ఛాయా సోమేశ్వరాలయం, పానగల్లు, నల్గొండ పానగల్లు రాజధానిగా కుందూరు చోళులు క్రీ.శ. 1040 నుండి 1290 వరకు నల్గొండ, మహబూబ్ నగర్ మరియు...
ఛాయా సోమేశ్వరాలయం, పానగల్లు, నల్గొండ
పానగల్లు రాజధానిగా కుందూరు చోళులు క్రీ.శ. 1040 నుండి 1290 వరకు నల్గొండ, మహబూబ్ నగర్ మరియు ఖమ్మం జిల్లాల్లో నిర్మించిన రాష్ట్రమును పరిపాలించిరి. వీరి కాలములోనే ఈ దేవాలయము కూడా నిర్మిమ్పబడ్డది. ఈ దేవాలయము లో లభించిన వొక శాసనము లో క్రీ.శ. 1290 లో కాకతీయ ప్రభువగు ప్రతాపరుద్రుని పేరు కలదు.
ఇది త్రికూటాలయముగా మూడు గర్భ గృహములతో నిర్మించబడినది. తూర్పుముఖముగా వున్న గర్భగృహములో శివలింగం వున్నది. ఈ గర్భగృహము మధ్య నిరంతరము కదలకుండా వుండే పొడుగాటి స్తంభము లాంటి ఛాయను చూడచ్చు. శివలింగం ఈ ఛాయతో కప్పబడి వుంటుంది. అందుకనే ఈ దేవాలయం ఛాయా సోమేశ్వర దేవాలయం గా పిలవబడుతున్నది. ఈ దేవాలయమునందు కాకతీయులనాటి శిల్ప కళా రీతులను చూడవచ్చు.
రచన: ఫోటో - పి యస్ ఎం లక్ష్మి