తిరుమలలో అంతర్జాలం ద్వారా గదులు, ప్రవేశ చీటీ - Tirumala Tirupati Devasthanam Darshan - TTD Seva Tickets


అంతర్జాలం ద్వారా గదులు,ప్రవేశ చీటీ
అంతర్జాలం (ఇంటర్నెట్‌ - Internet) సౌకర్యం ఉంటే చాలు తిరుమలలోని బస, శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం, ఆర్జిత సేవలు ముందస్తుగా రిజర్వ్‌ చేసుకునే సౌకర్యం ఉంది. దేశవిదేశాల్లో ఎక్కడున్నా సరే ఇంటర్‌నెట్‌ ద్వారా రిజర్వేషన్‌ చేసుకునే వెసులుబాటు టీటీడీ కల్పించింది.

అంతర్జాలం  ద్వారా సాధారణ సేవలైన కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు భక్తులు సులభంగా పొందవచ్చు. ఇక అతిముఖ్యమైన శ్రీవారి సుప్రభాతసేవ, అర్చన, తోమాలసేవ, విశేషపూజ, అష్ట దళ పాదపద్మారాధనసేవ, నిజపాద దర్శనం తదితర సేవలు బుక్‌ చేసుకునే సౌకర్యం కూడా టీటీడీ కల్పించింది. దీనికి సంబంధించిన కోటాను ప్రతి నెలా మొదటి శుక్రవారం కోటా విడుదల చేస్తారు. టికెట్ల కోసం భక్తులు ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వన్‌ టైం పాస్‌వర్డ్‌తో ఒకరికి ఒక టికెట్టు చొప్పున కేటాయిస్తారు.

ఈ –దర్శన్‌ కేంద్రాల ద్వారా ముందస్తు బుకింగ్‌
మన రాష్ట్రంతోపాటు చెన్నయ్, బెంగళూరు, న్యూ ఢిల్లీ, ఇతర ముఖ్యనగరాల్లో మొత్తం 86 ఈ– దర్శన్‌ కేంద్రాలు మరియు మొబైల్ యాప్ ద్వారా టీటీడీ నిర్వహిస్తోంది. వీటి ద్వారా  ఫోటోమెట్రిక్‌ పద్ధతిలో భక్తుడి వేలిముద్ర, ఫోటో ద్వారా స్వామి దర్శనం, ఆర్జితసేవలు, గదులు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు.
  • 🖝 తిరుమలలో నిత్యం భక్తులకు 7 వేల వరకు అద్దె గదులు కేటాయిస్తుంటారు. ఇందులో పద్మావతి అతిథి గృహాల పరిధిలో మొత్తం 2 వేల గదులున్నాయి. రూ.500 నుంచి 6 వేల వరకు అద్దె కలిగిన గదులు కేటాయిస్తారు.  ఫోన్‌ నెంబరు - 877–2263731 
  • 🖝 గదులు కావాలంటే ఆధార్‌కార్డు / ఓటరు కార్డు/ పాన్‌ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులోని ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది 
  • 🖝 రూ.100 నుంచి రూ.7100 (జీఎస్‌టీతో కలిపి) వరకు అద్దెగదుల్లో అవసరమైన గదిని పొందవచ్చు 
  • 🖝 సీఆర్‌వో విచారణ కార్యాలయ పరిధిలో మొత్తం 3 వేల గదులున్నాయి. రూ.50 నుంచి రూ.500 వరకు అద్దె కలిగిన గదులు మంజూరు చేస్తారు. వరుస క్రమంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భక్తులకు గదులు కేటాయిస్తారు. సిఫారసు లేఖలపై కూడా భక్తులకు ఇక్కడే గదులు కేటాయిస్తారు.  ఫోన్‌ నెంబరు – 0822–2263492  
  • 🖝 ఎంబీసీ–34లో పరిధిలో మొత్తం 3 వేల గదులున్నాయి. ఫోన్‌ నెంబరు : 0877–2263929, 2263523.
🖝 తిరుమలలో అంతర్జాలం ద్వారా గదులు, ప్రవేశ చీటీ పొందేందుకు ఇక్కడ నొక్కండి 👆

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top