కొన్ని ముఖ్యమైన చిట్కావైద్యము - Vaidyamu

చిట్కావైద్యం

  • తలనొప్పి- కుంకుడు కాయల గుజ్జుతో గురవింద గింజ అరగదీసి కణతలకు పట్టువేసిన తలనొప్పి తగ్గును.
  • జలుబు: తులసిరసం సేవించిన జలుబు తగ్గును.
  • చర్మవ్యాధులు: వేప చిగుళ్ళను నూరి, ఉసిరిక రసంలో కలిపి సేవించిన చర్మవ్యాధులు తగ్గిపోవును. 
  • పంటివ్యాధులు: వేప పుల్లతోగాని, గానుగుపుల్లతో గాని పళ పళ్ళుతోముకున్నచో దంతముల నొప్పులు, బాధలు తగ్గి, దంతములు గట్టి పడును గాయములు మానుటకు వేపాకులు తేనెలో నూరి ముద్దజేసి, గాయముల పైకట్టిన అవి వెంటనే తగ్గును.
  • కాలిన గాయములు: కొబ్బరి నూనెలో సున్నపు తేటను కలిపి రాసిన, కాలిన బొబ్బలు, గాయములు తగ్గును
  • కాళ్ళతిమ్మిర్లు: నీరుల్లి రసంతీసి, తిమ్మిరి పట్టిన కాళ్ళకు బాగా రాసిన తిమ్మిర్లు తగ్గును
  • తామర: వేపాకు రసం, కొబ్బరినూనెలో వేడిచేసి, తామర ఉన్నచోట రాసిన తగ్గిపోవును గొంతునొప్పి - మిర్యాలపొడి, శాంటి చూర్ణము తేనెలో కలిపి తీసుకున్నగొంతునొప్పి తగ్గును
  • జ్వరము: పిప్పళ్ళ చూర్ణమును తేనెతో కలిపితీసుకున్న జ్వరము, దగ్గు తగ్గును.-
  • బొంగురుగొంతు: మిర్యాలపొడి వేడివేడి పాలలో కలిపి త్రాగిన బొంగురు గొంతు - తగ్గును కీళ్ళనొప్పులు: వెల్లుల్లిపాయ, ఉప్పు కలిపి నూరి ముద్ద జేసి కట్టు కట్టిన కీళ్ళనొప్పులు తగ్గును-వేడి- ఎండుకర్టూరము నీటిలో రాత్రిపూట నాన బెట్టి ఉదయం ఆ నీటిని త్రాగితి వేడి తగ్గి, మంచిరంగు కూడ వస్తారు.
  • దురదలు: మెట్టతామరాకు రసం, నిమ్మరసం కలిపి దురద ఉన్నచోట రాసిన. దురదలు తగ్గును.
గమనిక:
పైన నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top