నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
స్త్రీలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్త్రీలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, సెప్టెంబర్ 2020, శనివారం

వివేకానందుని దృష్టిలో భారతీయ మహిళ - Vivekananda Perspective on Indian Women

వివేకానందుని దృష్టిలో భారతీయ మహిళ - Vivekananda Perspective on Indian Women

హిళల గురించి భారతీయుల, పాశ్చాత్యుల ఆలోచనలో చాలా తేడా ఉంది. వారివారి జీవన విధానాన్ని బట్టి ఈ తేడాలు వచ్చాయి. భారత దేశంలో మహిళకు ఇచ్చిన స్థానం, ఆమె ఎదుర్కొం టున్న సమస్యల గురించి స్వామి వివేకానంద అనేకసార్లు ప్రస్తావించారు. వారి ఉపన్యాసాల్లో చెప్పిన అనేక ముఖ్య విషయాలను చూద్దాం

ప్రతి దేశంలో స్త్రీ, పురుషులు తెలిసో, తెలియకో ఒక ఆదర్శాన్ని అనుసరిస్తుంటారు. ఆ ఆదర్శం వ్యక్తుల ద్వారానే తెలుస్తుంది. వ్యక్తుల సమూహమే దేశం. దేశం ఒక మ¬న్నతమైన ఆదర్శాన్ని మన ముందుంచుతుంది. కాబట్టి ఏ దేశాన్నైనా అర్థం చేసుకోవాలంటే ఆ దేశపు ఆదర్శం ఏమిటో తెలుసుకోవాలి. ఆ ఆదర్శాన్ని బట్టి ఆ దేశపు జయాపజయాలను అంచనా వేయాలి. అభివృద్ధి, పురోగతి, సుస్థితి, పతనం అనేవి ఆదర్శాన్ని బట్టి నిర్ణయమవుతాయి. ఒక దేశంలో మంచిదని భావించే అంశం మరో దేశంలో మంచి కాక పోవచ్చును. కాబట్టి ఒక దేశస్థుల గుణదోషాలను వేరే దేశపు ప్రమాణాలను బట్టి నిర్ణయించకూడదు.

ఆదర్శ భారతీయ మహిళ సీత

సీతారాములు భారతీయులకు ఆదర్శప్రాయులు. బాలికలు సీతను ఆరాధిస్తారు. పవిత్రురాలు, భక్తురాలు, సహనశీలవతి అయిన సీతాదేవిని అనుసరించాలని ప్రతి భారతీయ మహిళ కోరుకుంటుంది. సీతాదేవి గురించి మాట్లాడు తున్నప్పుడు భారతీయుల, పాశ్చాత్యుల ఆదర్శాల్లో తేడా ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. ‘చేతల్లో శక్తిని చూపించాలి’ అని అంటారు పాశ్చాత్యులు. ‘సహనంలో శక్తిని చూపాలి’ అంటారు భారతీ యులు. ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా, ఎంత ఎక్కువ సంపద కూడబెట్టవచ్చో పాశ్చాత్యులు చూపితే, సంపదను ఎంతగా త్యాగం చేయవచ్చో భారతీ యులు చూపారు. సీతాదేవి భారతీయులకు ఎందుకు ఆదర్శం అయింది? ఆమె క్షమాశీలి. పరమసాధ్వి. దుర్భర కష్టాలను కూడా చిరునవ్వుతో భరించింది. తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించింది. కష్ట సమయంలో కూడా భర్త సేవను విడనాడలేదు. అందుకే సీత భారతీయులందరికీ ఆదర్శం. మేమంతా సీతమ్మ బిడ్డలం. భారతీయ మహిళలు అభివృద్ధి సాధించడానికి, శ్రేయస్సు పొందడానికి సీతామార్గాన్ని అనుసరించడంతప్ప మరో మార్గం లేదు.

భారతీయ మహిళకు శుచిత్వమే ఆదర్శం

బుద్ధిబలమే పరమార్థం కాదు. నీతి, ఆత్మదృష్టి అవసరం. భారతీయ మహిళలలో పాండిత్యం, విద్య తక్కువ కావచ్చును కానీ వారిలో పవిత్రత ఎక్కువ. భార్య తప్ప ఇతర మహిళలను తల్లిగా భావిస్తాడు భారతీయుడు. భారతీయ మహిళల్లో ప్రపంచంలో మరెక్కడా కనిపించని శీలం, త్యాగం, దయ, తృప్తి, భక్తి కనిపిస్తాయి. సిగ్గు, మితంగా మాట్లాడటం వంటి లక్షణాలు మహిళలకు శోభనిస్తాయి. ఇవి భారతదేశపు మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పాశ్చాత్య దేశాల్లో స్త్రీ అంటే భార్య గుర్తుకు వస్తుంది. అక్కడ మాతృత్వపు స్థానం కంటే భార్య ¬దా ఎక్కువ. కానీ మన దేశంలో అలా కాదు. ఇక్కడ మాతృత్వానికే విలువ. ‘భారతదేశంలో గృహిణి స్థానం ఏది’ అని మీరు (పాశ్చాత్యులు) ప్రశ్నిస్తారు. ‘అమెరికా కుటుంబంలో తల్లిస్థానం ఏది?’ అని భారతీయులు ప్రశ్నిస్తారు. తల్లి పరమ పూజ్యురాలు. స్త్రీ అనే మాట కేవలం శరీర సంబంధ మైనది కాదు. స్త్రీ అంటే తల్లి. దురాశలను, దుష్కామాలను అణచ గలిగే శక్తి ‘అమ్మ’ అనే మాటకంటే ఇక ఏ పదానికి ఉంది? అందుకని తల్లే భారతీయుల ఆదర్శం.

వ్యక్తిదృష్టి, సంఘదృష్టి

పాశ్చాత్యుల్లో వ్యక్తిదృష్టి ఎక్కువ. భారతీయుల్లో సంఘదృష్టి ఎక్కువ. నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకో వచ్చని, అందుకు ఇతర అడ్డంకులు ఏవీ లేవని పాశ్చాత్యులు భావిస్తారు. వ్యక్తి నచ్చినా వారి కుటుంబం, వారసత్వాన్ని కూడా చూడాలని భారతీ యులు భావిస్తారు. తాగుబోతులు, అనారోగ్య వంతులు, పిచ్చివారి సంతతిని పెళ్ళి చేసుకోరాదని ధర్మశాస్త్రం చెపుతోంది.కానీ మేం పరాజితుల మవడంవల్ల అనేక దేశాల వారు అనేక చట్టాల్ని, నిబంధనల్ని మా తలపై రుద్దారు. అనేక దురా లోచనలు, దురభిప్రాయాలను మాకు అంటగట్టారు.

(స్వామి వివేకానంద సమగ్ర గంథావళినుండి…)

11, జులై 2020, శనివారం

పరస్త్రీ వ్యామోహం, ఎంగిలి ఆకుతో సమానం - Parastri vyamoham

పరస్త్రీ వ్యామోహం, ఎంగిలి ఆకుతో సమానం - Parastri vyamoham
కసారి ఒక రాజు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిల్చున్నాడు. ఆ ఇంటిలోని ఇల్లాలు వాళ్లాయనకు అన్నం వడ్డిస్తూ వుంది.

ఆమె చాల అందగత్తె, ఆవిడ అందం చూసి రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆమె అందానికి వివశుడై మోహంలో పడిపోయాడు. నా రాజ్యములో ఇంత ఆందమైన అమ్మాయిని ఇదివరకు చుడానేలేదే అని అనుకున్నాడు.

ఆమె భర్త భోజనం చేసి తన పనికోసం బయటికి వెళ్ళాడు. భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడా రాజు ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తెరిచి చూడగా ఆయన వేషధారణను బట్టి ఎవరో రాజ వంశానికి చెందిన వ్యక్తి అనుకున్నది. 'ఎవరు మీరు అని ప్రశ్నించింది'. రాజు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి రాజును, నీవు చాలా అందంగా వున్నావు నీ అందం నన్ను వ్యామోహంలో పడవేస్తోంది. నిన్ను నా భార్యగా చేసుకోవాలి అనుకుంటున్నాను. నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి మహారాణిని చేస్తాను. నీవు చూడని సంపద చూడగలవు, నీ అడుగులకు మడుగులోత్తే పనివారు, కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు.

ఆమె ఎంతో తెలివైంది. చక్కటి గుణవంతురాలు, మంచి సంస్కారం కలది. ఆవిడ రాజుతో ఇలా అంది.

రాజా !! తప్పకుండా మీ కోరిక తీరుస్తాను ముందు మీరు ఆలసిపోయి వచ్చి వుంటారు. శరీరం, మనసు రెండు ఆకలితో వుంటాయి. మీరు వెళ్లి కాళ్లు చేతులు కడుక్కొని రండి అని చెప్పింది.

ఆమె అంగీకారంతో రాజు ఆనందానికి అవధులు లేవు. ఇంత సులువుగా తన కోరిక తీరుతందని' ఆవిడ అంగీకరిస్తుందనీ ఊహించ లేదు.

ఆవిడ అంగీకరించకపోతే తన అధికారంతో అయినా ఆవిడను చేరబట్టాలను కున్నాడు. కానీ పరిస్థితులు అంత దూరం దారితీయనందుకు తన ఆనందం అంతా ఇంతా కాదు. కాళ్లు చేతులు శుభ్రం చేసుకొని ఇంటిలోనికి వెళ్ళాడు.

రాజా! మీరు భోజనం చేయండి అంటూ వాళ్ల ఆయన తిన్న అరిటి ఆకును రాజు ముందు వేసి ఇలా అంది. "ఇప్పుడే మావారు ఇదే ఆకులో భోంచేసి వెళ్ళారు, అదే ఎంగిలి ఆకులో మీరూ భోజనం చేయండి. మీ ఆకలి తీరాక నేనూ మీతో వస్తాను మీ ఆంతరంగిక కోరిక ఏమైనా తీరుస్తాను. మీ రాజ్యానికి మీతో పాటు వస్తాను అన్నది.ఊహించని ఆ పరిణామానికి రాజుకు ఆమెపై కోపం, ఆ ఎంగిలి ఆకును చూసి అసహ్యం కలిగాయి.

"దేశాన్నేలే ప్రభువును నేను, ఎప్పుడూ బంగారు పళ్లింలో ఘుమఘుమలాడే షద్రసోపేతమయిన వంటకాలు వేడి వేడిగా తినే నాకు ఈ ఒక ఎంగిలి ఆకులో భోజనం వడ్డించడానికి నీకెంత ధైర్యం అని గద్దించాడు."

అందుకు సమాధానంగా ఆమె ఇలా చెప్పింది! "మహరాజా! నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డు రాలేదా. పెళ్లైన నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి, భోజనం చేసే విస్తరాకు విషయంలో కలిగిందా, ఎంత ఆశ్చర్యం" అన్నది

రాజుకు ఆమె మాటలలోని అంతరార్ధం అర్ధమయ్యింది. కనువిప్పు కలిగింది. మోహం పటా పంచలయ్యింది. ఆవిడ సంస్కారానికి, సమయస్ఫూర్తికి ముగ్గుడయ్యాడు. ఆవిడ పాదాల మీద పడి నమస్కరించాడు. చేతులు జోడించి "తల్లీ నన్ను క్షమించు. కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అవివేకంతో అజ్ఞానిలా ప్రవర్తించాను. నీవు ఎంతో నేర్పుగా నాకు సూక్ష్మాన్ని దర్శింపజేశావు. నేను చూపిన ఆశలకు లోబడక నీ పాతివ్రత్యాన్ని ప్రదర్శించావు. నీవంటి మాతృ మూర్తులవల్లే ధర్మం ఇంకా జీవించి ఉంది" అని అక్కడి నుండి వెళ్లిపోయాడు

_జాగృతి

10, జులై 2020, శుక్రవారం

రాణి అబ్బాక్కా దేవి - భారతదేశ మొదటి స్వాతంత్య్ర పోరాట యోధురాలు - Tuluva RANI ABBAKKA DEVI

మహారాణి అబ్బక్క

అది 1555 సంవత్సరం పోర్చుగీస్ వాళ్ళు వలసరాజ్యాల స్థాపనలో తిరుగులేకుండా ఉన్నారు. మనదేశంలోని కాలికట్ వశపరుచుకొని జామోరిన్స్ను నాశనం చేశారు. బీజాపూర్ సుల్తాన్ను ఓడించారు.గుజరాత్ సుల్తాన్ని ఓడించి డామన్ ను తీసుకొని, మైలాపూర్ లో ఒక కాలనీని స్థాపించారు, బొంబాయిని స్వాధీనం చేసుకున్నారు మరియు గోవాను వారి ప్రధాన కార్యాలయంగా మార్చారు. గోవలో చర్చిని నిర్మించడానికి పురాతన కపలీశ్వర ఆలయాన్ని కూడా నాశనం చేశారు. వారి తదుపరి లక్ష్యం, మంగుళూరులో ఉన్న ఓడరేవు.
30 ఏళ్ల యువతి రాణి అబ్బక్క చౌతా
30 ఏళ్ల యువతి రాణి అబ్బక్క చౌతా
మంగుళూరుకు దక్షిణాన కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉల్లాల్ అనే చిన్న సంస్థానం దాన్ని పారిపాలించేది 30 ఏళ్ల యువతి రాణి అబ్బక్క చౌతా. మొదటిలో పోర్చుగీస్ వాళ్ళు రాణి అబ్బక్కని తేలికగా తీసుకొని, ఆమె సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని వారిలో కలుపుకోవాలని అలాగే ఆమెని బంధించి గోవాకు తీసుకురావడానికి కొన్ని పడవలు మరియు సైనికులను పంపారు - ఆ పడవలు తిరిగి రాలేదు.

