“రామ్ ని దోచేద్దాం, రాబర్ట్, రహీమ్లని పోషిద్దాం” – ఇదే మన “లౌకిక” ప్రభుత్వాల విధానం - Loot Bhagawan Rama, Spend Ram Money to Robert and Rahim


“రామ్ ని దోచేద్దాం, రాబర్ట్, రహీమ్లని పోషిద్దాం” – ఇదే మన “లౌకిక” ప్రభుత్వాల విధానం - Loot Bhagawan Rama, Spend Ram Money to Robert and Rahim
గన్ మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం తమ మొదటి బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది. క్రైస్తవ పాస్టర్ లకి నెలకి 5000 జీతం ఇవ్వడానికి, అలానే ముస్లిం ఇమాంలకి ఇప్పటికే ఇస్తున్న జీతాలని 10,000కి పెంచడానికి, మౌజాన్లకి 5000 జీతం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను 948.72 కోట్ల రూపాయలని ఈ సంవత్సర బడ్జెట్ లో కేటాయించారు1. అయితే ఇందులో ఎక్కడా దేవాలయ అర్చకుల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

కొందరు పాస్టర్ లకు, ఇమాంలకు ఇచ్చే ఈ జీతాలని, దేవాదాయ శాఖ నియంత్రణలో ఉన్న దేవాలయాలలో పనిచేసే అర్చకులకు ఇచ్చే జీతాలతో పోల్చుతున్నారు. ఇది అయితే అమాయకత్వం లేదా అతి తెలివి. ఇలా భావించే వారు, ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిసా, తమిళనాడు, కేరళ మరియు మహారాష్ట్రలలో చాలా దేవాలయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధినంలో పెట్టుకున్నాయి. వాటిని ఆయా రాష్ట్రాల దేవాదాయ శాఖలు నిర్వహిస్తాయి. ఆ శాఖ నియంత్రణలో ఉన్న దేవాలయాలలో పని చేసే ఉద్యోగులకి మాత్రమే (అర్చకులకు కూడా), దేవాలయాల ఆదాయం నుండి ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. అంటే మన దేవాలయాల ఆదాయం ప్రభుత్వం తమ చేతుల్లో పెట్టుకుని, ఆ ఆదాయం నుండే దేవాయాలకి చెందిన వివిధ అవసరాలకి డబ్బులు సర్దుబాటు చేస్తుందే తప్ప, ప్రభుత్వ ఖజానా నుండి, అంటే ప్రజలు కట్టే పన్నుల డబ్బు నుండి కాదు.
ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలో లేని దేవాలయాలలో పని చేసే అర్చకులకు ఎటువంటి జీతాలూ ఇవ్వదు.
ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలో లేని దేవాలయాలలో పని చేసే అర్చకులకు ఎటువంటి జీతాలూ ఇవ్వదు. కానీ పాస్టర్ల విషయం అలా కాదు. దేవాలయ ఆస్తులలా చర్చి ఆస్తులు, ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. కాబట్టి వాటి మీద వచ్చే ఆదాయంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ ఉండదు. ఈ కారణం వలన పాస్టర్లకి ఇచ్చే జీతాలని, అర్చకులకి ఇచ్చే జీతాలలో పోల్చడం కుదరదు. దేవాలయాల ఆస్తులలా, చర్చి ఆస్తులను కూడా ప్రభుత్వం తమ అధీనంలో పెట్టుకుంటే, ఆ వచ్చే ఆదాయం నుండి పస్టర్లకు 5000 కాదు 50,000 ఇచ్చినా ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు.

అంతే కాక మన ప్రభుత్వపు దేవాలయ మరియు , దేవాలయ ఆస్తుల నిర్వహణ అత్యంత లోపభూయిష్టం. దేవాదాయ శాఖ పేరుతో దేవాలయాలలో ప్రభుత్వం అధికారులు చేసే దోపిడీ అంతా ఇంతా కాదు. మరిన్ని వివరాలు కావాలనుకునే వారు సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా ఉన్న శ్రీ J. సాయి దీపక్ గారి యూట్యూబ్ వీడియోలు, అలానే ఆయన రాసిన వ్యాసాలూ చదవవచ్చు.

