Page Nav

HIDE

Grid

HIDE_BLOG

శివశక్తి - ఆధ్యాత్మిక చైతన్య వేదిక, శివశక్తి బుక్స్ ఇప్పుడు ఇంగ్లీష్ లో లభ్యం కాబోతున్నాయి - Shakti books ippudu anglamulo english versions

శివశక్తి కార్యకర్తలకు, అభిమానులకు , హిందూ బంధువులందరికి శివశక్తి నుంచి ముఖ్య ప్రకటన. క్రైస్తవ మతమార్పిడి పై శివశక్తి చేస్తున్న సైద్ధా...

శివశక్తి - ఆధ్యాత్మిక చైతన్య వేదిక, శివశక్తి బుక్స్ ఇప్పుడు ఇంగ్లీష్ లో లభ్యం కాబోతున్నాయి - Shakti books ippudu anglamulo english versions

శివశక్తి కార్యకర్తలకు, అభిమానులకు , హిందూ బంధువులందరికి శివశక్తి నుంచి ముఖ్య ప్రకటన.

క్రైస్తవ మతమార్పిడి పై శివశక్తి చేస్తున్న సైద్ధాంతిక పోరాటం మీకు అందరికీ తెలిసిందే. హిందూ సనాతన ధార్మిక గ్రంధాలను వక్రీకరించడం, హిందూ దేవీ దేవతలను దూషించడం, హిందువుల విశ్వాసాలను దెబ్బ తీసేవిధంగా మాట్లాడటం నిత్యం పాస్టర్ లు చేస్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం. మతమార్పిడి పెరిగి వారి సంఖ్యా బలం పెరిగితే ప్రత్యక్ష దాడులు కూడా చేయడానికి ఈ మిషనరీ మాఫియా వ్యవస్థ వెనుకాడటం లేదు.

నిరంతర హిందూ చైతన్యం, హిందూ సంఘటన తో పాటు సిద్ధాంత పరమైన పోరాటం కూడా ఎంతో అవసరం. దీనిలో భాగంగా బైబిల్ల్ మీద పాస్టర్లతో డెబిట్ లు , బైబిల్ మీద పుస్తకాలు మ తమార్పిడి అవగాహన పై లఘు చిత్రాలు నిర్మించడం జరిగింది.

శివశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్ సుగ్గున రచించిన బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు, లోకమెరుగని ఏసు మరో రూపం అనే పుస్తకాలు, మతమార్పిడి మాఫియా గుండెల్లో ఎంత ఆందోళన కలిగించాయో, వాటికి సమాదానాలు చెప్పలేక ఎంతమంది పాస్టర్లు తోక ముడిచారో, ఈ పుస్తకాలను ఒక చేత పట్టుకుని ఎంతో మంది హిందువులు తమ ఇళ్ళకి వచ్చిన మతమార్పిడి పాస్టర్ లను తరిమేశారో , సమాజం పై ఈ పుస్తకాలు ఎంత ప్రభావం చూయించాయో మీ అందరికి తెలిసిందే.

బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలు పుస్తకం లక్ష కాపీలు , లోకమెరుగని ఏసు మరో రూపం పుస్తక కాపీలు 50 వేలు ముద్రిస్తే ఇప్పటికే లక్షా 20 వేల కాపీల వరకు ప్రజల్లోకి వెళ్లి రెండు రాష్ట్రాలలో ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాస్టర్ గుండెల్లో గునపాలు గా దిగుతూనే ఉన్నాయి. అంతే కాదు ఈ రెండు పుస్తకాలలో ఏమైనా తప్పులు ఉన్నాయని నిరూపించినా, బైబిల్ లో లేనివి ఇందులో జోడించి వక్రీకరించి రాశామని నిరుపించిన పాస్టర్ లకు, బైబిల్ స్కాలర్లకు 10 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా ఇస్తామని బహిరంగ ప్రకటన కూడా శివశక్తి నుండి విడుదల చేయడం జరిగింది. పదిలక్షల రూపాయలకు ఆశపడి వందల మంది పాస్టర్ లు ఈ పుస్తకాలు కొన్నా ధైర్యం చేసి ఈ పుస్తకాల మీద చర్చించడానికి ఏ పాస్టర్ ముందుకు రాలేకపోయాడు.

ఈ పుస్తకం లోని విషయాలు అన్ని భాషల్లోకి వెళ్లాలని గత రెండు సంవత్సరాలు గా చాలా మంది కోరుతూనే ఉన్నారు అందులో ఆస్ట్రేలియా నుండి రాజేష్ గారు , బెంగుళూరు రవిశంకర్ గారు , హైదరాబాద్ బాజీ రావు గారు దీనిని ఆంగ్లం లోకి అనువదించి, మార్పులు చేర్పులు చేసి ఆంగ్లం లో ముద్రించమని కూడా కోరారు.

కానీ అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళవలసిన పుస్తకాలు కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా ఉండేవిధంగా ప్రొఫెషనల్ గా ట్రాన్స్లేట్ చేయడానికి దానిని మంచి క్వాలిటీ తో ప్రింట్ చేయించటానికి , అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుని విడుదల చేయాలనే ఉదేశ్యంతో ఇన్నాళ్లు ఆగడం జరిగింది. దానికి ఆర్ధిక తోడ్పాటు కూడా అవసరం అవుతుంది.

ఇక ఎట్టకేలకు కాస్త నమ్మకస్థులు, ప్రపంచం లోని చాలా బాషలలో ట్రాన్స్లేట్ చేయగలిగిన కంపెనీ తో పరిచయం ఏర్పడటంతో వారితో కలిసి ఈ ప్రాజెక్టు ను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మొదట ఆంగ్లం లోకి అనువందించి తరవాత తమిళ, హిందీ భాషల్లోకి అనువదించాలి అనుకుంటున్నాము. ముందుగా పూణేలో ప్రస్థిద్ధ శైవ క్షేత్రం శ్రీ మురుడేశ్వరుడి పాదాల చెంత పూజ చేయించి మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు కి మీ అందరి ఆశీర్వాదాలతో పాటు సహాయ సహకారాలు కూడా అందిస్తారని కోరుకుంటున్నాం.

శివశక్తి - ఆధ్యాత్మిక చైతన్య వేదిక:
To know more:
  • Facebook Page: https://www.facebook.com/BharathaShivashakthi/
  • YouTube/shivashakthi
  • Twitter@shivashakthiorg
  • www.Shivashakthi.org
  • Call: 8886600412
  • WhatsApp: 9381625183