వారికి ఏమి జరిగిందో అర్ధంకాలేదు ఇప్పటి వరకు వారు దాడి చేసిన ప్రతి రాజ్యం వాళ్ళకి దాసోహం అన్నవి కానీ మొదటిసారి పరాజయం అందులోని స్త్రీ చేతిలో , ఈసారి కోపంతో భారీ నౌకలను పంపారు, చాలా ప్రసిద్ధ అడ్మిరల్ డోమ్ అల్వారో డా సిల్వీరా నాయకత్వంలో అడ్మిరల్ త్వరలోనే గోవా తిరిగి వచ్చాడు, తీవ్రంగా గాయపడ్డాడు మరియు ఖాళీ చేతులతో ఓడిపోయి ఆ తరువాత, మరొక పోర్చుగీస్ నౌకాదళం పంపబడింది - అనేక పోర్చుగీస్ సైనికులు ఆచూకీ లేదు...కొద్దిమంది మాత్రమే గాయాలతో వెనుకకు వచ్చారు.

ఇంకా పోర్చుగీస్ వాళ్ళు ముందుగా మంగళూరుని ఆక్రమించుకొని అక్కడనుండి రాణి అబ్బక్క మీద యుద్ధం చెయ్యాలని ప్రణాళిక వేసుకున్నారు. పోర్చుగీస్ జనరల్ జోనో పీక్సోటో ఆధ్వర్యంలో భారీ సైన్యం మంగుళూరును విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు.

తరువాత ఆ అనుభవజ్ఞుడు అయిన పోర్చుగీస్ జనరల్ ఉల్లాల్‌కు పంపబడ్డాడు. అతని ఉద్దేశం ఉల్లాల్‌ను లొంగదీసుకుని, అబ్బాక్కా చౌతాను బంధించడం. పోర్చుగీసువారు ఉల్లాల్‌కు చేరుకున్నారు అది నిర్జనమైపోయి ఖాళీగా కనబడింది..వారు ఊరు మొత్తం వెతికారు రాణి అబ్బాక్క ఎక్కడా కనిపించలేదు.
రాణి అబ్బక్క
రాణి అబ్బక్క
సైన్యం కానీ రాణి అబ్బక్క కనిపించపోవటంతో విశ్రాంతి తీసుకున్నారు ......ఇంకా మేమే గెలిచాము రాజ్యం సొంతం అయింది అని అనుకుంటునంతలో రాణి అబ్బక్క చౌతా ఆమె ఎంచుకున్న 200 మంది సైనికులతో దాడి చేసింది - ఒక్కసారిగా మీదపడటంతో ఊహించని పరిణామానికి పోర్చుగీసువారు పోరాటం చెయ్యకుండానే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో జనరల్ జోనో పీక్సోటో చనిపోయాడు,70 మంది.పోర్చుగీస్ సైనికులు బందీలుగా పట్టుబడ్డారు.

రాణి అబ్బాక్కా చౌతా పెద్ద ఎత్తున దురాక్రమణదారులను ఓడించి, ఒక జనరల్‌ను చంపి, యోధులను బంధించి, ఆమె రాజ్యాన్ని రక్షించుకున్నారు.... చాలు నా రాజ్యాన్ని కాపాడుకున్న అని విశ్రాంతి తీసుకోలేదు రాణి అబ్బాక్కా చౌతా, అదే రాత్రి తన మనుష్యులతో కలిసి మంగుళూరు వైపు ప్రయాణించి, మంగుళూరు కోటను ముట్టడించింది - తెలివిని ఉపయోగించి పోర్చుగీస్ జనరల్ లలో ముఖ్యమైన శక్తివంతమైన చీఫ్ అడ్మిరల్ మస్కారెన్హాస్ను హత్య చేసి, పోర్చుగీస్ సైన్యాన్ని మంగుళూరు నుండి వెళ్లేలా చేసింది.
రాణి అబ్బాక్కా చౌతా పెద్ద ఎత్తున దురాక్రమణదారులను ఓడించింది !
రాణి అబ్బాక్కా చౌతా పెద్ద ఎత్తున దురాక్రమణదారులను ఓడించింది !
ఆమె అంతటితో ఆగలేదు, మంగుళూరుకు ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుందపుర వద్ద పోర్చుగీస్ స్థావరాన్ని కూడా స్వాధీనం చేసుకుంది.

పోర్చుగీస్ వారికి ఇంకా రాణి అబ్బక్క ని ఎదుర్కోవటం కష్టం అనిపించి, చివరకు అబ్బాక్కా చౌతా యొక్క భర్తను ప్రలోభపెట్టి ఒప్పించి, డబ్బు కోసం ద్రోహం చేయమని చెపుతారు ( ఇక్కడ ఒక్క విషయం కొన్ని కారణాల వలన రాణి అబ్బక్క తన భర్తకి విడిపెట్టి ఆమె పిల్లలతో కలిసి రాజ్యపాలన చేస్తున్నది). ఆ అమ్ముడుపోయిన భర్త ఆమెను బందించేలా పోర్చుగీస్ వాళ్ళకి సాయం చేస్తాడు, రాణి అబ్బక్క బందించబడి ఖైదు చేయబడుతుంది...అక్కడ ఆమె మళ్లీ తిరుగుబాటు చేసి తప్పించుకునే ప్రయత్నంలో చంపబడింది.

1857 లో భారత స్వాతంత్ర్య మొదటి యుద్ధానికి 300 సంవత్సరాల ముందు అబ్బక్కా చౌతా పోర్చుగీసులకు వ్యతిరేకంగా పోరాడింది...

భారతీయులము అయిన మనం ఆమెకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలిపాము ఏ విధంగా గౌరవించం ? ఆమెను మరిచిపోయాం.

ఆమె తెలియది ఆమె పేరు మనకి తెలియదు ఇంకా మన పిల్లలకు ఎమ్ తెలియచేస్తాం....అనే సాహస కథలను పిల్లలకు ఎవ్వరు చెపుతారు.

ఆమె పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది ప్రభుత్వం..ఆమె పేరుని ఒక షిప్ కి పెట్టి 2 విగ్రహాలను నిర్మించాము - భారతీయులు ప్రతి ఒక్కరు గొప్పగా గర్వముగా చెప్పుకోవాల్సిన ఆమె ఎవ్వరికి తెలుసు ఎక్కడో 2 విగ్రహాలు పెడితే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసిజిఎస్ రాణి అబ్బాక్కా హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మించిన ఐదు ఇన్షోర్ పెట్రోలింగ్ ఓడల్లో మొదటిది అబ్బాక్కా మహాదేవి పేరు.

ఆమె యూరోపియన్ లేదా అమెరికన్ అయి ఉంటే, మన పాఠ్య పుస్తకాలలో ఆమె గురించి ఒక అధ్యాయం చదవవలసి ఉండేది....ఆమె పేరుతో ఒక రోజు ఉండేది. ప్రపంచంలోనే ఎక్కువ గొప్ప వ్యక్తులను కలిగి ఉంది మన భారతదేశం... కానీ మనం గుర్తించడం లేదు.

__ధర్మధ్వజం

6, జూన్ 2020, శనివారం

భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ లక్ష్మీబాయి - Veera Jhansi Lakshmi Bhai


భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ లక్ష్మీబాయి - Veera Jhansi Lakshmi Bhai
క చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం సంపాదించుకున్న వీర వనిత ఝాన్సీ లక్ష్మి బాయి. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి ప్రధమ స్వాతంత్ర్య శంఖారావం చేసిన వీర నారి. యుద్ధ రంగంలో అపర కాళిలా విజృంభించి శత్రు సైనికులను చీల్చి చెండాడిన ధీశాలి.

ఆంగ్లేయ సింహాసనాలను అల్లల్లాడించిన పరాక్రమము, దేశభక్తి కలబోసి రూపొందిన ఆమె జీవితాన్ని గురించి కొంత తెలుసుకుందాం. 1835 నవంబర్ 19 న ఝాన్సీ లక్ష్మి జన్మించింది. 1842లో ఝాన్సీ రాజు గంగాధర రావుతో వివాహం జరిగింది. దాంతో ఒక పేద బ్రాహ్మణ బాలిక ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా మారిపోయింది. ఝాన్సీ ఉత్తరప్రదేశ్లో ఒక జిల్లా కేంద్ర పట్టణం.

 1851 వ సంవత్సరంలో మహారాణి లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. రాణి దురదృష్ట వశాత్తు మూడు నెలల లోపునే ఆ బాలుడు చనిపోయాడు. ఆనందరావు అనే బాలుడిని దత్తత చేసుకున్నారు. తర్వాత గంగాధరరావు కూడా కాలం చేశాడు. రాజ్యపు బాధ్యత లక్ష్మీబాయిపై పడింది. దత్తత ద్వారా వారసుడిని ఎంపిక చేసుకునే అధికారం గంగాధరరవుకి, లక్ష్మీబాయికి లేదంటూ బ్రిటిష్ ప్రభుత్వం, ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చెయ్యాలని నిశ్చయించింది. కానీ రాణీ లక్ష్మీబాయి అందుకు తిరస్కరించింది.

 రాణి దినచర్యలో మార్పు వచ్చింది. గుర్రపు స్వారీ చేసేది, తుపాకీ, ఖడ్గం, బల్లెం ప్రయోగించడం నేర్చుకునేది. “అత్యాచారాలు, అన్యాయాలను మౌనంగా సహించేవారు మరణించిన వారితో సమానం. న్యాయాన్ని గౌరవించడమే నీతి. అన్యాయం ముందు తల వంచడం పిరికితనమే” అనేది.  స్వాతంత్ర్య వీరుడు తాంత్యాతోపెతో బ్రిటీషు వారిని ఎదిరించే విషయమై ఝాన్సీ లక్ష్మి నిరంతరం రహస్య మంతనాలు జరిపింది. 1857 ఏడు మే 31వ తేది ఆదివారం దేశమంతటా ప్రజలు ఒకేసారి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చెయ్యాలని నిర్ణయం జరిగింది. 19,20 నెలల పాటు పోరాటం సాగుతూనే వుంది.  అయితే ఈ పోరాటం విషయం కొన్ని కారణాల వల్ల ముందుగానే పసిగట్టిన ఆంగ్లేయ ప్రభుత్వం ఆ మహా ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ అణచివేయడంతో మూకుమ్మడి పోరాటం ద్వారా బ్రిటిష్ వారికి ఊపిరి సలపకుండా చేసి దేశం నుంచి తరిమివెయ్యాలనే దేశ భక్తుల ప్రయత్నం విఫలమైంది. బానిసత్వంలో  మ్రగ్గుతున్న జాతి తన స్వాతంత్ర్యం కోసం చేసే పోరాటంలో ఎన్ని సార్లు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చినా తన ప్రయత్నాలు మానుకోవలసిన పని లేదు. సజీవ సమాజ లక్షణం పోరాడుతూనే ఉండడం. అదే ఒక రకంగా గొప్ప గౌరవప్రదమైన విషయం.
భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ లక్ష్మి
భారతి ప్రియ పుత్రిక వీర ఝాన్సీ లక్ష్మి
1858 మార్చ్ 23న బ్రిటీష్ సైన్యాధికారి సర్ రోజ్ ఝాన్సీపై యుద్ధం ప్రకటించాడు. 10,12 రోజుల వరకూ చిన్న రాజ్యమైన ఝాన్సీ గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ వచ్చింది. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడం రాణి గమనించింది. ఝాన్సీ నుండి బయటకు దూసుకుపోయింది. అక్కడి నుండి కాల్పికి చేరి తాంత్యా తోపె, రావు సాహెబ్ లను కలుసుకుంది.

కాల్పీలో కూడా రాణి సైన్యాన్ని సమీకరించింది. రోజ్ తన సైన్యంతో కాల్పీని ముట్టడించాడు. ఓటమి తప్పదని రాణికి అర్ధమైంది. వెంటనే రావు సాహెబ్, తాంత్యా తోపె మరి కొందరు యోధులు రాణితో కలిసి గ్వాలియర్ కోటని వశ పరచుకొన్నారు. తెల్ల వారు ఝామున గ్వాలియర్ కోటను ముట్టడించారు. రాణి పురుష వేషం ధరించి యుద్ధానికి సిద్ధమైంది.

రాణి వద్ద సైన్యం సంఖ్యా పరంగా తక్కువే ఉన్నప్పటికీ సర్దారుల అసాధారణ సాహసం, యుద్ధ వ్యూహం, రాణి పరాక్రమం కారణంగా ఆ రోజు ఆంగ్లేయ సైన్యం భారీగా దెబ్బ తింది. మరునాడు కొందరు సైనికులు ఆంగ్లేయులతో చేయి కలిపారు. రాణి లక్ష్మీ బాయి తన సర్దారులతో  “నేడు యుద్ధానికి చివరి రోజేమోననిపిస్తోంది. ఒకవేళ నేను మరణిస్తే నా కుమారుడు ఆనంద రావు జీవితాన్ని నా జీవితం కంటే విలువైనదిగా పరిగణించాలి.అతనిని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యాలి.” అంది. “నేను మరణించిన తర్వాత నా శవం విధర్మీయుల చేతుల్లో పడరాదు”. అని కూడా ఆమె కోరింది.

రోజ్ వద్ద సైనిక శక్తి అధికంగా వుంది. విప్లవకారుల సైన్యం వారి ముందు నాశనమైపోయింది. రాణికి తప్పించుకుని పోవడం మినహా మరొక మార్గం కనిపించటం లేదు. ఆమె ముందుకి దూకింది. ఆంగ్లేయుల సైన్యం ఆమెను చుట్టుముట్టింది. రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి.రాణి చెయ్యి ఒకటి తెగి పడింది. కడుపులో నుంచి రక్తం కారుతోంది. ఒళ్లంతా గాయాలయ్యాయి. కళ్ళు బైర్లు క్రమ్ముతున్నాయి. ఆమె దురవస్థని చూచి ఆమె అంగ రక్షకుడైన కుల్ మొహమ్మద్ కూడా విలపించసాగాడు. రాణిని భుజానికి ఎత్తుకుని గంగాదాస్ ఆశ్రమం వైపుకి పరుగు తీశాడు.

