విగ్రహాల విధ్వంసం.. వృత్తికి కళంకం.. సెయింట్ వాలెంటైన్ మతోన్మాదం - The stigma of the profession .. St. Valentine's communalismవిగ్రహాల విధ్వంసం.. వృత్తికి కళంకం.. సెయింట్ వాలెంటైన్ మతోన్మాదం - The stigma of the profession .. St. Valentine's communalism
ప్రేమికుల ప్రేమకు చిహ్నంగా ఫిబ్రవరి 14 నాడు జరుపుకుంటున్న వాలెంటైన్స్ డే అనేది క్రైస్తవ మతాధిపతి అయిన సెయింట్ వాలెంటైన్ పేరుమీద ఏర్పడింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. వృత్తిరీత్యా వైద్యుడు కూడా అయిన వాలెంటైన్ ఒక క్రైస్తవ మతోన్మాది.

అప్పట్లోనే వాలెంటైన్ను క్రైస్తవేతరుల, పాగన్ దేవుళ్ల విగ్రహాల విధ్వంసకారుడిగా అభివర్ణించారు. క్రైస్తవేతర దేవుళ్లను అసభ్యంగా నిందిస్తూ మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేవాడు. (ఆధారం: Legenda Aurea: Compiled in 1275 CE)

వాలెంటైన్ ఎంతటి మతోన్మాది అంటే.. క్రైస్తవంపై విశ్వాసం లేకుండా పాగన్ల దేవుడైన జూపిటర్ ను ఆరాధిస్తున్న తన తల్లి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో వైద్యం చేయడానికి నిరాకరించాడు. చివరికి ఆమె ఆ వ్యాధితోనే కన్నుమూసింది.
వృత్తిరీత్యా వైద్యుడు అయిన వాలెంటైన్ తన మతాన్ని నమ్మి బాప్టిజం తీసుకునేదాకా రోగులకు చికిత్స చేసేవాడు కాదు. “జీసస్ ని దేవుడిగా అంగీకరించండి, మీరు ఇప్పటిదాకా ఆరాధించిన దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయండి, అప్పుడే మీ కొడుకుకి చికత్స చేస్తాను” – ఇది వాలెంటైన్ తన వద్దకు వచ్చే రోగులకు, వారి తల్లిదండ్రులకు పెట్టె షరతు. (ఆధారం: Passio Valentini: 6th Century).
తన మతోన్మాదంతో ఇతర మతాలకు చెందిన దేవుళ్లను తీవ్రంగా దూషిస్తూ మతపరమైన ఉద్రిక్తతలు సృష్టిస్తున్న వాలెంటైన్ను రోమన్లు అరెస్ట్ చేశారు. తన ఉన్మాదాన్ని తగ్గించుకుంటే విడుదల చేద్దామనే ఉద్దేశంతో వారు అతడిని “మా దేవుళ్లపై నీ అభిప్రాయం ఏమిటి?” అని ప్రశ్నించప్పటికీ అతను తీవ్రమైన పదజాలంతో దూషించాడు. 

మూలము: True Indology ట్విట్టర్ కధనం
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top