భారతదేశం లౌకిక రాజ్యమా?
మనమందరం లౌకిక రాజ్యమే అనుకుంటాం. మన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. కానీ వ్యవహారంలో అలా ఉందా, అంటే, లేదు అని సమాదానం చెప్పక తప్పదు. నిజమైన లౌకిక రాజ్యానికి మతంతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. కానీ మన దేశంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. దాదాపు అన్ని ప్రభుత్వాలూ హిందువుల మీద జులుం చేస్తూ, అల్పసంఖ్యాక వర్గాలని మాత్రం బుజ్జగిస్తూ వస్తున్నాయి. మన దేశంలో తప్ప, బహుశా ప్రపంచంలో మరే ఇతర లౌకిక రాజ్యం కూడా కేవలం ఒక మతానికి చెందిన దేవాలయాలని మాత్రమె తమ నియంత్రణలో పెట్టుకుని దోపిడీ చెయ్యదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమె దాదాపు 70,000 ఎకరాల దేవాలయాల భూములు కబ్జాలో ఉన్నాయి అంటే ప్రభుత్వ నిర్వహణ ఎంత గొప్పగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు2. మన రాష్ట్రంలో మాత్రమె కాదు, దేవాదాయ శాఖ ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి. ఇదే సమయంలో చర్చికి సంబంధించిన ఆస్తులని మాత్రం ప్రభుత్వం తన నియంత్రణలో ఉంచుకోదు. మరి ఇది ఏ విధంగా లౌకికత్వామో ఏలిన వారికే తెలియాలి.

ఇందువలన మన దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందువులు, సమానత్వం కోసం పోరాడుతున్నారు. ఎక్కడైనా అల్పసంఖ్యాక వర్గాల వారు సమానత్వం కోసం పోరాడుతారు కానీ, అధిక సంఖ్యాకులు పోరాడటం బహుశా ఇక్కడ తప్ప మరెక్కడా ఉండదు. అంతే కాక మన దేశంలో 20 కోట్లకి పైగా జనాభా ఉన్న వర్గాన్ని కూడా ప్రభుత్వాలు అల్పసంఖ్యాక వర్గామనే అంటారు. ఇంకా విచిత్రం ఆ వర్గం వారు, 80 – 90% ఉన్న రాష్ట్రాలలో కూడా వారు అల్పసంఖ్యాకులే.

చారిత్రిక విశ్లేషణ
క్రైస్తవం, ఇస్లాం ప్రవేశించిన తరువాత కూడా బ్రతికి బట్టకట్టిన ఏకైక సంస్కృతి, ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే. మిగిలిన అన్ని దేశాల సంస్కృతులూ దాదాపు నాశనం అయిపోయాయి. అలా అని మనమేమీ నష్టపోలేదు అని కాదు కానీ, మిగిలిన వాటితో పోల్చుకుంటే మనం చాలా మెరుగైన స్థితిలో ఉన్నాము. ఐరోపా కావచ్చు. మాధ్య ప్రాశ్చ ఆసియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు కావచ్చు, క్రైస్తవం, ఇస్లాంలు అడుగుపెట్టాక స్థానిక నాగరికత, సంస్కృతి పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. అందుకు విరుద్ధంగా భారతీయ సంస్కృతి నాశనం అవ్వలేదు సరికదా, ఒక విధంగా చూస్తె రోజు రోజుకీ బలపడుతోంది. 30 – 40 సం. క్రితం వరకూ మూఢ నమ్మకంగా పరిగణింపబడిన యోగా, ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలకి చేరుకుంది. కేవలం అమెరికాలో మాత్రమె 3.60 కోట్ల మంది యోగాభ్యాసకులు ఉన్నారు3. ఆయుర్వేదం విషయంలో కూడా బహుశా ఇదే జరుగుతుంది