ఆ రోజు జూన్ 28, 1858. చుట్టూ చిమ్మ చీకటి. ఆ చీకట్లోనే బాబా గంగాదాస్ రక్తసిక్తమైన రాణి ముఖాన్ని గుర్తు పట్టాడు. చల్లని నీటితో ఆమె ముఖాన్ని కడిగాడు. గంగా జలం త్రాగించాడు. రాణికి కొద్దిగా స్పృహ వచ్చింది. వణుకుతున్న కంఠంతో ఒక్క సారి “హర హర మహాదేవ్” అని మాత్రం అంది. ఆ తర్వాత ఆమె శరీరం తిరిగి చైతన్యాన్ని కోల్పోయింది. కొద్ది సేపటి తర్వాత అతి కష్టం మీద మళ్ళీ ఆమె కన్నులు తెరిచింది. బాల్యంలో తాను నేర్చుకున్న భగవద్గీత శ్లోకాలను నెమ్మదిగా ఉచ్ఛరించింది. ఆమె కంఠస్వరం  అంతకంతకూ క్షీణించ సాగింది. ” ఓ కృష్ణా నీ ముందు నేను ప్రణమిల్లుతున్నాను.” ఇవే ఆమె చివరి మాటలు. ఝాన్సీ రాజ్యపు భాగ్య రేఖ అంతరించింది.

బాబా గంగా దాస్ ఇలా అన్నాడు. “వెలుతురుకు అంతం లేదు. ప్రతి కణంలోనూ అది దాగి వుంటుంది. తగిన సమయంలో అది తిరిగి ప్రకాశిస్తుంది. రాణి పార్ధివ శరీరం అక్కడే అగ్ని జ్వాలలకు ఆహుతి చెయ్యబడింది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కేవలం భారత దేశానికే కాక మొత్తం ప్రపంచంలోని మహిళా లోకానికే వన్నె తెచ్చిన వీర నారీమణి. అమెది పవిత్ర జీవితం. పరిపూర్ణ నారీత్వం. సాహసం, అమర దేశభక్తి, బలిదానాల ఉత్తేజ గాథే ఆమె జీవితం.

ఆదర్శ పత్నిగా వ్యవహరించింది. భర్త మరణంతో జీవితం మీద విరక్తి కలిగినా తన కర్తవ్యాన్ని మాత్రం ఆమె విస్మరించలేదు. ఆమె నిష్టావంతురాలైన హిందువు. మిగిలిన మతాల విషయంలో పూర్తి సహిష్ణుత కలిగివుండేది. ఆమె ఏ యుద్ధానికి బయలుదేరినా హిందువులతోబాటు, ముస్లిములు కూడా ఆమె సైన్యం ముందుండేవారు. రాణితో అనేక సార్లు యుద్ధంలో ఓడిపోయి చివరికి ఆమెను ఓడించిన సర్ రోజ్ రాణి లక్ష్మీబాయి గొప్పతనాన్ని గురించి ఇలా అన్నాడు. “విప్లవకారులదరిలో అత్యంత సాహసి, అందరికంటే గొప్ప సేనాపతి రాణి లక్ష్మీబాయి.” అని కొనియాడాడు.

ఝాన్సీ లక్ష్మీబాయి భారత దేశం గాఢ అంధకారంలో ఉన్నప్పుడు ఒక మెరుపులా ప్రకాశించి మాయమైన వీర వనిత. ధైర్య సాహసాలు, సంఘటనా కౌశలం, దేశ భక్తిని ప్రదర్శించి అమరురాలైన ఝాన్సీ లక్ష్మీబాయి కోట్లాది భారతీయుల హృదయాలలో నిత్యమూ ప్రేరణా జ్యోతులను వెలిగించే అమర జ్యోతి.

__ విశ్వ సంవాద కేంద్రము

2, జూన్ 2020, మంగళవారం

స్త్రీలను గౌరవించిన పురాణాలు - Strianu Gauravinchina Puranaluస్త్రీలను గౌరవించిన పురాణాలు

పురాణాల్లో ప్త్రీలకెంతో ఉన్నతన్థానం కనిపిస్తున్నది. 
 • 1. ఒక్క సీతకోసం శ్రీరామచంద్రుడు రావణాసురుని సర్పస్వము నాశనం చేశాడు. 
 • 2. సభలో అవమానింపబడిన డ్రౌపదిని ఓదార్చేందుకు పాండవులు జరిపిన మహాభారత సంగ్రామంలో కురువంశం మొత్తం బలయింది. 
 • 3. సతీదేవికి జరిగిన అవమానం భరించలేక పరమశివుడు దక్షయాగాన్ని విధ్వంసం చేశాడు. 
ఈ సంఘటనలేగాక స్త్రీల గౌరవానికద్దం పట్టే మరికొన్ని ఉదాహరణలు: - 
 • ➣ మహావిష్ణువు లక్ష్మీపతిగ, 
 • ➣ శివుడు గౌరీపతిగ,
 • ➣ శ్రీరామచంద్రుడు సీతాపతిగ పిలవబడుతున్నారు. 
 • ➣ అంతేగాక శ్రీరాముడు కౌసల్యానందనుడుగ, 
 • ➣ శ్రీకృష్ణుడు దేవకీసుతుడుగ, 
 • ➣ వినాయకుడు ఉమాసుతుడుగ, 
 • ➣ పాండవులు కుంతీపుత్రులుగ కీర్తింపబడుతున్నారు
ఇంకా చెప్పాలంటే.. పూజా సవయంలో లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, వాణీ పురందరులు, సీతారాములు అనడం ద్వారా అయ్యగార్లతోపాటు అమ్మవార్లుకూడ పూజలందుకుంటున్నారు.  అంటే తల్లిగా, భార్యగ స్త్రీమూర్తి లోకంలో మన్ననలను పొందుతోంది.  మరో విశేషమేమంటే మనదేశంలో ఎక్కడాలేని విధంగా పూరి జగన్నాథక్షేత్రంలో బలరామ-శ్రీకృష్ణులతో సమానంగా తమ సోదరి సుభద్రాదేవి నేటికీ ఘనంగా పూజలందుకొంటున్నది.
కుడివైపున శ్రీకృష్ణుడు - ఎడమన సోదరి సుభద్రా దేవి - మధ్యన బలభద్రుడు
కుడివైపున శ్రీకృష్ణుడు - మధ్యన సోదరి సుభద్రా దేవి - ఎడమ బలభద్రుడు

ఈ విధంగా అన్ని రకాలుగ ధన్యురాలు స్త్రీమూర్తి. ఈ ఉదాహరణలన్నీ మహిళను మనం ఎలా గౌరవించాలో తెలియజేస్తున్నాయి. గనుకనే - "యత్ర నార్యస్తు పూజ్యస్తే రమస్తే తత్ర దేవతా" అని ఆర్యోక్తి.

రచన: పేరి సత్యనారాయణ శాస్త్రి
సంకలనం: డా. జనమద్ది రామకృష్ణ

13, మే 2020, బుధవారం

స్త్రీ అను పదమునకు పర్యాయ పదాలు - Stri,Sthree, Paryaya Padalu

స్త్రీ అను పదమునకు పర్యాయ పదాలు - Stri,Sthree, Paryaya Padalu
ఇన్ని పదాలు ఒక్క స్త్రీ కే ఉన్నాయని ఇప్పటివరకు నాకు తెలియదు. మీరు కూడా చదివి తెలుసుకోండి.

స్త్రీ అను పదమునకు 220 పర్యాయ పదములివి. దాదాపుగా ఒక పదమునకు ఇన్ని పర్యాయ పదములు గల ఘనత మరే భాషలో ఉండవేమో ...!!!
 •  1. అంగన
 •  2. అంచయాన
 •  3. అంబుజాలోచన
 •  4. అంబుజవదన
 •  5. అంబుజాక్షి
 •  6. అంబుజనయన
 •  7. అంబురుహాక్షి
 •  8. అక్క
 •  9. అతివ
 • 10. అన్ను
 • 11. అన్నువ
 • 12. అన్నువు
 • 13. అబల
 • 14. అబ్జనయన
 • 15. అబ్జముఖి
 • 16. అలరుబోడి
 • 17. అలివేణి
 • 18. అవ్వ
 • 19. ఆటది
 • 20. ఆడది
 • 21. ఆడగూతూరు
 • 22. ఆడుబుట్టువు
 • 23. ఇంచుబోడి
 • 24. ఇంతి
 • 25. ఇదీవరాక్షి
 • 26. ఇందునిభాష్య
 • 27. ఇందుముఖి
 • 28. ఇందువదన
 • 29. ఇగురాకుబోణి
 • 30. ఇగురాకుబోడి
 • 31. ఇభయాన
 • 32. ఉగ్మలి
 • 33. ఉజ్జ్వలాంగి
 • 34. ఉవిధ
 • 35. ఎలతీగబోడి
 • 36. ఎలనాగ
 • 37. ఏతుల
 • 38. కంజముఖి
 • 39. కంబుకంఠ
 • 40. కంబుగ్రీవ
 • 41. కనకాంగి
 • 42. కన్నులకలికి
 • 43. కప్పురగంధి
 • 44. కమలాక్షి
 • 45. కరబోరువు
 • 46. కర్పూరగంది
 • 47. కలకంఠి
 • 48. కలశస్తిని
 • 49. కలికి
 • 50. కలువకంటి
 • 51. కళింగ
 • 52. కాంత
 • 53. కించిద్విలగ్న
 • 54. కిన్నెరకంఠి
 • 55. కురంగానయన
 • 56. కురంగాక్షి
 • 57. కువలయాక్షి
 • 58. కూచి
 • 59. కృషమధ్యమ
 • 60. కేశిని
 • 61. కొమ
 • 62. కొమరాలు
 • 63. కొమిరె
 • 64. కొమ్మ
 • 65. కోమ
 • 66. కోమలాంగి
 • 67. కొమలి
 • 68. క్రాలుగంటి
 • 69. గజయాన
 • 70. గరిత
 • 71. గర్త
 • 72. గుబ్బలాడి
 • 73. గుబ్బెత
 • 74. గుమ్మ
 • 75. గోతి
 • 76. గోల
 • 77. చంచరీకచికుర
 • 78. చంచలాక్షి
 • 79. చంద్రముఖి
 • 80. చంద్రవదన
 • 81. చక్కనమ్మ
 • 82. చక్కెరబొమ్మ
 • 83. చక్కెర
 • 84. ముద్దుగుమ్మ
 • 85. చాన
 • 86. చామ
 • 87. చారులోన
 • 88. చిగురుంటాకుబోడి
 • 89. చిగురుబోడి
 • 90. చిలుకలకొలోకి
 • 91. చెలి
 • 92. చెలియ
 • 93. చెలువ
 • 94. చేడి(డియ)
 • 95. చోఱుబుడత
 • 96. జక్కవచంటి
 • 97. జని
 • 98. జలజనేత్ర
 • 99. జోటి
 • 100. ఝషలోచన
 • 101. తనుమధ్య
 • 102. తన్వంగి
 • 103. తన్వి
 • 104. తమ్మికింటి
 • 105. తరళలోచన
 • 106. తరళేక్షణ
 • 107. తరుణి
 • 108. తలిరుబోడి
 • 109. తలోదరి
 • 110. తాటంకావతి
 • 111. తాటంకిని
 • 112. తామరకంటి
 • 113. తామరసనేత్ర
 • 114. తియ్యబోడి
 • 115. తీగ(వ)బోడి
 • 116. తెఱువ
 • 117. తెలిగంటి
 • 118. తొగవకంటి
 • 119. తొయ్యలి
 • 120. తోయజలోచన
 • 121. తోయజాక్షి
 • 122. తోయలి
 • 123. దుండి
 • 124. ధవలాక్షి
 • 125. ననబోడి
 • 126. నళినలోచన
 • 127. నళినాక్షి
 • 128. నవల(లా)
 • 129. నాంచారు
 • 130. నాచారు
 • 131. నాచి
 • 132. నాతి
 • 133. నాతుక
 • 134. నారి
 • 135. నితంబవతి
 • 136. నితంబిని
 • 137. నీరజాక్షి
 • 138. నీలవేణి
 • 139. నెచ్చెలి
 • 140. నెలత
 • 141. నెలతుక
 • 142. పంకజాక్షి
 • 143. పడతి
 • 144. పడతుక
 • 145. పద్మముఖి
 • 146. పద్మాక్షి
 • 147. పర్వందుముఖి
 • 148. పల్లవాధర
 • 149. పల్లవోష్ఠి
 • 150. పాటలగంధి
 • 151. పుచ్చడిక
 • 152. పుత్తడిబొమ్మ
 • 153. పువు(వ్వు)బోడి
 • 154. పువ్వారుబోడి
 • 155. పుష్కరాక్షి
 • 156. పూబోడి
 • 157. పైదలి
 • 158. పొల్తి(లతి)
 • 159. పొల్తు(లతు)క
 • 160. త్రీదర్శిని
 • 161. ప్రమద
 • 162. ప్రియ
 • 163. ప్రోడ
 • 164. ప్రోయాలు
 • 165. బంగారుకోడి
 • 166. బాగరి
 • 167. బాగులాడి
 • 168. బింబాధర
 • 169. బింబోష్ఠి
 • 170. బోటి
 • 171. భగిని
 • 172. భామ
 • 173. భామిని
 • 174. భావిని
 • 175. భీరువు
 • 176. మండయంతి
 • 177. మగువ
 • 178. మచ్చెకంటి
 • 179. మడతి
 • 180. మడతుక
 • 181. మత్తకాశిని
 • 182. మదిరనయన
 • 183. మదిరాక్షి
 • 184. మసలాడి
 • 185. మహిళ
 • 186. మానవతి
 • 187. మానిని
 • 188. మించుగంటి
 • 189. మించుబోడి
 • 190.మీనసేత్రి
 • 191. మీనాక్షి
 • 192. ముగుద
 • 193. ముదిత
 • 194. ముదిర
 • 195. ముద్దరాలు
 • 196. ముద్దియ
 • 197. ముద్దుగుమ్మ
 • 198. ముద్దులగుమ్మ
 • 199. ముద్దులాడి
 • 200. ముష్ఠిమధ్య
 • 201. మృగలోచన
 • 202. మృగాక్షి
 • 203. మృగీవిలోకన
 • 204. మెచ్చులాడి
 • 205. మెఱుగారుబోడి
 • 206. మెఱుగుబోడి(ణి)
 • 207. మెలుత
 • 208. మెళ్త(లత)మెల్లు(లతు)
 • 209. యోష
 • 210. యోషిత
 • 211. యోషిత్తు
 • 212. రమణి
 • 213. రామ
 • 214. రుచిరాంగి
 • 215. రూపరి
 • 216. రూపసి
 • 217. రోచన
 • 218. లతకూన
 • 219.లతాంగి
 • 220. లతాతన్వి
తెలుగు భాషలో ఒక్క స్త్రీ అనే పదానికి మాత్రమే ఇన్ని పర్యాయ పదాలున్నాయంటే - తెలుగు నా మాతృభాష అని చెప్పడం గర్వకారణం కదా.🌹

సంకలనం: ఎన్ కిషోర్ 

5, ఏప్రిల్ 2020, ఆదివారం

రక్తహీనత నివారణకు ప్రకృతి ఆహారము - Anemia, Raktahinathaరక్తహీనత నివారణకు ప్రకృతి ఆహారము - Anemia, Raktahinatha
రక్తహీనత వల్ల పూర్తి బలహీనం అవుతారు. ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువుగా ఉంటుంది.

