కరోన నిర్ములన కోసం లలితా పారాయణ సంకల్పం - Corona Nirmulana kosam Lalitha Paarayanaa Sankalpam


కరోన నిర్ములన కోసం లలితా పారాయణ సంకల్పం - Corona Nirmulana kosam Lalitha Paarayanaa Sankalpam
కరోనా నిర్ములన కోసం లలితా పారాయణ సంకల్పం
అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ  సిద్ధ్యర్ధం, సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి అనుగ్రహ అస్మిన్  సమస్త లోక  క్షేమ  సంరక్షణార్థం , కరోనావ్యాధి నిర్మూలనార్థం, శీఘ్రమేవ కరోనా వ్యాధి నివారణ ఔషధ సిద్ధ్యర్ధం. అపమృత్యుబాధా నివారణ శ్రీ లలితా త్రిపురసుందరీ అనుగ్రహ ప్రీత్యర్థం యధాశక్తి సహస్త్రనామ పారాయణ జపం కరిష్యే. 

ఇలా సంకల్పం చేసి రేపు సాయంత్రం 5 గం సమయానికి ఒకేసారి ఎవరి గృహంలో వారు అమ్మవారి ముందు ఈ సంకల్పమ్ తో 3 సార్లు లోక క్షేమం కోసం సహస్త్ర నామ పారాయణం చేద్దాము ఒకే సమయంలో అన్ని ప్రాంతాల వారు చదవడం వల్ల కొన్ని లక్షల జపం జరుగుతుంది.. అలా చేయడం వల్ల ఆ శబ్ద ప్రకంపనలు ప్రకృతి మాత అయిన పరాశక్తి ని ప్రేరేపించి లోకరక్షణ చేస్తుంది. 

అమ్మవారిని నమ్ముకున్న భక్తులుగా లోక క్షేమం కోసం ఇది మన కనీస బాధ్యత.. ఇది మన పారాయణ సంఖ్య లో భాగమే అవుతుంది అయితే అందరూ ఒకే సమయంలో చేయడం వల్ల అధిక శక్తి ఉత్పన్నమవుతుంది. దయచేసి నా విన్నపం మన్నించి ఆ తల్లి భక్తులంతా సహకరిస్తారు అని ఆశిస్తున్నాను.. 3 సార్లు పారాయణ తర్వాత ఇక్కడ ఇస్తున్న సిద్ధ కుంజిక స్త్రోత్రం చదివి హారతి ఇచ్చి లోకా సమస్తా సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు శ్రీదేవి అనుగ్రహ సిద్ధిరస్తు ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః అని పూజ ముగించండి ఉగాది రోజు సాయంత్రం 5 గం ప్రాంతంలో పానకం నైవేద్యం పెట్టండి కుదిరితే నిమ్మకాయ కూడా పెట్టండి..

శ్రీ సిద్ధ కుంజికా స్తోత్రం

ఓం అస్య శ్రీ కుంజికా స్తోత్ర మంత్రస్య సదాశివ ఋషిః, అనుష్టుప్ ఛందః ,
శ్రీత్రిగుణాత్మికా దేవతా, ఓం ఐం బీజం, ఓం హ్రీం శక్తిః, ఓం క్లీం కీలకమ్,
మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః ।

శివ ఉవాచ 
శృణు దేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమమ్ ।
యేన మంత్రప్రభావేణ చండీజాపః శుభో భవేత్ ॥ ౧॥

న కవచం నార్గలాస్తోత్రం కీలకం న రహస్యకమ్ ।
న సూక్తం నాపి ధ్యానం చ న న్యాసో న చ వార్చనమ్ ॥ ౨॥

కుంజికా పాఠమాత్రేణ దుర్గాపాఠఫలం లభేత్ ।
అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభమ్ ॥ ౩॥

గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి ।
మారణం మోహనం వశ్యం స్థంభనోచ్చాటనాదికమ్ ।
పాఠమాత్రేణ సంసిద్ధ్యేత్ కుంజికా స్తోత్రముత్తమమ్ ॥ ౪॥

అథ మంత్రః
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ।
ఓం గ్లౌం హుం క్లీం జూం సః జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల
ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహా ॥ ౫॥

ఇతి మంత్రః
నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని ।
నమః కైటభహారిణ్యై నమస్తే మహిషార్దిని ॥ ౬॥

నమస్తే శుంభహన్త్ర్యై చ నిశుంభాసురఘాతిని ।
జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వ మే ॥ ౭॥

ఐంకారీ సృష్టిరూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా ।
క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోఽస్తు తే ॥ ౮॥

చాముండా చండఘాతీ చ యైకారీ వరదాయినీ ।
విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణి ॥ ౯॥

ధాం ధీం ధూం ధూర్జటేః పత్నీ వాం వీం వూం వాగధీశ్వరీ ।
క్రాం క్రీం క్రూం కాళికా దేవి శాం శీం శూం మే శుభం కురు ॥ ౧౦॥

హుం హుం హుంకార రూపిణ్యై  జం జం జం జమ్భనాదినీ ।
భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యై తే నమో నమః ॥ ౧౧॥

అం కం చం టం తం పం యం శం వీం దుం ఐం వీం హం క్షం ।
ధిజాగ్రమ్ ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహా ॥ ౧౨॥

పాం పీం పూం పార్వతీ పూర్ణా ఖాం ఖీం ఖూం ఖేచరీ తథా ।
సాం సీం సూం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురూష్వ మే ॥ ౧౩॥

ఇదం తు కుంజికా స్తోత్రం మంత్ర జాగర్తిహేతవే ।
అభక్తే నైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి ॥ ౧౪॥

యస్తు కుంజికా యా దేవి హీనాం సప్తశతీం పఠేత్ ।
న తస్య జాయతే సిద్ధిరరణ్యే రోదనం యథా ॥ ౧౫॥

ఇతి శ్రీ రుద్రయామలే గౌరీతన్త్రే శివపార్వతీసంవాదే
కుంజికా స్తోత్రం సంపూర్ణం

ఇతి శ్రీ డామరతన్త్రే ఈశ్వరపార్వతీసంవాదే కుంజికా స్తోత్రం సంపూర్ణం

🙏శ్రీ మాత్రే నమః🙏


రచన/సంకలనం: భానుమతి అక్కిశెట్టి 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top