దాంపత్య జీవనం, దైవకార్యము - Dampatya Jivanam Daivakaryam

దాంపత్య జీవనం, దైవకార్యము - Dampatya Jivanam Daivakaryam
దాంపత్య జీవనం దైవకార్యం గృహస్థాత్రమంలో ఒక స్తీ, ఒక పురుషుడు కలిసి జీవించే విధానం అనాది నుండి వస్తోంది. వారిద్దరి మైత్రి బంధం ద్వారా వచ్చే సంతానంతో పీతృఋణం, గురుఋణం, దేవఋణం తీర్చుకోవాలని శాస్త్రాలు బోధిస్తున్నాయి.

స్రీ పురుషులు అనుబంధానికి నైతికబలం సామాజికబలం, గౌరవ మర్యాదలు ఒకరివల్ల మరొకరు పొందుతారు. దీన్నే వివాహబంధం అంటున్నాం. పవిత్రమైన వివాహబంధం ద్వారా ఒక్కటైన జంట సృష్టి కార్యాన్ని దైవకార్యంగా భావించాలి. ఇందులో భర్త, భార్య వద్దకు వెళ్లేటప్పడు ఒక పవిత్ర దేవాలయంకు వెళుతున్నట్లు భావించాలి. భార్య, భర్త చెంతకు చేరేటప్పడు పరమాత్ముని చేరుతున్నట్లు భావించాలి. దంపతులు కలిసేటప్పుడు ఒక భావదశ కావాలి. పవిత్ర భావన కలగాలి.
ఆధ్యాత్మిక సంభోగం
ఆధ్యాత్మిక సంభోగం
సంభోగ సమయంలో భగవంతుడు సృష్టి క్రియచేసి క్రొత్త జీవిని జన్మింపచేస్తాడు అప్పుడు దంపతులు భగవంతునికి సమీపంలో ఉంటారు. వారు మార్గంగా ఒక నూతనజీవి ఆవిర్భవిస్తోంది. దంపతులు జన్మదాతలవుతారు. భగవంతుని ప్రార్థిస్తున్న భావనతో అత్యంత పవిత్రమైన కార్యంగా భార్యభర్తల సంగమం జరగాలి. జ్ఞానాన్ని పొందడానికి సుజ్జాన జీవితం గడపటానికి కామాన్ని భోగంగా గాక యోగంగా రూపొందించుకోవాలి. ఇద్దరు వ్యక్తుల పరిపూర్ణమైన కలయిక ఎంత గాఢంగా ఉంటుందో, సంతానం కూడా అంత అద్భుతంగా వుంటుంది. కలయిక తేలికగా అత్యల్పంగా ఉన్నప్పుడు, అందువల్ల కలిగే సంతానం అలాగే ఉంటుంది.

ఒక కళాకారుడు మత్తులో ఉన్నప్పుడు సుందర విగ్రహాలను తయారు చేయలేడు అశాంతి, క్రోధంతో ఉన్న నృత్యకారుడు సరిగ్గా అభినయించలేడు. ఇవన్నీ మానసిక స్థితులపై ఆధారపడి ఉంటాయి. క్రోధం, నిరాశ, నిస్సృహ, అశాంతితో సృష్టికార్యం చేసినట్లయితే సంతానం అదే స్థాయికి చెంది ఉంటుంది. సంభోగాన్ని సువ్యవస్థితంగా, ఆధ్యాత్మికంగా సమాధికి ద్వారంగా రూపొందించేవరకు మంచి మానవుడు జన్మించేందుకు అవకాశమే లేదు భవిష్యత్తులోన సద్భావాల వ్యక్తుల పుట్టుక అనుమానంగానే ఉంటుంది. కనుకనే దాంపత్య జీవితం దైవకార్యంగా భావించి దంపతులు మెలగాలని భారతీయ శాస్త్రాలు బోధిస్తున్నాయి.

ఎంతో ఉన్నతమైన భావాలతో. రూపొందించిన హిందూ సంప్రదాయాలను అందరూ ఆచరిస్తే సద్దుణాలతో కూడిన సమాజ నిర్మాణ కార్యం సులువుగా నెరవేరుతుంది. ధర్మబద్ధంగా కామం కోరికలు ఉండడం సహజం. దానిని తీర్చుకునే ప్రయత్నం చేయడం కూడా సహజమే. కోరిక అంటే కేవలం లైంగిక సంబంధమైనదే కాదు. పురుషార్ణాలలో "కామం" ఒకటి. అయితే అది ధర్మబద్ధంగా తీర్చుకోవాలని హిందుత్వం చెప్తోంది. కోరికలు తీర్చుకోవడానికే మానవుడు పుట్టాడు.

మానవుడు అంటే కోరికల పుట్ట, అవి అనుభవించడానికి మానవ జన్మ అని పాశ్చాత్యుల భావన. హిందూ ధృక్పథం దీనికి పూర్తిగా భిన్నమైంది. సామాజిక జీవనానికి భంగం కలుగుతుంటే మానవుడు కోరికలను అదుపులో పెట్టుకోవాలని చెప్తొంది. కోరికలను అనుభవిస్తే కామాగ్ని శాంతించదు. అది మరింత తీవ్రంగా ప్రజ్వరిల్లుతుంది. ఎలాగంటే నెయ్యి మొదలైన హవిస్సుల వలన అగ్ని మరింత రగలుతుంది. అందుకే కామాగ్నిని శాంతపర్చేందుకు మనోనిగ్రహం కావాలి. దీనినే “దమం” అని చెప్పింది శాస్త్రం.

ఆహారం తినుట, నిద్రపోవుట, భయపడుట, దాంపత్య సుఖం అనుభవించుట, ఈ లక్షణాలు పశువులకు, మనుషులకు సమానంగా ఉంటాయి. కానీ మనుషులు ధర్మబద్ధంగా వీటిని గ్రహిస్తారు. ఇది పశువుల కంటే విశేష లక్షణం. ఆ ధర్మాలను ఆచరించనివాడు పశువుతో సమానమని శాస్త్రం చెబుతోంది.

రచన:  జాగృతి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top