రక్తహీనత క్షణాలు 
ముఖం పాలిపోయినట్లు ఉండటం, త్వరగా అసిపోవడం, చిరాకు, కోపం, అసహనం ఎక్కువుగా ఉంటాయి. ఆయాసం, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం. నాుక మంట. మెడనొప్పి, తనొప్పి వస్తుంది.

నివారణ:
ఐరన్‌ లోపం వ్ల రక్తహీనత ఏర్పడుతుంది. శరీరానికి కావసిన ఐరన్‌ భించుటకు పండ్లు, పుట్టగొడుగు, ఆకుకూరు, తీగకు కాసే కాయ గూరు, ఖర్జురము, తేనె, సోయాబీన్స్‌, బీన్స్‌ సమృద్దిగా తీసుకోవాలి,  కూరలో నిమ్మకాయ పిండుకోవాలి. తేనె వాడితే కొద్దిరోజుల్లొనే మార్పు వస్తుంది. ఖర్జురంలో ఐరన్‌ బాగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజుకి 10 నుంచి 12 వరకు తినాలి. 

నిషిద్ధ ఆహరం:
 • 🙙 వైట్‌ బ్రెడ్‌, స్వీట్స్‌, పంచదార, వేపుళ్లు, న్వి పచ్చళ్ళు, మైదాపిండి మొదగునవి వాడకూదు. 
 • 🙙 ఐరన్‌ శరీరం గ్రహించాలి అంటే సీ విటమిన్‌ అవసరం ఉంటుంది. ఐరన్‌ టాబ్లెట్స్‌ వాడటం కంటే ఆహారం ద్వారా సహజంగా ఐరన్‌ శరీరానికి అందించడం ఉత్తమం. 
 • 🙙 మద్యపానం, ధూమపానం ఈ సమస్యను మరింతగా ఎక్కువ చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
పళ్ళు, కాయ రసములతో వైద్యం:
ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌లో ఒక స్పూన్‌ గోధుమగడ్డి చూర్ణం కలిపి ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు తీసుకోవాలి. ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఒక ఆపిల్‌ పండు తినాలి. ఇలా చేస్తే కేవం నభై రోజులోనే శరీరంలో సంపూర్ణంగా రక్తం వృద్ది అయ్యే అవకాశం ఉంది.  దానిమ్మ జ్యూస్‌ తాగలేనివారు ఆపిల్‌ జ్యూస్‌లో కూడా గోధుమగడ్డి చూర్ణం కుపుకుని తాగవచ్చు.

సంకలనం: మాధవ్ బాలు చౌదరి 

31, మార్చి 2020, మంగళవారం

దాంపత్య జీవనం, దైవకార్యము - Dampatya Jivanam Daivakaryam

దాంపత్య జీవనం, దైవకార్యము - Dampatya Jivanam Daivakaryam
దాంపత్య జీవనం దైవకార్యం గృహస్థాత్రమంలో ఒక స్తీ, ఒక పురుషుడు కలిసి జీవించే విధానం అనాది నుండి వస్తోంది. వారిద్దరి మైత్రి బంధం ద్వారా వచ్చే సంతానంతో పీతృఋణం, గురుఋణం, దేవఋణం తీర్చుకోవాలని శాస్త్రాలు బోధిస్తున్నాయి.

స్రీ పురుషులు అనుబంధానికి నైతికబలం సామాజికబలం, గౌరవ మర్యాదలు ఒకరివల్ల మరొకరు పొందుతారు. దీన్నే వివాహబంధం అంటున్నాం. పవిత్రమైన వివాహబంధం ద్వారా ఒక్కటైన జంట సృష్టి కార్యాన్ని దైవకార్యంగా భావించాలి. ఇందులో భర్త, భార్య వద్దకు వెళ్లేటప్పడు ఒక పవిత్ర దేవాలయంకు వెళుతున్నట్లు భావించాలి. భార్య, భర్త చెంతకు చేరేటప్పడు పరమాత్ముని చేరుతున్నట్లు భావించాలి. దంపతులు కలిసేటప్పుడు ఒక భావదశ కావాలి. పవిత్ర భావన కలగాలి.
ఆధ్యాత్మిక సంభోగం
ఆధ్యాత్మిక సంభోగం
సంభోగ సమయంలో భగవంతుడు సృష్టి క్రియచేసి క్రొత్త జీవిని జన్మింపచేస్తాడు అప్పుడు దంపతులు భగవంతునికి సమీపంలో ఉంటారు. వారు మార్గంగా ఒక నూతనజీవి ఆవిర్భవిస్తోంది. దంపతులు జన్మదాతలవుతారు. భగవంతుని ప్రార్థిస్తున్న భావనతో అత్యంత పవిత్రమైన కార్యంగా భార్యభర్తల సంగమం జరగాలి. జ్ఞానాన్ని పొందడానికి సుజ్జాన జీవితం గడపటానికి కామాన్ని భోగంగా గాక యోగంగా రూపొందించుకోవాలి. ఇద్దరు వ్యక్తుల పరిపూర్ణమైన కలయిక ఎంత గాఢంగా ఉంటుందో, సంతానం కూడా అంత అద్భుతంగా వుంటుంది. కలయిక తేలికగా అత్యల్పంగా ఉన్నప్పుడు, అందువల్ల కలిగే సంతానం అలాగే ఉంటుంది.

ఒక కళాకారుడు మత్తులో ఉన్నప్పుడు సుందర విగ్రహాలను తయారు చేయలేడు అశాంతి, క్రోధంతో ఉన్న నృత్యకారుడు సరిగ్గా అభినయించలేడు. ఇవన్నీ మానసిక స్థితులపై ఆధారపడి ఉంటాయి. క్రోధం, నిరాశ, నిస్సృహ, అశాంతితో సృష్టికార్యం చేసినట్లయితే సంతానం అదే స్థాయికి చెంది ఉంటుంది. సంభోగాన్ని సువ్యవస్థితంగా, ఆధ్యాత్మికంగా సమాధికి ద్వారంగా రూపొందించేవరకు మంచి మానవుడు జన్మించేందుకు అవకాశమే లేదు భవిష్యత్తులోన సద్భావాల వ్యక్తుల పుట్టుక అనుమానంగానే ఉంటుంది. కనుకనే దాంపత్య జీవితం దైవకార్యంగా భావించి దంపతులు మెలగాలని భారతీయ శాస్త్రాలు బోధిస్తున్నాయి.

ఎంతో ఉన్నతమైన భావాలతో. రూపొందించిన హిందూ సంప్రదాయాలను అందరూ ఆచరిస్తే సద్దుణాలతో కూడిన సమాజ నిర్మాణ కార్యం సులువుగా నెరవేరుతుంది. ధర్మబద్ధంగా కామం కోరికలు ఉండడం సహజం. దానిని తీర్చుకునే ప్రయత్నం చేయడం కూడా సహజమే. కోరిక అంటే కేవలం లైంగిక సంబంధమైనదే కాదు. పురుషార్ణాలలో "కామం" ఒకటి. అయితే అది ధర్మబద్ధంగా తీర్చుకోవాలని హిందుత్వం చెప్తోంది. కోరికలు తీర్చుకోవడానికే మానవుడు పుట్టాడు.

మానవుడు అంటే కోరికల పుట్ట, అవి అనుభవించడానికి మానవ జన్మ అని పాశ్చాత్యుల భావన. హిందూ ధృక్పథం దీనికి పూర్తిగా భిన్నమైంది. సామాజిక జీవనానికి భంగం కలుగుతుంటే మానవుడు కోరికలను అదుపులో పెట్టుకోవాలని చెప్తొంది. కోరికలను అనుభవిస్తే కామాగ్ని శాంతించదు. అది మరింత తీవ్రంగా ప్రజ్వరిల్లుతుంది. ఎలాగంటే నెయ్యి మొదలైన హవిస్సుల వలన అగ్ని మరింత రగలుతుంది. అందుకే కామాగ్నిని శాంతపర్చేందుకు మనోనిగ్రహం కావాలి. దీనినే “దమం” అని చెప్పింది శాస్త్రం.

ఆహారం తినుట, నిద్రపోవుట, భయపడుట, దాంపత్య సుఖం అనుభవించుట, ఈ లక్షణాలు పశువులకు, మనుషులకు సమానంగా ఉంటాయి. కానీ మనుషులు ధర్మబద్ధంగా వీటిని గ్రహిస్తారు. ఇది పశువుల కంటే విశేష లక్షణం. ఆ ధర్మాలను ఆచరించనివాడు పశువుతో సమానమని శాస్త్రం చెబుతోంది.

రచన:  జాగృతి

16, మార్చి 2020, సోమవారం

బైబిలులో స్త్రీల పట్ల వివక్ష - Discrimination against women in the Bibleబైబిలులో స్త్రీల పట్ల వివక్ష - Discrimination against women in the Bible
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బైబిలులో స్త్రీల పట్ల వివక్ష గురించి పూర్తిగా చదవండి.
 • 🖝 స్త్రీని పురుషుడు ముట్టకుండుట మేలు. కానీ మనసు నియంత్రించుకోలేకపోతున్నప్పుడు పెళ్లి చేసుకోవటం మంచిది. ఎందుకంటే పురుషుడు స్త్రీని ముట్టడం ద్వారా పాపాత్ముడు అవుతాడని పౌలు బలంగా నమ్మేవాడు. 1 కొరింథీయులు 7:1
 • 🖝 స్త్రీకి శిరస్సు తన భర్త, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తునకు శిరస్సు దేవుడు. ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో ఆ స్త్రీ తన తలను అవమానపరచినట్లు అంటే తన భర్తను అవమానించినట్లు, అటువంటి స్త్రీ తలవెంట్రుకలు కత్తిరించుకోవాలి. పురుషుడు దేవుని ప్రతిరూపం మరియు దేవునికి కీర్తి కలిగించేవాడు. కనుక అతడు తన తల కప్పుకొనకూడదు. కాని స్త్రీ వల్ల పురుషునికి కీర్తి కలుగుతుంది. ఎందుకంటే పురుషుడు స్త్రీ నుండి సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడింది. అంతేకాక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు స్త్రీ పురుషుని కొరకు సృష్టింపబడింది. 1 కొరింథీయులు 11:2-10
 • 🖝 సంఘం( church) క్రీస్తుకు లోబడి ఉన్నట్లే భార్య కూడా తన భర్తకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. ఎఫెసీయులు 5: 24
 • 🖝 స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి అధికారం లేదు. ఈ విషయాన్ని ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. కనుక ఒకవేళ స్త్రీ ఏదైనా విషయాన్ని గురించి తెలుసుకోదలిస్తే, తమ ఇండ్లలో తమ భర్తల్ని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే స్త్రీలు సంఘంలో మాట్లాడటం అవమానకరం. 1 కొరింథీయులు 14:34-35
 • 🖝 స్త్రీలు మౌనంగా ఉంటూ పూర్తిగా లోబడి ఏదైనా నేర్చుకోవాలి. స్త్రీలు బోధించడానికి, పురుషులపై అధికారం చెలాయించడానికి హక్కు లేదు. మరియు స్త్రీలు ఎక్కువగా మాట్లాడకూడదు. దేవుడు ఆదామును మొదట సృష్టించాడు. ఆ తర్వాత హవ్వను సృష్టించాడు. స్త్రీ మోసపోయి పాపియైనది కానీ మోసపోయింది ఆదాము కాదు. దేవుని పట్ల విశ్వాసము, ప్రేమ కలిగివుండి, పవిత్రంగా ఉండి బిడ్డలను కనడం ద్వారా ఆమె రక్షించబడుతుంది. 1 తిమోతి 2:11-15
 • 🖝 స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. ఇది మన ప్రభువుకు నచ్చుతుంది. అలాగే పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. వాళ్ళతో కఠినంగా ప్రవర్తించరాదు. కొలొస్సయులు 3:18-19
 • 🖝 స్త్రీ సంపర్కం వలన పురుషులు మలినపడుతారు. ప్రకటన గ్రంథం 14:3-4.
చరవాణి: 9515767777.

15, మార్చి 2020, ఆదివారం

బొట్టు ప్రాముఖ్యత - Bottu praamukhyata

బొట్టు ప్రాముఖ్యత - Bottu praamukhyata
బొట్టు ప్రాముఖ్యత..
బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసుకోండి!
మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. బొట్టులేని ముఖము, ముగ్గులేని ఇల్లు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా స్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు.

కాబట్టి ఇంటి ముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు, దరిద్రదేవత తాండవం చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే.కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు, వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.

మన ముఖములో ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ (వ్యతిరేక శక్తి) అంటారు.

నరుడు కంటే చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు, అలాగే ఎదురుగా ఉండేటటువంటివారు. మన ముఖాన్ని చుస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ఎనర్జీ (వ్యతిరేక శక్తి) మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది.

మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి. ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.

ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అంటే మెదడుకు సంభందించినటు వంటి నాడులు మన ముఖములో కనబడుతాయి. కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది. మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది, తద్వారా మనకు తలనొప్పి వస్తుంది, మనఃశాంతి పోతుంది, చిరాకు వస్తుంది.

ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము. కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే మెదడును కాపాడుకోవాలంటే మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని (సానుకూల శక్తి) కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి, అంటే బొట్టు పెడితే చాలు.

మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది ,తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది.

జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి. ఎటువంటి ఒత్తిడికి లోనూ కావు, మనల్ని కాపాడుతూ ఉంటాయి. మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి, అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.

సైంటిఫిక్ (శాస్త్రీయంగా) కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది, అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి.

ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి, ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీకూడా తొలగిపోతాయి. అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి.

ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి.

పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా సౌభాగ్యవతులే కాకుండా మగవారే కాకుండా వైథవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు దానినే గంగసింధూరము అంటారు.

ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు, ఆ బొట్టును వైదవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు, ఎటువంటి తప్పూ లేదు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి.

మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే, ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము. పాపటిలో సింధూరం ఆడవాళ్లకు మరింత గౌరవాన్ని కలిగిస్తుంది.. భర్తకు క్షేమం కూడా అంటారు.

ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు అందుకని చక్కగా కుంకుమను ధరించండి.

శ్రీ మాత్రే నమః
రచన: భానుమతి అక్కిశెట్టి

24, డిసెంబర్ 2019, మంగళవారం

స్త్రీ హితోదం, మనుధర్మ శాస్త్రం - Mandharmam lo Striiస్త్రీ హితోదం, మనుధర్మ శాస్త్రం - Mandharmam lo Strii
మనుధర్మ శాస్త్రం ఒక పరిశీలన

|| శ్లో || శోచంతి జామయో యత్ర నినశ్యత్యాశు తత్కులమ్
న శోచంతి తు యత్రైతా వర్థతే తద్ది సర్వదా || .1
తాత్పర్యము: వ్యభిచారులు, అత్యాచారులు, దుర్మార్గులైన పురుషుల వలన శోకించి ధుఃఖించే స్త్రీలు ఉన్న ఇల్లు, లేదా వంశం నశిస్తుంది. ఉత్తమ పురుషులతో ప్రసన్నంగా స్త్రీలు ఉన్న ఇల్లు లేదా వంశం ఎప్పుడూ అభివృద్ది చెందుతూ ఉంటుంది.

|| శ్లో || అరక్షితా గృహే రుద్దాః పురుషైరాప్తకారిభిః
ఆత్మానమాత్మనాయాస్తు రక్షేయుస్తాః సురక్షితాః || .2
తాత్పర్యము: గృహంలో తండ్రీ, భర్త మొదలైన పురుషులున్నా కూడా స్త్రీలు ఎవరైతే తమను తాము రక్షించుకుంటారో వారే సురక్షితంగా ఉంటారు.

|| శ్లో || సువాసినీః కూమారీశ్చ రోగిణీ గర్బీణీః స్త్రియః
అదతిభ్యో 2గ్రేవైతాన్ భోజయే దవిచారయన్ .|| .3
తాత్పర్యము: నూతన వధూవరులకు, అల్పవయస్సుగల కన్యలకు, రోగగ్రస్తులైన స్త్రీలకు, గర్భవతులైన స్త్రీలకు, వీరికి అతిధులకంటే ముందు గా భోజనం పెట్టాలి.

పై శ్లోకాల వల్ల మనకు అర్థంకావలసింది ఒక్కటే మనువు స్త్రీ విరోధి కాదు. ముందు పోస్ట్ లలో మనుమహర్షి ఆస్తి విషయం లో స్త్రీలకు ఎలాంటి రక్షణ కల్పించాడో చూద్దాం.

స్త్రీ ధర్మము - వ్యాఖ్యానం, భానుమతి గారు

రచన: పి.వి.జె - పవన్ కుమార్ 

కాఫీ అలవాటు: స్త్రీ హిత బోధిని - Coffee Arogyaniki Haani

కాఫీ అలవాటు: స్త్రీ హిత బోధిన - Hithabhodini - Coffee Arogyaniki Haani
ఉదయము నుండి రాత్రి పరుండు వఱకు స్త్రీ, ఆచరింపవలసిన విధులను ఈ గ్రంథక రతి " శ్రీమతి, సౌభాగ్యవతి శారదాదేవి " గారు చక్కగా చిత్రించినారు.

స్త్రీ హితబోధినలో తర్వాతి అంశం - కాఫీ అలవాటు

స్నానానంతరము పిల్లలు భోజనము చేయుట మంచిది కాని ఇడ్లెనలు, కాఫీ మున్నగువాటిని అలవాటు చేయరాదు. కాఫీ జీర్లశ క్తిని తగ్గించుటయే గాక శరీరములో ఒకవిధమగు విషపదార్థమును గూడ వ్యాపింపజేయును. ఇంటిలోనివారందరు కాఫీకి అలవాటుపడిన యెడల కుటుంబ ఖర్చులలో సగము ఈ అలవాటే మ్రింగివేయును. కొన్నాళ తరువాత దీనిని వదలుకోనుటగూడ కష్టము.

కాఫీ అభ్యాసము గల వారు ఒక్కొక్క ప్పుడు అది దొరకనిచో తలనొప్పి చే బాధ,  కొందరు ఇంటిలోని వారిని వదలి తామొకరే కాఫీహటలునకు పోయి కనీసము నెలకు ఐదారు వందల రూప్యము లైన ఖర్చు చేయుచుందురు. ఇలా నిత్యమును కాఫీహోటలుకు పోవుట అనవసర వ్యయము. సకాలమునకు భోజనము చేసిన వ్యయము తగ్గుటయేకాక అరోగ్యము గూడ బాగుపడును.

కాఫీ త్రాగువారికి సకాలనునకు ఆకలి కాదు, అట్టివారు వేళకు భోజనమునకు రాక స్త్రీలను బాధించుచుందురు.

హోటలులో తినుటవలన వారి వారికుండు అంటువ్యాధులు క్లూడ కలుగుచుండును, పాత్రలను కాఫీహాోటలులో ఎంత కడిగినను వ్యాధిని కలిగించు చిన్న జీవాణువులు పాత్రలలో నిలిచిపోయి, వ్యాధులను వృద్ధిపోందజేయును రోగములను నయముజేయించుకోనుటకు చాల వ్యయము చేయవలయును. ఏదృష్టితో చూచినను, ప్రతిదినము కాఫీ హోటలునకు వెళ్ళుఅలవాటు వ్యయప్రయాసలనే కలిగించును .

ఏదృష్టితో చూచినను, ప్రతిదినము కాఫీ హోటలునకు వెళ్ళుఅలవాటు వ్యయప్రయాసలనే కలిగించును . ఇంటియందై నను అటి అలవాటు వదలుకోనుట మంచిది ఎప్పుడో ఒక ప్పుడు కాస్తీ నుపయోగింపవచ్చును గాని నిత్యము అలవాటు కూడదు

రచన: శ్రీమతి, సౌభాగ్యవతి శారదాదేవి

23, డిసెంబర్ 2019, సోమవారం

సాంప్రదాయిక పద్దతిలో " కాలకృత్యములు" తీర్చుకొనుట - Kaalakrutyamulu (Strii Hithabodini )

సాంప్రదాయిక పద్దతిలో " కాలకృత్యములు" తీర్చుకొనుట - Kaalakrutyamulu (Strii Hithabodini )
ఉదయము నుండి రాత్రి పరుండు వఱకు స్త్రీ, ఆచరింపవలసిన విధులను ఈ గ్రంథక రతి శ్రీమతి, సౌభాగ్యవతి శారదాదేవి గారు చక్కగా చిత్రించినారు.

కాలకృత్యములు
ప్రతివారును సూర్యోదయమునకు ముందే నిద్ర మేల్కొని మల మూత్ర విసర్జనము చేయవలెను. పట్టణములలో నుండువారు మలవిసర్జనమునకు మరుగుదొడ్ల లోనికి వెళ్ళవలసి యుండును. అప్పుడు ఒక పెద్ద చెంబుత నీరు తీసికొని, కొన్ని అచట పోయవలెను అంటురోగములు రావు.

రాత్రి సమయములందు పల్లె-గ్రామములలో బహిర్భూమికి వెళ్ళవలసివచ్చిన, తోడు తీసికొని అందువలన కొన్న వెళ్ళపలెనే కాని, ఒకరే వెళ్లరాదు.

తరువాత కాలుసేతులు కడగుకొని పుక్కిలించి ఉమిసి దంతధావనము చేయవలెను. వేప, గానుగ, తుమ్మ, మజ్జి మొదలగు పుల్లలతో దంతధాననము చేయవచ్చును. ఉచితముగా దొరకునపుడు వీనిని కొనగూడదు, పుల్లలు దొరకనపుడుగాని, ప్రయాణములు చేయునపుడు గాని, పండ్లపొడి తయారుచేసికొనిన అది ఉపయోగించవలయును.

కాని బజారులలో నమ్మబడు పౌడర్లనుగాని, టూత్పేస్టుని కొనగూడదు. అందువలన వ్యయము ఎక్కువగుటయేగాక ప్రయోజనముగూడ ఉండదు. ప్రకటనలో ఉన్నంత పస వస్తువులలో ఉండదు. మనము తయారు చేసికొనిన పొడి, పంటివ్యాధులను పోగొట్టి, నోటిని బాగుగా శుభ్రపరచును. కొద్ది వ్యయముతో తయారగును దీనిని తయారుచేయువిధము ముందు చెప్పబడును. 

దంతధావన మైనపిమ్మట ఆరోగ్యవంతులు స్నానము చేయవలెను. చన్నీ రు స్నానమునకు చాల మంచిది. వేడినీరు అంత మంచిది కాదు. పైగా వంట చెరకు కొనవలసిన వారికి చన్నీటిస్నానము ఖర్చు తగ్గించును. రోగులు తొట్టిస్నానపు పద్దతిలో తప్ప చన్నీ ట స్నానము చేయరాదు. స్నానమునకు సాధారణముగ సబ్బుల నుపయోగింపరాదు. అట్టి సబ్బుల
లోని సోడా శరీరమునకు గరకుతనము గలిగించును. అవి మన దేహముపై ని సన్నని పొట్టును గూడ లేవదీయును. సబ్బుల నుపయోగింపనియెడల గౌరవహాని యని తలచువారు స్వదేశీ సబ్బులను, ఎక్కువ వాసన లేసవాటిని ఉపయోగింపవలెను.

వాసన శర్రీరము పై నిలువన ఉండునది కాదు. కావున వాసనకుగాను ఎక్కువ వ్యయము చేయరాదు.

సబ్బులకంటే క్రింది పిండి శరీరమునకు చాల మంచిది. ఇది శరీరమునందలి మురి కీని పోగొట్టుటయే గాక దురద, గజ్జి మున్నగు చర్మవ్యాధులను గూడ పోగొటును. ఆబాలవృద్ధులు దీనిని ఉపయోగించవచ్చును. ఇది చాలా చౌకగా తయారగును.

పిండితయారీ కి కావలసిన వస్తువులు:
 • 🍀పెసలు సోలెడు, 
 • 🍀 పసుపు తులము, 
 • 🍀 బావంచాలు తులము,
 • 🍀 తంటెపుగింజలు తులము,
 • 🍀 తుంగముసైలు తులము, 
ఇందులో పెసలు విసిరి పిండిచేసి మిగిలినవాటిని చూర్ణము చేసి ఆపిండిలో కలుపవలెను,

రచన: శ్రీమతి, వెంపటి సౌభాగ్యవతి శారదాదేవి - "స్త్రీ హితబోధిని" గ్రంధము 

20, డిసెంబర్ 2019, శుక్రవారం

కుంకుమ తయారీ (సింధూరం) - Kumkuma Thayaari

కుంకుమ తయారీ విధానం:
 • పసుపుకొమ్ములు - 200 గ్రాములు
 • పటిక - 20 గ్రాములు
 • ఎలిగారం - 20 గ్రాములు
 • నిమ్మకాయలు - 6
 • నువ్వులనూనె - 10 గ్రాములు
పటికనూ, ఎలిగారంలనూ కచ్చాపచ్చాగా దంచి నిమ్మరసం బాగా కలపాలి. ఆపై పసుపుకొమ్ములు అందులో వేసి కలిపి ఓ రోజంతా ఉంచాలి. మరుసటిరోజు మరో పాత్రలోకి మార్చాలి. పసుపుకొమ్మలకి బాగా పట్టి వుంటాయి. వాటిని నీడ ఉండే ప్రదేశంలో ఉంచి ఎండబెట్టాలి ఆ తర్వాత రోటిలో వేసి బాగా మెత్తగా దంచాలి. దంచిన కుంకుమని తెల్లబట్టలో వేసి జల్లించుకోవాలి. చాలా కొద్దిగా నూనె వేసి కలుపుకొని కుంకుమ భరిణలో పదిలం చేసుకోవాలి. మీరు చేసుకున్న కుంకుమను ..మీరే ఆనందంగా అలంకరించుకోండి, ధరించండి

రచన: శ్రీ లక్ష్మీ నిధి

28, జూన్ 2019, శుక్రవారం

స్త్రీ - శక్తి స్వరూపిణి - Stri Shakti


లక్ష్మివి నువ్వే.. సరస్వతివి నువ్వే.. పార్వతివి నువ్వే. మూడు శక్తులు నువ్వే.  బ్రహ్మా-విష్ణు-మహేశ్వరరూపం కూడా నువ్వే. ఓ దుర్గా నీకు నమస్సులని మొక్కుతారామెను. అంతటి మహిమాన్విత. దసరా శరన్నవరాత్రి రోజుల్లో దుర్గమ్మ ఒక్కో రోజు ఒక్కో అవతారమహిమ చూపుతుంది. స్త్రీ శక్తి నిదర్శనంగా నిలిచే ఆ తల్లి మహిమలు ఎలాంటివి?

