మాతృగయ - Maathru Gayaమాతృగయ - Maathru Gaya
 మాతృగయ ప్రాశస్త్యం
"మాతృదేవోభవ"అనే వేదవాక్యం యొక్క గొప్పతనం,మనకు అర్ధమై అనుభవంలోకి రావాలంటే,ప్రతి ఒక్క తనయుడు(తల్లి ని కోల్పోయిన వారు) వచ్చితీరవలసిన ఏకైక ప్రదేశం ఒక్కటే అదే "మాతృగయ".

గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ కు 100కిలోమీటర్ల దూరంలో "సిద్దపూర్" నే మాతృగయగా పిలుస్తారు.

తల్లిగర్భంలో ప్రవేశించినది మొదలు, తల్లి శక్తిని, రక్తాన్ని, మాంసాన్ని, తల్లి సమస్తాన్ని పీల్చి, తాను బయటపడే వరకు,తల్లి కి అన్నిరకాల కష్టాన్ని, దుఃఖాన్ని, బాధను కలిగించి, తాను క్షేమంగా బయటకు రావడానికి తన సర్వమును త్యాగం చేసిన, తల్లికి యధాశక్తి ఉపశమనం కల్గించి, క్షమాపణ వేడుకొని, ఆమె కు విష్ణు సాయుజ్యాన్ని కలిగించు పవిత్రప్రదేశమే "మాతృగయ".
శ్రీ కర్ధమఋషి
శ్రీ కర్ధమఋషి

శ్రీ కర్ధమఋషి,దేవహూతి పుణ్యదంపతులు,తప్పస్సు చేసి,శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకొని,ఆయన్నే పుత్రునిగా పొందాలని వరం అడుగగా,స్వయంగా విష్ణువే "కపిలమహర్షి" గా జన్మిస్తాడు.
మాతృగయ ఆలయం
మాతృగయ ఆలయం 
నాలుగు సంవత్సరాలకు,
తల్లికి జ్నానోపదేశం చేసి, వైకుంఠానికి పంపుతాడు. తల్లి,కపిలుడుతో "నాయనా" నారాయణా! నువ్వంటే సర్వేశ్వరుడవు. మాకు వైకుంఠ ప్రాప్తి కల్పించావు. లోకంలో సామాన్య తల్లులకు వైకుంఠ ప్రాప్తి ఏ విధంగా కలుగుతుంది?

అప్పుడు కపిలమహర్షి "ఏ కుమారుడయైతే ఇక్కడ బిందుసరోవరంల, స్నానమాచరించి, తల్లికి పిండప్రదానం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తానని" వాగ్దానం చేశాడు.

తరువాత కాలంలో పరశురాముడు రేణుకాదేవికీ, పిండప్రదానం గావించాడు. ఇక్కడ కర్ధమ, దేవహూతి, కపిల, సాక్షిభగవానుని విగ్రహాలు చూడవచ్చు. మొత్తం 21 పిండాలను పెట్టిస్తారు‌.

(16 రకాలుగా తల్లి జన్మనివ్వటానికి పడినబాధలకు, విష్ణువునకు, సాక్షిభగవానునికి, మాతృ, పితామహి, ప్రపితామహి లకు) తల్లి ఋణం భగవంతుడు కూడా తీర్చుకొనలేడు. అట్టి కన్నతల్లికి యధాశక్తి క్షమార్పణ చెప్పుకోని, ఆమెను ఉధ్ధరించని కొడుకు జన్మ వృధా అని "పెద్దల" వాక్యం.

సిధ్ధాపూర్ లో గుజరాతీ బ్రాహ్మణులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ కపిల్ శాస్త్రి గారు. చరవాణి: 09825397724, తీర్ధవిధిసామానుల నుండి, కోరితే భోజనసదుపాయం కూడా ఏర్పాటు చేస్తారు.

మాతృగయ ఆలయం గూగుల్ మ్యాపులో:రచన: కె.వి.స్ ప్రసాద్ 

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top