బ్రహ్మ ఆలయాలు - Brahma Aalayalu

బ్రహ్మ ఆలయాలు - Brahma Aalayalu
భారతీయ సంప్రదాయంలో బ్రహ్మ విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులుగా భావించి ఆరాధిస్తాము. సృష్టి - స్థితి - లయ కారకుడు పరమేశ్వరుడు సృష్టిని చేయగా, పద్మనాభుని నాభినున్న కమలంలో పంచముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. స్థితికారకుడుగా విష్ణుమూర్తి ప్రతి యుగంలోనూ వేర్వేరు అవతారాల నెత్తి దుష్టశిక్షణ శిష్టరక్షణ సల్పుతూ ఉంటాడు.

మనం బ్రహ్మదేవుని చతుర్ముఖుడిగా భావించి పూజ చేస్తాము. మరి పంచముఖాలతో ఆవిర్భవించాడని చెప్ప బడుతున్న బ్రహ్మ, చతుర్ముఖుడు ఎలా అయ్యాడు?

బ్రహ్మ విష్ణువులిద్దరూ ఒకప్పుడు, నేను శ్రేష్ఠుడనంటే నేను వరేణ్యుడనని వాదించుకొని, ఒకరితో ఒకరు పోరాటం ప్రారంభించారు. ఇలా వారిద్దరి యుద్ధం చూపరులకు ఆశ్చర్యం కలిగించింది. అత్యంత క్రోధావిష్టుడైన విష్ణువు బ్రహ్మదేవునిపై మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించగా, బ్రహ్మకూడా ్ర ఎంతో ఆవేశంపొంది ఘోరమైన పాశుపతాస్త్రాలను విష్ణువుపై విడిచాడు. అప్పుడు దేవతలు కైలాసానికేగి శివుని వేనోళ్ళ ప్రకొనియాడి, బ్రహ్మవిష్ణువులు కలహించుకొంటున్న ఉదంతం తెలియపరిచారు.

మహేశ్వరుడు పంకజాసన, పంకజాక్షుల రణరంగంవద్దకు వెళ్ళి, వారిద్దరిమధ్య గొప్ప జ్వాలాస్తంభమై ఆవిర్భవించాడు. విష్ణువు మహేశ్వరాష్త్రం, బ్రహ్మ పాశుపత్స్త్రం జ్వాలాస్తంభంలో లీనమయ్యాయి. ఆ జ్వాలాస్తంభం యొక్క ఆద్యంతాలు నారాయణుడు వరాహస్వరూపంతో ఆ జ్వాలాస్తంభపు చివరి భాగం, బ్రహ్మదేవుడు హంసరూపుడై స్తంభం అగ్ర భాగాలను కనుగొనడానికి బయల్దేరారు.

నారాయణుడు పాతాళలోకాలను భేదించి మిక్కిలి దూరంవెళ్ళినా చివరిభాగం కనబడలేదు. అప్పుడు చేసేదిలేక అలసినవాడై, మొదటి యుద్ధతలానికి తిరిగివచద్చాడు.

స్తంభాగ్రాన్ని కనుక్కోవడానికి పైకివెళ్ళిన బ్రహ్మదేవుడికి దైవవళాన కేతకీపుష్పం పైనుండి జారిపడుకున్నట్లు కనబడింది. అపత్కాలంలో అబద్ధమాడటం తప్పలేదని భావించిన బ్రహ్మదేవుడు, కేతకీ పుష్పాన్ని, తాను ఈ జ్వాలాస్తంభం యొక్కఅగ్రభాగాన్ని చూచినట్లు సాక్ష్యంచెప్పడానికి ఒప్పించి, రణ )రంగానికి తిరిగివచ్చాడు.

ఆ విధంగా బ్రహ్మా శ్రీహరికి తెలుపగా, ఆయన బ్రహ్మవాక్యాలు విశ్వసించి సత్కరించాడు అ సమయంలో, బ్రహ్మగావించిన అపచారం సహింప లేక, శివభగవానుడు అగ్నిస్తంభము నుండి ఒకానొక దివ్య మూర్తిగా ఆవిర్భవించాడు

బ్రహ్మ గర్వమునణిచే ఉద్దేశంతో "సాంబశివుడు-భైరవుడనే" మహాపురుషుని సృష్టించి, విధాతను తగిన రీతిగా శిక్షింపమని ఆజ్ఞాపించాడు. కాలభైరవుడు, అసత్యములాడిన బ్రహ్మదేవుని ఐదవ శిరస్సును ఛేదించాడు. అప్పుడు, శివుడు విగత పంచమశిరస్కుడైన బ్రహ్మతో, "నీవు కపటంగా ప్రవర్తించావు. కావున నీకు క్షేత్రములుగాని, ఉత్సవములు గాని, ప్రాణులు పూజించటంగాని ఉండజాలవు" అని శపించగా, బ్రహ్మ, “స్వామి! నాయందు ప్రసన్నుడవు కమ్ము నీ లీలలు ఎవరికీ తెలియరానివి' అంటూ క్షమించమని ప్రార్థించాడు

దీనుడైన విధాతను, "వత్సా! జగత్ సృష్టికార్య భారములను నీవే నిర్వహించు. అంతేగాక, యజ్ఞయాగములలో నీవే గురు స్వరూపంగా భావింపబడతావు" అని తెలిపాడు. ఈ విధంగా విధాత బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు పంచముఖుడిగా భావించేవాడు ఆ పరమేశ్వరుడొక్కడే.

