సి.ఎ.ఎ వ్యతిరేక నిరసనల పేరుతో హింసకు పాల్పడటం క్షమించరాని నేరం: వి.హెచ్.పి - Violence in the Name of Anti-CAA Protests: VHP


సి.ఎ.ఎ వ్యతిరేక నిరసనల పేరుతో హింసకు పాల్పడటం క్షమించరాని నేరం: వి.హెచ్.పి - Violence in the Name of Anti-CAA Protests: VHP
న్యూఢిల్లీ: “పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) వ్యతిరేక నిరసనల పేరుతో దేశంలో జరుగుతున్న హింస భరించలేనిదిగా మారుతోంది!” అని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ముఖ్య కార్యదర్శి మిలింద్ పరాండే అన్నారు. ఇటువంటి అనారోగ్యకరమైన, తప్పుదోవ పట్టించే నిరసనల కారణంగా ఒకవైపు జార్ఖండ్‌లోని లోహర్‌దగా వంటి ప్రదేశాలలో హిందువులపై బహిరంగ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ ఉన్మాదపు దూకుడు కార్యకలాపాల నుండు తేరుకోవడంలేదు. ఈ నిరసనల కారణంగా రాజధానిలోని ముఖ్యమైన రహదారులు, ఉద్యానవనాలు నిరసనకారులతో నిండిపోతున్నాయి. ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో ఉండే ముస్లిమేతరులు, హిందువుల రోజువారి జీవితం కష్టతరంగా మారింది. ఈ పార్లమెంటరీ చట్టంతో భారతీయుల మతాలకు సంబంధం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ తదితర పార్టీలు, జాతివ్యతిరేక శక్తులతో కలిసి ముస్లిం ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు తప్పుడు సమాచారం వ్యాప్తి ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడమే కాక గందరగోళానికి గురిచేస్తున్నాయి. దేశానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ దుష్టశక్తులు చేస్తున్న కుట్రలను అరికట్టి, అటువంటి వారిపై కఠినచర్యలు తీసుకోవాలి.
VHP
జార్ఖండ్ లోని లోహర్దగా పట్టణంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చిన హిందూ శరణార్థుల మానవ హక్కులకు, సి.ఎ.ఎకు మద్దతుగా శాంతియుత ర్యాలీ చేపట్టిన స్థానిక హిందూ సమాజం ఘోరమైన దాడులు జరిగాయి (వీరిలో ఎక్కువ మంది ఎస్సీ/ఎస్టీ పురుషులు, మహిళలు, పిల్లలు, ఆయా దేశాలలో జిహాదీ దార్-ఉల్-ఇస్లాంవాదులచే మతపరంగా హింసించబడ్డవారు). ఆ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం రావడంతో జిహాదీ మనస్తత్వం గలవారు హిందువులపై ఎంత దూకుడుగా ప్రవర్తిస్తున్నారో ఈ సంఘటన మళ్ళీ రుజువు చేసింది. జార్ఖండ్‌లోని పట్టాల్‌గర్హిలో సి.ఎ.ఎ కి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో గిరిజన సోదరులను దారుణంగా హత్యలు చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, జార్ఖండ్లో హిందువులపై దాడులకు కాంగ్రెస్ మద్దతు ఉన్న కూటమి ప్రభుత్వం ఉదాసీనతే కారణమని అన్నారు. దాడి చేసిన జీహాదీ మూకలను వెంటనే అరెస్టు చేసి వారికి కఠినమైన శిక్షలు విధించేలా చూడాలని, బాధితుల ప్రాణ, ఆస్తి నష్టాలకు తగిన పరిహారం, భద్రత, వైద్య చికిత్స తో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని జార్ఖండ్ వి.హెచ్‌.పి సెక్రటరీ జనరల్ మిలింద్ పరాండే, కాంగ్రెస్ మద్దతు ఉన్న హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేశారు.

ఢిల్లీలో షాహీన్‌బాగ్, ఖురేజ్ ఘటనలను ప్రస్తావిస్తూ శ్రీ పరండే- షాహీన్‌బాగ్ వద్ద ఒకవైపు, ఢిల్లీని ఉత్తర ప్రదేశ్‌తో కలిపే ముఖ్య రహదారులను గత నెల రోజులుగా సిఎఎ వ్యతిరేక నిరసనకారులు స్వార్థ ప్రయోజనాలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అడ్డుకున్నారని అన్నారు. దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక నినాదాలను లేవనెత్తడమే కాక, ఖురేజ్‌లో రాళ్ళు విసిరేవారు వివేకానంద ఆశ్రమాన్ని దెబ్బతీస్తున్నారు. డిడిఎ పార్కు సమీపంలో ప్రభుత్వ భూమిపై మసీదు నిర్మాణ ప్రయత్నం జరుగుతోంది. ఈ కార్యకలాపాలన్నింటినీ వెంటనే ఆపాలి అని అన్నారు.

రచన: విశ్వహిందూ పరిషత్ (VHP )
మూలము: విశ్వ సంవాద కేంద్రం

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top