను [బిల్డర్] [మహమ్మారి] పరిస్థితిని ఉపయోగించుకున్నాడు. మేము దేవాలయాన్ని సందర్శించలేని సమయం చూసి మా ప్రార్థనా స్థలాన్ని కూల్చివేశాడు” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించవలసిందిగా అతను పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలయానికి ఎత్తి పరిస్థితుల్లోనూ నష్టం జరగదని, ఆలయం చుట్టూ నివసిస్తున్న హిందూ కుటుంబాలకందరికీ ప్రత్యామ్నాయ గృహాలను నిర్మించి ఇస్తామని కూడా బిల్డర్ స్థానిక హిందువులకు హామీ ఇచ్చి ఇప్పుడు ఈ విధంగా మోసం చేశాడని హరేశ్ పేర్కొన్నాడు.

హిందూ కార్యకర్త మోహన్ లాల్ ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌తో మాట్లాడుతూ బిల్డర్ ఆ స్థలంలో సమావేశమైన మైనారిటీ హిందువులను బెదిరించాడని ఆరోపించారు. ఆలయ కూల్చివేతను తీవ్రంగా ఖండించారు. “మేము ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాము, కాని బిల్డర్ మమ్మల్ని అడ్డుకున్నాడు” అని అతను వివరించాడు. “మా ప్రార్థనా స్థలాలను ఈ పద్ధతిలో పడగొట్టడాన్ని మేము అంగీకరించము” అని మోహన్ లాల్ చెప్పారు.

పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాల నిర్మాణాన్ని వ్యతిరేకించడం, ఉన్న దేవాలయాల్ని కూల్చివేయడం కొత్తేమీ కాదు. పైగా ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందువులు మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో ఇస్లామాబాద్‌లో కొత్త శ్రీ కృష్ణ ఆలయ నిర్మాణాన్ని ప్ర్రారంభించగా ఇస్లామిక్ మత ఛాందసవాదులు బలవంతంగా ఆలయ కాంపౌండ్ గోడను పడగొట్టి, నానా యాగీ చేయడంతో ఆలయ నిర్మాణాన్ని ఆపివేయాల్సి వచ్చిన సంగతి పాఠకులకు విదితమే. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.

మూలము: ఆర్గనేజెర్ - విశ్వ సంవాద కేంద్రము