పంచముఖాలు: 
 • 1. సద్యోజాత, 
 • 2. వామదేవ, 
 • 3. అఘోర, 
 • 4. తత్పురుష, 
 • 5. ఈశాన - ముఖాలే పరమేశ్వరుడి పంచముఖాలు.
కార్తికేయుడు షణ్ముఖుడు. బ్రహ్మదేవుడు చతుర్ముఖములతో, చతుర్ హస్తములతో సత్యలోకంలో సరస్వతి (సావిత్రి, గాయత్రిలతో) భాసిస్తూవుంటాడు. పదునాలుగు లోకాలూ అక్కడనుండే సృష్టించబడ్డాయి.

బ్రహ్మదేవుడు తన చతుర్ముఖాలతో ఎల్లవేళలా వేదోచ్చారణ (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము) చేస్తూవుంటాడని పురాణవచనం. ఆయన కమలము, జపమాల ధరించివుంటాడు

బ్రహ్మదేవుని ఆలయాలు
పరమేశ్వరుడు శాసించినట్లు బ్రహ్మదేవునికి ఆలయాలు నామమాత్రంగానే ఉన్నాయి.  ఎక్కువ పేరు గాంచినది రాజస్థాన్, అజ్మీర్ వద్ద గల "పుష్కర్" దేవాలయం.
"పుష్కర్" బ్రహ్మాలయం
"పుష్కర్" బ్రహ్మాలయం, రాజస్థాన్
బ్రాహ్మలయం , సతారా, గోవా
మన దేశంలో తమిళనాడు కుంభకోణంలోను, కేరళ తిరుపత్తూరు లోను , మహారాష్ట్ర సోలాపూర్ లోను, గోవా పంజిం దగ్గర సతారా తాలూకాలోను, హిమాచల్ప్రదేశ్లో సృష్టి నారాయణ్ గానూ, గుజరాత్లో ఖేద్  బ్రహ్మగానూ దేవాలయాలు గలవు.
చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి
చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం , చేబ్రోలు
ముఖ్యంగా, మన రాష్ట్రంలో, శ్రీకాళహస్తిలో బ్రహ్మదేవాలయం వుంది. గుంటూరు జిల్లా, చేబ్రోలులో అత్యంత పురాతనమైన 'చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి' ఆలయం ఉంది. అలాగే నాలుగు ముఖాలతో లింగాకారంగా పాలరాయి విగ్రహం ఉంది.

రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, కోనేరు మధ్యలో ఆలయం ఏర్పరిచి బ్రహ్మదేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసాడట.  దేవాలయం అష్టదిగ్బంధనం చేయించి, 
 • ψ - తూర్పున చంద్రమౌళీశ్వరస్వామి ఆలయం, 
 • ψ - పడమరన సహస్రలింగేశ్వరాలయం, 
 • ψ - దక్షిణాన శ్రీరంగనాథస్వామి ఆలయం, 
 • ψ - ఉత్తరాన వేణుగోపాలస్వామి ఆలయం; 
 • ψ - ఆగ్నేయ నైరుతి, వాయవ్య, ఈశాన్యాలలో అమ్మవార్ల ఆలయాలు నిర్మింపచేసాడట. 
శక్తి ఆలయాలు కాలగర్భంలో కలసిపోయి నేడు లేవు. ధ్వజస్తంభం పడిపోయినా, పునర్నిర్మించలేదు కర్నూలుజిల్లా ఆలంపురంలో తుంగభద్రనది ఎడమ ఒడ్డున 7వ శతాబ్దంలో చాళుక్యులు 'నవ బ్రహ్మ ఆలయాలు నిర్మించారు.

అవి:
 • 1. తారకబ్రహ్మ, 
 • 2. స్వర్గబ్రహ్మ పద్మ్రహ్మ, 
 • 3. బాల బ్రహ్మ, 
 • 4. విశ్వబ్రహ్మ, 
 • 5. గరుడబ్రహ్మ, 
 • 6. కుమారబ్రహ్మా, 
 • 7. అర్క బ్రహ్మ, 
 • 9. వీరబ్రహ్మల ఆలయాలివి.
నవ బ్రహ్మ ఆలయాలు - ఆలంపురం
నవ బ్రహ్మ ఆలయాలు - ఆలంపురం

కాంబోడియా , అంగోర్కువాట్ లోని , బ్రాహ్మలయం
విదేశాలలో చూస్తే, కంబోడియా అంగకోర్వాట్లో బ్రహ్మాలయంవుంది. బ్యాంకాక్ లో 2006 మే 21న ఒక అద్భుతమైన బ్రహ్మదేవుని ఆలయం కట్టారట థాయిలాండ్లో, అమెరికాలోని లాస్ వెగాస్ లో బ్రహ్మదేవుని విగ్రహాలు కనువిందు చేస్తాయి.
అమెరికాలోని లాస్ వెగాస్ లో బ్రహ్మదేవుని
అమెరికాలోని లాస్ వెగాస్ లో బ్రహ్మదేవుని ఆలయం 

 బ్రహ్మదేవుని ఆలయం కట్టారట థాయిలాండ్
 బ్రహ్మదేవుని ఆలయం కట్టారట థాయిలాండ్
త్రిమూర్తులలో శివుడికి, విష్ణుమూర్తికి, అలాగే అమ్మ వార్లకు, ప్రపంచమంతా లెక్కలేనన్ని దేవాలయాలున్నా బ్రహ్మదేవునికి మాత్రం, శాపవశాన బహు తక్కువ సంఖ్యలో దేవాలయాలు గలవు. 

రచన: శివశ్రీ డా !! అత్తలూరి మృత్యుంజయశర్మ గారు
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top