నాలుగు హైందవ వివాహ పద్ధతులు - Haindava Vivaham


నాలుగు హైందవ వివాహ పద్ధతులు - Haindava Vivaham
హైందవ వివాహ పద్ధతులు

ప్రధానముగా హిందూవులలో నాలుగు విధానలైన వివాహ పద్ధతులున్నాయి. 

అవి. 
1. బ్రహ్మీ వివాహం, 
2. గాంధర్వ వివాహం, 
3. క్షాత్ర వివాహం. 
4. రాక్షస వివాహం. 

1. బ్రహ్మీ వివాహం:
ఋషి సాంప్రదాయ బద్దమైన బ్రాహ్మీ వివాహం ఆర్య సమ్మతమైన వివాహము. వధూ వరుల కుల పెద్దలు, తల్లి దండ్రులు అనుమతించి అంగీకరించి, ఆశీర్వదించి వైధిక విధితో ఆచార యుక్తముగా జరిపించిన వివాహము అని అంటారు. ఇది సనాతనమైనది సర్వ జన సమ్మతమైనది మరియు సత్సంప్రదాయము. 

2. గాంధర్వ వివాహం:
గాంధర్వ వివాహం: యువతీ యువకులు ఇద్దరూ యుక్త వయస్సు గలవారైయుండి, మంచి చెడుల విచక్షణ కలిగి ఉండి, ఒకరినొకరు ఇష్టపడి, పెద్దల అంగీకారం గానీ ప్రమేయము లేకపోయినా, తమంత తాముగా రహస్యముగా వివాహం చేసుకొనడాన్ని గాంధర్వ వివాహము అని అంటాము. ఇతః పూర్వము శకుంతల దుష్యంతుల వివాహము ఈ విధముగానే జరిగినట్టు జెప్పబడుతుంది. పూర్వము గంధర్వులు, రాజులు, చక్రవర్తుల ఈ విధమైన వివాహము చేసుకునేవారు.

3. క్షాత్ర వివాహం:
కన్యామణి అంగీకారం ఉన్నా లేకున్నా, కన్య తరపు వారి పెద్దల అనుమతి లేకుండా వరుడు తన శౌర్య సాహసాలను ప్రదర్శించి కన్యను బలాత్కారంగా ఎత్తుకెళ్ళి తన స్వజనుల సమక్షములో వివాహం చేసుకోవడాన్నే క్షాత్ర వివాహం అంటారు. ఇది వివాహ పధ్ధతి కేవలం ఒక క్షత్రియ వర్ణమునకు చెందిన వరుడు ఇంకొక క్షత్రియ వర్ణమునకు చెందిన కన్యను లేక కన్యలను మాత్రమే ఈ పద్ధతిలో చేసుకొనుటకు అవకాసం వుంది. ఇతర వర్ణాల వారికి ఈ వివాహ పధ్ధతి నిషిద్ధము.

4. రాక్షస వివాహం:
అన్ని వివాహ పద్ధతులలో ఈ వివాహా పద్ధతి అతి నీచమైనదిగా పెద్దలు నిర్ణయించినారు. ఈ పద్ధతిలో వివాహామునకు బ్రాహ్మణ, వైశ్య వర్ణముల వారికి అనుమతి లేదు. ఈ పద్ధతిలో ఎవరికీ తెలియకుండా, దొంగచాటుగా మోసపూరిత ఆలోచనతో, కన్య యొక్క ఇష్టాఇష్టముల ప్రమేయము లేకుండా, కన్యను అపహరించి తీసుకొనిపోయి బలవంతంముగా వివాహం చేసుకోవటం రాక్షస వివాహం.

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top