నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Wednesday, January 15, 2020

సంక్రాంతి శోభ - Sankranthi Sobha

సంక్రాంతి శోభ
సూర్యుడి రాశి సంక్రమణాల్లో మకర రాశిలో ప్రవేశించే కాలం అత్యంత ప్రధానంగా చెబుతారు. మకర సంక్రాంతి అయినప్పటికీ, సామన్యులకు సంక్రమణం" అంటే ఈ ఒక్క పర్వమే స్సురిస్తుంది.

ఏడాది మొత్తంలో ఈ సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యం దీన్ని పెద్ద పండుగ చేసింది సౌరమానం ప్రకారం ఇక్కడి నుంచి మకర మాసం. దీన్ని దార్మిక గ్రంధాల్లో దేవ పర్యం'గా అభివర్ణించారు సంవత్సరానికి పగలు వంటిది ఉత్తరాయణం రాత్రి మంటిది దక్షిణాయనం.

కాలంలో ప్రకృతిలో కలిగే మార్చుల్లో నూక్ష్మంగా ఉన్న దివ్యత్వాన్ని దర్శించిన ధార్మిక రుములు, ఆ దివ్యత్వాన్ని మనం పొందేందుకు కావలసిన సాధనా ప్రక్రియలను ఏర్పరచారు. స్నాన, దానాలకు ప్రాధాన్యం ఈ సంక్రమణంలో కనిపిస్తుంది ఈ రోజున ప్రయాగ స్నానం మనదేశంలో జరిగే మహావైభవం.

ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని ఈ సమయాన దానం చేయడం ప్రధాన సత్కర్శ సంకల్పహర్వకుగా శ్రోత్రియులకు చేసే వివిధ దానాలేకాక్ష దీన జనులకు చేసే దానాలూ భగవంతుడికి ప్రీతికంమైనవి. వ్యక్తి స్వయంకృషితో న్యాయబద్ధంగా ఆర్జించిన సంపదలు దానం వల్ల పవిత్రమవుతాయని పురాణ బోధ

సంపాదించుకున్న ధనాదులను దైవకార్యాలకు, సమాజ హితానికి వినియోగించడం దాన వ్యవస్థ ఉద్దేశం. కానుకలుగా, సహాయంగా ఆర్చణంగా తన ద్రవ్యాలను పంచడంలో ఉన్న ఆనందం ఈ పర్వం నాటి దానక్రియలోని సౌందర్యం.

పంట చేతికందే ప్రకృతి వరాల ఈవేళ. వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో, పంటల సంపదలను పలు విధాలుగా పంచి ఆనందించే పండుగగా ఇది శ్రమజీవులకు ఆనందహేల అవుతోంది. కుటుంబ సంబంధాల తీయందనాలు, సామాజిక బాధ్యతల దాతృత్వాలు సంక్రాంతి సౌరభాలు,

సర్వజీవలకు ప్రాణప్రదాతగా ప్రకృతి గతిని మలిచి అనుగ్రహించే మహాశక్తిమంతుడిగా సూర్యుని దర్శించి, ప్రత్యక్ష దైవంగా, కర్ణస్కషిగా ఉపాసించిన బారతీయులు - దీన్ని సూర్యపర్వంగా ఆవిష్కరించారు.

ఉత్తరాయణ సూర్యుని సర్వదేవమయుడిగా సంభావిస్తూ- కొత్త బియ్యంతో, ఆవుపాలతో పరమాన్నాన్ని వండి, స్వామికి నివేదించడం పొంగల్ గా ఈ పర్వాన్ని తీర్చిదిద్దుతోంది దైవికమైన ధ్యాన-జపాది అనుష్ఠానాలు ఈ పర్వ సమయాన విశేష ఫలాన్నిస్తాయని వాటికి సంబంధించిన శాస్త్రాలు ఈ కాల ప్రభావాన్ని బహువిధాలుగా ప్రశంసించాయి.

హిందువుల (వైదికులు) పండుగల్లో వైవిధ్యశోభ - ఆయా రుతువుల మార్చులకు అనుగుణమైన వంట వినోదాల్లోనూ కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో దీన్ని 'తిల సంక్రాంతిగా వ్యవహరిస్తారు.
తెల్లనువ్వులు, మదధుర పదారాలు శుభాకాంక్షల భావంతో పరస్పరం కొన్ని ప్రాంతాల ఆచారం. పూజలో నైవేద్యంలో, వంటల్లో తిలలను వాడడం ప్రశస్తి.
పతంగం' అనే మాట ముఖ్యంగా సూర్యుణ్నే, పక్షిని తెలియజేస్తుంది. ఆకాశ గమనుడైన సూర్యుని పర్వం కనుకనే ఆయనకు ప్రతీకగా పతంగాలను (గాలిపటాలు) ఎగరేయడం కొన్నిచోట్ల వేడుక.

మనుషులతోపాటు, వ్యవసాయంలో శ్రమించిన పశువుల పట్టా కృతజ్ఞతాబావం, దేవతా భావం వ్యక్తపరచడం విలక్షణమైన సంస్కారం, దేశ సంపదను పుష్టిపరచే పశుసంపదను పూజించే పర్వం కూడా ఇది పంటతోపాటు, పాడి కూడా వ్యవసాయంలో ప్రదానం కనుక ఈ ఆచారాన్ని ప్రాచీన కాలం నుంచి ఆనుసరిస్తున్నారు నేలలో నింగిలో వచ్చే చక్కని పరిణామాలు సకల
ప్రసాదించాలని సద్బావంతో జరుపుకొనే సంస్కారాల పర్వమే సంక్రాంతి:|

రచన: గురు-సామవేదం షణ్ముఖశర్మ, ఈనాడు సౌజన్యంతో
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com