మానవ దేహం - ఏడు చక్రములు - Yedu Chakraluమానవ  దేహంలోని చక్రాలు:
మానవ శరీరంలో ఏడు చక్రాలు అమరి ఉంటాయి. 
అవి:
  • మూలాధార, 
  • స్వాదిష్టాన
1. వీనిలో మొట్టమొదటిది మూలాధారం: గుద స్థానము నందు వుండే నాలుగు రేకుల ఎరుపు రంగుతో వెలుగుచుండును. ఒక ఘడియ నలభై విఘడియలకు ఆరు వేల జపములు జరుగును.  మూలధార చక్రమునకు విఘ్నేశ్వరుడు అధిదేవత.

2. రెండవది స్వాథిష్టాన చక్రము: ఆధార చక్రమునకు రెండు అంగుళములపై గుహ్యమందున నాలుగు రేకులు కలిగి,మూడు కోణములతో తెల్లని రంగుతో, ప్రకాశవంతంగా, నిర్మలంగా వుంటుంది. ఇది జల తత్త్వాన్ని కలిగి వుంటుంది. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపములు జరుగును. ఈ చక్రమునకు బ్రహ్మదేవుడు అధిదేవత.

3. మూడవది మణిపూరకము: స్వాధిష్ఠాన చక్రమునకు పైన మూడంగులములలో నాభి నందున ఒక అగ్ని నిలయమై మణివలె ప్రకాశిస్తుంటుంది. నీలవర్ణము కలిగింది. మొత్తం పది రేకులతో వుంటుంది. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపములు జరుగుతుంది. విష్ణువు ఈ చక్రానికి అధిష్టాన దేవత.

4. నాలుగవది అనాహత చక్రము: హృదయ స్థానములో పన్నెండు రేకులతో వుంటుంది. స్వర్ణ కాంతులను వెదజల్లుతూంటుంది .ఇది వాయు స్వభావం కలిగి వుంటుందని యోగుల భావన. పదహారు ఘడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపములు జరుగుతుంది. దీనికి రుద్రుడు అధిష్టాన దేవత.

5. విశుద్ధ అనేది ఐదవ చక్రము: అనాహిత చక్రమునకు పైన  పన్నెండు అంగులములలో కంఠం నందున  వుంటుంది. పదహారు దళములుంటాయి. రెండు ఘడియల నలభై అయిదు విఘడియలకు వేయి హంస జపములు జరుగుతుంది. అధినాయకుడు జీవుడు.

6. ఆజ్ఞేయ చక్రము ఆరవది: విశుద్ధ చక్రము మొదలు 12 అంగుళములపైన భ్రూ మధ్య స్థానంలో (త్రికూట స్థానము) ఉంటుంది. రెండు రేకులు కలిగి వుంటుంది. ఎరుపు, పసుపు రంగులతో అపారమైన కాంతిని వెదజల్లుతుంటుంది. రెండు ఘడియల నలభై విఘడియలకు వేయి హంస జపములు జరుగును. దీనికి సర్వేశ్వరుడు అధిష్టాన దేవత.

7. సహస్రారము అనునది ఆజ్ఞా చక్రానికి పైన కపాలంలో, నడి నెత్తిన బ్రహ్మరంథ్రము వద్ద వుంటుంది. ఎనిమిది దళాలుంటాయి. వేయి రేకులు కలిగి వుంటుంది. ఓంకారము ధ్వనించుచుండును. రెండు ఘడియల ఆరు విఘడియలకు వేయి హంసల జపము జరుగును. గురుమూర్తి అధిష్టాన దేవత.

ప్రాణ వాయువునకు కుడి ఎడమ వేపుల ఇడ పింగళులు అనే నాడులు వున్నాయి. ఇడ పింగళులు సహస్రారము మొదలు ఆగ్నేయ చక్రం వరకు వ్యాపించి వుంటాయి. వీటిమధ్య సుషుమ్ననాడి వుంటుంది. ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి వుంటుంది. ఈ నాడుల యందు ప్రవహించే జీవ శక్తి జీవుని చలనంతో వుంచుతుంది''
ఏకాగ్రతతో మనసు నిలిపివింటే ఓంకారము వినిపిస్తుంది. అదే విధముగా భ్రూమధ్యమున ద్రుష్టి నిలిపితే పరంజ్యోతి కనిపిస్తుంది. ఆ చిదానంద మూర్తిని దర్శించితే ముక్తి ప్రాప్తిస్తుంది.

