వాస్తు: ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం - Vaastu, Prachina Bharathiya NivaaSa Sastramuవాస్తు: ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం - Vaastu, Prachina Bharathiya NivaaSa Sastramu
వాస్తు అనగా దేవతలు మానవులు నివాసమునకు అనువైన ప్రదేశం  అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. భారతీయులు, చైనీయులు తమ ఇంటి నిర్మాణాల్లో పాటిస్తారు.

వాస్తు పూజ పై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం:

వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి:
 • 1. భూమి వాస్తు.
 • 2. హర్మ్య వాస్తు
 • 3. శయనాసన వాస్తు.
 • 4. యాన వాస్తు.
వాస్తు శాస్త్రంలోని నిర్మాణ వ్యవస్థలో ప్రధాన వస్తువులు పంచ భూతాలైన:
 • 1. భూమి
 • 2. జలం
 • 3. అగ్ని
 • 4. వాయు
 • 5. ఆకాశం
వాస్తు పురుష మండలాలు:
ఎనిమిది దిక్కులకు పరిపాలించే అష్టదిక్పాలకులు ప్రధాన మండలాధిపతులు:
 • 1. ఈశాన్యము – ఈశానుడు
 • 2. తూర్పు – ఇంద్రుడు-
 • 3. ఆగ్నేయము – అగ్ని
 • 4. దక్షిణం – యముడు
 • 5. నైఋతి – పిత్రు/నైరుత్య,
 • 6. పడమర – వరుణుడు
 • 7. వాయువ్యం – వాయు
 • 8. ఉత్తరము – కుబేరుడు
 • 🟒కేంద్రము – బ్రహ్మ
వాస్తు: ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం - Vaastu, Prachina Bharathiya NivaaSa Sastramu
వాస్తు పురుషుని జన్మించు విదానం
వాస్తు శాస్త్ర పురాణం : 
పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి ‘ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు.

ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది.

అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు:
 •  1. శిరస్సున – శిఖి(ఈశ)
 •  2. దక్షిణ నేత్రమున – సర్జన్య
 •  3. వామనేత్రమున – దితి
 •  4. దక్షిణ శోత్రమున – జయంతి
 •  5. వామ శోత్రమున – జయంతి
 •  6. ఉరస్సున (వక్షమున) – ఇంద్ర, అపవత్స, అప, సర్ప
 •  7. దక్షిణ స్తనమున – అర్యమా
 •  8. వామ స్తనమున – పృధ్వీధర
 •  9. దక్షిణ భుజమున – ఆదిత్య
 • 10. వామ భుజమున – సోమ
 • 11. దక్షిణ బాహువున – సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా
 • 12. వామ బాహువున – పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట
 • 13. దక్షిణ పార్శ్వమున – వితధి, గృహక్షత
 • 14. వామ పార్శ్వకామున – అసుర, శేష
 • 15. ఉదరమున – వినస్వాన్, మిత్ర
 • 16. దక్షిణ ఊరువున – యమ
 • 17. వామ ఊరువున – వరుణ
 • 18. గుహ్యమున – ఇంద్ర జయ
 • 19. దక్షిణ జంఘమున – గంధర్వ
 • 20. వామ జంఘమున – పుష్పదంత
 • 21. దక్షిణ జానువున – భృంగరాజ
 • 22. వామ జానువున – సుగ్రీవ
 • 23. దక్షిణ స్పిచి – మృగబు
 • 24. వామ స్పిచి – దౌవారిక
 • 25. పాదములయందు – పితృగణము
ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే ‘వాస్తు పురుషుడు’గా సృష్టి గావించాడు.

భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. దీనిప్రకారం ఏయే దిక్కులు మంచి ఫలితాలను అందిస్తాయంటే …
 • 🝒  తూర్పు - గృహంలో శాంతి, ఆరోగ్యం, సంపద చేకూరటం,
 • 🝒  పడమర - సంతానాభివృద్ది, స్వచ్ఛత, అభివృధ్ది,
 • 🝒  ఉత్తరం - వ్యాపార అభివృద్ది, మంచి భవిష్యత్తు,
 • 🝒  దక్షిణం - అదృష్టం, వినోదం, కీర్తి,
 • 🝒  వాయువ్యం - తండ్రికి మంచి అభివృధ్ది సూచకాలు, అధిక ప్రయాణాలు,
 • 🝒  నైఋతి - తల్లికి సౌఖ్యం,వివాహ సఫలం,
 • 🝒  ఈశాన్యం - వృత్తి పరమైన అభివృద్ధి,
 • 🝒  ఆగ్నేయం - అదృష్టం,
వాస్తు ప్రకారం స్థలాన్ని కొనటం ఎలా?
ఇంటి నిర్మాణంలో స్థల ఎంపిక చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇంటి స్థలాన్ని వాస్తురీత్యా ఎంపిక చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు దరిచేరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. స్థల ఎంపికలో ఏదేని లోపముండినట్లైతే అశుభ ఫలితాలు, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన యజమానులకు అశాంతి కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయని వారు చెబుతున్నారు.