ఒక్కో చోట ఒక్కో పేరు. ఒక్కో రూపం ఒక్కో శక్తి.. అందుకే ఆమెను అమ్మలగన్నయమ్మగా చెబుతారు. ముగరమ్మల మూలపుటమ్మగా కొలుస్తారు. ఈ సృష్టికి ఆధారం ఆ తల్లేనని భావిస్తారామె భక్తులు. ఈ శరన్నవరాత్రుల్లో దుర్గమ్మలో కనిపించే వివిధ రూపాలను చూపి పులకరించి పోతుంటారు భక్తులు. చిన్ని చిన్ని ఆడపిల్లల నుంచి అమ్మమ్మల వరకూ ప్రతి స్త్రీ మూర్తినీ గౌరవించి ఆదరించమని సూచిస్తాయా తల్లి అవతార మహిమలు. ఆమె నీ రక్షణలో కాదు.. నువ్వే ఆమె రక్షణలో బతుకుతున్నావని చెబుతాయా లీలలు.

దసరా వచ్చిందంటే కనకదుర్గమ్మ కోటి సూర్యకాంతులతో దర్శనమిస్తుంది. వివిధ అవతారాల్లో కరుణిస్తుంది. అర్ధం చేసుకోవాలేగానీ.. అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కో స్త్రీ సూక్తి విడమరచి చెబుతుంది.

తొలి రోజు కనకదుర్గమ్మ శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. బాలత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే అజ్ఞానం తొలగిపోతుందన్నది భక్తుల విశ్వాసం. బాలా అన్న శబ్ధానికి.. అన్నెం, పున్నెం ఎరుగని బాలికని అర్థం. చిన్న పిల్లల మనస్సు నిర్మలంగా ఉంటుంది. అటు వంటి హృదయాలలో పరమాత్మికత నివసిస్తుంది. కాబట్టి, మనం చిన్న పిల్లలలాగా నిర్మలంగా అమ్మవారిని ఆరాధించాలన్న అంతరార్ధం దాగి వుంటుందట ఈ అవతారంలో. అలాగే బాలా అంటే జ్ఞానమని కూడా అంటారు. బాలా స్వరూపమైన అమ్మవారిని ఎవరు అర్చిస్తారో వారికి జ్ఞానానందం కలుగుతుంది. కామక్రోధాలను జయించి ఆత్మానందాన్ని పొందుతారని తెలుస్తోంది. అందుకే నవరాత్రుల్లో ప్రధమ దినాన అమ్మవారిని బాలాత్రిపురసుందరీదేవిగా ఆరాధన చేసి అజ్ఞానాన్ని పారద్రోలడానికి ప్రయత్నించాలని చెబుతారు పండితులు. అంతే కాదు.. పిల్లల్లో తానుంటానని. వారి ఆయురారోగ్యాలను కాపాడే బాధ్యత ఎవరైతే చక్కగా తీసుకుంటారో.. వారే తనకు అత్యంత ఇష్టులని దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా కొలువుదీరి భక్తులకు సెలవిస్తుంది.

రెండవ రోజున కనకదుర్గమ్మ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది.  దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ... ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో కనిపిస్తుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులను కరుణిస్తుంది.  గాయత్రికి మించిన మంత్రము, అమ్మకు మించిన దైవమూ లేదని అంటారు. అను నిత్యం గాయిత్రి జపించే వారిని ఆమె సదా రక్షిస్తుందని నమ్ముతారు. అంతేకాదు ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపిణి. ఆమెలో ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలున్నాయి. ఇవి ఆమెలోని విశేషశక్తులకు ప్రతిరూపం. ఆమెలోని అపారమైన విద్యలకు సాక్ష్యాలు. కనుక స్త్రీలను గౌరవించడం వల్లే ఈ ప్రపంచం కాపాడబడుతుందని  గాయిత్రీ అవతారమహిమను భావించవచ్చు.

అమ్మవారు మూడో రోజు అన్నపూర్ణాదేవిగా కనిపిస్తుంది. సకల ప్రాణకోటికి ఆహారాన్ని అందించే జగన్మాత అన్నపూర్ణదేవి అవతారంలో ఓ చేతిలో మధురసాలతో ఉన్న మాణిక్య పాత్ర. మరో చేతిలో రతనాల గరిట పట్టుకుని భక్తులకు దర్శనమిస్తుంది. ఈ చరాచర సృష్టికి జీవనాధారం తానేనన్నది అమ్మవారి దర్శన అంతరార్ధం. మీకు మీ మీ ఇండ్లల్లో కడుపునిండా అన్నం పెట్టే ప్రతి తల్లిలో తానుంటాని దుర్గమ్మ సూచించడంగా  అర్ధం చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ కని పెంచి.. అన్నం పెట్టి.. సాకి సంతరించిన తల్లులను, వ్రుద్ధాశ్రమాల పాలు చేయకుండా గౌరవించడని సూచించే అలంకారం అన్నపూర్ణాదేవిది.

మూడు శక్తులు ఏకమైన తల్లి. ఐశ్వర్యం ఆమే.. విద్యాశక్తి ఆమే.. మహాశక్తి ఆమే. ఈ మొత్తం సృష్టి ఆమె సృజనే. ఆమె లేని లోకం చూడనవసరం లేదు. అసలా మాటకొస్తే మహిళలేని లోకమే లేదు. అన్నీ ఆ అభయ హస్తంలో దాగి వున్నాయని సూచించడానికి నిదర్శనాలు ఆమె అవతార మహిమలు. అమ్మవారు ఇంద్రికీలాద్రిపై వెలసి భక్తుల పాలిట కొంగుబంగారమై పూజలందుకుంటోంది. దసరా శరన్నవరాత్రులు కనకదుర్గమ్మ అపార మహిమలను చూపుతుంది. అనితర సాధ్యమైన ఎన్నో విషయాలు తనలో దాగి వున్నాయని సూచిస్తుందా తల్లి.

అందుకు నిదర్శనంగా నాలుగో రోజు దుర్గమ్మను లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు.
లక్ష్మీ, సరస్వతులు అమ్మవారికి ఇరువైపులా వింజామరలు వీస్తుండగా.. సదాశివుడ్ని తన ఆసనంగా మలుచుకుని.. కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తుందీ అవతారంలో.లలితా త్రిపుర సుందరి అంటే ఈ మొత్తం భూమండలానికీ ఆధారభూతమని అర్ధం. మనపై లాలిత్యంతో కూడిన అధికారం ఆమె సొంతం. అంతే కాదు విద్యకు ప్రతి రూపమైన సరస్వతి, ధనానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవి.. ఆమెకు ఇరువైపులా చేరి సేవించడంలో ఓ పరమార్ధముంది. విద్య-ధనం రెండూ స్త్రీ మూర్తి సేవ చేయడానికి ఉపయోగించాలని సూచిస్తాయి. ఎన్ని విద్యలొచ్చిన వారైనా.. ఎంత ధనవంతులైనా సరే.. ఆ విద్యాధనాలను మహిళాభ్యున్నతికి వినియోగించాలని సూచించే అలంకారమిది. అలా చేసినప్పుడు మాత్రమే వారి వారి కుటుంబాలు.. బలపడుతాయని అర్ధం చేసుకోవాలని అంటారు. ఇక ప్రకృతి- పురుషుడులో పురుషుడు కూడా ఆమె ఆధీనంలోనే ఉంటాడని. అలా వుండటమే ధర్మమని సూచిస్తుందీ అవతారం. విద్యా, ధన, పురుష శక్తులు ఆమె ఆధీనంలో వుండి.. ఆమె సేవలకు వినియోగించడంలోనే కుటుంబ వ్యవస్థకు మంచిదని సూచిస్తుంది లలితా త్రిపురసుందరి అలంకారం.

ఐదవరోజు అమ్మవారికి మహాలక్ష్మీ అలంకారం చేస్తారు. దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మలగన్న అమ్మగా ప్రసిద్ధి పొందిన దుర్గమ్మ.. మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి రూపాలతో కూడా నిత్యం పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మి అవతారంలో ఉన్న దుర్గమ్మను కొలిస్తే ఏ రకమైన ఈతి బాధలుండవని భక్తుల విశ్వాసం. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే సకలసంపదలు చేకూరుతాయన్న అపార నమ్మకం. ధనానికి అధిదేవత మహిళే. ఆమె ఇస్తున్న ధనమే ఇదంతా. అందుకే 'యత్రనార్యంతు పూజ్యంతే' అన్నా భాష్యం పుట్టిందని అంటారు. ఎక్కడ మహిళ గొప్పగా గౌరవించబడుతుందో అక్కడ సమస్త సంపదలుంటాయని సూచిస్తూ అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తుంది. అసలు స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలవడమే, సంపదలనిస్తుందని.. ఆమెను గౌరవించడంలోనే అష్టైశ్వర్యాలు దాగి వున్నాయని తెలుపుతూ కనకదుర్గమ్మ మహాలక్ష్మి అవతారంలో భక్తజనులకు దర్శనమిస్తుంది.

ఆరవ రోజు కనకదుర్గమ్మ జన్మనక్షత్రం సందర్భంగా  సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తుంది. వీణ చేతపట్టి, పుస్తకం ధరించిన రూపంతో సరస్వతీదేవిగా కనువిందు చేస్తుందీ రోజు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిగా, త్రిశక్తి స్వరూపిణియైన దుర్గాదేవి తన అంశంలోని నిజరూపాన్ని సాక్షాత్కరింపచేయడమే ఈ అలంకారం ప్రత్యేకతగా చెబుతారు. అజ్ఞానమే అసలు సిసలైన చీకటి. ఆ చీకటిని పారదోలడానికి విద్యాజ్ఞానం ఎంతో అవసరం. ఆ విద్యలన్నీ.. మహిళామూర్తిలో దాగి వుంటాయి. పుట్టినప్పుడు పాలివ్వడం నుంచి పెరిగి పెద్దయ్యి ప్రయోజకత్వం సాధించే వరకూ తల్లి నేర్పే విద్యలు అన్నిన్ని కావు. నిజమైన విద్యాస్వరూపం నీకు జన్మనిచ్చిన తల్లే.  నీ విజయంలో ప్రధాన భాగస్వామ్యం స్త్రీశక్తిదే. ఆమె నేర్పిన విద్యలే ఇవన్నీ. అలాంటి విద్యలకు అధిదేవత ఆమె. ఆమె దర్శనమాత్రం చేత.. అజ్ఞానం తొలిగిపోతుందని సూచిస్తుంది సరస్వతిదేవిగా కనిపించే కనకదుర్గ అవతారం.
నీకు వూపిరి పోసేది స్త్రీ.. నీకు పాలిచ్చి.. గోరుముద్దలు తినిపించి.. పెంచి పెద్ద చేసేది స్త్రీ.. నీకు పాపిడి తీసి బడికి పంపేది స్త్రీ.. నిన్ను ఇంతింతై వటుడింతై చేసేది స్త్రీ.. నీ విద్యా ఉద్యోగ వ్యాపారాభివృద్ధికి సహకరించేది స్త్రీ.. నీతో ఏడడుగులు నడిచేది స్త్రీ.. నీ వంశాకురాన్ని కని.. నీ చేతుల్లో పెట్టేది స్త్రీ.. వారిని తిరిగి లాలించి పాలించి పెంచి పెద్దవారిని చేసేది కూడా స్త్రీయే.. ఆఖరున నీతో కలసి నడిచేది స్త్రీ.. నీ ప్రారంభం.. ప్రారబ్ధం రెండూ స్త్రీ చేతిలోనే ఉంటాయి.. అలాంటి స్త్రీ శక్తి కి చిహ్నమైన దసరా ఉత్సవ సమయంలో తెలుసుకోవల్సిన సారం ఇంకెంతో ఉంది..
దసరా ఆరు రోజులు ఒకెత్తు. మిగిలిన మూడు రోజులు ఒకెత్తు. కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిలో వెలసినందుకు ప్రతీకగా జరిగే వుత్సవాలు ఈరోజునే జరుగుతాయి. ఆమెలోని అనితరసాధ్యమైన శక్తియుక్తులు దర్శనమిచ్చేది ఈ మూడు అవతారాల్లోనే. దుర్గమ్మను ఎదురిస్తే ఎంతటి మహిషాసురుడికైనా మరణమేనని సూచిస్తుంది. మహిషాసురుడిని అంతమొందించే సమయంలో దుర్గాదేవి అవతారం అత్యంత ప్రధానమైంది. శరన్నవరాత్రుల్లో అష్టమి నాడు దుర్గామాత అవతారంతో మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసినందుకు గుర్తుగా దర్శనమిస్తుంది. ఆ రోజు అమ్మవారికి దుర్గాదేవి అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహిస్తారు.  దీన్నే దుర్గాష్టమి పర్వదినంగా పాటిస్తారు. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచిదని చెబుతారు. అలాగే ఉత్తరగోగ్రహణం యుద్ధంలో అర్జనుడు జమ్మి చెట్టు మీది ఆయుధాలను పూజించి విజయం సాధించింది ఈ పర్వదినంలోనే అన్నది ఇతిహాసం. అమ్మవారిని దుర్గాదేవిగా చూపడంలో అంతరార్ధం.. ఆమె దుష్టశక్తిని గుర్తించిందంటే ఇక ఆ దుర్మార్గుడి ఆయువు మూడినట్టేనని అర్ధం. మహిళల శక్తియుక్తులు తెలీక స్వైరవిహారం చేసే వారికి చరమగీతం తప్పదని సూచిస్తుంది దుర్గామాత అలంకారం.

దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపం మహిషాసుర మర్ధినీ దేవి. ఆశ్వయుజ  శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా మహర్నవమిని భక్తులు మహోత్సవంగా జరుపుకుంటారు. సింహ వాహనం అధీష్ఠించి.. ఆయుధాలను ధరించి.. అమ్మ సకల దేవతాంశాలతో మహాశక్తి రూపంలో దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడ్ని సంహరించిన శక్తి స్వరూపాన్ని మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయాలు తొలగిపోతాయని నమ్ముతారు.. సకల విజయములు కలుగుతాయని విశ్వసిస్తారు. మహిషాసుర మర్ధినీ దేవిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితమని చెబుతారు. మహిళలను గౌరవించడం అంటే సమస్తమైన శుభాలను ఆహ్వానించడమని చెబుతుందీ అలంకారం. ఆమెను అబలగా అనుకుని పొరబడ్డావో.. మహిషాసురుడికి పట్టిన గతే పడుతుందని  సూచిస్తుంది మహిషాసుర మర్ధిని అలంకారం.

