వరంగల్ లో గుర్తు తెలియని వ్యక్తులచే హనుమాన్ విగ్రహం ధ్వంసం - Shri Hanuman’s temple vandalized by a group of people in Karimabad, Warangal.రంగల్, కరీమాబాద్ శ్రీ శివలింగేశ్వర దేవాలయంలోని హనుమాన్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

శనివారం ఉదయం ఆలయానికి వెళ్ళిన భక్తులు ఈ విషయాన్ని గమనించి స్థానిక బజరంగ్ దళ్ నాయకులకు తెలియజేశారు. వెంటనే స్థానికులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి హనుమాన్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తులపై వెంటనే చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. అనంతరం వారు రాస్తారోకో చేశారు. పోలీసులు 103 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు.


వరంగల్ పట్టణంలో గత సంవత్సరం సాయిబాబా మందిరం పూజారి హత్య, రంగనాథస్వామి దేవాలయంలో విగ్రహాల ధ్వంసం మరువకముందే శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరగడంతో హిందువులందరూ ఆందోళన చెందుతున్నారు.హనుమాన్ విగ్రహ ధ్వంసం చేసిన నిందితులను పట్టుకొని చట్టరీత్యా శిక్షించాలని బజరంగ్ దళ్ నేత నిఖిల్ ఒక ప్రకటనలో కోరారు.


మూలము: విశ్వ సంవాద కేంద్ర

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top