ఒక సారి మనం కనుక క్రైస్తవం రాక ముందు ఐరోపాలో ఉన్న మత విశ్వాసాలని, అలానే వాటిని ద్వంసం చెయ్యడానికి పాటించిన క్రైస్తవ వ్యూహాలని – అలానే హిందూ ధర్మ విశ్వాసాలని, ఇంతకు ముందు బ్రిటిష్ వారు, వారి తరువాత వివిధ ప్రభుత్వాలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న వ్యూహాలని పరిశీలిస్తే ఆశ్చర్యంగొలిపే పోలికలు కనబడతాయి. 313వ సంవత్సరంలో కాన్స్టాన్టిన్ సంపూర్ణ రోమన్ సామ్రాజ్యానికి రాజైన తరువాత క్రైస్తవ మతాన్ని చట్టబద్దం చేశాడు4. అప్పటి నుండీ పదవిలో ఉన్న వారి సహకారం, ప్రత్యక్ష ప్రమేయం క్రైస్తవ వ్యాప్తికి బాగా ఉపయోగపడింది. కాన్స్టాన్టిన్ మొదటి నుండీ క్రైస్తవ వ్యాప్తికి తాను చెయ్యగలిగినదంతా చేశాడు. భిషప్ లకు జీతాలు ఇవ్వడమే కాక, చర్చీల వృద్ధికి, క్రైస్తవ వ్యాప్తికి నిధులు కేటాయించాడు. పెద్ద ఎత్తున దేవాలయాల ధ్వంసం తరువాతి కాలంలో ప్రారంభం అయినా దానిని మొదలు పెట్టింది మాత్రం కాన్స్టాన్టినే. ఆయన 5 దేవాలయాలని కూల్చి వాటిని చర్చీలుగా మార్చాడని యూసేబియస్ తన “లైవ్ అఫ్ కాన్స్టాన్టిన్” లో తెలియచేశాడు. ఇది అతని జీవిత చరిత్ర. యూసేబియస్ ని చరిత్రకారులు “చర్చి చరిత్ర పిత” అని పిలుస్తారు5.

కేవలం 19 నెలల పాటు పాలించిన జూలియన్ తప్ప కాన్స్టాన్టిన్ తరువాత వచ్చిన రోమన్ చక్రవర్తులందరూ క్రైస్తవులే. సమయం గడుస్తున్న కొద్దీ రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవ జనాభా, దానితో పాటు క్రైస్తవ మతానికి రోమన్ చక్రవర్తుల సహకారం పెరుగుతూ వచ్చాయి. దీనితో పాటు స్థానిక మతాలపై ఆంక్షలూ పెరుగుతూ వచ్చాయి. మొదట క్రైస్తవాన్ని చట్టబద్దం చేశారు, తరువాత క్రైస్తవ వ్యాప్తికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం మొదలెట్టింది, అటు తరువాత స్థానిక మతస్తుల దేవాలయాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, దేవాలయాల ఆదాయాన్ని కూడా ఎన్నో సందర్భాలలో క్రైస్తవ మత వ్యాప్తికి ఉపయోగించారు, కొంత కాలం తరువాత కొత్త ఆలయాల నిర్మాణాన్ని, తరువాత పాత ఆలయాల మరమ్మత్తులను నిషేదించారు, అటు తరువాత స్థానిక మతస్తుల ఆచారాలలో ముఖ్యమైన డివినేషన్ (జ్యోతిషం వంటిది), జంతుబలి వంటి వాటిని నిషేధించారు, మరి కొంత కాలం తరువాత క్రమంగా స్థానిక మతస్తుల ఉత్సవాలని, దేవాలయంలో పూజలని, దేవాలయాలకి వెళ్లడాన్ని, దేవాలయాల పరిసర ప్రాంతాలకి వెళ్లడాన్ని కూడా నిషేదించారు. అటు తరువాత ఎవరి ఇంట్లో వారు దైవారాధన చేసుకోవడాన్ని కూడా నిషేదించారు. చివరిగా రోమన్ సామ్రాజ్యాన్ని 379 CE నుండి 395 CE వరకూ పాలించిన థియొడోసియస్ క్రైస్తవాన్ని రోమన్ సారాజ్యానికి అధికారిక మతం చెయ్యడం మాత్రమె కాక, స్థానిక మతాలన్నిటినీ పూర్తిగా నిషేదించాడు6. ఈ కాలంలో దేవాలయాల ధ్వంసం కూడా పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. చాలా సందర్భాలలో స్థానిక బిషప్ లే ఆ ప్రాంతలోని క్రైస్తవుల సహాయంతో దేవాలయాలని కూల్చేసేవారు. కొన్ని సందర్భాలలో దేవాలయాలని చర్చీలుగా మార్చేసే వారు. దేవాలయాలని కూల్చేయ్యమని చెప్పే బైబిల్ లోని వాక్యాల ఆధారంగా బిషప్ లు చాలా సందర్భాలలో దేవాలయాల కూల్చివేతకు చక్రవర్తి అనుమతి కూడా తీసుకునే వారు. అందుకే ఏదైనా దేవాలయం కూల్చివేయ్యడం స్థానికుల ప్రతిఘటన వలన కష్టమైతే రాజ్య సైన్యం నేరుగా వచ్చి దేవాలయ ధ్వంసానికి సహకరించేది. అంటే క్రైస్తవుడైన కాన్స్టాన్టిన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 70 – 80 సంవత్సరాలలోనే స్థానిక మతాలు నిషేధానికి గురి అయ్యాయి, క్రైస్తవం రాజ్యానికి అధికారిక మతం అయ్యింది.

