సతీసహగమనం - ఒక కట్టుకథ అని తెలుసుకో - Sathii Sahagamanam Oka Kattukada  • 🖛 రాముడు రావణుణ్ణి చంపిన తర్వాత మండోదరి ఏమైంది.??
  • 🖛 సత్యభామ నరకాసురుణ్ణి చంపిన తర్వాత అతని 1600 వేల మంది భార్యలు ఏమైనారు.??
  • 🖛 బుద్ధుడు చనిపోయిన తర్వాత యశోధర ఏమైంది..?
  • 🖛 కృష్ణుడు చనిపోయి, వేరే అవతారం లొకి వెళ్లిన తర్వాత అతని అష్ట భార్యలు ఏమయ్యారో..??
  • 🖛 అంతెందుకు, మన జాన్సీ లక్ష్మీ భాయ్, అదేనండి మన మనకర్ణిక, ఆమె భర్త చనిపోయిన తర్వాత ఏమయ్యింది..??
ఈ రోజు మన Azam Syed సతీ సహగమనం, బాల్య వివాహం వల్ల నాకు హిందూ వ్యవస్త పై గౌరవం లేదు అన్నారు. వారికి, ఇంకా ఇటువంటి డౌట్ లు ఉన్న అతి జ్ఞానులకు ఈ పోస్ట్ అంకితం,..

పూర్వాకాలంలో భారతీయ సాంప్రదాయంలో సాహిత్యం లో ఎక్కడా కూడా బాల్యవివాహాలు జరుగలేదు, వాటికి ఆధారాలు కూడా లేవు. సతీసహగమనాలు కూడాలేవు కానీ 1000, 1200 ఏళ్ళ క్రితం నుండి మన భారతదేశం మీద దురాశతో దండెత్తి వచ్చిన దురాత్ములు మతపిశాచులు, దోచుకోవడమే గాకుండా స్త్రీలమాన ప్రాణాలపై అత్యాచారాలు చేస్తుంటే, కన్నెపిల్లలను చెరుస్తుంటే వారిని కాపాడుకునే భాధ్యతను అనవసరంగా మనపెద్దలు నెత్తిన తెచ్చిపెట్టుకున్న అధికభారమే ఈ బాల్యవివాహాలు. సాంఘికాదురాచారాల కారణాలవల్ల అప్పుడు అలా చేయవలసి వచ్చింది. ఆనాడు ఆ పద్ధతి వాళ్ళు గనుక అవలంభించకపోతే, ఈ, రోజున అతితెలివిగా ప్రశ్నిస్తున్న మగజాతికూడా మిగిలి ఉండేది కాదు.

ఒకవేళ మనుధర్మం లో ఈ విషయం చెప్పారనుకుంటే, మనుధర్మం లక్షల ఏళ్ళ క్రితం రాసింది. ఒకవేళ ఇందులో రాసినట్టే జరిగుంటే త్రేతాయుగంలో దశరధుడి భార్యలుకౌసల్య, సుమిత్ర కైకేయి సతీసహగమనం చేశారా ? ద్వాపరయుగంలో ఎక్కడైనా పాండురాజు భార్య కుంతీ దేవి సతీసహగమనం చేసిందా ? కోశాల్య సుమిత్ర కైకేయి ఉత్తర సత్యవతి విల్లు ఎవరు సతీసహగమనం చేయలేదు అలాగే కుంతీ.

అంటే అది ఎక్కడా లేవనే చెప్పాలి .... ఒకవేళ జరిగినా భర్త మరణించిన తరువాత భార్యకు సమాజంలో సరియైన గౌరవం లభించదు, భర్తతో భార్యకున్న అనుబంధం, గౌరవం, భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేక తనకు తాను తీసుకునే గొప్ప త్యాగధనమైన నిర్ణయమే కానీ ఎవరూ తీసుకెళ్లి మంటల్లో తోయరు. పడుకోబెట్టరు. సతీసహగమనం...అంటే...భర్త వెళ్లిన మార్గంలో భార్య తనవంతు బాధ్యతగా అనుసరించి వెళ్లడం. అంతే గాని నిప్పుల్లో కాలిపోవడం కానే కాదు.

ఇక బాల్య వివాహాలు:
ఇవి కూడా పురాణగాధల్లో ఎక్కడా కనబడవు. చిన్నపిల్లలకు ,రాజ కుమార్తెలు పెళ్లిళ్లు అతిచిన్న వయసులో జరిగినట్టు ఎక్కడా ఆధారభూతమైన సాక్షాలు లేవు, కొన్ని కట్టకధలు తప్ప. ఎందుకంటే ఆనాడు కూడా రాజులు తమ యుక్తవయసు కొచ్చిన కుమార్తెలకు (పసిపిల్లలకు కాదు ) *స్వయంవరం* అనే పద్ధతి నియమం పెట్టేవారు , స్వయం = తనకు ఇష్టం, వర =భర్త ను ఎంపిక చేసుకునే విధానం పెట్టారు. అలా అప్పట్లోనే ప్రతి బాలికకు యుక్తవయసు వచ్చిన తరువాత పెళ్లి చేసారు.