ఇకపోతే వాస్తు ప్రకారం ఎటువంటి స్థలాన్ని కొనకూడదు:
 • 🝒 ఈశాన్యము తగ్గిన స్థలములను కొనకూడదు. ఇటువంటి స్థలాల్లో నివసించేవారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వంశావృద్ధి క్షీణిస్తుంది. సమాజ గౌరవాన్ని కోల్పోవటం జరుగుతుంది.
 • 🝒 స్థలానికి తూర్పు, ఉత్తర దిక్కులలో వేరే వారి స్థలాలు ఉంటే వారి స్థలాల నుండి మన స్థలంలోకి పారకుండా విధంగా చూసుకోవాలి. ఇలా ఇతరుల స్థలం మన స్థలంలోకి పారే విధంగా ఉంటే ఇటువంటి స్థలం నివసించటానికి మంచిది కాదు.
 • 🝒 రెండు విశాలమైన స్థలముల మధ్య నున్న ఇరుకైన స్థలాన్ని కొనకూడదు. దీనివలన మనశ్శాంతి ఉండదు. ఎన్నో ఒత్తిడిలకు లోనవుతారు.
ఇలాంటి స్థలాల్నికొనాలి:
 • 🝒 ఆగ్నేయంగా ఉండి తూర్పు, ఈశాన్యం పెరిగి ఉంటే ఆ స్థలాన్ని కొనటం శుభఫలాన్నిస్తుంది. యజమానికి పేరు ప్రతిష్టలు, సంతానం, మంచి అభివృద్ధిలోకి వస్తారు.
 • 🝒 ఉత్తర - ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కొంటే అన్నీ విధాల మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యాభివృద్ధిని కలుగ జేస్తుంది. ఆ ఇంట స్త్రీలకు సుఖ సంతోషాలకు లోటుండదు. 
 • 🝒 తూర్పు - ఈశాన్యం, ఉత్తరం -ఈశాన్యం పెరిగిన స్థలాలను కొనటం ద్వారా మంచి సంపదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 
 • 🝒 కుటుంబం సుఖ సంతోషాలతో సాగుతుందని వాస్తు చెబుతోంది.
వాస్తు ప్రకారం సింహద్వార గేట్ల అమరిక:
ఆగ్నేయ స్థలంలో తూర్పు సింహద్వార గృహం కట్టడం శ్రేయస్కరమని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు. కాబట్టి ప్రహరీ గేట్లు కూడా తూర్పు ఈశాన్యం, తూర్పు ఉచ్ఛంలో పెట్టుకోవడం మంచిదని వారు పేర్కొంటున్నారు. దక్షిణ స్థలంలో గేటు దక్షిణ స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు ఉన్న స్థలంలో సింహద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.
 • 🝒 తూర్పు దిశన రెండు గేట్లు పెట్టాలను కుంటే తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు, ఉత్తరం ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.
 • 🝒 నైరుతి స్థలంలో గేటు నైరుతిస్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణ లేదా పశ్చిమ దిశలలో ఏదో ఒక దిశకు మాత్రమే సింహద్వారం, ఇతర వాస్తు విషయాలు దృష్టిలో పెట్టుకుని గేటు పెట్టాలి. దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యంలో గేటు పెట్టాలి.
 • 🝒 ఉత్తర దిశను ఉత్తర ఉచ్ఛం ఈశాన్యం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోవాలి. విశాలమైన ఆవరణ కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.
 • 🝒 అలాగే.. వాయువ్య స్థలంలో గేటు వాయువ్య స్థలంలో నిర్మించిన గృహంలో అవసరాన్ని, సింహ ద్వారాన్ని బట్టి రెండు వైపులకు లేదా కేవలం ఒకవైపుకు పెట్టుకోవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు.
రచన: శ్రీ డబ్బీరు వెంకటేశ్వర రావు, MA(Vastu & Astrology), విశాఖపట్నం
సంప్రదించండి: 9704840400

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top