పైన తెలిపిన చక్రాలు ముఖ్యమైనవి ఇవికాక శరీరమంతా విశ్వశక్తి నిరాటంకంగా ప్రసరించేందుకు ఉపయోగపడేవి'చక్ర'లు. అరచేతి వేళ్ల చివర్లలో సైతం చక్రాలు వుంటాయి. అరచేతిలో రెండు చక్రాలుంటాయి. శరీరంలో 31 ప్రధానమైన చక్రాలు వుంటాయి.

బహిర్గతంగా వుండే చెడుశక్తుల నుంచి శరీరంలోని ప్రాణశక్తిని ఇవి కాపాడతాయి. రోగనిరోధక వ్యవస్థ చురుకుగా పనిచేసేందుకు ఈ చక్రాలే కారణం . ఇవి బలహీనపడితే వ్యాధులు ప్రబలుతాయి. ఏ భాగంలో వుండే చక్ర బలహీనపడితే అక్కడ 6వుండే శరీరభాగం దెబ్బతింటుంది. సాధారణంగా ఏ వ్యక్తిలోనైనా కేవలం రెండు లేక మూడు చక్రాలు మాత్రమే బాగా క్రియాశీలకంగా వుంటాయి. మిగిలినవి సాధారణస్థితిలో వుంటాయి. ఏయే చక్రాలు చురుకుగా వుంటే ఆ శక్తులు మరింత ఎక్కువగా పని చేసి కొన్ని రంగాలలో బాగా రాణిస్తారు.

శరీరంలో వుండే ఏడు ప్రధాన చక్రాలలో మొట్టమొదటిది మూలస్థానంలో వుంటుంది. మొత్తం ఈ ఏడు చక్రాలు శక్తి తరంగాలను శరీరంలోని నిరంతరం పంపటం ద్వారా జీవశక్తిని అందిస్తాయి. ఈ ఏడు చక్రాలలో ఏ ఒక్కటి పూర్తిగా పనిచేయకపోయినా మరణం తప్పదు.

కాలివేళ్ళు, చేతివేళ్ళలో ఏడు చిన్న చక్రాలున్నాయి. ఏడు చక్రాలు శక్తిమయ దేహంలోవున్న ఏడు పొరలతో అనుసంధానం కలిగివుంటాయి. విశ్వంలోని విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశించేందుకు ఏడు ప్రధానచక్రాలు కూడా ముఖ ద్వారాలుగా వ్యవహరిస్తాయి. 

చేప శరీరంలో మొప్పలు ఏ విధంగా అయితే ఆక్సిజన్‌ను గ్రహించి శరీరానికి అందిస్తాయో ఈసప్త చక్రాలు కూడా విశ్వమంతటా ఆవరించివున్న విశ్వశక్తిని గ్రహించి భౌతిక శరీరానికి అందించటం ద్వారా శరీరాన్ని సజీవంగా నిలుపుతున్నాయి. చక్రాలు మూలస్థానం నుంచి చివరివరకు చూస్తే ఒక శంఖు ఆకారాన్ని పోలి వుంటాయి. చక్రం చివరి భాగం శరీరం బైటకు వుండి శక్తి మయ శరీరంలోని ఏదో ఒక అంశతో అనుసంధానాన్ని కలిగివుంటుంది.

శరీరంలోని నేత్రాలు, మెదడు, హృదయం, జీర్ణవ్యవస్థ, ఎండోక్రైన్‌ వ్యవస్థ, జననాంగ వ్యవస్థలతో చక్రాలు సంబంధాన్ని కలిగివుంటాయి. భౌతిక శరీరం మనుగడ సాధించేందుకు ఇవి అత్యంత ఆవశ్యకాలు. ఏయే చక్రాలు అత్యంత క్రియాశీలంగా వున్నాయో తెలుసుకోవటం ద్వారా ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని పూర్తిగా అంచనా వేయవచ్చు. వ్యక్తిత్వ లక్షణాలను, ప్రవర్తనా తీరును నిర్దేశించేవి ఆయా భాగాలకు అనుసంధానం చేయబడిన చక్రాలు. ఏదైనా 'చక్ర' బలహీనపడినట్టైతే సంబంధిత శరీరభాగం కూడా బాగా దెబ్బతింటుంది.

ఇది బాగా క్షీణ దశకు చేరుకున్న సమయంలో వ్యాధి రూపంలో భౌతిక శరీరంలో బహిర్గతమవుతుంది. నిజానికి వ్యాధి మూలం భౌతిక శరీరంలో వుండదు. సంబంధిత 'చక్ర'కు విశ్వశక్తిని అందించటం ద్వారా రక్షణ వ్యవస్థను మరింత శక్తిమంతం చేస్తుంది. ఫలితంగా భౌతిక శరీరం వ్యాధిని నిర్మూలించటమే కాకుండా చురుకుగా పనిచేస్తుంది.

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top