రాజరాజేశ్వరీ దేవి అలంకారం. రాజరాజేశ్వరీ దేవి కమలంపై ఆసీనురాలై ఉంటుంది. చేతిలో చెరకుగడతో.. భక్తులకు అభయమిస్తూ కనిపిస్తుంది. రాజరాజేశ్వరీదేవిని అపరాజితాదేవిగానూ పిలుస్తారు. ఆమెకే విజయ అని మరో పేరు. మణిద్వీపంలో శ్రీనగరంలోని చింతామణి ఆమె నివాసం. విజయాదేవి చెడుపై సాధించిన విజయమే విజయదశమి అయ్యిందట. ఈ అలంకారంలోని అంతరార్ధమిదే. ఏ విషయంలోనైనా విజయం సాధించాలంటే మహిళ తోడ్పాటు ఎంతో అవసరమని సూచించే అలంకారమిది. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ అండదండలు ఉంటాయన్న మాట ఊరకే పుట్టలేదు. అమ్మవారి మహిమల వల్లే ఈ మాటకు ప్రాణమొచ్చింది. నిజజీవితంలోనూ అంతే.. మహిళా శక్తి సాయం లేకుండా ఏ పురుషుడూ మనుగడ సాధించడం కష్టం. అందుకే స్త్రీశక్తికి గుర్తుగా దసరాను చేసుకోమని చెబుతాయి అమ్మవారి అలంకారాలన్నీ.

ఆమే మనకు ఆధారం. ఆమెను గౌరవించడంలోనే సమస్తమైన విజయాలు దాగి వుంటాయి. సుఖసంతోషాలు దొరుకుతాయి. ఆమె పట్ల దురాచారం.. సర్వమానవాళికి చేజేతులా కలిగించే నష్టం. కనకదుర్గను కొలవడం.. ఆమె అవతారమహిమలను తెలుసుకోవడం అంటే, మన చుట్టూ ఉండే మహిళలను తగిన రీతిన గౌరవంచడాన్ని సూచిస్తుంది.

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి - తెలుగు శాల సౌజన్యంతో 

9, డిసెంబర్ 2018, ఆదివారం

నెలసరి, స్త్రీలలో హార్మోన్ల పాత్ర ఎటువంటిది ? - Strilu Hormones - Women and Hormonesనెలసరి, స్త్రీలలో హార్మోన్ల పాత్ర ఎటువంటిది ? - Strilu Hormones - Women and Hormones

ప్రశ్న: నా వయసు ముప్ఫై. నెలసరి రెణ్నెల్లకోసారి వస్తోంది. వైద్యుల్ని సంప్రదిస్తే.. హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓఎస్‌ అంటూ మందులు సూచించారు. ఏమిటీ పరిస్థితి? అసలు హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏయే సమస్యలు తలెత్తుతాయి?హార్మోన్ల పనితీరు అంత కీలకమా?.
- ఓ సోదరి

జవాబు: స్త్రీ శరీరంలో మెరుగైన పునరుత్పత్తి వ్యవస్థకు హార్మోన్ల పాత్ర కీలకమైంది. వాటి సమతుల్యత ఏ మాత్రం లోపించినా సమస్యలు తప్పవు. పునరుత్పత్తి వ్యవస్థకు సందేశాలు అందించడంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌, తక్కువ మోతాదులో ఉండే టెస్టోస్టెరాన్‌ (పురుష హార్మోను) కాకుండా లుటైనిజింగ్‌ (ఎల్‌హెచ్‌), ఫాలికల్‌ స్టిమ్యులేటింగ్‌ (ఎఫ్‌ఎస్‌హెచ్‌), గోనాడోట్రోఫిన్‌ రిలీజింగ్‌ (జీఎన్‌ఆర్‌హెచ్‌) అనే ఆరు హార్మోన్లు ముఖ్యమైనవి. అవి సక్రమంగా సాగినంత కాలం సమస్యలు రావు. రుతుక్రమం సజావుగా సాగుతుంది. సమతుల్యత లోపించినప్పుడే సమస్యలు మొదలవుతాయి. మీ విషయంలో ఇదే జరిగింది. నెలసరి సక్రమంగా రాకపోవడానికీ హార్మోన్ల పని తీరే కారణం.

నెలసరి ఆలస్యం..
అండాశయాల్లోని హార్మోన్లలో మార్పు చోటు చేసుకొని, ఫలితంగా పురుష హార్మోనుగా పరిగణించే టెస్టోస్టెరోన్‌ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి కావడం వల్ల నెలసరి సక్రమంగా రాదు. పీసీఓఎస్‌ (పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌)గా పేర్కొనే ఈ పరిస్థితి వల్ల ప్రతినెలా అండం సక్రమంగా విడుదల కాదు. కొందరిలో అండాలే విడుదల కావు. అందుకే నెలసరి రావడంలో ఆలస్యం. ఒకవేళ వచ్చినా రక్తస్రావం సక్రమంగా కాకపోవడం వంటి సమస్యలుంటాయి. ఇదే కొనసాగితే, సంతానసాఫల్య సమస్యలు, అవాంఛిత రోమాలు, మొటిమలూ బాధిస్తాయి. ఈ సమస్యతో బాధపడే ప్రతి పదిమందిలో నలుగురు అధిక బరువు పెరుగుతారని ఓ అధ్యయనం తెలిపింది. సమస్యను నివారించకపోతే మధుమేహం, అధిక రక్తపోటు వంటివీ తప్పవు. అలాగే నెలసరి సక్రమంగా రాకపోయినా, ఆగిపోయినా గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వైద్యులు సూచించిన మందులు వాడుతూ, జీవనవిధానంలో మార్పులు చేసుకుంటే ఈ సమస్యను చాలామటుకు అదుపులో ఉంచవచ్చు.

Women and Hormones

శారీరక, మానసిక సమస్యలు..
హార్మోన్లలో చోటు చేసుకునే తేడా వల్ల ఎదురయ్యే మరో సమస్య ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎమ్మెస్‌). దాదాపు తొంభై శాతం మహిళలకు ఎదురయ్యే సమస్యే ఇది. నెలసరికి రెండు వారాల ముందు నుంచి చిరాకు, ఒత్తిడి, ఆందోళన, ఉద్వేగాలకు లోనవడం, అలసట, తలనొప్పి, ఆకలి లేకపోవడం, రొమ్ముల్లో నొప్పి.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవి అందరిలో ఒకేలా ఉండవు. నెలసరి వచ్చి ఆగిపోయాక లక్షణాలు అదుపులోకి వస్తాయి. హార్మోన్ల ప్రభావం జుత్తు, చర్మంపైనా ఉంటుంది. నెలసరి సమయంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్ల పనితీరులో తేడా వల్లే ఈ పరిస్థితి. అధిక బరువున్న వారు, వ్యాయామం సరిగా చేయనివారు, బీఎంఐ ఎక్కువగా ఉన్నవారిలో ఇది మరింత అధికం. జీవన శైలిలో మార్పులు చేసుకుంటే.. సమస్య అదుపులోకి వస్తుంది.

మెనోపాజ్‌ ఇబ్బందులు..
హార్మోన్ల తేడా వల్ల చోటుచేసుకునే మరో మార్పు మెనోపాజ్‌. ఈ దశలో నెలసరి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అండాశయాలు ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్లను చాలా తక్కువగా ఉత్పత్తి చేయడమే అందుక్కారణం. తరచూ హార్మోన్ల స్థాయులు మారుతుండటం వల్ల నెలసరి ఓ పద్ధతి ప్రకారం రాదు. ఈ మార్పు నలభైల్లో మొదలై నెమ్మదిగా కొనసాగి, చివరకు రుతుచక్రం ఆగిపోతుంది. ఈ సమయంలో హాట్‌ఫ్లషెస్‌, దాంతో అధిక స్వేదం... రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, జననేంద్రియాల దగ్గర పొర పొడిబారి పలచగా మారడం, కలయిక అసౌకర్యం, మానసిక స్థితిలో తేడాలు, అధికబరువు వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని అదుపులో ఉంచేందుకు వైద్యులు హార్మోన్లను సిఫారసు చేస్తారు. అవి ఈస్ట్రోజెన్‌కు ప్రత్యామ్నాయం. అలా వాడే అన్నిరకాల మందుల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోను తప్పనిసరిగా ఉంటుంది. ఇవి చాలారకాల్లో లభిస్తాయి. వాటి వల్ల కొంత మార్పు ఉన్నా.. గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం ఎక్కువ. అందుకే వైద్యులు ఈస్ట్రోజెన్‌తోపాటు ప్రొజెస్టెరాన్‌ను కూడా కలిపి సిఫారసు చేస్తారు. హిస్ట్రెరెక్టమీ చేయించుకుంటే.. ఇతర ప్రత్యామ్నాయాల్ని సూచిస్తారు.

హార్మోన్లలో తేడా చోటుచేసుకోకుండా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలికి, సమతులాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పంచదార, కెఫీన్‌, కొవ్వు ఆధారిత పదార్థాల్ని తగ్గించాలి. పండ్లు, కూరగాయల మోతాదును పెంచాలి. వ్యాయామం చేయడం, బరువుని అదుపులో ఉంచుకోవడం అన్నివిధాలా మేలు.  -డాక్టర్‌ ప్రణతీరెడ్డి, యూరో గైనకాలజిస్టు

హెచ్చరిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

ఎంతటి వారైనా... అమ్మకు కొడుకే - Yenta Varalaina Amma ku Koduke

ఎంతటి వారైనా... అమ్మకు కొడుకే - Yenta Varalaina Amma ku Koduke
అమ్మ ప్రత్యక్ష దైవం. జగద్గురువైన ఆదిశంకరులు సైతం అమ్మ మాటకు కట్టుబడి ఉన్నారు. తల్లి అవసాన దశలో తప్పక వస్తానని మాటిచ్చిన శంకరులు.. యతిగా ఉన్నా.. ఆర్యాంబకు అంత్యేష్ఠి సంస్కారాలు నిర్వహించారు. ఆధునిక భారతంలో పరమయోగిగా భాసిల్లిన రమణ మహర్షి సైతం అమ్మ దగ్గరకు వచ్చేసరికి మామూలు మనిషైపోయారు.

ఐహిక విషయాలను విసర్జించి రమణులు కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి.. అరుణాచలం వచ్చేశారు. రమణుల జాడ తెలిసిన బాబాయి నెల్లియప్ప అయ్యర్‌ అరుణాచలం వచ్చారు. ఇంటికి రావాలని కోరగా.. స్వామి స్పందించలేదు. ఇదే విషయాన్ని నెల్లియప్ప.. రమణుల తల్లి అళగమ్మకు తెలియజేశారు. కొడుకుపై అవ్యాజమైన ప్రేమ కలిగిన ఆ మాతృమూర్తి.. నిమిషం నిలువక అరుణాచలం చేరుకుంది. తనతో పాటు ఇంటికి రావాల్సిందిగా రమణులను కోరింది. అప్పుడూ స్వామి మౌనాన్ని ఆశ్రయించారు. తల్లికి ఒక కాగితంపై.. ‘కర్త వారి ప్రారబ్ధానుసారం జీవులను ఆడించును. జరగనిది ఎవరెంత ప్రయత్నించినా జరగదు. జరిగేది ఎవరెంత అడ్డుపెట్టినా జరగక మానదు. ఇది సత్యం. కనుక మౌనంగా ఉండటమే ఉత్తమం’ అని రాసిచ్చారు. ఆ సమాధానం చదివి బరువెక్కిన గుండెతో ఆ తల్లి వెనుదిరిగింది.

ఆ తర్వాత చాలాసార్లు రమణుల దగ్గరికి ఆ తల్లి వస్తూ, పోతూ ఉండేది. ఓసారి అళగమ్మకు తీవ్రమైన జ్వరం వచ్చింది. తల్లికి రమణులు ఎన్నో సపర్యలు చేశారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మనామదురైకి తిరిగి వెళ్లారు. 1916లో తిరువణ్ణామలై వచ్చిన ఆమె.. రమణుల వద్దనే స్థిరపడాలని నిశ్చయించారు. తర్వాత నాలుగేళ్లకు అళగమ్మ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. రమణులు కంటి మీద కునుకు లేకుండా తల్లికి సేవలు చేస్తూ గడిపారు. స్వామి ఆజ్ఞ చేస్తే చాలు.. ఆ తల్లికి సేవ చేయడానికి ఎందరో సిద్ధంగా ఉన్నారు. అయినా.. తల్లికి రమణులే సపర్యలు చేశారు. అమ్మకు వేదాంత సారాన్ని బోధిస్తూ ఉండేవారు. చివరగా.. రమణుల కుడిచేతిని ఆమె హృదయంపైన.. ఎడమచేతిని శిరస్సుపైన ఉంచి.. తదేక దృష్టితో తల్లిని వీక్షిస్తూ.. ముక్తిని ప్రసాదించారు. ఏ స్థాయి వ్యక్తులైనా.. తల్లికి కొడుకులేనని.. తల్లికి సేవ చేయడం కొడుకుల బాధ్యత అని జగతికి చాటారు రమణులు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

ప్రతి స్త్రీ లో మనం అమ్మ ను చూడాలి, ఎలా ? Prati Strilo Manam Ammanu Chudali

ప్రతి స్త్రీ లో మనం అమ్మ ను చూడాలి, ఎలా ? Prati Strilo Manam Ammanu Chudali

ఆడవారిని మన సమాజము ఏ యే దశలలో ఏ విధంగా గౌరవించాలి పూజించాలి?
యత్ర నార్యోస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
కావున ఆడవారిని మన సమాజము ఏ యే దశలలో ఏ విధంగా గౌరవించాలి పూజించాలి. ప్రతి స్త్రీ లో మనం అమ్మ ను చూడాలి అంటారు పెద్దవాళ్లు .శాస్త్రాలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. మరి మహిళలను అమ్మ గా చూడాలి అన్నారు.