ఇక 1000, 1200 ఏళ్లకిందటి బాల్య వివాహాల దురాచారం... పసిపిల్లలను యుక్తవయసు రాని వారిని, అధిక వయస్సు ఉన్నవారికిచ్చి పెళ్లిళ్లు చేసేవారు. దానికి చాలానే కారణాలున్నాయి. పేదరికం, ఆర్థికపరమైన ఇబ్బందులు, మతదాడుల నేపధ్యం. మతచాందసవాదులనుండి కాపాడుకోవడానికి ఆడకూతుళ్ళకు చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసేవారు (ఇతర పాశాండ మతాల వారు దండెత్తి వచ్చినపుడు వాళ్లకున్న మతపరమైన ఆచార, ఆజ్ఞల ప్రకారం పెళ్లిళ్లు కానీ కన్య స్త్రీ లను చెఱచె వారని చరిత్ర, ఇవి వారి మత పిచ్చి పుస్తకాలలో ఇప్పటికీ ఉన్నాయ్ )
యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతాః  - అని చెప్పిన మనువు స్త్రీకి వ్యతిరేకా?
మనువు స్త్రీ ధర్మాలకు అనేకం చెప్పాడు. కుటుంబ గౌరవాన్ని నిలపాలన్నా, పోగొట్టాలన్నా స్త్రీయే కారణమూ. అటువంటి స్త్రీని కనిపెట్టుకోవాలని, రక్షించుకోవాలని, సుఖపెట్టాలని కూడా చెప్పాడు.

తప్పు చేస్తే ఎంత ఘోరమైన శిక్షలు. వేయాలో చెప్పాడు. అలాగే మగవాడికి అనేక శిక్షలు చెప్పాడు . స్త్రీని ఇష్టం లేకుండా పొందితే, దొంగతనానికి శిక్షగా శిరచ్చేధం చెయ్యమని చెప్పినట్లు, లింగాచ్చేధం చెయ్యమన్నాడు.
యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతాః అనగా స్త్రీలని ఎక్కడ పూజిస్తే అక్కడ దేవతలు నాట్యం చేశారని చెప్పాడు.
తండ్రి బాధ్యతలను విస్మరిస్తే, కూతురు తను స్వయంగా ఎంచుకొని వివాహం చేసుకోవచ్చని చెప్పాడు.

పాశన్నమతాల మారణకాండ గురించి:
పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపేయండి. కన్యలైన బాలికలను మాత్రం మీకోసం బతకనీయండి. సంఖ్యాకాండం 31:17. 🤯
ఈ మాటలు అనేది స్వయంగా బైబుల్ దేవుడు యెహోవా. మోషే ఆ మాటల్ని అక్షరాల పాటిస్తాడు. అలా మొత్తం 16000 కన్యలైన మిద్యాని బాలికలు ఇశ్రాయేలీయులకు దొరుకుతారు. అంటే పెళ్ళైన ఆడవాళ్ళని, పిల్లల్ని, పశువులను, గొర్రెలను ఎన్నిటిని నిష్కారణంగా చంపేసి ఉండాలి.? ఇలాంటివి మనదేశంలో నూ కోకొల్లలు..

పరాయి పాలకుల దాడులనుండి తప్పించుకోవటానికి, కొన్ని ఆచారాలు సమాజంలో ప్రవేశ పెట్టబడ్డాయి. దానిలోనిదే బాల్య వివాహాలు. ఆ వివాహం జరిగిన తరువాత 12సంవత్సరాలు వివాహిత స్త్రీ గౌరివ్రతం లో వుండాలన్న నిబంధనను విస్మరిస్తున్నారు. ఆ దీక్షలో వున్నంత కాలం భార్యా భర్తలు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకో కూడదు. అది పాటించారు కూడ.

ఇక పోతే విదేశీ మతస్థులు వారి మత గ్రంథాలు ప్రోత్సహించిన విధంగా, కన్నె పిల్లమీద మనస్సు పడితే ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవచ్చు. ఎవ్వరి అనుమతి అవసరం లేదు. పైగా వారి పెద్దల ప్రోత్సాహం అది మతాను సారం జరుగుతున్నదనే భావన. ఈ కాలంలో కూడ దేశంలో జరుగుతున్నదదేను. ముఖ్యంగా కేరళలో జరగుతున్నది గమనించవచ్చు. అయితే పెళ్ళైన స్త్రీ మీద మనసు పడితే ఆ స్త్రీ భర్తను చంపి ఆ స్త్రీ ని లోబరుచుకోవచ్చు. వారి పెద్దల అభ్యంతరముండదు. అది వారి మతాన్ని తుచ పాటించినట్టేను.

దేశానికి పట్టిన చీడ "సెక్యూలర్లు:
ఇప్పుడు చెప్పండి హిందూ సమాజం ఏమి చెయ్యాలో. ఈ సెక్యులర్ పాలనలో ఇప్పటికి హిందూ స్త్రీలకు రక్షణ లేదు. సతీ సహగమనం కూడ అటువంటిదే. రాజస్తాన్, బెంగాల్ లోని క్షత్రియ కుటుంబాలలో ఈ దురాచారం ప్రవేశం చేసింది. రాజును ఓడించిన తరువాత ఆయన సొత్తుగా భావించ బడ్డ అతని భార్యను ఆ పాలకుల పరం చెయ్యాలి. లేక పోతే రక్తపాతమే.

అక్బర్ జమానాలో ఇటువంటి రాజ పుత్ర స్త్రీలు బలవంతంగా అప్పగించబడ్డారు. ఆ పాలకులకు లొంగని స్త్రీలు సతీసహగమనానికి సిధ్ధపడ్డారంటే ఆశ్చర్యమేముంది.?

దీన్ని మొత్తం హిందూస్థాన్ కు వర్తింప చేయ చూసే సిక్కులర్ల చెంపలు వాయగొట్ట తప్పేముంది..??
(రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, నాగ్నజిత్తి, కాళింది, లక్షణ కృష్ణుని అష్ట భార్యలు కాగా..సత్యభామ నరకాసురుణ్ణి చంపిన తర్వాత అతని 1600 వేల మంది భార్యలు కృష్ణుని చెంత చేరారు..)

రచన: హరిప్రసాద్. వడ్డమాను
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top