నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

2, సెప్టెంబర్ 2019, సోమవారం

కాణిపాకం వరసిద్ది వినాయకస్వామి ఆలయ సమాచారం - Kanipakam Alaya Samacharam

కాణిపాకం వరసిద్ది వినాయకస్వామి ఆలయ సమాచారం - Kanipakam Alaya Samacharam
వరసిద్ది వినాయకస్వామి వారి ఆలయంలో ప్రతి నిత్యం నిర్వహిస్తున్న అభిషేక సమయ వివరాలు ఇలా వున్నాయి. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు యధావిధిగా స్వామివారికి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు.

కాణిపాకంలో శాశ్వత పూజా టిక్కెట్‌ ధరలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో ప్రతి నిత్యం నిర్వహిస్తున్న శాశ్వత పూజా టిక్కెట్‌ ధర రూ.10 సంవత్సరాల కళ్యాణోత్సవం 15,116 రూపాయలు, 10 సంవత్సరాల ఊంజల్‌సేవకు 7500 రూపాయలు, 10 సంవత్సరాల అభిషేకానికి 7500, 10 సంవత్సరాల గణపతిహోమంకు 7500, 10 సంవత్సరాల నిత్య అర్చనకు 1516 రూపాయలు, ఉచిత ప్రసాదంకు 1116 రూపాయలకు పైనా, శాశ్వత గోపూజకు 1116 రూపాయలకు పైన వుంటుంది.

ఈ పూజలు సంవత్సరంలో ధాత కోరిన ఒక రోజున పూజ నిర్వహించడం జరుగుతుంది. విభూది, ప్రసాదం, పోస్టు ద్వారాధాతకు పంపించడం జరుగుతుంది.

శాశ్వత పూజల ధరలు కాలానుగుణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒక సారి పునఃపరిశీలన చేయబడును. పై పూజలకు నిర్ణయించిన రుసుములు నేరుగాను లేదా డీడీ ద్వారా లేదా మనీయార్డర్‌ ద్వారా కార్య నిర్వహణాధికారికి పంపవచ్చు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


« PREV
NEXT »