కాలీఫ్లవర్ లో దాగున్న అద్బుత ఆరోగ్య రహస్యాలు - Cauliflower lo Daagiunna Adhbutha Aarogya Rahasyaalu

కాలీఫ్లవర్ లో దాగున్న అద్బుత ఆరోగ్య రహస్యాలు - Cauliflower lo Daagiunna Adhbutha Aarogya Rahasyaalu
కాలీఫ్లవర్ తో ఆరోగ్యం
క్యాలీఫ్లవర్లో విటిమిన్ సి' హెచ్చుగా ఉంటుంది. విటమిన్ సి'ని తక్కువగా తీసుకుంటే డోపమైన్ తయారీని తగ్గిస్తుంది. ఆరోగ్య భావనలను కల్గిస్తుంది. క్యాలీస్లవర్లో ఉత్పాత స్పూర్తిని పెంచే విటమిన్లు ఎక్కువ స్థాయిలోనే ఉంటాయి.

జీవితంలో నిలవడానికి, నిలదొక్కుకోవడానికి, గెలవడానికి ఆరోగ్యం అవసరం. అలాగే జీవితంలో ఆహార క్రమశిక్షణ కూడా అవసరమే. ఇవాళ కొనుగోలుదారులలో ఆరోగ్య స్పృహ పెరగడంతో పోషకవిలువలకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. జనంలో ఆరోగ్య ఆహారాలపట్ల ఆసక్తితోపాటు అవగాహన పెరిగింది.

ఆరోగ్యదాయకమైన భోజనాల్ని అలవాటు చేసుకుంటున్నారు. ఇది దేశవ్యాప్తంగా అత్యంత ఆరోగ్యవంతమైన రెస్టారెంట్స్, పుడ్ స్టోర్స్,ఆర్గానిక్ రెస్టారెంట్స్ ఏర్పాటుకావడానికి దోహదం చేసింది. మనిషి ఆరోగ్యం, ఆయువు ఆ వ్యక్తి తీసుకునే ఆహారం మీదే ప్రధానంగా ఆధారపడి ఉంటాయి.

ప్రపంచంలో పలువురు శాస్త్రవేత్తలు వివిధ రకాల ఆహారపదార్ధాలపై నిరంతర పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగిస్తున్నారు. కూరగాయలు,వండ్లలోని పోషక విలువలు, ఔషధ గుణాల గురించి సాగించిన సాగిస్తున్న పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. మానవాళికి మహోపకారం చేస్తున్నాయి.
Cauliflower - కాలిఫ్లవర్
కాలిఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టముండదు వండేటప్పుడు దాని వాసన అంతగా బాగుండదు. కాని కాస్త మసాలాలు దట్టించి , నిదానంగా వండితే అద్భుతమైన రుచిగా కాలిఫ్లవర్ కూరలు, వేపుళ్లు చేసుకోవచ్చు.

కాలిఫ్లవర్ లో ఉండే పోషక విలువల పరిమాణము పట్టిక:
 • ⚘ పిండిపదార్థాలు 5 g
 •  చక్కెరలు 2.4 g
 •  పీచుపదార్థాలు 2.5 g
 •  కొవ్వు పదార్థాలు 0 g
 •  మాంసకృత్తులు 2 g
 •  థయామిన్ (విట. బి1) 0.057 mg 4%
 •  రైబోఫ్లేవిన్ (విట. బి2) 0.063 mg 4%
 •  నియాసిన్ (విట. బి3) 0.53 mg 4%
 •  పాంటోథీనిక్ ఆమ్లం (B5) 0.65 mg 13%
 •  విటమిన్ బి6 0.22 mg 17%
 •  ఫోలేట్ (Vit. B9) 57 μg 14%
 •  విటమిన్ సి 46 mg 77%
 •  కాల్షియమ్ 22 mg 2%
 •  ఇనుము 0.44 mg 4%
 •  మెగ్నీషియమ్ 15 mg 4%
 •  భాస్వరం 44 mg 6%
 •  పొటాషియం 300 mg 6%
 •  జింకు 0.28 mg 3%
గర్భిణీ స్త్రీ
తాజా పువ్వు రసాన్ని ప్రతిరోజూ ఒక కప్పు చొప్పున రెండుమూడు మాసాలపాటు సేవిస్తుంటే పొట్టలో కురుపులు, దంతాల చిగుళ్లనుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి.
 • కాలిఫ్లవర్‌ ఆకుల రసం రోజూ ఒక కప్పు స్వీకరిస్తుంటే రేచీకటి, చర్మం పొడిపొడిగా ఉండటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు నివారించబడతాయి.
 • గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ కాలిఫ్లవర్‌ పువ్వు ఆకుల రసం సేవిస్తుంటే పిండం ఆరోగ్యంగా ఉండి, వెంటవెంటనే గర్భధారణ కాకుండా ఉంటుంది.
 • కాలిఫ్లవర్ క్యాన్సర్‌నని దూరంగా ఉంచును . కాలిఫ్లవర్‌లో ఉండే రసాయనాలు క్యాన్సర్‌ బారినుండి దూరంగా ఉంచడమే కాకుండా మన కాలేయం పనితీరును కూడా క్రమబద్ధం చేస్తుంది .
 • కాలిఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల లంగ్‌, బ్రెస్ట్‌, ఒవేరియన్‌, ఇంకా బ్లాడర్‌ క్యాన్సర్‌ వంటి పలు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
 • కాలిఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్‌, ధయోసయనేట్స్‌ లివర్‌ పనితీరును మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి .
 • ఇందులో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రుమటాయిడ్‌ ఆర్ధరైటిస్‌ నుండి రక్షణనిస్తుందని పరిశోధనలు తేల్చాయి.
 • స్త్రీలకు అతి ముఖ్యమైన (విటమిన్ B) కాలిఫ్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. గర్బిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు ప్రసవ సమయం లో కావలసిన శక్తి లభిస్తుంది.
 • కాలిఫ్లవర్ లో విటమిన్ C - కాల్షియమ్ కూడా లభిస్తాయి.
 • ఇందులో క్రొవ్వు పదార్ధము 0. 
కాలిఫ్లవర్ ను ప్రతి రోజూ స్త్రీలు కనీసం 400 మైక్రోగ్రామ్స్ అయినా తీస్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top