తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన "ఆతనికి నీవు మేలు ఆతఁడు నీకు మేలు" - Annamayya Sankeerthana, Athaniki Neeve Melu

తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన "ఆతనికి నీవు మేలు ఆతఁడు నీకు మేలు" - Annamayya Sankeerthana, Athaniki Neeve Melu
🔆 ఓం నమో వెంకటేశాయ🔆 
అన్నమయ్య పాటకు పట్టాభిషేకం తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన||ఆతనికి నీవు మేలు ఆతఁడు నీకు మేలు
చేతులెత్తి మొక్కి ఇట్టె సేవసేయవే
॥పల్లవి॥

మనసు లెడసినాను మంచిమాఁటలె మేలు
ననుచకుండినాను వినయమే మేలు
పెనఁగులాడినాను ప్రేమపు నవ్వులే మేలు
అనిశము పతితోడ నాఁటదానికి
॥ఆత॥

కోపము గలిగినాను కొసరుఁజూపులె మేలు
తోపు నూపుడైనా సంతోసాలే మేలు
రాఁపు లెక్కడైనా నూరకె వోరుచుటే మేలు
చేపట్టిన పతితోడ చెలియకును
॥ఆత॥

వేవేలు నేరములైనా వేడుకతో నుంటే మేలు
కావరించు యొరసినా కాఁగిలే మేలు
భావించి నిన్నేలినాఁడు పట్టపుదేవులఁజేసి
శ్రీవేంకటపతి మేలు చేరీ మగువ నీకు
॥ఆత॥

🔆🔆🔆🔆🔆🌹🔆🔆🔆🔆🔆
సేకరణ: సూర్య ప్రకాష్ నిష్టల

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top