ఇక్కడ జంతుబలుల నిషేధం విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. కొన్ని సైద్ధాంతిక కారణాల వలన యూదుమతంలో భాగమైన జంతు బలులు క్రైస్తవంలో నిషేధం. కేవలం ఈ కారణం వల్లనే అప్పుడు రోమన్ చక్రవర్తులు వాటిని తమ సామ్రాజ్యంలో నిషేదించారు. ఇదే కారణం వలన ఐరోపా దేశాలు తాము ఆక్రమించుకున్న అన్ని దేశాలలో జంతుబలులను నిషేదించాయి. బ్రిటిష్ వారు కూడా మన దేశంలో అదే చేశారు. పైకి చెప్పక పోయినా దేవాలయాలలో జంతుబలుల విషయమై మాట్లాడే జంతు ప్రేమికులలో చాలా వరకూ ఈ కోవకి చెందిన వారే. నిజమైన జంతు ప్రేమికులు శాఖాహారాన్ని ప్రోత్సహిస్తారు తప్ప, ఇలా ఒకవైపు గోహత్యలని సమర్ధిస్తూ, కొన్ని దేవాలయాలలో జరిగే జంతుబలులని వ్యతిరేకించరు.

రోమన్ సామ్రాజ్యపు పేగన్లకు పట్టిన గతే మనకూ పడుతుందా?
రోమన్ సామ్రాజ్యంలో ఏమైతే జరిగిందో అదే భారతదేశంలో కూడా జరుగుతోంది అన్న విషయం చాలా మందికి ఇప్పటికే అర్ధం అయి ఉండాలి. బహుసా క్రైస్తవం వ్యాపించిన మిగిలిన అన్ని దేశాలలో కూడా ఇదే జరిగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉదాహరణనే మనం తీసుకున్నట్లయితే, ఆంధ్ర ప్రభుత్వం కూడా దేవాలయాలని తమ నియంత్రణలో పెట్టుకుని దోచుకుంటోంది. కొన్ని సందర్భాలలో హిందూ దేవాలయాల సొమ్మును ఇతర మతాల వ్యాప్తికి ఉపయోగిస్తోంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. (ఇది కేవలం ప్రస్తుత ప్రభుత్వానికి మాత్రమె సంబంధించిన అంశం కాదు. అన్ని ప్రభుత్వాల పరిస్థితీ అంతే.) అలానే రోమన్ సామ్రాజ్యంలో బిషప్ లకు డబ్బులు ఇచ్చినట్లు, క్రైస్తవ వ్యాప్తికి నిధులు కేటాయించినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా క్రైస్తవ వ్యాప్తే తమ వృత్తిగా కల పాస్టర్లకి జీతాలు ఇస్తానంటోంది, అలానే క్రైస్తవ మత వ్యాప్తికి మరెన్నో రకాలుగా నిధులు కేటాయిస్తోంది7.
  • 〉నూతన చర్చి నిర్మాణానికి: 1 లక్ష వరకూ
  • 〉చర్చి మరమ్మత్తులకు: 30వేల వరకూ
  • 〉చర్చి అనుబంధ ఆసుపత్రి నిర్మాణానికి: 10 లక్షల వరకూ
