స్తోత్రము, మూల మంత్రము - Stotram and Mola Mantra


సాంప్రదాయిక విధానంలో ఏ దేవతలను ఉద్దేశించి జపం చేస్తున్నప్పటికీ సర్వసాధారణంగా ఈ కింది పద్ధతులను అనుసరించాలి అని చెబుతారు. అవి రుష్యాది న్యాసం కరన్యాసం అంగన్యాసం ధ్యానశ్లోకమ్ మంత్రజపం ఫలం సమర్పణ.

రుష్యాది న్యాసంలో మంత్రము ఏ ఋషికి అనుభూత మైనదో ఆయన నామాన్ని పాటిస్తాము ఆ మంత్రం ఏ ఛందస్సులో విరచితమైనదో చెబుతూ ఏ దేవతలను ఉద్దేశించి చేస్తున్నామో ఆ దేవత పేరు ఉచ్చరిస్తారు. అటు తర్వాత మంత్రాన్ని ఏ రకంగా దేనికోసం ఉపయోగిస్తున్నాము పేర్కొంటాం. ఇక మన శరీరంలోని వివిధ భాగాలకు వివిధ దేవతలు ఉంటారు. కరన్యాసం అంగన్యాసం లో ఆయా దేవతలను ఆవాహన చేసి వారి వారి ఉచిత స్థానాలలో ప్రతిష్ఠితం చేస్తాం. దీని వల్ల మొత్తం శరీరమంతా వైదికంగా పవిత్ర మవుతుంది అలా ధ్యాన సాధనకు శరీరానికి యోగ్యత కల్పిస్తాం.

ధ్యాన శ్లోకం అనేది మనం ధ్యానం చేసే దేవతా స్వరూపాన్ని వర్ణిస్తుంది దీని వల్ల సాధకుడు తన ఇష్టదేవతను తన హృదయంలో సజీవంగా నెలకొని ఉన్నట్లు ఊహించుకో గలుగుతాడు ఇక జపంలో మంత్రాన్ని పదే పదే మననం చేస్తాం చేతివేళ్ళతో కానీ జపమాలను ఉపయోగిస్తూ కానీ లెక్క పెడతాం. చివరిగా పలసమర్పణం ద్వారా మనకు లభించే ఫలం ఫలితాన్ని పూర్తిగా దేవతకు సమర్పించడమే పలసమర్పణం. 

సాధారణంగా లలితా సహస్రనామ స్తోత్రములో ఖడ్గమాల స్తోత్రంలో వివిధ రకాల స్తోత్రాలలో మంత్ర జపాలలో న్యాసములు చేసేటప్పుడు శాస్త్ర పరిచయం లేని వారు కొందరు ఉపదేశం లేనివారు చేసే తప్పులు కొన్నిటిని వివరిస్తాను.

ఉదాహరణకి: ఖడ్గమాల స్తోత్రములో ముందుగా వ్యాసములు చేసే విషయంలో పుస్తకాలను చూస్తూ... న్యాసం చేయవలసిన వాటిని ఒక వచనం లాగా చదువుకుంటూ పోతారు న్యాసములు అస్సలు చేయరు. కొన్ని పుస్తకాలలో ఈ న్యాసం యొక్క వివరాలు తెలుపకుండా "మూలమంత్రేనా సడన్గాన్యాసం కుర్యాత్" అంటారు స్తోత్ర పాటకుడు కూడా న్యాసం చేయకుండా "మూలమంత్రేనా షడన్గాన్యాసం కుర్యాత్" అని చదివి వెంటనే ధ్యాన శ్లోకాన్ని పఠించడం మొదలుపెడతాడు.

ఇక్కడ గుర్తించవలసిన తప్పు ఏమనగా మూల మంత్రేన షడంగ న్యాసం కుర్యాత్ అంటే మూల మంత్రం తోటి శరీరంలోని ఆరు అంగములలో ఆయా దేవతలను ప్రతిష్ఠితం చేయాలి అని దాని అర్థం( న్యాసం చేస్తూ ) తరువాత ధ్యాన శ్లోకాన్ని పటణం చేస్తారు తప్ప ఆ దేవత యొక్క వర్ణన ఎలా ఉందో మనసులో ధ్యానం చేయరు. తరువాత "లమిత్యాది పంచపూజ కుర్యాత్ " అని పుస్తకంలో ఉంటే పాఠకులు కూడా యథాతథ "లమిత్యాది పంచపూజ కుర్యాత్" అని చదువుతారు వాస్తవానికి దీని అర్థము లం మొదలైన సo వరకు కలిగిన బీజ అక్షరాల తోటి పంచ పూజలు చేయాలి. ఇక్కడ కొన్ని ముద్రలు ప్రదర్శించాలి. కానీ ఇది కూడా చేయరు చదువుతారు అంతే అలా చదవడం వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది. ఒకసారి తెలుగులో భావన ఎలా ఉంటుందంటే "కుర్యాత్ " అంటే చేయాలి చేయవలెను అని అర్థం. మరి ఎవరు న్యాసాలు చేయాలి? పాటకులే కదా చేయాలి. అలా కాకుండా యధాతథ చదువుకుంటూపొతే అలా చదివినప్పుడు మంత్ర దేవతకే మంత్రo యొక్క న్యాసములు పంచ పూజలు చేసుకోమని చెప్పినట్లవుతుంది తనకు తాను పూజలు చేసుకోవడం ఏమిటి? ఈ విషయాన్ని గ్రహించలేరు అందుకని స్తోత్రం పరిచయం ఉపదేశం లేనివారు కనీసం దగ్గరలో ఉన్నటువంటి పురోహితులు కానీ మంత్ర సాధన చేసే వారి దగ్గర కానీ వివరణ పొందడానికి ప్రయత్నం చేయాలి. తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పుగానే ఉంటుంది. తెలుకోడానికి ప్రయత్నం చేయాలి.. ప్రత్నం చేసే వారికీ దైవ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

ఓం శ్రీమాత్రే నమః!!

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top