సాంప్రదాయిక పద్దతిలో " కాలకృత్యములు" తీర్చుకొనుట - Kaalakrutyamulu (Strii Hithabodini )

సాంప్రదాయిక పద్దతిలో " కాలకృత్యములు" తీర్చుకొనుట - Kaalakrutyamulu (Strii Hithabodini )
ఉదయము నుండి రాత్రి పరుండు వఱకు స్త్రీ, ఆచరింపవలసిన విధులను ఈ గ్రంథక రతి శ్రీమతి, సౌభాగ్యవతి శారదాదేవి గారు చక్కగా చిత్రించినారు.

కాలకృత్యములు
ప్రతివారును సూర్యోదయమునకు ముందే నిద్ర మేల్కొని మల మూత్ర విసర్జనము చేయవలెను. పట్టణములలో నుండువారు మలవిసర్జనమునకు మరుగుదొడ్ల లోనికి వెళ్ళవలసి యుండును. అప్పుడు ఒక పెద్ద చెంబుత నీరు తీసికొని, కొన్ని అచట పోయవలెను అంటురోగములు రావు.

రాత్రి సమయములందు పల్లె-గ్రామములలో బహిర్భూమికి వెళ్ళవలసివచ్చిన, తోడు తీసికొని అందువలన కొన్న వెళ్ళపలెనే కాని, ఒకరే వెళ్లరాదు.

తరువాత కాలుసేతులు కడగుకొని పుక్కిలించి ఉమిసి దంతధావనము చేయవలెను. వేప, గానుగ, తుమ్మ, మజ్జి మొదలగు పుల్లలతో దంతధాననము చేయవచ్చును. ఉచితముగా దొరకునపుడు వీనిని కొనగూడదు, పుల్లలు దొరకనపుడుగాని, ప్రయాణములు చేయునపుడు గాని, పండ్లపొడి తయారుచేసికొనిన అది ఉపయోగించవలయును.

కాని బజారులలో నమ్మబడు పౌడర్లనుగాని, టూత్పేస్టుని కొనగూడదు. అందువలన వ్యయము ఎక్కువగుటయేగాక ప్రయోజనముగూడ ఉండదు. ప్రకటనలో ఉన్నంత పస వస్తువులలో ఉండదు. మనము తయారు చేసికొనిన పొడి, పంటివ్యాధులను పోగొట్టి, నోటిని బాగుగా శుభ్రపరచును. కొద్ది వ్యయముతో తయారగును దీనిని తయారుచేయువిధము ముందు చెప్పబడును. 

దంతధావన మైనపిమ్మట ఆరోగ్యవంతులు స్నానము చేయవలెను. చన్నీ రు స్నానమునకు చాల మంచిది. వేడినీరు అంత మంచిది కాదు. పైగా వంట చెరకు కొనవలసిన వారికి చన్నీటిస్నానము ఖర్చు తగ్గించును. రోగులు తొట్టిస్నానపు పద్దతిలో తప్ప చన్నీ ట స్నానము చేయరాదు. స్నానమునకు సాధారణముగ సబ్బుల నుపయోగింపరాదు. అట్టి సబ్బుల
లోని సోడా శరీరమునకు గరకుతనము గలిగించును. అవి మన దేహముపై ని సన్నని పొట్టును గూడ లేవదీయును. సబ్బుల నుపయోగింపనియెడల గౌరవహాని యని తలచువారు స్వదేశీ సబ్బులను, ఎక్కువ వాసన లేసవాటిని ఉపయోగింపవలెను.

వాసన శర్రీరము పై నిలువన ఉండునది కాదు. కావున వాసనకుగాను ఎక్కువ వ్యయము చేయరాదు.

సబ్బులకంటే క్రింది పిండి శరీరమునకు చాల మంచిది. ఇది శరీరమునందలి మురి కీని పోగొట్టుటయే గాక దురద, గజ్జి మున్నగు చర్మవ్యాధులను గూడ పోగొటును. ఆబాలవృద్ధులు దీనిని ఉపయోగించవచ్చును. ఇది చాలా చౌకగా తయారగును.

పిండితయారీ కి కావలసిన వస్తువులు:
  • 🍀పెసలు సోలెడు, 
  • 🍀 పసుపు తులము, 
  • 🍀 బావంచాలు తులము,
  • 🍀 తంటెపుగింజలు తులము,
  • 🍀 తుంగముసైలు తులము, 
ఇందులో పెసలు విసిరి పిండిచేసి మిగిలినవాటిని చూర్ణము చేసి ఆపిండిలో కలుపవలెను,

రచన: శ్రీమతి, వెంపటి సౌభాగ్యవతి శారదాదేవి - "స్త్రీ హితబోధిని" గ్రంధము 

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top