  • 〉చర్చి అనుబంధ పాఠశాల నిర్మాణానికి: 5 లక్షల వరకూ
  • 〉చర్చి అనుబంధ అనాధ శరణాలయ నిర్మాణానికి: 5 లక్షల వరకూ
  • 〉చర్చి అనుబంధ వ్రుద్దాశ్రమ నిర్మాణానికి: 5 లక్షల వరకూ
ఇవన్నీ చూస్తె, ఆనాడు రోమన్ సామ్రాజ్యంలో జరిగిన దానికి, నేడు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో జరుగుతున్న దానికీ చాలా దగ్గరి పోలికలు కనబడతాయి. అయితే అదృష్టవశాత్తూ మనం ఇంకా తొలి దశలలోనే ఉన్నాం. అందువలన మనం ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చవచ్చు. అలా కాకుండా మనం చూస్తూ కూర్చుంటే అప్పుడు రోమన్ సామ్రాజ్యంలో ఉన్న స్థానిక మతస్తులకు ఏ గతి పట్టిందో రేపు మనకూ అదే గతి పడుతుంది. మన దేవాలయాలు కూడా కూల్చివేయబడతాయి, చర్చీలుగా మార్చబడతాయి.

తమ చరిత్ర నుండే కాక ఇతరుల చరిత్ర నుండి కూడా నేర్చుకోవడం ప్రతీ జాతికీ అత్యవసరం. అలా చెయ్యని జాతి నశించిపోవడం ఖాయం. రోమన్ సామ్రాజ్యంలోని స్థానిక మతస్తులు నాశనం అయిపోయి ఉండవచ్చు, కానీ వారి చరిత్ర మనకి అమూల్యమైన పాఠాలు నేర్పుతోంది. ఆ చరిత్ర నుండి నేర్చుకుని అవసరమైన విధంగా స్పందించడం ఇప్పుడు మన బాధ్యత, కర్తవ్యం.

ఆధారాలు - References :

〉The Triumph of Christianity by Bart D. Ehrman – page number: 290 (2018)
〉Ibid 230 – 231
〉Ibid 250 – 252
http://christianminorities.ap.nic.in// (డౌన్లోడ్స్ లోకి వెళ్లి దరకాస్తులు డౌన్లోడ్ చేస్తే వివరాలన్నీవాటిలో ఉన్నాయి)

రచన:
Ranjith Vadiyala
Independent Researcher, having interest in history / contemporary issues related to Christianity and liberal thought and their effects on Bharathiya Samskruthi.

ఈ వ్యాసం Pgurus ద్వారా తిరిగి వ్రాయబడింది. అన్ని హక్కులు Pgurus వారికీ చెందుతాయి.

ధర్మ్ ~ ఎవా హతో హంతి, ధర్మో రక్షతి రక్షా!
తాస్మా ~ ధర్మో నా హంత్వియో, మా నో ధర్మో హాథో ~ వాదిత్ !!

ధర్మాన్ని మీరు రక్షిస్తే, ఆ ధర్మమమే మిమ్మల్ని రక్షిస్తుంది !

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top