Page Nav

HIDE
FALSE
HIDE_BLOG

Classic Header

{fbt_classic_header}

తాజా విశేషాలు:

latest

వీరీ గుమ్మడి పండు వీరి పేరేమీ - Veri Veri Gummadi Pandu

వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమీ కాళ్ళా గజ్జ కంకాళమ్మా వేగు చుక్క వెలగ మొగ్గ మొగ్గ కాదు మోటానీరు నీరు గాదు నిమ్మల బ...

వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమీ

కాళ్ళా గజ్జ కంకాళమ్మా
వేగు చుక్క వెలగ మొగ్గ
మొగ్గ కాదు మోటానీరు
నీరు గాదు నిమ్మల బావి
బావి కాదు బచ్చలి కూర
కూరా కాదు గుమ్మడి పండు
పండు కాదు పాప కాలు
కాలు తీసి కడగా పెట్టు. 

కాళ్ళాగజ్జ కంకాళమ్మ అంటే గుర్తొచ్చింది, దాగుడు మూతలు ఆడేముందు దొంగని డిసైడ్ చేయడానికి చేతి పంటలు వేసుకునే బదులు, అందరం కింద రౌండుగా కాళ్ళు చాపుకుని కూర్చుని ఇదే పాటని బాగా కుదించి

కాళ్ళా గజ్జ కంకాళమ్మా
వేగు చుక్క వెలగ పండు
కాలు తీసి కడగా పెట్టు.
అని అంటూ చేత్తో కాళ్ళు చూపుతు "కడగాపెట్టు" అన్న పదం ఎవరి కాలి మీదకి వస్తే వాళ్ళు పంటైనట్లు చివరిగా మిగిలిపోయిన వాళ్ళని దొంగగా నిర్ణయించేసే వాళ్ళం. ఈ దాగుడు మూతలు ఆటకి ఉపయోగించే మాటలు కూడా పాటలాగానే ఉంటాయ్ కదా.. కాకపోతే మన అమ్మో లేదా మన టీంలో పెద్దవాళ్ళో పాడేస్తారు .

వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమీ
రాముడు , ఆ రాముడు వెళ్ళి దాక్కో

దాగుడు మూతల దండాకోర్
పిల్లి వచ్చే ఎలుక చోర్
ఎక్కడి దొంగలక్కడే..
గప్ చుప్.. సాంబార్ బుడ్డీ 

సంకలనం: దీప్తీ మాధవ్