అది ఎలా??? అమ్మ అంటే ఆ జగన్మాత అయినటువంటి ఆది పరాశక్తి ని చూడాలి అని అర్థము . అది ఎట్లా చూడాలి.మనుష్యులము అయినవంటి మనము మన బుధ్ధితో జ్ఞానముతో అమ్మవారి స్వరూపాన్ని చూడటుము ఎలా సాధ్యము అవుతుంది?ఈ అంశము పై చాలా కాలము పరిశోధన చేసిన పెద్దలు అందించిన విజ్ఞానాన్ని సేకరించి పోస్ట్ చేస్తున్నాను ఆచరించండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి.

అమ్మవారి 9 రూపములలో స్త్రీ యొక్క పరిపూర్ణ జీవన విధానము మనకు ప్రతిబింబిస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది అంటే..
 1. స్త్రీ యొక్క జననము అమ్మవారి మొదటి స్వరూపము (బాలా) .పేరు శైలపుత్రీ దుర్గ.
 2. కౌమార దశ అనగా విద్య ఇతరత్రా అన్నీ నేర్చుకుంటూ చిన్న పిల్లలు చేసే అల్లరి చేయడము రెండవ స్వరూపము పేరు (బ్రహ్మచారణీ దుర్గ) 
 3. వివాహానికి పూర్వము చంద్రుడి తో సమానమైనటువంటి కళలు కలిగి ప్రశాంతమయిన ముఖవర్చస్సు కలిగి ఉండటం మూడవ స్వరూపము .పేరు(చంద్ర ఘంటా దుర్గ) 
 4. కొత్త జీవికి జన్మనివ్వడము కోసము గర్భధారణ చేయడమనేది నాల్గవ స్వరూపము.పేరు(కూష్మాండా దుర్గ) 
 5. సంతాన ప్రాప్తి తరువాత తన పిల్లలను చూసుకునే క్రమము ఐదవ స్వరూపము.పేరు( స్కందమాత దుర్గ) 
 6. తన జీవితములో జరిగే అనేక సంఘటనలు చూస్తూ దైవాన్ని సాధన చేస్తూ జీవించే పధ్ధతి ఆరవ స్వరూపము.పేరు(కాత్యాయని దుర్గ) 
 7. తన సంకల్పము చే భర్త యొక్క అకాల మృత్యువును కూడా జయించేటప్పుడు తన ఏడవ స్వరూపము .పేరు(కాళరాత్రి దుర్గ) 
 8. తన వారికి మరియు కుటుంబానికీ తన ద్వారా ఉపకారము చేస్తూ ఉండేది ఎనిమిదవ స్వరూపము.పేరు (మహాగౌరీ దుర్గ ) 
 9. భూమిని విడిచి పెట్టి స్వర్గ ప్రయాణము చేసే ముందు తన సంతానానికి సిధ్ధి(( సమస్త-- సుఖ సంపదలు)) కలగాలని ఆశీర్వాదము ఇచ్చే క్రమములో తన తొమ్మిదవ స్వరూపము.పేరు( సిధ్ధిధాత్రీ దుర్గ) అందుకే స్త్రీ ని గౌరవించాలి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

21, ఏప్రిల్ 2018, శనివారం

పురుషుడు భార్యని ఎలా గురవించాలి - Purushudu bharyani yela gauravinchali - How to give respect women

పురుషుడు భార్యని ఎలా గురవించాలి - Purushudu bharyani yela gauravinchali - How to give respect women
స్త్రీ వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తవారింట్లొ అడుగుపెడుతుంది. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను, బంధువులను అందరిని విడచి వివాహము చెసుకొన్న భర్తపై నమ్మకంతో అత్తవారింట్లొకి అడుగుపెడుతుంది. భర్త ,భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకొంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్నీ, సంతానాన్నీ, ధనాన్నీ, కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహుతురాలిగా, మంత్రిగా, వీటన్నింటికి మిoచి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుది.
 • అందువలన భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు.
 • భార్య వడ్డించిన పదార్ధాలను తినకుండా విమర్శించరాదు.
 • ఇంటిని భార్య జైలులా భావించే పరిస్తితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బైటికి తీసుకెళ్ళాలి.
 • పిల్లలతొ సరళ సంభాషణలు చేయాలి.
 • పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు.
 • ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి.
 • భార్యకి ఎంతో కొంత ఆర్ధిక స్వేచ్హ ఇవ్వాలి.
 • ఆమె అభిప్రాయలను గౌరవించాలి.
 • భార్యను పరులముందు అవమానించే విధంగా ప్రవర్తించరాదు.
 • భార్యను ఇంటి యజమానిరాలుగా చూడాలి గాని, అనుమానించే వ్యక్తిగా చూడగూడదు.
 • భర్త తను తుదిశ్వాస వదిలేవరకు, భార్యను కంటికి రెప్పలాగ, సంతొషంలోనూ, బాధలలోను చేదొడువాదోడుగా ఉండాలి.
 • భర్త తను మరణించిన తరువాత గూడ, భార్య ఇతరుల మీద ఆధారపడకుండ, కష్ఠాలు పడకుండా ముందు జాగ్రతలు తీసుకొని ఆమెకు తగిన భద్రత మరియు జీవనోపాది కొరకు తగిన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయలి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

8, ఏప్రిల్ 2018, ఆదివారం

స్త్రీ రజస్వల అగుట - శుభ మరియు అశుభ ఫలితములు? - Stri Rajaswalaguta

/stri-rajaswala-ante-ardham-girl-becoem-Menarche
 రజస్వల..!!🍁

రజోదర్శనము అనగా స్త్రీ రజస్వల అగుట. ప్రధమ రజోదర్శనమునకు వాడుకలో సమర్థ, పుష్పవతి, పెద్దమనిషి అయినదని కూడా అంటారు. నెల నెల రజోదర్శనమును బహిష్టు అంటారు.

ప్రధమ రజస్వల ప్రాతః కాలము నుంచి మధ్యాహ్నము లోపు అయిన శుభము. మిగిలిన కాలము అశుభము.

రజస్వలకు దుష్ట తిధులు:
 • అమావాస్య,
 • ఉభయ పాడ్యమిలు,
 • షష్టి,
 • అష్టమి,
 • ద్వాదశి తిదుల యందును
 • పరిఘ యోగముల పూర్వార్ధమునందును,
 • వ్యతీపాత,
 • వైధృతి యోగములందును,
 • సంధ్యా కాలమునందును,
 • ఉప్పెన, భూకంప మొదలైన ఉపద్రవ కాలమందును
 • భద్ర కరణము నందును
 • మొదటిసారి రజస్వల అయిన శుభకరము కాదు.
/stri-rajaswala-ante-ardham-girl-becoem-Menarche
వారఫలము:.
సోమ, బుధ, గురు, శుక్ర వారములందు ప్రధమ రజస్వల అయిన శుభ ఫలము, ఆది, మంగళ, శని వారములందు అశుభ ఫలము కలుగుతుంది.

శుభ నక్షత్రములు: ✶
 1. అశ్విని,
 2. రోహిణి, 
 3. మృగశిర, 
 4. పుష్యమి, 
 5. ఉత్తర, 
 6. హస్త, 
 7. చిత్త, 
 8. స్వాతి, 
 9. విశాఖ, 
 10. అనూరాధ, 
 11. మూల, 
 12. ఉత్తరాషాఢ ,
 13. శ్రవణం, 
 14. ధనిష్ఠ, 
 15. శతభిషం, 
 16. ఉత్తరాభాద్ర, 
 17. రేవతి 
యీ నక్షత్రములందు ప్రధమ రజస్వల అయిన సౌభాగ్యము, సౌఖ్యము, సంతానము, ఆయువు, ధనము కలుగుతుంది.

మిగిలిన నక్షత్రములు అశుభ ఫలములు ఇచ్చును. కావున శాంతి చేయాలి. రజస్వల కాకుండానే వివాహాలు జరిపించే పూర్వపు రోజుల ప్రకారము భర్త యొక్క జన్మ నక్షత్రము నాడు హాని అని చెప్పబడినది.

దుష్ట నక్షత్రములందు ప్రధమముగా రజస్వల అయినపుడు హోమయుక్తమైన శాంతి జరిపించి దానాదులు నిర్వహించి తిరిగి షుహ నక్షత్రములో రజోదర్శనమైన తదుపరి శుభ ముహూర్త కాలమందు గర్భాదానము చేయాలి. ఆ విధంగా చేసిన యెడల సంతాన ప్రాప్తి కలుగుతుంది మరియు..
గ్రహణ సమయములందు,
సంక్రాంతి యందు,
అశుభమైన నిద్రా సమయములందు,
అర్ధరాత్రి యందు
ప్రధమ రజస్వల అయినచో యుక్తమైన శాంతులు నిర్వహించాలి.

శుభ తిధులు: 
తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిధులు శుభము.

లగ్న గ్రహ ఫలము:
ప్రదమ రజోదర్శన సమయమున..
కేంద్ర, కోణ, లాభ స్థానములందు శుభ గ్రహములు, తృతీయ, షష్ట లాభ స్థానములందు క్రూర గ్రహములు శుభ ఫలములిస్తాయి.
చంద్రుడు అష్టమ స్థానమునందు వుండిన పతి నాశనము కలుగజేస్తాడు. కాని చంద్ర తారాబలములు సంపన్నమైనపుదు పుత్ర, ధన సంపత్తులు కలుగుతాయి. కుజుడైనను లేక చంద్రుడైనను లగ్నమునకు 3, 6, 10 స్తానములన్డున్నచో సంపంన్నులగు కుమారులు కలుగుతారు.

నక్షత్ర గ్రహ ఫలము:
రజస్వలా సమయ నక్షత్రమందు గురుడుగాని, శనిగాని వున్నాను, యే గ్రహము లేకున్నను శుభము. రజస్వలా సమయ నక్షత్రము నందు కుజుడున్నను బుధ శుక్రులు కలిసి వున్నను, రవి వున్నను రాహు కేతువులున్నను అశుభము.

రజోదర్శన స్థాన ఫలితము:
తన యింటి యందును,
గొడ్డల చావిడియందును,
స్వగ్రామ మధ్యమందు,
జల సమీపమున,
ఇంటి ఆవరణ మధ్య..
ప్రధమ రజస్వల అయిన శుభము. గ్రామము బయట, ఇతర గ్రామములందు, నగ్నముగా వున్నపుడు ఇతరుల యిండ్లలోను ప్రదమ రజస్వల అయిన అశుభము.

వేళా విశేషములు:
 • ప్రాతః కాలం..చిర సౌభాగ్యం,
 • ఉషః కాలం..సౌభాగ్యలోపం,
 • పూర్వాహ్నం..పుణ్య క్షేత్ర దర్శనం,
 • మధ్యాహ్నం..ధనవతి, పుత్రవతి,
 • సాయంత్రం..జారగుణం,
 • సంధ్యలందు..చెడుప్రవర్తన కలది,
 • అర్ధరాత్రి..బాల వైధవ్యం కలుగును.
రాత్రి వేళ నిర్ణయం:
రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడు భాగాలుగా చేసి రెండు భాగముల కాలము పూర్వదినము, మూడవ భాగకాలమున తదుపరి దినమునకు చెందుతుంది.

వస్త్రఫలము:
 • తెల్లబట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి,
 • గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి యగును,
 • నూతన వస్త్రము ధరించగానే శుభ సంపన్నురాలగును, చిరిగిన బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును,
 • యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధి గ్రస్తురాలగును,
 • నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.
రజస్వలా శుద్ధి:
రజోవతి అయిన స్త్రీ..
మొదటి దినమునందు చండాల స్త్రీ సమానురాలు, రెండవ దినమందు పతితురాలితో సమానురాలు, మూడవ దినమునందు చాకలి స్త్రీతో సమానము, నాలుగవ దినమున కూడా శూద్ర స్త్రీ సమానురాలు, అయిదవ దినమందు దేవ పితృ కార్యములందు పరిశుద్దురాలూ అన్నారు.

నాలుగవ దినమందు స్నాముచేత శుచి కాగలదు. బహిష్టు అయిన స్త్రీ మూడు రోజుల తరువాత శుద్ధి అవుతుంది. తిరిగి మళ్ళీ పంతొమ్మిది రోజులలో బహిష్టు అయిన ఒక దినముతో శుద్ధి అట్లుగాక ఇరవై రోజుల అనంతరము ఎప్పుడైనా బహిష్టు అయిన మూడు రోజుల తరువాత శుద్ధి అగును.

ప్రధమ రజస్వల అయిన కన్యకు అక్షతలు తలపై వేసి ఆసనమేసి కూర్చుండ బెట్టాలి. దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసినులకు శ్రీ గంధము, పుష్పములను,తాంబూలములను లవణము, పెసలు మొదలగునవి ఇవ్వాలి.

ప్రధమ రజస్వల అయిన వస్త్రముతోనే మూడు రోజులు ఉంచాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్త గా, ప్రశాంతముగా, ఉండునట్లు చూడాలి. భోజన విషయంలో పులగము, నెయ్యి, పాలు వంటి సాత్విక ఆహారము ఉప్పు, పులుపు, కారము లేకుండా ఇచ్చుట మంచిది, నాలుగవ రోజు స్నానము చేయించి నూతన వస్త్రములు కట్టించాలి.

సర్వ ఋతువులకు సాధారణ నియమములు:.💐
మూడు దినములు ఎవరిని తాకకూడదు. అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట , అగ్ని ముట్టుట, ప్రాసనము, సూర్యావలోకనము, భూమిపై గీతాలు గీయుట చేయుట చేయకూడదు. క్రింద పడుకోవాలి, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించరాదు. ఇవన్నీ ఆరోగ్యము కొరకు పాటించే నియమములు..

సర్వే జనా సుఖినో భవంతు..!!


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి