నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label వాస్తు శాస్త్రం. Show all posts
Showing posts with label వాస్తు శాస్త్రం. Show all posts

Thursday, June 4, 2020

వర్షాకాలంలో చిక్కులు లేకుండా వాస్తుతో గృహ నిర్మాణము - Vastu


వర్షాకాలంలో చిక్కులు లేకుండా వాస్తుతో గృహ నిర్మాణము - Vastu
వర్షంతో చిక్కులు లేకుండా చూసుకోండి, శ్లాబులు, ట్యాంకుల వాస్తు జాగ్రత్తలు, పరిష్కారాలు

వానాకాలం వచ్చిందంటే నీటి సమస్య తీరిపోతుంది. కానీ ఇంట్లో కొత్త సమస్య మొదలవుతుంది. కొన్ని ఇళ్ల శ్లాబుల నుంచి బొట్లుబొట్లుగా కారుతుంటుంది. గోడలు చెమ్మగిల్లి రంగు వెలిసిపోయి వికారంగా మారడం.. డ్రైనేజీ సమస్యలు వంటివి ఉంటాయి. నిజానికి ఇంటి నిర్మాణ సమయంలోనే నీటి ప్రవాహం, ట్యాంకుల నిర్మాణానికి సంబంధించి అటు వాస్తు విషయంలోనూ, ఇటు నిర్మాణశాస్త్ర పరంగానూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.
 • ➣ సాధారణంగా తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణ దిశల అభిముఖంగా ఇళ్లను నిర్మిస్తారు. నీటి ప్రవాహం మాత్రం ఈశాన్య దిక్కుకే ఉండేలా చూసుకుంటారు. తూర్పు దిశగా ఇంటిని నిర్మించే వారు నీటి వాటం తూర్పు ఈశాన్యం వైపు.. ఉత్తరదిశ ఇంటి వారు ఉత్తర ఈశాన్యం.. పడమర దిశ ఇంటివారు పడమర వాయవ్యం, దక్షిణ దిక్కు ఇంటి వారు దక్షిణ ఆగ్నేయం మూల నుంచి వర్షపు నీరు, డ్రైనేజీలైను ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం. నీటి ట్యాంకు నిర్మాణం ఎటువైపు ఉండాలన్నదీ ముఖ్యమే. ఈశాన్య దిశలో వీటి నిర్మాణం నిషిద్ధం. నైరుతి, దక్షిణ, పడమర దిక్కుల్లో ఏర్పాటు అనుకూలమే.
 • ➣ నీళ్ల ట్యాంకును శ్లాబుకు కనీసం అడుగున్నర ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం అనుకూలం. శ్లాబుకు ఆనుకొని ఏర్పాటుచేస్తే లీకేజీ ప్రమాదం ఉంటుంది. తర్వాత శ్లాబు బలహీనమవుతుంది.
 • ➣ శ్లాబుపై చెత్తా చెదారం లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.
 • ➣ నీళ్ల ట్యాంకు చుట్టూ పేరుకుపోయిన మట్టి, చెత్త, పిచ్చి మొక్కలను తీసేయాలి. శ్లాబుపై పడిన నీరు లైన్‌ పైపుల నుంచి వెళ్లేలా చూసుకోవాలి.
 • ➣ పైపులలో చేరిన చెత్త, కాగితాలను శుభ్రం చేయాలి. పగలిన పైపులు మార్చుకోవాలి. జాయింట్ల వద్ద సరిచేసుకోవడం అవసరం. లైన్‌ పైపుల వెనక నీరు కారి నాచు ఏర్పడుతుంది. ఆ భాగమంతా నల్లగా చూసేందుకు అసహ్యంగా కన్పిస్తుంది. వీటిని ఎప్పటికప్పుడు బాగు చేయించుకోవాలి.
 • ➣ గోడలకు పగుళ్లు ఉంటే పిచ్చి మొక్కలు పెరుగుతాయి. వాటిని వేళ్లతో సహా తీసేసి మరమ్మతు చేసుకోవాలి.
 • ➣ వంటగది నుంచి బయటకు కడిగిన నీరు వెళ్లే పైపులో కూరగాయల వ్యర్థాలు, అన్నం మెతుకులు అడ్డుపడి సాఫీగా పోదు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసి అవసరమైతే తగిన మరమ్మతులు చేయించుకోవడం ఉత్తమం.
 • ➣ స్నానాల గదుల నుంచి బయటకు వెళ్లే పైపులలో షాంపూ కవర్లు అడ్డుపడి నీరుపోదు. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి.
 • ➣ ఇంటి బయట రోడ్డుపైన ఉన్న మ్యాన్‌హోల్స్‌ పైపులు కూడా మనవంతుగా చూసుకోవడం మంచిది. వాటిలో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే కష్ట
భూగర్భ జలాలు పెరిగేలా
 • ➣ వాననీటిని సంరక్షించుకుంటేనే భూగర్భ జలాలు పెరిగి వేసవిలో కొరత ఉండకుండా చూసుకోవచ్చు. దీనికోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. వీటిని ఎలా ఏర్పాటుచేసుకోవాలన్నదీ కీలకమే.
 • ➣ ఇంకుడు గుంతలు బోరు బావికి దగ్గరగా ఉండడం మంచిది. ఇల్లు నిర్మాణం ప్రారంభించేటప్పుడే ప్రణాళికాబద్ధంగా తూర్పు వైపుగాని ఉత్తరం దిశలో గాని వీటిని ఏర్పాటు చేసుకోవాలి. శాస్త్ర రీత్యా ఏ ఇంటికైనా తూర్పు, ఉత్తర దిశలలో ఎక్కువ స్థలం వదులుతారు. కాబట్టి రెండు విధాలా ప్రయోజనకరమే.
 • ➣ తూర్పు, ఉత్తర దిక్కులలో నీరు పడనప్పుడు ఇంకుడుగుంతల ఏర్పాటులో మార్పులు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో సమస్యలు కొద్దికాలం తర్వాత వస్తుంటాయి. ముందే జాగ్రత్తలవసరం. ఇంటి నిర్మాణం గురించి అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, వాస్తునిపుణుల సలహాలు తీసుకోవాలి.

సంకలనం: వెంకు ఈనాడు - 80084 55788

Sunday, May 24, 2020

వాస్తు శాస్త్ర పురాణం - Vastu Shastra Puranam

వాస్తు శాస్త్ర పురాణం

పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సమ్రక్షణార్ధం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు.

ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి 'ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు.

బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముకంగా క్రిందకు పడవేశారు ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది.

అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు:
 • ➣ శిరస్సు - శిఖి (ఈశ )
 • ➣ దుక్షిణ నేత్రమున - సర్జన్య
 • ➣ వామనేత్రమున - దితి
 • ➣ దక్షిణ నోత్రమున - సర్జస్య
 • ➣ వామనేత్రమున - దితి
 • ➣ దక్షిణ శోత్రమున - జయంతి
 • ➣ వామ శోత్రమున - జయంతి
 • ➣ ఉగస్సున (పక్షమున) - ఇంద్ర అపవత్స. అప, సర్ప
 • ➣ దక్షిన స్తనమున - అర్యమా 
 • ➣ వామ స్తనమున - పృద్వీదర
 • ➣ దక్షిణ భుజమున - ఆదిత్య
 • ➣ వామ భుజమున - సోమ
 • ➣ దక్షిణ బాహువున - సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా
 • ➣ వామ బాహువున - పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట
 • ➣ దక్షిణ పార్శ్వకామున - వితధి, గృహక్షత
 • ➣ వామ పార్శ్వ కామున - అసుర శేష
 • ➣ ఉదరమున - వినస్వాన్, మిత్ర
 • ➣ దక్షిణ ఊరువున - యమ.
 • ➣ వామ ఊరువున - వరుణ
 • ➣ గుహ్యమున - ఇంద్ర జయ
 • ➣ దక్షిణ జంఘమున - గంధర్వ
 • ➣ వామ జంఘమున - పుష్పదంత
 • ➣ దక్షిణ జానువున - భృంగరాజ
 • ➣ వామ జానువున - సుగ్రీవ
 • ➣ దక్షిణ స్పీచి - మృగబు
 • ➣ వామ స్పీచి - దౌవారిక
 • ➣ పాదములయందు - పితృగణము
ఇంతమంది దేవతల తేజస్పముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే 'వాస్తు పురుషుడూ గా సృష్టిగావించాడు.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

Saturday, May 16, 2020

గృహములో పూజ గది - Gruhamu, Poojagadi

ఇంట్లో పూజ గది ఎటు ఉండాలి?

ఎంత లేనివాళ్ల‌యినా.. ఎంత చిన్న ఇల్ల‌యినా పూజ కోసం కొంత భాగాన్ని కేటాయించ‌డం హిందూ సంప్ర‌దాయం. చివ‌ర‌కు గూట్లో అయినా ఓ ప‌టాన్ని ఉంచి చిన్న దీపాన్ని వెలిగించాల‌నే చూస్తారు ఎవ‌రైనా. ఎవరి స్తోమ‌తును బట్టి వారు దేవుడికి అలమరాలలో ఒక అరగాని, ప్రత్యేకించి ఒక మందిరంగాని లేదా ప్రత్యేకంగా ఒక గదినిగాని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇల్లు స‌ర్వ హంగుల‌తో అల‌రారాలంటే ఇంట్లో దేవుడికి ప్ర‌త్యేకంగా గ‌ది ఉండాల్సిందే. అలాగే ఇంట్లో ఎక్కడ వీలు దొరికితే అక్కడ దేవుడి గదిని ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడి గది కోసం కూడా వాస్తును పాటించాల్సిందే.

ఇంట్లో సానుకూల శ‌క్తిని పెంచ‌డానికి, ప్ర‌తికూల శ‌క్తిని తొల‌గించ‌డానికి పూజగ‌ది.. పూజా కార్య‌క్ర‌మాలు ఉపక‌రిస్తాయ‌ని పెద్ద‌లు చెబుతారు. పూజ గది విష‌యంలో దాని మూలకాలు, శక్తిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈ గ‌ది నిర్మాణానికి కొన్ని సూత్రాల‌ను రూపొందించారు పెద్ద‌లు. వాటిని అనుస‌రించ‌డం వల్ల ఆ ఇంట్లో సానుకూల‌ శక్తి పెరిగి అందులో నివ‌సించేవారికి మంచి ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయ‌ని, మాన‌సిక ప్ర‌శాంత‌త చేకూరుతుంద‌ని.. దైవానుగ్ర‌హంతో ప‌రిపూర్ణ ఆనందం, అదృష్టం ల‌భిస్తాయ‌ని చెబుతారు.

దాదాపుగా ప్రతి కుటుంబానికీ మూల దైవం ఒకరు ఉంటారు. వారికి సంబంధించిన విగ్రహాలనో, చిత్ర ప‌టాల‌నో పెట్టి ప్రార్థన చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకునే వారు గతంలో. ప్రస్తుతం నగరాలలోని ఇరుకు జీవ‌నాల్లో దేవుడికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడం పెద్ద స‌మ‌స్యే. అపార్ట్‌మెంట్ల‌లో అయితే మ‌రీ క‌ష్టం. 1200 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం ఉండే ఫ్లాటులో కూడా పూజ‌కు ప్రత్యేక గ‌దిని కేటాయించ‌లేని ప‌రిస్థితి. ఇక్క‌డ‌ ఇంకో ప్ర‌ధాన కార‌ణం ఉంది. సాధార‌ణంగా బిల్డ‌ర్లు ఏ ఒక్క వ‌ర్గం వారినో దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయ‌రు క‌నుక పూజ‌గ‌దిపై ప్ర‌తే్య‌కంగా దృష్టిపెట్ట‌రు. ఒక‌వేళ నిర్మాణద‌శ‌లోనే కొనుక్కునేవారు.. ప్ర‌త్యేక అభిరుచి ఉన్న‌వారు మాత్రం చిన్న‌దైనా పూజ‌గ‌ది కావాల‌ని కోరుతుంటారు. ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలనే అనుకునేవారు..
దేవుని గది - pooja gadi 
వాస్తు ప్రకారం పూజ గదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎలా చేయాలి? అనే అంశాల‌ను ప‌రిశీలిద్దాం..
 • ➣ పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశాన్యం లేదా తూర్పు లేదా ఉత్తరం దిక్కున ఏర్పాటు చేసుకోవ‌డం మంచిద‌ని పెద్ద‌లు చెబుతారు. దీనికి కారణం ఉద‌యాన్నే సూర్యుడు తూర్పున ఉద‌యిస్తాడు క‌నుక‌.. ఇంటికి ఈశాన్య దిక్కున సూర్య‌కిర‌ణాలు ప్ర‌స‌రిస్తాయి క‌నుక‌ ఈ సమయంలో యోగ, ధాన్యం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగుతాయ‌నేది ఇందులోని ప్రాథ‌మి సూత్రం. సూర్యుడి లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కనుక పూజ గదికి ఈశాన్య దిక్కును ఎంచుకోవడం మం చిది.
 • ➣ రెండు అంత‌స్తుల ఇల్ల‌యితే పూజ గదిని ఎప్పుడూ కింది భాగంలోనే ఏర్పాటు చేయాలి. అలాగ‌ని సెల్లార్ లేదా బేస్‌మెంట్‌లో పెట్టుకోకూడదు. ఎందుకంటే అక్క‌డికి వెలుతురు ప్రసరించదు క‌నుక‌. సూర్యుడి తొలి కిరణాల వల్ల లబ్ధి పొందలేరు. అలాగే పూజ గదిని పైఅంతస్తుల్లో ఏర్పాటుచేసుకోవ‌డం కూడా మంచిదికాదు. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండాలి. ఇంట్లో పెద్ద వారు, కదలలేని వారు ఉంటే ఇది సమస్య అవుతుంది.
 • ➣ ఒకవేళ పూజగది ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇదే చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరదు కనుక ఇది ఉత్తమ పద్ధతి.
 • ➣ పూజా మందిరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పడకగదులలో ఏర్పాటు చేసుకోకూడదు. అలాగే బాత్‌రూంకు సమీపంలోనూ ఏర్పాటుచేసుకోకూడ‌దు. కొంత‌మంది స్థ‌లం స‌ర్దుబాటు కోసం టాయిలెట్ పక్కన పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. అది చాలాతప్పు. పవిత్రమైన ప్రార్థినా మందిరం దగ్గర బాత్రూం ఉండటం అనారోగ్యకరం. టాయిలెట్‌ లేదా బాత్‌రూమ్ వంటివి వ్యతిరేక శక్తిని (నెగెటివ్ ప‌వ‌ర్స్‌) ఉత్పత్తి చేస్తుంటాయి. వాటిలోంచి దుర్వాస‌న వ్యాపిస్తుంటుంది. బాత్‌రూమ్, టాయిలెట్ లేదా సామానుల గది పక్కన కాకుండా మ‌రెక్కడైనా పూజ గది ఉండవచ్చు. బహుళ అంతస్తుల‌ భవంతిలో ఫ్లాట్లు కొనేట‌ప్పుడు పై పోర్ష‌న్‌లో ఉండే బాత్‌రూమ్‌లు, టాయిలెట్‌లకు దిగువన మ‌న పూజ‌గ‌ది రాకుండా చూసుకోవాలి.
 • ➣ పూజగదిలో దేవుడికి దీపాలు వెలిగించ‌డం, ర‌క‌ర‌కాల సువాస‌న‌లు వెద‌జ‌ల్లే ప‌రిమ‌ళ‌భ‌రిత‌మైన‌ పువ్వులను అర్పించ‌డం, కర్పూరం, అగరవత్తులు వెలిగించి, మంత్రోచ్ఛారణ చేయడం వల్ల పూజ గది నుంచి సానుకూల శక్తి వెలువడుతుంటుంది. దేవతా ప్రతిమలను పూజగదిలో ఉంచి, పువ్వులు, ప‌త్రిని స‌మ‌ర్పించ‌డం.. జ‌లాలు, సుగంధ ద్ర‌వ్యాలు, పంచామృతాల‌తో అభిషేకం చేయడం వ‌ల‌న అక్క‌డ పాజిటివ్ ఎన‌ర్జీ (సానుకూల శ‌క్తి) పుడుతుంది. ఇది ఇల్లంత‌టికీ వ్యాపిస్తుంది.
 • ➣ పూజగదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటే విగ్రహాలను ఎటు పెట్టుకోవాలన్నది చాలామంది సందేహం. విగ్రహాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కున పెట్టుకోవచ్చు. దీనికి కారణం ఉదయం సూర్య కిరణాలు ఈశాన్య, తూర్పు దిక్కుల‌ నుంచి ప్రసరిస్తాయి, సాయం వేళల్లో పడమర నుంచి ప్రసరిస్తాయి. కనుక ఇవి వి గ్రహాల మీద పడి మరింత భక్తి భావనను కలిగిస్తాయి. విగ్రహాలను ఉత్తర దిక్కు పెట్టకూడదు. ఆ దిక్కున పెడితే ప్రార్థించేవారు దక్షిణ ముఖంగా కూర్చోవలసి వస్తుంది. అలా కూర్చున్నప్పుడు వారి పాదాలు దక్షిణ దిక్కుకు, తల ఉత్తరం దిక్కుకు ఉంటాయి. దీనివల్ల శరీరంలోని ఉత్తర మూలమైన తల భూమి నుంచి వచ్చే అయ‌స్కాంత ఉత్తర ధృవాన్ని వికర్షిస్తాయి. అలాగే దేవుడి గదిలో విరిగిన విగ్రహాలు, ప‌గిలిన ప‌టాలు లేదా చిరిగిపోయిన బొమ్మలను పెట్టుకోకూడదు. ఇందుకు కారణం దానిని చూస్తూ దేవుడి మీద మనసును లగ్నం చేయలేం. అలాగే విగ్రహాలు ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు. ఎందుకంటే మనం విగ్రహాలను చూసి పూజించాలి తప్ప అవి ఒకదానిని ఒకటి చూసుకోరాదు.
 •  గోడకు అంగుళం దూరంలో విగ్రహాలు పెట్టాలి. దీని వెనుక ఉన్న కారణం గాలి, అగరువ‌త్తుల పొగ వంటివన్నీ చుట్టుకోకుండా సులభంగా పారడానికే. దేవుడి ముందు దీపా లు వెలిగించేటప్పుడు వాటిని విగ్రహం ముందే పెట్టాలి. అసలు దీపం పెట్టడమే వెలుగు కోసం కనుక విగ్రహం ముందు పెడితే అవి మరింత మెరుగ్గా కనిపిస్తాయి. నైవేద్యం పెట్టేటప్పుడు దానిని విగ్రహం ఎదురుగా పెట్టాలి తప్ప మన ఎదురుగా ఉంచుకోకూడదు. పూజ సామ‌గ్రిని గదిలో ఆగ్నేయ దిక్కున భద్రపరచాలి. అవి విగ్రహాలకు, మనం కూచోవడానికి అడ్డం లేకుండా ఉంటాయ‌నేది దీని వెనుక ఉన్న శాస్ర్తీయ కారణం. అంతే కాదు, సూర్య కిరణాలు సవ్యంగా ప్రసరించకుండా అడ్డం ఉండవు.
 • ➣ ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయవ్యాలలో దేవుడిగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతి ఆగ్నేయ గదులు మాత్రం దేవుడి గదులుగా చేయకండి. ప్రత్యేకించి దేవుడిగదిని ఏర్పాటు చేయటం అనుకూలం కాని పక్షంలో గృహములో ఏ గదిలోనైనా సరే (నైరుతి, ఆగ్నేయ, గదులలో అయిన సరే) అలమారలలోగాని, పీటమీదగాని దేవుడి పటాలు, ప్రతిమలు వుంచుకొని పూజించవచ్చు.
 • ➣ దేవుడి చిత్ర పటాలను ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమ నైరుతిలలో పీట వేసిగాని, ఏదైనా మంచి వ‌స్త్రం వేసి గాని దానిపై పటాలు, ప్రతిమలు ఉంచి పూజించుకోవ‌చ్చు. పటాలు, ప్రతిమలు తూర్పు, ఉత్తరాలకు దేవుడు అభిముఖంగా వుండాలని కొంద‌రు, పూజించేవారి ముఖం తూర్పు, ఉత్తరాలకు అభిముఖంగా ఉండాలని మరికొందరు చెబుతుంటారు. మీరు ఏ వైపున‌కు అభిముఖంగా ఉన్నా అది వాస్తుతో కాకుండా మనలోని భక్తికి సంబంధించినదనే చెప్పాలి. అయితే ధ్యానం చేసే అలవాటు ఉంటే తూర్పున‌కు అభిముఖంగా కూర్చుని చేయటం ఉత్తమం.
 •  పూజ గదిలో అరుగులు నిర్మించి దానిపై దేవుని పటాలను వుంచి పూజ చేసుకోవడం చాలా ఇళ్లల్లో అలవాటుగా వుంది. పూజ పటాలను అరుగులపై వుంచే కన్నా, కొయ్యపీట, మండపంలో ఉంచుకోవడం మంచిది. అరుగు మీద లేదా నేల మీద పటాలు వుంచినప్పుడు నేలపై కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి దానిపై పటాలను ఏర్పాటు చేయాలి. వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. చాప కాని, వస్త్రం కాని వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి. పూజామంద‌రంలో నిత్య దీపారాధన ఎంతో శుభకరం.
దేవుని గది - pooja gadi
దేవుని గది - pooja gadi 

దేవుని గది.. కొన్ని జాగ్రత్తలు

 • ➣ మరో ముఖ్య విషయం ఏమిటంటే.. పూజ గదికి ఎటువైపు కూడా అనుకుని బాత్ రూమ్ లేదా టాయిలెట్సు ఉండకూడదు. ఇదే విధంగా పూజ గది పైనగాని, కింద గాని టాయిలెట్సు, వుండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి పొరపాటు చేయకూడదు. వీటి విషయంలో అపార్ట్ మెంట్ లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు అపార్ట్ మెంట్స్ లో ఒకరి పూజ గది పైన ఇతరుల టాయిలెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు.
 • ➣ అలాగే పూజ గది మీద 'లో-రూఫ్' వేసి అనవసరమైన వ‌స్తువుల్ని అక్క‌డ‌ దాస్తుంటారు. ఇలా చేయకూడదు.
 • ➣ మరణించిన తాత ముత్తాతల ఫోటోలు పూజ గదిలో పెట్టడం సరికాదు. చాలామంది పెద్దల ప‌ట్ల‌ గౌరవం చూపిస్తున్నామని భావిస్తుంటారు. పెద్దల విషయంలో మనకున్న గౌరవానికి గాను వారి ఫోటోలకు ప్రత్యేకంగా వుండాలేగాని, పూజ గదిలో దేవుడి ఫోటోలతో సమానంగా వుంచడం శుభకరమైన విధానం కాదు. కానీ అవి మన దృష్టిని, ఆలోచనలను మరల్చడమే కాదు బాధాకరమైన జ్ఞాపకాలు వ‌స్తే ఏకాగ్ర‌త దెబ్బ‌తింటుంది.
 • ➣ ఇళ్ల‌లోని పూజామందిరాల్లో పూజించే దేవ‌తామూర్తుల విగ్ర‌హాలు ఎప్పుడూ మరీ పెద్ద‌విగా ఉండ‌కూడ‌దు. సాధార‌ణంగా అంగుష్ఠ ప్ర‌మాణంలో (బొట‌న వేలెడంత‌) మాత్ర‌మే ఉండాల‌ని బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావుగారితో స‌హా ఎంతోమంది పెద్ద‌లు చెబుతుంటారు. ఇంట్లో ఉండే విగ్ర‌హాలు పెద్ద‌విగా ఉంటే వాటికి మామూలుగా ఇంట్లో చేసుకునే పూజ స‌రిపోదు. విశేష పూజ‌లు, నైవేద్యాలు స‌మ‌ర్పించాలి.
 • ➣ పూజామందిరంలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను దాచడం సరికాదు. ఈ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఆ గదికి ఎప్పుడూ రెండు తలుపులు ఉన్న ద్వారాన్నే ఎంచుకోవాలి. ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి. లోప‌ల‌ లేత రంగులే వేయాలి. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి పెట్టడం సులువవుతుంది.
 • ➣ పటాలను గోడకు వేలాడ‌దీయదలిస్తే దక్షిణ, పశ్చిమ గోడలకు పెట్టుకోవాలి. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమగోడలలో గల అలమారలో కూడా దేవుణ్ణి వుంచవచ్చు.
కొన్ని ముఖ్యాంశాలు:
 • 1. పుజ కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించండి . 
 • 2. లేదంటే శుచి, శుభ్ర‌త ఉండే గ‌దిలో తూర్పు ముఖంగా దేవుని విగ్రహాలను ప్రతిష్ఠించాలి.
 • ౩. సాధారణంగా మన ఇళ్లలో ఓ పెద్ద తప్పు చేస్తుంటారు. సెలవులకు ఊరెళుతున్నాం కదా అని దేవుని గ‌దికి తాళం వేసేస్తుంటారు. అలా చేయడం వల్ల దేవుడిని మనం ఇంట్లోకి రాకుండా ఆపినట్లు అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
 • 4. ఇంట్లో వారానికోసారి మాత్ర‌మే పూజ చేస్తుంటారు కొంద‌రు. అప్పుడే దేవుడి గది శుభ్రం చేస్తారు. అలా కాకుండా రోజు వారి దినచర్యలో భాగంగా దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి.
 • 5. దేవ‌త‌ల చిత్రాల‌ను పెట్టుకుంటే వీలైనంత వ‌ర‌కు సీతారాములు, పార్వ‌తీ ప‌ర‌శ‌మేశ్వ‌రులు, ల‌క్ష్మీ నారాయ‌ణ‌లు.. ఇలా దంపతులు ఫోటోలు ఉంచుకోవ‌డం మంచిది.
 • 6. దేవతలకు అధిపతులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి ప్ర‌తిమ‌లను (ఇప్పుడైతే ఫొటోలు) పూజామందిరంలో తప్పనిసరిగా ప్రతిష్ఠించాలని సహస్త్రపురాణం చెబుతోంది.
 • 7. దేవుడి గదిలో ఎన్నివిగ్రహాలైన పెట్టుకోవచ్చు. కాని వాటికి నిత్య ధూప దీప నైవేద్యాల‌కు లోటు రాకుండా చూసుకోవ‌డం ఉత్త‌మం.
 • 8. వీలైనంత వ‌ర‌కు వంట‌గ‌దిలో పూజామందిరాన్ని పెట్టకూడదు. ఎందుకంటే వంటగది ఎప్పుడూ చిందరవందరగా ఉంటుంది. ఒక‌వేళ మ‌రెక్క‌డా కుద‌ర‌ని ప‌క్షంలో వంట‌గ‌దినే పరిశుభ్రంగా ఉంచుకొని దైవారాధ‌న చేయాలి.
 • 9. మన ఇంటి దేవుడి గుడిలో మూడు వినాయక విగ్రహాలు, రెండు శివలింగాలను పెట్టడం మంచిద‌ని పెద్ద‌లు చెబుతారు.
 • 10. పూజ గదిలో గుడుల్లో మాదిరిగా పెద్ద గంటను ఏర్పాటు చేయడం సరికాదు. పూజ గది ఆలయం కాదు. అది మన వ్యక్తిగత ధ్యానానికి, పూజకు ఉద్దేశించింది కనుక పెద్ద శబ్దాలు లేకుండా ఉంటుంది. చిన్న‌గంట స‌రిపోతుంది.
 • 11. ఇంటీరియర్ డిజైన్‌తో పూజగదిని మరింత అందంగా మార్చుకోవచ్చు..
 • 12. పూజ గది గుమ్మం బ్లాక్ కలర్‌లో చెక్కతో తయారుచేసిన మెటిరీయల్ ఉంటే ఆధ్యాత్మికత తట్టిలేపేలా ఉంటుంది. గుమ్మానికి ఇరువైపులా డిజైన్ చేసిన దేవుళ్ల ప్రతిమలు ఉంటే అందంగా ఉంటుంది.
 • 13. ఫ్లోర్‌కు ఇటాలియన్ మార్బుల్స్ డిజైన్‌ను ఎంచుకుంటే పూజ సమయంలో ప్రశాంతత కనిపించేట్లు ఉంటుంది. వైట్ కలర్ అయితే ఇంకా బెటర్.
 • 14. కబోర్డ్స్ కూడా ట్రెడిషన్‌గా కనబడేలా ఉండాలి. వీటికోసం మార్కెట్లో చాలా రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. పూజా సామాగ్రి ఎక్కడ పడితే అక్కడ కాకుండా ప్రత్యేకమైన కబోర్డ్‌లోనే పెడితే బెటర్.
 • 15. గది లోపలి భాగం మరీ తక్కువ కాకుండా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఉంటే పూజతో పాటు మెడిటేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పూజగదికి ఇంటీరియర్ డిజైన్ కల్పిస్తే ఎల్లప్పుడు ఆధ్యాత్మిక భావాలు కలుగుతాయి.
మ‌రిన్ని నిర్మాణ‌రంగ విశేషాల‌తో మ‌ళ్లీ క‌లుద్దాం - మీ వెంకూ

Sunday, April 19, 2020

వాస్తుపూజ కాల నిర్ణయం - Vasthu Puja Kala Nirnayam

వాస్తుపూజ కాల నిర్ణయం - Vasthu Puja Kala Nirnayam
వాస్తుపూజ కాల నిర్ణయం
వాస్తు పూజను ఏ ఏ సమయాల్లో చేయాలో విశ్వకర్మ ప్రకాశిక ఈ క్రింది విధంగా నిర్దేశించింది.
గృహారంభ సమయాల్లోను, గృహప్రవేశ సమయాల్లోను, ద్వార స్ధాపన సమయాల్లోను, త్రివిధ ప్రవేశ సమయాల్లోను, ప్రతి సంవత్సరం ఆరంభ సమయాల్లోను, యజ్ఞారంభ సమయాల్లోను, పుత్ర జనన సమయాల్లోను, ఉపనయన సమయాల్లోను, వివాహ సమయాల్లోను, గొప్ప ఉత్సవాల సమయాల్లోను, జీర్ణోద్ధార, శల్యోద్ధార సమయాల్లోను, పిడుగు పడిన సమయాల్లోను, దగ్ధమైన సమయాల్లోను వాస్తుపూజ తప్పక చేయవలెను.

ఛండాల ధూషిత గృహాలలోనూ, గుడ్లగూబ ప్రవేశించిన ఇండ్లలోను ఏడురోజులు కాకి ఉన్న ఇండ్లలోను, గో మార్జాలాది ధ్వనులు, ఏనుగులు, గుర్రాలు ధ్వనులన్నానుకరించు ధ్వనులు కలిగించు ఇండ్ల యందును, స్త్రీలు నిత్యం తగువులాడు గృహము నందును తేనేటెట్టెలు పట్టిన గృహము నందు, పావురాలు నివసించు ఇంటినందు మరియు అనేకరకాలైన ఉత్పాతాలు (భూకంపాలు) కలిగినప్పుడు శుభం జరగటం కోసం వాస్తు పురుష పూజ తప్పక చేయవలెను.

అంతేకాక గ్రామాలు, నగరాలు, దుర్గాలు, పట్టణాలు, ప్రాసాదాలు, ప్రాజాలోద్యానవనాలు, గృహారామ మండపాదులు నిర్మించునపుడు వాస్తుపూజ తప్పక చేయాలి. వాస్తుపూజ చేయకపోతే దరిద్రం, మృత్యువు, విఘ్నాలు కలుగుతాయని విశ్వకర్మ ప్రకాశికలో చెప్పబడింది.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

Saturday, April 18, 2020

వాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు - Vastu Shatram, Gruha Pravesam

వాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు - Vastu Shatram, Gruha Pravesam
వాస్తు ప్రకారం ఇంటికి నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు మంచి సమయం కోసం ఎదురు చూడడం అందరికీ తెలిసిందే. కొత్తగా నిర్మించిన గృహంలోకి ఎప్పుడు ప్రవేశిస్తే మంచిదనే విషయమై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది. దీని ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. అదేసమయంలో కార్తీక, మృగశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలమని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది. 

ఇక రిక్త తిథులైన చవితి, నవమి, చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు యోగ్యమైనవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే దక్షిణ సింహద్వారము గల గృహమునకు సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు యోగ్యమైనవి. మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం మంచిది కాదని వాస్తు ఉవాచ.
 • దక్షిణ సింహద్వారము గల ఇంటికి సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. 
 • తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి, దశమి, పూర్ణిమా తిథులు, 
 • పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశీ తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది. 
సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదమని అదే విధంగా ఆది, మంగళ వారాలలో గృహ ప్రవేశం అశుభప్రదం కనుక ఈ వారాలలో గృహప్రవేశం చేయకూడదని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది.

రచన: డబ్బీరు వెంకటేశ్వరరావు - శ్రీ జనయిత్రి  జ్యోతిష్యం - 9704840400

Monday, March 30, 2020

వాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు - Vastu, Gruha pravesamవాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు - Vastu, Gruha pravesam
వాస్తు ప్రకారం ఇంటికి నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు మంచి సమయం కోసం ఎదురు చూడడం అందరికీ తెలిసిందే. కొత్తగా నిర్మించిన గృహంలోకి ఎప్పుడు ప్రవేశిస్తే మంచిదనే విషయమై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది.

దీని ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. అదేసమయంలో కార్తీక, మృగశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం చెబుతోంది.

అలాగే నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలమని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది.ఇక రిక్త తిథులైన చవితి, నవమి, చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు యోగ్యమైనవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే దక్షిణ సింహద్వారము గల గృహమునకు సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు యోగ్యమైనవి. మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం మంచిది కాదని వాస్తు ఉవాచ.

దక్షిణ సింహద్వారము గల ఇంటికి సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి, దశమి, పూర్ణిమా తిథులు, పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశీ తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది. సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదమని అదే విధంగా ఆది, మంగళ వారాలలో గృహ ప్రవేశం అశుభప్రదం కనుక ఈ వారాలలో గృహప్రవేశం చేయకూడదని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది.

గృహంపై వీధి పోటు… వాస్తు ప్రభావం
ఇంటికి ఎదురుగా నిలువుగా వుండే వీధి ఇంటి వరకూ వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుండి ఏదోవైపుకు తిరిగినా దానిని వీధిపోటుగా గుర్తించాలి. ఇటువంటి వీధిపోటు వల్ల సదరు గృహస్తులకు కొన్ని మంచి ఫలితాలను, కొన్ని చెడు ఫలితాలను కలిగిస్తాయని వాస్తు చెబుతోంది. వాస్తు ప్రకారం వీధి పోటు వల్ల కలిగే ఫలితాలు కింది విధంగా ఉంటాయి.

గృహానికి తూర్పు, ఈశాన్య భాగంలో ఎదురుగా వుండే వీధి వల్ల వీధిపోటు కలుగుతుంది. ఈ రకమైన పోటు వల్ల సదరు గృహంలో నివశించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మ విశ్వాసాన్ని కలిగి వుంటారు. ఏ రంగంలో కాలు పెట్టినా పైచేయి సాధిస్తారు.
 • నివశించే ఇంటికి ఉత్తర – ఈశాన్య భాగంలో వీధి వున్నప్పుడు కలిగే వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని స్త్రీలకు అన్నివిధాలా మేలు కలుగుతుంది. సుఖ సంతోషాలతో పాటు కోర్కెలు తీరి ఆనందంగా వుంటారు. ఇంటి యజమానికి మానసిక ప్రశాంతత, ధన ఆదాయం బాగుగా ఉంటుంది.
 • ఇంటికి ఉత్తర – వాయువ్య భాగంలో నిలువుగా వీధి వుండుట వీధి పోటు కలుగుతుంది. ఈ తరహా వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని స్త్రీలు తీవ్రమైన దుష్ప్రభావానికి లోనవుతారు. పెళ్లి సంబంధాలు కుదరక పోవడం, కుదిరిన సంబంధాలు కూడా చివరివరకు వచ్చి తప్పిపోవడం, ఇంకా అనేక సమస్యలకు, చికాకులకు కలుగుతాయి.
 • ఇంటికి పశ్చిమ – వాయువ్యంలో వీధి వున్నప్పుడు వీధిపోటు కలుగుతుంది. దీని వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇంటి యజమాని సమాజంలో గౌరవాన్ని, పలుకుబడిని పొందుతాడు. రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు. ధనాదాయం బాగుంటుంది.
 • ఇంటికి పశ్చిమ – నైరుతి భాగంలో వున్న వీధి వల్ల వీధిపోటు వస్తుంది. దీనివల్ల సదరు ఇంట్లోని వారికి శ్రమ అధికంగా వుంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం వుండదు. చేతికి అందాల్సిన డబ్బు చేజారి పోతుంది. ఆర్థిక కష్ట, నష్టాలు తప్పవు.
 • ఇంటికి దక్షిణ – నైరుతి భాగంలో వీధి వున్నప్పుడు వచ్చే వీధిపోటు వల్ల అనేక అశుభాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి. ఏ పని మొదలు పెట్టినా ముందుకు సాగక పూర్తి ఇబ్బందులకు గురవుతారు.
 • ఇంటికి దక్షిణ – ఆగ్నేయ భాగంలో వున్న వీధి వల్ల కలిగే పోటుతో మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబం అంతా సుఖసంతోషాలతో, మానసిక ప్రశాంతతతో వుంటారు. బంధువుల ఆదరణ, శుభ కార్య నిర్వహణ వంటివి ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
పైన పేర్కొన్నవాటితోపాటు ఇంటికి తూర్పు – ఆగ్నేయంలో వీధి వుండటం కలిగే పోటు వల్ల అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటారు. ఎన్నిరకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించిన ఖర్చు ఏదో ఒక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వుంటుంది. కుటుంబ కలహాలు మరికొంత వేదనకు గురి చేస్తాయి. ఈ విధంగా గృహానికి కలిగే వీధిపోట్ల వల్ల కొన్ని మంచి ఫలితాలు, మరి కొన్నిసార్లు చెడు ఫలితాలు కలిగే అవకాశముందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.

ఇంటి నిర్మాణంలో దిక్కుల ప్రాధాన్యత
ఇంటి నిర్మాణంలో దిక్కులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాన్ని చేపట్టినప్పుడు దిక్కులను అనుసరించే ఆ ఇంటి నిర్మాణాన్ని రూపొందించడం జరుగుతుంది. ఎందుకంటే మనకున్న ఎనిమిది దిక్కుల్లో ఒక్కోదాన్ని ఒక్కో దేవత పాలిస్తుందన్నది నమ్మకం. దీన్ని అనుసరించి ఎనిమిది దిక్కుల్లో ఒక్కోదాని ప్రభావం గురించి తెలుసుకుందాం.
 • తూర్పు: తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కులోని ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.
 • పడమర: పడమర దిక్కునకు అధిష్టాన దేవత వరుణడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు దిక్కుకంటే తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఈ దిశలో ఎత్తు ఉండేలా చేస్తే సర్వ శుభములు కలుగుతాయి. పడమర భాగంలో కూడా మంచి నీటి బావులు, బోరులు ఏర్పరచవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
 • ఉత్తరం: ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ విశాలంగానూ ఉత్తరం ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.
 • దక్షిణం: దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తరదిశతో పోల్చినపుడు ఈ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.
 • ఈశాన్యం: ఈ దిక్కుకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగాను, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కనుక ఈ దిశలో నీరు లేదా బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి, జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.
 • ఆగ్నేయం: ఈ దిక్కుకు అధి దేవత అగ్నిదేవుడు. అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు ఉండడం, ఇతర దిక్కులకంటే ఎక్కువ పల్లంగా ఉండడం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు స్థిరాస్థులు కోల్పోవటంలాంటి అపశకునాలు కలుగుతాయి.
 • వాయవ్యం: వాయువ్యానికి అధిదేవత వాయువు. ఈ దిక్కు నైరుతి, ఆగ్నేయ దిశలకంటే పల్లంగానూ, ఈశాన్యంకంటే ఎత్తుగానూ ఉండాలి. అలాగే ఈ దిశలో నూతులు,గోతులు ఉండకూడదు. ఈ దిశ ఈశాన్యం కంటే హెచ్చుగా పెరిగి ఉండరాదు. ఇలా ఉంటే పుత్ర సంతానానికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.
 • నైరుతి: ఈ దిక్కుకు అధిదేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్ని దిక్కులకన్నా ఈ దిక్కు తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. అలాగే ఈ దిక్కులో ఎక్కువగా బరువు ఉడడం శుభం. ఈ దిక్కులో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.
పైన చెప్పిన విధంగా ఉన్న ఎనిమిది దిక్కుల అధి దేవతలను బట్టి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపడితే ఆ గృహం సకల ఆనందాలకు నెలవవుతుందని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.

ఇంటి కప్పు నిర్మాణంలో వాస్తు నియమాలు
గృహం నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్క అంశాన్ని వాస్తుశాస్త్రం క్షణ్ణంగా వివరించింది. ఇందులో గృహాన్ని నిర్మించే స్థలం నుంచి గృహానికి సంబంధించి ఎలా నిర్మించాలి, ఏ దిశల్లో తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయాలిలాంటి ఎన్నో అంశాలను వాస్తుశాస్త్రం వివరించింది.
 • వీటితోపాటు గృహానికి పైన వేసే కప్పుకు సంబంధించి కూడా వాస్తుశాస్త్రం వివిధ రకాలైన జాగ్రత్తలను సూచించింది. వాస్తుశాస్త్రం ప్రకారం గృహానికి వేసే కప్పు విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ఆ గృహం అన్ని రకాల సంతోషాలతో విలసిల్లుతుంది. గృహానికి వేసే కప్పుకు సంబంధించి వాస్తుశాస్త్రం ప్రకారం క్రింది జాగ్రత్తలు పాటించాలి.
 • ఇంటి ముఖద్వారానికి ఎలాంటి గోడలు లేకుండా చూసుకోవడం. అలాగే మన ఇంటికి ఎదురుగా మరో ఇంటి పైకప్పు ఉండటం వంటివి ఉండకుండా చూసుకోవడం మంచిది.అలాగే ఓ ఖాళీ స్థలంలో గృహం నిర్మించినా, నిర్మించక పోయినా తూర్పు గోడను ఆనుకుని తూర్పు భాగంలో ఎలాంటి కట్టడమైనా నిర్మించి, దానిపై కప్పు వేయకూడదు. దీనివల్ల ఆ ఇంటిలో ఉండే పురుష సంతానం వక్ర మార్గంలో నడుచుకుంటారు.
 • అలాగే పశ్చిమ గోడను ఆనుకుని ఎలాంటి కట్టడం గోడనైనా నిర్మించుకోవచ్చు. ఈ దిశను వరుణ దేవుని స్థానంగా పేర్కొంటారు. అందువల్ల పాడి పంటలకు మేలు చేకూరుతుంది. ముఖ్యంగా ఈ భాగంలో పశువుల పాకను గానీ, ధాన్యపు గదులను గానీ నిర్మించుకోవడంవల్ల కలిసివస్తుంది. దీనివల్ల మంచి ధనాదాయం సమకూరుతుంది. అయితే ఈ కట్టడంపై వేసే కప్పు తూర్పు వాలుగా ఉండేలా జాగ్రత్తవహించాలి. లేకుంటే స్త్రీలకు అనారోగ్య, ఇతర సమస్యలు కలిగే అవకాశముంది.
 • వీటితోపాటు ఉత్తర భాగంలో ఓ కట్టడాన్ని నిర్మించి దానిపై కప్పు వేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కుబేర స్థానం కాబట్టి దీనిని కప్పి ఉంచడం వల్ల వచ్చే సిరి సంపదలు కోల్పోతామని వాస్తుశాస్త్రం చెపుతోంది. దీనివల్ల ధనరాబడి తగ్గి అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక దక్షిణభాగంలో ఏదో ఓ కట్టడాన్ని నిర్మించి దానిపై మూత వేసి ఉంచడం మంచిది. ఎందుకంటే ఇది యమధర్మరాజు స్థానంగా పేర్కొంటారు.
 • దీనివల్ల ఇంటిలో నివశించే వారికి ఆయురారోగ్యాలు కలుగడమే కాకుండా ఆ కుటుంబం సుఖ శాంతులతో వర్థిల్లుతుంది. ఈ కట్టడంపై వేసే కప్పు తప్పనిసరింగా తూర్పు లేదా ఉత్తరం వైపు వాలుగా ఉండే విధంగా చూసుకోవాలి. పైన చెప్పిన విధంగా గృహానికి సంబంధించిన కప్పు విషయంలో జాగ్రత్తలు పాటిస్తే సదరు గృహంలో ఎలాంటి కష్టాలు ఎదురుకాకుండా నిత్యం సంతోషం వెల్లివిరుస్తుంది.
ఇంటి పునాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి పునాది వేసే సమయంలో వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… ఇంటిలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించబోయే ముందు స్థలానికి ఈశాన్య భాగంలో పునాదిని త్రవ్వడం మొదలు పెట్టాలి. ఇంటికి పునాదితోనే నిర్మాణం ప్రారంభమవుతుంది… కాబట్టి వాస్తు ప్రకారం పునాది వేయటం మంచిది.

ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవతాయి. అనంతరం నైరుతీ దిక్కును చదును చేసి పనులు ప్రారంభించుకోవాలి. వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్రప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కానిదే పూర్తిస్థాయిలో ఫలితాలు అందవు. ఇళ్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలని సూచిస్తున్నారు. మనం నిర్మించుకున్న ఇంటి కంటే ఎత్తుగా తూర్పుదిశలో వేరొకరు ఇంటినిర్మాణం చేపడితే ఆ ఇంటికి సంబంధించిన దోషాలు మనం నిర్మించిన ఇంటిపై ప్రభావం చూపుతాయి.

ఇంటిలో వంటగది ఎక్కడ ఉండాలి?
ఇంటిలోనే వంటగది తప్పనిసరిగా ఉండాలని వాస్తురీత్యా నియమం లేదు. వాస్తుశాస్త్రాల ప్రకారం.. అగ్ని స్థానమైన ఆగ్నేయంలో వంటగది ఉండాలి. విశాలమైన ఆగ్నేయ ఆవరణ ఉన్నవాళ్లు ఉపగృహంలో వంటగది ఏర్పాటు చేసుకోవచ్చు.

ఆగ్నేయ దిశలో వంటగదిని నిర్మించుకుంటే ఆ గృహంలో అష్టైశ్వర్యాలు కొలువుంటాయని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. వంటగదిలో గ్యాస్ పొయ్యికోసం తూర్పు గోడకు వేసే ఫ్లాట్‌ఫామ్ కింద మెట్టు పెట్టకూడదు.

దక్షిణ, పశ్చిమ దిశలలో వేసే ఫ్లాట్‌ఫారం కింద మెట్లు పెట్టుకోవచ్చు. ఫ్లాట్‌ఫాణ్‌తో పాటు పెట్టే నీళ్లు సింకు పొయ్యికి వీలైనంత దూరంలో గదికి ఈశాన్యంలో పెట్టాలి. వంటగదికి రెండు కిటికీలు పెట్టడం మంచిది.

ఇంటి పునాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి పునాది వేసే సమయంలో వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… ఇంటిలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించబోయే ముందు స్థలానికి ఈశాన్య భాగంలో పునాదిని త్రవ్వడం మొదలు పెట్టాలి. ఇంటికి పునాదితోనే నిర్మాణం ప్రారంభమవుతుంది… కాబట్టి వాస్తు ప్రకారం పునాది వేయటం మంచిది.

ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవతాయి. అనంతరం నైరుతీ దిక్కును చదును చేసి పనులు ప్రారంభించుకోవాలి. వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్రప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కానిదే పూర్తిస్థాయిలో ఫలితాలు అందవు. ఇళ్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలని సూచిస్తున్నారు. మనం నిర్మించుకున్న ఇంటి కంటే ఎత్తుగా తూర్పుదిశలో వేరొకరు ఇంటినిర్మాణం చేపడితే ఆ ఇంటికి సంబంధించిన దోషాలు మనం నిర్మించిన ఇంటిపై ప్రభావం చూపుతాయి.

చిన్న స్థలాల్లో ఇళ్లు కట్టేవారికి జాగ్రత్తలు ఇరుకైన చిన్న స్థలాల్లో ఇల్లు కట్టే వారు పాటించవలిసిన జాగ్రత్తలను భారతీయ వాస్తు శాస్త్రాలు సూచిస్తున్నాయి. విదిక్కులు తిరిగిన స్థలాలో ముఖ్యంగా తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్యాలలో మెట్లు పెట్టాలనుకునే వాస్తు ప్రకారం జాగ్రత్తలు పాటించాలి. పునాదులు మొదలుపెట్టి గోడలు నిర్మించేటప్పుడు ఎన్ని కిటికీలు పెట్టాలి అన్న విషయం దగ్గర్నుంచి కిటికీలు ద్వారాలకు సరిపోయే విధంగా మార్కు చేశారా, అలమరాలు ఎలా అమరుస్తున్నారన్నదాన్ని తప్పకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.

మెట్లు మార్కింగ్ చేసేటప్పుడు ఈ విషయాలపై దృష్టి కేంద్రీకరించటం ఎంతైనా అవసరం. అలాగే శ్లాబు వేసే ముందు దాని వాటం ఎలా ఉంది… బాల్కనీలో అది ఎలా ఉందీ అన్న అంశాలను ముందుగా ప్లాన్‌లో వేసుకున్న విధంగా సరిగా ఉన్నాయో లేదో చూసుకోవటం మంచిది. గోడలు నిర్మించి అటకలు కట్టేటప్పుడు, ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ప్లాను ప్రకారం జరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అదే విధంగా ఫ్లోరింగ్ మొదలైనప్పుడు వాటం సరిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి.

ఇంట్లో నిర్మించే సెప్టిక్ ట్యాంకులు, నీళ్ల సంపుల మార్కులు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత బయట అరుగులు కట్టే వారైతే వాటి మార్కింగ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇల్లు పూర్తవుతున్న సమయంలో ప్లాను ప్రకారం అన్ని సరిపోయాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి.

రచన: శ్రీ డబ్బీరు వెంకటేశ్వర రావు

Thursday, March 26, 2020

వాస్తు: ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం - Vaastu, Prachina Bharathiya NivaaSa Sastramuవాస్తు: ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం - Vaastu, Prachina Bharathiya NivaaSa Sastramu
వాస్తు అనగా దేవతలు మానవులు నివాసమునకు అనువైన ప్రదేశం  అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. భారతీయులు, చైనీయులు తమ ఇంటి నిర్మాణాల్లో పాటిస్తారు.

వాస్తు పూజ పై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం:

వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి:
 • 1. భూమి వాస్తు.
 • 2. హర్మ్య వాస్తు
 • 3. శయనాసన వాస్తు.
 • 4. యాన వాస్తు.
వాస్తు శాస్త్రంలోని నిర్మాణ వ్యవస్థలో ప్రధాన వస్తువులు పంచ భూతాలైన:
 • 1. భూమి
 • 2. జలం
 • 3. అగ్ని
 • 4. వాయు
 • 5. ఆకాశం
వాస్తు పురుష మండలాలు:
ఎనిమిది దిక్కులకు పరిపాలించే అష్టదిక్పాలకులు ప్రధాన మండలాధిపతులు:
 • 1. ఈశాన్యము – ఈశానుడు
 • 2. తూర్పు – ఇంద్రుడు-
 • 3. ఆగ్నేయము – అగ్ని
 • 4. దక్షిణం – యముడు
 • 5. నైఋతి – పిత్రు/నైరుత్య,
 • 6. పడమర – వరుణుడు
 • 7. వాయువ్యం – వాయు
 • 8. ఉత్తరము – కుబేరుడు
 • 🟒కేంద్రము – బ్రహ్మ
వాస్తు: ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం - Vaastu, Prachina Bharathiya NivaaSa Sastramu
వాస్తు పురుషుని జన్మించు విదానం
వాస్తు శాస్త్ర పురాణం : 
పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి ‘ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు.

ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది.

అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు:
 •  1. శిరస్సున – శిఖి(ఈశ)
 •  2. దక్షిణ నేత్రమున – సర్జన్య
 •  3. వామనేత్రమున – దితి
 •  4. దక్షిణ శోత్రమున – జయంతి
 •  5. వామ శోత్రమున – జయంతి
 •  6. ఉరస్సున (వక్షమున) – ఇంద్ర, అపవత్స, అప, సర్ప
 •  7. దక్షిణ స్తనమున – అర్యమా
 •  8. వామ స్తనమున – పృధ్వీధర
 •  9. దక్షిణ భుజమున – ఆదిత్య
 • 10. వామ భుజమున – సోమ
 • 11. దక్షిణ బాహువున – సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా
 • 12. వామ బాహువున – పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట
 • 13. దక్షిణ పార్శ్వమున – వితధి, గృహక్షత
 • 14. వామ పార్శ్వకామున – అసుర, శేష
 • 15. ఉదరమున – వినస్వాన్, మిత్ర
 • 16. దక్షిణ ఊరువున – యమ
 • 17. వామ ఊరువున – వరుణ
 • 18. గుహ్యమున – ఇంద్ర జయ
 • 19. దక్షిణ జంఘమున – గంధర్వ
 • 20. వామ జంఘమున – పుష్పదంత
 • 21. దక్షిణ జానువున – భృంగరాజ
 • 22. వామ జానువున – సుగ్రీవ
 • 23. దక్షిణ స్పిచి – మృగబు
 • 24. వామ స్పిచి – దౌవారిక
 • 25. పాదములయందు – పితృగణము
ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే ‘వాస్తు పురుషుడు’గా సృష్టి గావించాడు.

భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. దీనిప్రకారం ఏయే దిక్కులు మంచి ఫలితాలను అందిస్తాయంటే …
 • 🝒  తూర్పు - గృహంలో శాంతి, ఆరోగ్యం, సంపద చేకూరటం,
 • 🝒  పడమర - సంతానాభివృద్ది, స్వచ్ఛత, అభివృధ్ది,
 • 🝒  ఉత్తరం - వ్యాపార అభివృద్ది, మంచి భవిష్యత్తు,
 • 🝒  దక్షిణం - అదృష్టం, వినోదం, కీర్తి,
 • 🝒  వాయువ్యం - తండ్రికి మంచి అభివృధ్ది సూచకాలు, అధిక ప్రయాణాలు,
 • 🝒  నైఋతి - తల్లికి సౌఖ్యం,వివాహ సఫలం,
 • 🝒  ఈశాన్యం - వృత్తి పరమైన అభివృద్ధి,
 • 🝒  ఆగ్నేయం - అదృష్టం,
వాస్తు ప్రకారం స్థలాన్ని కొనటం ఎలా?
ఇంటి నిర్మాణంలో స్థల ఎంపిక చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇంటి స్థలాన్ని వాస్తురీత్యా ఎంపిక చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు దరిచేరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. స్థల ఎంపికలో ఏదేని లోపముండినట్లైతే అశుభ ఫలితాలు, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన యజమానులకు అశాంతి కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయని వారు చెబుతున్నారు.

ఇకపోతే వాస్తు ప్రకారం ఎటువంటి స్థలాన్ని కొనకూడదు:
 • 🝒 ఈశాన్యము తగ్గిన స్థలములను కొనకూడదు. ఇటువంటి స్థలాల్లో నివసించేవారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వంశావృద్ధి క్షీణిస్తుంది. సమాజ గౌరవాన్ని కోల్పోవటం జరుగుతుంది.
 • 🝒 స్థలానికి తూర్పు, ఉత్తర దిక్కులలో వేరే వారి స్థలాలు ఉంటే వారి స్థలాల నుండి మన స్థలంలోకి పారకుండా విధంగా చూసుకోవాలి. ఇలా ఇతరుల స్థలం మన స్థలంలోకి పారే విధంగా ఉంటే ఇటువంటి స్థలం నివసించటానికి మంచిది కాదు.
 • 🝒 రెండు విశాలమైన స్థలముల మధ్య నున్న ఇరుకైన స్థలాన్ని కొనకూడదు. దీనివలన మనశ్శాంతి ఉండదు. ఎన్నో ఒత్తిడిలకు లోనవుతారు.
ఇలాంటి స్థలాల్నికొనాలి:
 • 🝒 ఆగ్నేయంగా ఉండి తూర్పు, ఈశాన్యం పెరిగి ఉంటే ఆ స్థలాన్ని కొనటం శుభఫలాన్నిస్తుంది. యజమానికి పేరు ప్రతిష్టలు, సంతానం, మంచి అభివృద్ధిలోకి వస్తారు.
 • 🝒 ఉత్తర - ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కొంటే అన్నీ విధాల మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యాభివృద్ధిని కలుగ జేస్తుంది. ఆ ఇంట స్త్రీలకు సుఖ సంతోషాలకు లోటుండదు. 
 • 🝒 తూర్పు - ఈశాన్యం, ఉత్తరం -ఈశాన్యం పెరిగిన స్థలాలను కొనటం ద్వారా మంచి సంపదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 
 • 🝒 కుటుంబం సుఖ సంతోషాలతో సాగుతుందని వాస్తు చెబుతోంది.
వాస్తు ప్రకారం సింహద్వార గేట్ల అమరిక:
ఆగ్నేయ స్థలంలో తూర్పు సింహద్వార గృహం కట్టడం శ్రేయస్కరమని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు. కాబట్టి ప్రహరీ గేట్లు కూడా తూర్పు ఈశాన్యం, తూర్పు ఉచ్ఛంలో పెట్టుకోవడం మంచిదని వారు పేర్కొంటున్నారు. దక్షిణ స్థలంలో గేటు దక్షిణ స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు ఉన్న స్థలంలో సింహద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.
 • 🝒 తూర్పు దిశన రెండు గేట్లు పెట్టాలను కుంటే తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు, ఉత్తరం ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.
 • 🝒 నైరుతి స్థలంలో గేటు నైరుతిస్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణ లేదా పశ్చిమ దిశలలో ఏదో ఒక దిశకు మాత్రమే సింహద్వారం, ఇతర వాస్తు విషయాలు దృష్టిలో పెట్టుకుని గేటు పెట్టాలి. దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యంలో గేటు పెట్టాలి.
 • 🝒 ఉత్తర దిశను ఉత్తర ఉచ్ఛం ఈశాన్యం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోవాలి. విశాలమైన ఆవరణ కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.
 • 🝒 అలాగే.. వాయువ్య స్థలంలో గేటు వాయువ్య స్థలంలో నిర్మించిన గృహంలో అవసరాన్ని, సింహ ద్వారాన్ని బట్టి రెండు వైపులకు లేదా కేవలం ఒకవైపుకు పెట్టుకోవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు.
రచన: శ్రీ డబ్బీరు వెంకటేశ్వర రావు, MA(Vastu & Astrology), విశాఖపట్నం
సంప్రదించండి: 9704840400

Friday, January 24, 2020

వాస్తు దోషం ఎలా తెలుస్తుంది..? - Vaastu Doshamవాస్తు దోషం ఎలా తెలుస్తుంది..?
మానవుని శరీరంలో ఆయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది. అందుకే మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరంపై, మనసుపై పడుతుంది. తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి. అదే మాదిరిగా గృహంలో కూడా దోషం ఉంటే ఆ ప్రభావం పడుతుంది.

ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనిపించకపోవచ్చు. కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ అకారణ చికాకులూ, అనారోగ్యాలూ, లేనిపోని టెన్షన్లూ, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉండవచ్చు. వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ ఇంటి వాస్తులో లోపం ఉందని చెప్పుకోవచ్చు.

అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో కలహాలు, పిల్లలు పుట్టకపోవడం, అనేకమైన వ్యాధుల బారిన పడడం, అవమానాలు, ఇతరత్రా స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు ఇతరత్రా సంఘటనలు ఇంట్లో జరిగితే అటువంటి వారికి వాస్తుదోషం ఉందని చెప్పవచ్చు.

అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటంకూడా ఒక సూచనే. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.

దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మవ్యాధులు, ఉద్యోగం లభించక పోవడం మొదలగునవి. అదే విధంగా ఆడపిల్లల విషయంలో ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింట కష్టాలు, భర్త బలవంతంచే పుట్టినింటి వారిని పీడించండం మొదలగునవి అన్నీ వాస్తు దోషాలలోకి వస్తాయి. అందువలన ఏ నిర్మాణమునైనా సరైన వాస్తు రీత్యా నిర్మించుకొని అందరూ ఆనందంగా ఉండాలి.

కొన్ని గృహాలు చూడటానికి కళావిహీనంగా కనబడతాయి. అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మహత్యలో, హత్యలో జరిగి వుండవచ్చు అలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులు పడవలసి రావచ్చు. అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయనికాదు, అవి లేకపోయినా కొన్ని చికాకులు ఉంటాయి. ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలిసే అవకాశం ఉండదు. అయినా మనలో అంతర్లీనంగా ఉన్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి.

అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము. అందుకని వాస్తు పండితులకు చూపించి, లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది. కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందీ పడక్కరలేదు.

చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాతో, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతో వాస్తు దోషాలున్నాయేమోనని వాస్తు పండితుల్ని సంప్రదిస్తారు. అది సరికాదు. అసలు వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా 3 కారణాలు చెప్పవచ్చు. మొదటిది భూమి కొనే ముందే అన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి. ఎందుకంటే లూజ్ సాయిల్ అయితే ఇల్లు కట్టుకోవటానికి అనువైందికాదు. కట్టడం బలంగా ఉండదు. అలాగే నేల అడుగున దేవాలయాలు, జల నాడులు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన ఉన్న ప్రదేశాలలో కూడా గృహం నిర్మిస్తే సుఖంగా వుండలేరు. అలాగే చుట్టుపక్కల ఎలా వుంది, ఇరుగూ, పొరుగూ కూడా చూసుకోవాల్సిందే.

రెండవది యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ ఉండాలి..? 
ఎన్ని గుమ్మాలు ఉండాలి..? 
ఎక్కడెక్కడ వుండాలి..? 
కిటికీలు ఎక్కడ ఉండాలి..? 
వగైరాలన్నీ ముందే వాస్తు పండితుల్ని సంప్రదించి నిర్ణయించుకోవాలి. ఇవ్వన్నీ చూపించినా కొన్నిసార్లు ఆ ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగాలేదనుకుంటారు. దానికి కారణం మన ప్రవర్తనవల్ల వచ్చింది. ఏ ఇంట్లో అయితే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో, ఏ ఇంట్లో అనర్ధాలు జరుగుతాయో, ఆక్రందనలుంటాయో ఆ ఇంటికి వాస్తు దోషం ఉంటుందంటారు.

జీవ హింస జరిగే ఇంట్లో, తల్లిదండ్రులు, వృద్దులు, బాధపడే గృహం వాస్తు దోషం ఉన్నట్లే. అంటే ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు ఉండవు. సర్ప, దేవతా, ఋషి శాపాలు ఉన్న ఇంట, పసిపిల్లలకు అన్యాయం జరిగే ఇంట వాస్తు దోషం ఉన్నట్లే. ఇవ్వన్నీ భూమి ఎంచుకునేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చిన దోషాలు కాదు. మన ప్రవర్తనవల్ల వచ్చిన దోషాలు. వాస్తుతో పాటు ప్రవర్తన కూడా బాగుంటేనే సుఖ సంతోషాలతో ఉంటారు.

రచన: చింతా గోపి శర్మ సిద్ధాంతి
వాస్తు శాస్త్ర నిపుణులు - చింతా గోపి శర్మ సిద్ధాంతి గారు 

Friday, June 14, 2019

వాస్తు అంటే? - Vastu


వాస్తు అంటే......  వసతి, నివాస గృహం, నివాస ప్రదేశం అనీ,  శాస్త్రం అంటే......  శాసించేది, రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. పూర్వ కాలములో వాస్తుని విధిగా పాటించి గృహ నిర్మాణము చేసేవారు. ఆ మధ్య కాలములో, వాస్తు శాస్త్రమునకు కొంత ఆదరణ తగ్గిన మాట వాస్తవమే అయినా ఇప్పుడు చాలా వరకు వాస్తు శాస్త్రజ్ఞులకు చూపించి ఇంటి నిర్మాణము చేస్తున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే......  మానవ శరీరములో ఏ అవయాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి, ఎంత పరిమాణములో ఉండాలో అంత పరిమాణములో ఉంటే ఆ మానవుడిని ఎంత అందముగా ఉన్నాడో చూడు అంటారు. అలా కాకుండా ఏదో ఒక అవయవము లోపించినా లేక ఒక అవయవము ఎక్కువగా ఉన్నా, ఉండవలిసిన పరిమాణము కన్నా చిన్నదిగా లేదా పెద్దదిగా ఉన్నా(ఉదా: ఒక కాలు చిన్నది లేక పెద్దది )ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.  అలాగే మనము నిర్మాణము చేయదలచిన ఇంటికి కూడా ఏ గది ఎక్కడ ఉండాలో, ఎంత కొలతలతో ఉండాలో అలా నిర్మించుకుంటే ఇల్లు పొందికగా, అందముగా నివాసయోగ్యమవుతుంది. 


Tuesday, October 16, 2018

వాస్తు పరంగా గృహ మెట్ల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు - Vastu - Gruha Metla Nirmanam


మెట్ల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
చాలా కాలం తర్వాత కలుసుకున్న ఇద్దరు ప్రాణస్నేహితులు కాసేపు కబుర్లు చెప్పుకున్నాక తమ జీవితంలో ఇంత అభివృద్ధి సాధించటానికి తను ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎలా ఎక్కాడో చెప్పి తనకు జరిగిన కష్టసుఖాల గురించి చెప్పుకుంటుంటారు. అలాగే మెట్టు అనేది మనిషి జీవితంలో అభివృద్ధికి బంగారు బాటలేసే సోపానంగా మారింది. అలాంటి మెట్లు మనం నివసించే ఇంటికి కూడా అంతకంటే ఎక్కువ మేలు చేసేవిగా వుండాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. కానీ ఇటీవల కాలంలో ఇంటీరియర్ డిజైనింగ్‌తో ఒక్కోసారి వాస్తు విరుద్ధంగా ఈ మెట్ల నిర్మాణాలు జరిగి సుఖశాంతులతో సరదాగా సాగే జీవితంలో వాస్తు దోషాలు సృష్టించే తుఫానులో కుటుంబాలే అంతరించిపోయే ప్రమాదాలు చాలా చాలా వింటుంటాం. అలాంటి సమస్యలు మనకు రాకుండా వుండాలంటే ఈ సూచనలతో ముందుకెళ్లండి అంతా మేలే జరుగుతుంది.

ఇంటికి అందాన్నిచ్చే ఈ మెట్లు వాస్తు ప్రకారం వుండాల్సిన దిశలో కాకుండా పొరపాటున వేరే దిక్కులో కట్టుకుంటే ఆ ప్రభావంతో మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోయే ఆస్కారం వుంది. ఈ మెట్ల నిర్మాణంలో వాటిని ప్రారంభించే ప్రదేశంలో త్రవ్వే పునాది నుంచి ఇంటి పిల్లర్ల క్రమం తప్పకుండా ఇంటికి పోటు తగలని విధంగా వాటి నిర్మాణం ప్లాన్ చేసుకోవాలి. ఒకటికి మించి అంతస్తులు కట్టే ఇంటి నిర్మాణాలకు ఈ మెట్లు చాలా అవసరం. ముఖ్యంగా ఈ మెట్ల దిశ నిర్ణయంచటమే చాలా సంక్లిష్టమైనది. వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వారే మెట్ల దిశా నిర్దేశం కచ్చితంగా చేయగలరు. శాస్త్ర ప్రకారం మనకు సృష్టి ప్రసాదించిన పది దిక్కులు చాలా శక్తివంతమైనవి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, వాయవ్యం, ఆగ్నేయం, నైరుతి, భూమి, ఆకాశం. వీటిని దశ దిశలు అని శాస్త్ర ప్రకారం పిలుస్తుంటారు. రావణాబ్రహ్మ తలలు పది. అందుకే ఆయనను దశకంఠుడు అన్నారు. ఒక్కో దిక్కు ప్రాధాన్యత వాటి నైసర్గిక పరిస్థితులను బట్టి వుంటుంది. ఈ దిక్కుల్లో తొమ్మిదోది అయిన దిక్కు భూమి లోపలకి చొచ్చుకుని పోతుంది. దశవ దిక్కుగా పిలిచే పదవ దిక్కు ఆకాశంలోకి దూసుకుపోతుంది.

మరి మనం కట్టుకున్న ఇంటికి మొదటి అంతస్థు కనుక కట్టుకుంటే... మనం పై అంతస్థుకు వెళ్లాలంటే ... మనకు మెట్లు ఒక్కటే మార్గం. అందుకనే మెట్లకి వాస్తులో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. మెట్లు పద్ధతి ప్రకారం కట్టాలి అంటే ఇంటి చుట్టూరా తగినంత ఖాళీస్థలం తప్పక వుండాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అలాంటి స్థలాలు దొరకాలంటే గగనమైపోయంది. ఉన్న స్థలంలోనే ఇంటిని కట్టుకొని మిగిలిన ప్రదేశంలో మెట్ల నిర్మాణం చేసుకొనేవారు చాలా మంది వున్నారు. వారందరూ ఈ విషయాలను జాగ్రత్తగా చదివి వాస్తుని అమలు చేసుకోండి. ఈ మెట్లు రకరకాలుగా వుంటాయ. కానీ వాస్తు ప్రకారం అన్నిటినీ జాగ్రత్తగా నిర్మించుకోవాలి.

ప్రధానంగా చెప్పాలంటే మెట్లు రెండే రకాలు. మొదటివి ఇంటి బయట కట్టే మెట్లు, రెండవవి ఇంటి లోపల కట్టే మెట్లు. ఇవి ఇంటికి దిశానిర్దేశం చేసే విధంగానే వుండాలి. బయటి మెట్లు అంటే ఇంటి బయట నుండి పై అంతస్థుకు వెళ్లేందుకు బయటనుండి కట్టే మెట్లు. లోపలి మెట్లంటే ఇంటి లోపలినుండి ఇంట్లోని పై అంతస్థుకు వెళ్లేందుకు లోపలి నుండి కట్టే మెట్లన్నమాట. ఇవి ఎక్కువగా డుప్లెక్స్ ఇళ్లలో తరచుగా చూస్తుంటాం. మెట్లు ఎక్కడున్నా ఏ పదార్థంతో కట్టినా, ఏ దిక్కులో కట్టినా వాటి ఫలితాలు వాస్తు శాస్త్ర ప్రకారంగానే వుంటాయి. అవి చెక్కవా? ఇనుప పదార్థానికి చెందినవా? రాతితో డిజైన్ చేసినవా అని తేడా వుండదు. ఈ మెట్లు మనం పైకి ఎక్కేపుడు ఉత్తరం నుండి దక్షిణానికి లేదా తూర్పు నుండి పడమరకు మాత్రమే ఎక్కేట్లుగా కట్టించాలి. అలానే ఎందుకు కట్టాలంటే తూర్పు, ఉత్తర దిశలు ఎప్పుడైనా పల్లంగానే వుంటాయి. కనుక మనం క్రింద నుంచి అంటే తూర్పు లేదా ఉత్తరం నుంచే మెట్లు ఎక్కటం ప్రారంభిస్తాము. మనం పైకి చేరే దిశలు దక్షిణం, పడమరలు. ఈ దిక్కులు ఎప్పుడైనా ఎత్తుగానే వుండాలి. కనుక మనం పైకి చేరే ప్రదేశం ఉచ్ఛస్థానంగానే వుండాలి. అందుకనే ఆ దిక్కులు అగ్రభాగాన నిలుస్తాయి. అలా కాకుండా ఈ వాస్తు పద్ధతులకు వ్యతిరేక దిశలలో మెట్ల నిర్మాణం కనుక చేస్తే ఇంటి యజమానికి అనారోగ్యం, తరచూ ప్రయాణాలలో ప్రమాదాలు సంభవిస్తుంటాయి. వ్యాపారస్థులకు అనుకోకుండా నష్టాలు వస్తుంటాయి సంతానం చదువులో వెనుకబడిపోతుంటారు. ధన వ్యయం ఎక్కువగా వుంటుంది. ఇంటి ఇల్లాలుకి శారీరక సమస్యలు వుంటుంటాయ. అన్ని రకాలుగా పతనావస్థకి చేరుకుంటుంటారు. అందుకని మెట్లని పద్ధతి ప్రకారమే కట్టించుకోండి.

మెట్లను ప్రారంభంలో తూర్పు నుండి పడమరకుగాని, ఉత్తరం నుండి దక్షిణానికి గాని మనం ఎక్కే విధంగా నిర్మాణం చేస్తూ, ఆ తరువాత కుడివైపునకుగాని లేకపోతే ఎడమ వైపునకుగాని తిరిగి ఎక్కేవిధంగా వీటి నిర్మాణం చేసుకోవాలి. మనం ఎక్కేపుడు తూర్పు లేదా ఉత్తరంనుంచి ఎక్కటం ప్రారంభించి, దక్షిణం లేదా పడమర దిశ ఎత్తులో మన నడక సాగేట్లుగా వుండాలి. మధ్యలో ఏవన్నా వంకరలుగాని, మలుపులుగాని వుండేట్లయతే వాటిని ఎడమ లేదా కుడివైపునకు తిరిగేట్లుగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకో రకమైన 1నిట్టనిలువు2 మెట్ల నిర్మాణ సమయంలో ఇంటి గోడలకు సమాంతరంగా కానీ, నేరుగా ఇంటి మీదకు మనం నడక సాగించే విధంగా కాని ఈ మెట్ల నిర్మాణం చేసుకోవాలి. అంటే ఈ మెట్లు చూడటానికి గోడకు వేసిన నిచ్చెన లాగా వుంటాయి. వీటిని ఉత్తరం నుండి దక్షిణానికి గాని, తూర్పు నుండి పడమరకు గాని మనం సులభంగా ఎక్కే విధంగా నిర్మించాలి. ఇక ఆఖరువి 1గుండ్రని (రౌండ్ షేప్)2 ఆకారంలో మెట్లు ఇవి చూడటానికి గుండ్రంగా తిరుగుతూ గమ్యానికి చేరే విధంగా వుంటాయి. ఇలాంటి వాటిని ఎక్కేపుడు మనం ఒక వృత్తంలో నడుస్తున్నట్టుగా వుంటుంది. వీటి నిర్మాణం ఉత్తరం నుండి లేదా తూర్పు నుండి ప్రారంభించాలి. గమ్యస్థానం చివరలో ఎటువంటి మెలికలు తూర్పు లేదా, ఉత్తర దిశలుగా లేకుండా వాస్తు పరంగా జాగ్రత్తలు తీసుకోండి.

ఇంటికి మెట్లు కట్టేపుడు తీసుకోవలసిన జాగ్రత్తలలో మొట్టమొదటిది, ఎలాంటి పరిస్ధితులలో కూడా మెట్లని ఇంటి సింహ ద్వారానికి కాని, ఇంటి లోపల కాని, బయట కాని వున్న ద్వారాలకు ఎదురు లేకుండా, ఎదురు రాకుండా వాస్తు పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి యజమాని కాని, యజమానురాలు కాని ఇంటి ద్వారంలోనికి ప్రవేశించటానికి మెట్లు ఏ మాత్రం ఎదురు కారాదు. అంటే ఎవరైనా సరే ఇంటి సింహద్వారం గుండా పైభాగానికి వెళ్లాలంటే వుండే ఇంటి మెట్లు సింహద్వారం వెడల్పులో సగభాగానికి దాటి రాకూడదన్నమాట. అసలు ఈ మెట్లు చాలా వాస్తు సమస్యలకు ప్రధాన కారణంగా మారుతుంటాయి. చాలా మంది మెట్ల నిర్మాణం కరెక్ట్ గా చేసి వాటి క్రింది స్ధలం వేస్ట్ గా పోతున్నదని బాత్‌రూంల నిర్మాణం చేసి సమస్యల సుడి గుండాలలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు.

మెట్ల క్రింద టాయలెట్‌లు, బాత్‌రూంలు అస్సలు కట్టనే కట్టకూడదు. ఏ దిక్కులో అయనా సరే అలాంటి నిర్మాణాలు వాస్తు ప్రకారం పనికిరాదు. వాస్తు ప్రకారం మెట్లు మానవ జీవితాన్ని ఉచ్ఛస్థితికి తీసుకువెళ్లే సోపాన మార్గాలు. వాటిని ఆటంకపరుస్తూ, వాటి ఆసరాతో వేరొక నిర్మాణాన్ని వాటికి అనుసంధానం చేయటాన్ని వాస్తు శాస్త్రం తప్పుగా పరిగణిస్తుంది. అలా అనుసంధానం చేయటం వలన ఆ దిక్కుకు పెరుగుదల, ఇంకా దిక్కుకు మూల భాగ విస్తీర్ణం ఏర్పడుతుంది. అలా ఏర్పడటం ప్రమాదకరం. అది ఎలాగంటే ఉత్తర వాయవ్యంలో ఇంటికి మెట్లు వున్నాయనుకోండి. దాని క్రింద టాయలెట్ కాని, బాత్‌రూం కాని కట్టినట్టయతే ఇంటిమొత్తానికి ఉత్తర వాయవ్యం పెరిగి రకరకాలైన చెడు ఫలితాలు వస్తాయి. అలాగే మెట్ల క్రింద ఇలాంటి నిర్మాణాలు చేయటం వలన రాకూడని ప్రదేశాలలో గోతులు, అండర్ గ్రౌండ్ డ్రయన్ పైపులు వచ్చి ఇంటి యజమానికి రకరకాలైన సమస్యలు మెడకు చుట్టుకుంటాయి. ఇంకా అలాంటివి ఏవన్నా కట్టాలనుకుంటే మాత్రం దక్షిణంలో కాని, పడమరలో కాని మెట్ల క్రింద ఇంట్లోని పాత సామాన్లు, పనికి రాని వస్తువులని వుంచే స్టోర్ రూంని కట్టుకోవచ్చు. కాని అలాంటి గదిని కట్టిన తర్వాత దాన్ని ఖాళీగా మాత్రం వుంచితే అది ఆ ఇంటి వాళ్ల జీవితాలనే పూర్తిగా ఖాళీ చేసేస్తుంది జాగ్రత్త సుమా.

ఇంటి నిర్మాణంలో మెట్లు ఇంటి వాస్తు ఆకారాన్నే మార్చేసే ప్రధాన కారకాలు. అది ఎలాగంటే... ఇంటి బయట మనం కట్టే మెట్ల వలన ఇంటి ఆకారం అనగా ఆ స్థల ఆకారం చతురస్రంగా కాని, దీర్ఘ చతురస్రంగా కానీ వుండాలి. ఉత్తర వాయవ్యంలో మనం కట్టే మెట్ల వెడల్పు వలన ఉత్తర ఈశాన్యం కూడా పెరిగి ఇల్లు చతురస్రంగా కాని దీర్ఘ చతురస్రంగా కాని మారితే మంచిది. తూర్పు ఆగ్నేయంలో మెట్లు కనక కట్టుకుంటే ఆ మెట్ల నిర్మాణం వలన తూర్పు ఈశాన్యం కూడా పెరిగి ఆ ఇల్లు చతురస్రంగా కాని దీర్ఘ చతురస్రంగా కాని చూడ చక్కగా వుంటుంది. అలాగే పడమర వాయవ్యంగా కానీ, దక్షిణ ఆగ్నేయంగా కాని, పడమర దిశకు మధ్యలోకాని, దక్షిణ దిశకు మధ్యలో కాని మెట్ల నిర్మాణం వాస్తు శాస్త్ర ప్రకారం కొలతలతో కట్టుకోవచ్చు. అలా పై విధంగా చెప్పినట్లు మెట్లు మాత్రమే వుండి ఇల్లు ఆకారంలో చతురస్రంగా కాని దీర్ఘ చతురస్రంగా లేకపోతే ఈశాన్య భాగంలో సగం గోడలు కట్టి వాటి మీద గ్రిల్స్ తో చిన్నపాటి రూంని కట్టి ఇంటి ఆకారాన్ని చతురస్రంగా కాని దీర్ఘ చతురస్రంగా కాని వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలా కూడా వీలుకానపుడు ఈశాన్యంలో నాలుగు పలకలతో చతురస్రపు ఆకారంలో పిల్లర్ వేయాలి. దానిని కలుపుకుంటూ ఈశాన్యం పెరిగే విధంగా పోర్టికోలాగా కట్టి ఇంటి ఆకారాన్ని చతురస్రంగా కాని దీర్ఘ చతురస్రంగా కాని వచ్చేలా సరిచేయాలి. అంటే ఎలాంటి నిర్మాణం చేయదలచినా ఇంటికి ఈశాన్య భాగం తగ్గకుండా వాస్తు పరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట.

వాస్తు సమస్యలు:
 • ఇక్కడ ఇంకో వాస్తు సమస్య ఏంటంటే.. ఇంటికి బయట మెట్ల నిర్మాణం చేయాలనుకుంటే... ఇంటికి తగలకుండా మెట్లు కట్టుకోవటమే. 
 • ఇలా చేయటం వలన ఇంటి ఆకారంలో వచ్చే చతురస్రం, లేదా దీర్ఘ చతురస్రం సమస్యకు ఇలా చేయటమే చక్కటి పరిష్కార మార్గం. అది ఎలా చేయాలంటే... కట్టబోయే మెట్లకు ప్రత్యేకంగా ఒక పిల్లర్‌ని వేయాలి. 
 • ఇలా చేసేపుడు మెట్ల బరువు ఇంటి మీద ఏ మాత్రం పడకుండా చూడాలి. కాకపోతే ఇలాంటి మెట్ల నిర్మాణ సమయంలో ఇంటికి, కట్టబోయే మెట్లకి మధ్య కనీసం రెండు అంగుళాల దూరం మాత్రమే కచ్చితంగా వుండితీరాలి. 
 • ప్రత్యేకమైన పిల్లర్ వేయకుండా మెట్ల నిర్మాణం చేయరాదు. 
 • ఈ పిల్లర్‌తో ఇంటి పిల్లర్లకు సంబంధం లేదు. 
 • ఇంటి బయట మనం కట్టుకునే మెట్లు ఇంటికి సంబంధించిన నాలుగు దిక్కుల్లో ఏ దిశలో కూడా కాంపౌండ్ వాల్‌కి తగలకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. 
 • ఒకవేళ పొరపాటున కాని, వాస్తు తెలియకో కాని కాంపౌండ్ వాల్‌కి తగిలితే మాత్రం అది చాలా పెద్ద పెద్ద వాస్తు దోషాలకు కేంద్ర బిందువవుతుంది. 
 • ఇలాంటి దోషాలకు తీవ్రమైన అనారోగ్యాలు, అనుకోకుండా ధనవ్యయం, ధననష్టం, ఇంట్లో మరణాలు, విలువైన వస్తువుల అపహరణలు, ఇంట్లో ఆడపిల్లల ప్రేమలు విఫలం కావడం, గర్భ స్రావాలు ఇలా రకరకాలైన చెడుఫలితాలు విచ్చలవిడిగా ఒకటి తర్వాత ఇంకోటి వస్తుంటాయి. 
 • ఉత్తర దిశలోని ప్రహరీ గోడకు తాకుతూ మెట్లు కనుక వుంటే చాలా ప్రమాదకరం
 • ఇంట్లోని మగ సంతానం కాని, యజమాని కాని అనుకోకుండా హఠాత్తుగా మరణించే ఆస్కారం వుంది. ధనవంతులు బికారులుగా మారే ప్రమాదమూ పొంచి వుంటుంది. 
 • ఇంట్లో అగ్నిప్రమాదాలు జరగటానికి అవకాశాలు చాలా వుంటాయ. 
 • గ్యాస్ స్టౌ ప్రమాదాలు అనుకోకుండా జరుగుతా య. అందుకనే ఇంటిలోపల కాని, బయట కాని మెట్లు కచ్చితంగా ఎక్కడ కడితే వాస్తు సమస్యలు రాకుండా వుంటాయో ఇపుడు తెలుసుకోండి. తూర్పు ఆగ్నేయంలో, ఉత్తర వాయవ్యంలో, పడమర వాయవ్యంలో, దక్షిణాగ్నేయంలో, పడమర మధ్య భాగంలో, దక్షిణ మధ్య భాగంలో కచ్చితమైన కొలతలతో, సరియైన దిశలో నిర్భయంగా మెట్ల నిర్మాణం చేసుకోవచ్చు.
వాస్తు బలం ఇంటికి కావాలనుకుంటే పడమర దిశలో మధ్యభాగాన మెట్లు కట్టుకుంటే ఇల్లు దేదీప్యమానంగా కళగా వెలిగిపోతుంటుంది. ఈ మెట్లు ఇంటికి లోపలైనా, ఇంటి బయటవైపైనా ఇదే విధంగా కట్టాలి. ఈ దిశలో మెట్లు కట్టాలనుకుంటే పడమర దిశ మధ్య భాగంలోని కేంద్ర బిందువును కచ్చితంగా పట్టుకుని అక్కడే నిర్మాణం జరిపితే ఇంటికి వెయ్య ఏనుగులంత బలమైన వాస్తు లభిస్తుంది. ఇంటి ఆయుష్షుకు, ఇంట్లోని వారి సుఖ శాంతులకు, ధన, ధాన్యలకు, వస్తు వాహనాలకు, రాజకీయ జీవితం ఉచ్ఛస్థితికి చేరటానికి, పెద్ద పెద్ద పదవులు అనుకోకుండా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే వాటంతట అవే రావాలన్నా, పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చి ఆదాయం పెరగాలన్నా పడమర దిశ మధ్యభాగాన మెట్లు కట్టుకోండి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Saturday, October 6, 2018

వేధలు - కనిపించకుండా బాధించే వాస్తు దోషాలు - Vastu Doshalu

వేధలు అంటే కనిపించకుండా బాధించే వాస్తు దోషాలు. వేధల్లో కొన్ని సహజమైన ప్రకృతి సంబంధమైనవి. మరికొన్ని సామాజిక మైనవి.

కుడ్య వేధ: ఇల్లు కడుతూ ఉన్నప్పుడు తూర్పు ఉత్తరం ప్రహరీ గోడలు కాని ఇతరమైన గోడలు కాని పడమర, దక్షిణ దిశలకన్నా ఎత్తుగా ఉండకూడదు. అంటే పడమర దక్షిణ దిశల గోడలు ఎత్తుగా ఉండాలి.

తారతమ్య వేధ: ఇంట్లో ఎప్పుడూ దక్షిణ పడమరల వైపు పెద్దవారు నివసించాలి. తూర్పు ఉత్తరముల వైపు చిన్నవారు వుండాలి. అలా కాకుండా వ్యత్యస్తంగా అయినప్పుడు తారతమ్య వేధా దోషం కలుగుతుంది.

నత వేధ: ఇంటి ఆవరణలో తూర్పు ఉత్తర భాగములు ఎత్తుగాను, పశ్చిమ దక్షిణములు పల్లముగాను ఉండుట వలన నత వేధా దోషం కలుగుతుంది. దాని వలన చోర బాధలు, ఆకస్మిక ప్రమాదాలు సంభవిస్తాయి.

కాంతి హీన వేధ: ఇంటిలోకి మొదటి, నాలుగు జాములో సూర్యరశ్మి సోకాలి. లేకపోతే కాంతి హీన వేధ దోషం కారణంగా భూత బాధలు పీడిస్తాయి.

క్షౌద్ర వేధ: ఇంట్లో ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ దిశల్లో పుట్టలు (చీమల పుట్టలు-పాముపుట్టలు) అదేపనిగా తేనె పట్టులు పెడుతూ ఉండడం మంచిది కాదు. అలా జరిగిన సందర్భాలలో కొన్ని నిర్మాణాలు అకస్మాత్తుగా భూమిలో కృంగిపోయిన సందర్భాలున్నాయి. దానినే క్షౌద్ర వేధ అంటారు.

పశు వేధ: ఇంటి ఆవరణలో ముందు భాగంలో పశువులు, గొర్రెలు, మేకలు వంటివి ఉండకూడదు. ఇంటి పశ్చిమ, దక్షిణ భాగాలలో ఉండాలి. గోవులైతే ఉత్తర ఈశాన్య భాగాలు శ్రేష్టం. గోవుయొక్క గిట్టల ధూళి వలన ఎన్నో దోషాలు పరిహారమవుతాయి. గోవు గురించి వేద విజ్ఞానం కాని హిందూ మత విశ్వాసం కాని, కేవలం విశ్వాసం కాదు-అది కేవలం విజ్ఞాన ప్రధానమూ మానవ శ్రేయస్సుకూ సంబంధించిన సత్సంప్రదాయం.

కోణ దృగ్వేధ: ఇంటి స్థలంలో ఒక మూలగా ఇల్లు కట్టకూడదు. ఒకవేళ తప్పనిసరి ఐన పక్షంలో దానికి ప్రత్యేక ప్రహరీ నిర్మాణం చేయాలి. అలాగే ఇతరుల ఇంటి మూల ఇంటి గృహ ద్వారాన్ని ఛేదించకూడదు. ఇంటి యొక్క మూలల వెంబడి ద్వారాలు ఉంచడం కూడా కోణ వేధగానే బాధిస్తుంది. ఈ కోణ వేధనే కొన్ని ప్రాంతాలలో ‘కొంజెర’ దోషం అని గ్రామీణ పద్ధతిలో పిలుస్తారు.

శైలవేధ: ఇంటికెదురుగా సింహ ద్వారానికెదురుగా కొండలు, గుట్టలూ ఉండకూడదు. ముఖ్యంగా తూర్పు ఉత్తర దిశలలో కొండలు, గుట్టలూ అసలు ఉండకూడదు. ఇంటి గోడల చివర్లలో కోట గోడల ఆకారంలో ఆర్చిలు కాని , కమాన్లు కానీ ఉండకూడదు. ఇల్లు నిర్మించే స్థలం కోణాకృతిలో ఉండకూడదు.

సత్రవేధ: ఇంటికి ఎదురుగా గాని సమీపంలో కాని రెండువందల గజాలలోపు సన్యాసాశ్రమాలు, అనాధాశ్రమాలు, ఆలయాలు ఉండకూడదు.

శల్యవేధ: శల్యములు అంటే ఎముకలు. ఇల్లు కట్టే స్థలం ముందుగా ఒక మనిషి నిలువు తవ్వి ఎముకలు, బొగ్గులు, ఊక వంటి నిషిద్ధ పదార్థాలు లేకుండా చూసుకోవాలి. ఇల్లు కట్టే స్థలంలో గర్భంలో గండశిల వంటివి ఉండకూడదు. అవి ఇంటిని కదిలిస్తాయి. హాని కలిగిస్తాయి.

కుల్యములు, అంటే కాలువలు, తటాకము అంటే చెరువులు, ప్రవాహాలు, ఇవి ముఖ్యంగా నైరుతి, వాయవ్యాలుగా కాని, ఈశాన్యము నుండి ఆగ్నేయముల వైపు కాని, దక్షిణ పడమరలుగా గాని ప్రవహించకుండా చూసుకోవాలి.

ఇంట్లో నీరు కూడా ఈశాన్యం వైపు పారేలా ఏర్పరుచుకోవాలి. ఇతరుల ఇంటి నీరు మన ఇంటి ఆవరణలోకి రాకుండా చూసుకోవాలి.ఈ వాస్తు నియమాలు చదివినప్పుడు, చెబుతున్నప్పుడు కఠినంగానే వినిపిస్తాయి. కాని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ఇబ్బందులు రాకుండా కాపాడతాయి.

స్తంభహీన వేధ:- స్తంభహీన వేధని ‘శంఖపాల వేధ’ అని కూడా అంటారు. స్తంభములు (పిల్లర్లు) లేకుండా గృహ నిర్మాణము చేయకూడదు. స్తంభము అంటే స్థిరంగా నిలబడి యుండునది అని అర్థం. స్తంభములు వాస్తురీత్యా సరియైన సంఖ్యలో సరియైన పద్ధతిలో ఏర్పాటుచేస్తే ఆ ఇల్లు కూడా స్థిరంగా సుస్థిరంగా ఉంటుంది. స్తంభములు లేకుండా ఇల్లు నిర్మించరాదు. దానినే స్తంభహీన వేధ - శంఖపాల వేధ అంటారు. ఆ స్తంభాలు, సున్నాలేని సరిసంఖ్యలో ఉంటే చాలా క్షేమం. షోడశ సంఖ్యలో ఉంటే అంటే పదహారు సంఖ్యలో ఉంటే అత్యంత ఉత్తమం.

వికట వేధ: వికటము - అంటే వంకర. గృహము యొక్క సింహ ద్వారము విషయంలో చెప్పబడింది. ‘వికటే సంతాన వేధ స్యాత్’ వికట వేధ వలన సంతానమునకు హాని. సింహద్వార ప్రమాణం వంకరగా ఉన్నా - కొలతలు (ఆయము - మిగతా ద్వారముల సమన్వయ ప్రమాణముతో) హెచ్చుతగ్గులు మిట్ట పల్లాలు - సంకరమైన కలప - నిషేధితమైన కలప (తుమ్మ మొదలైనవి)తో చేయబడినా రెండు ద్వారముగా లేక ఒకే ద్వారము కలిగి ఉన్నా మరొకరి ఇంటిలోది కొని తెచ్చిపెట్టినా.. రూపహీనంగా ఉన్నా ఆ ఇల్లు వికట వేధ కలిగిన ఇల్లుగా చెప్పవచ్చు. అందుకే వికట వేధ లేకుండా సింహ ద్వార నిర్మాణం చేయించాలి.

వృక్ష ఛాయ వేధ;- వృక్ష ఛాయ కూడా వేధగానే పరిణమిస్తుంది. దిన సమయంలో గాని రాత్రి సమయంలో గాని రెండు మూడు ఝాముల వేళల్లో కాండము గల చెట్టుయొక్క నీడలు ఇంట్లో కాని ఇంటి మీద కాని పడకూడదు.

తూర్పున మర్రి, ఆగ్నేయంలో వేప, జామ దక్షిణంలో తెల్ల జిల్లేడు, అల్ల నేరేడు, పనస - నైరుతిలో శమీ వృక్షం - పడమర రావి చెట్టు ఉసిరిక చెట్లు - వాయవ్యంలో మేడి ఉత్తరంలో వెలగ - పనస. ఈశాన్యంలో మారేడు చెట్లు ఉంటే రక్షగా ఉంటాయి.

అగ్నివేధ: ఇంటిలో ఆవరణలోగాని ఇంటి సమీపంలో గాని చెత్త లాంటివి తగులబెట్టవలసి వస్తే అది ఇంటికి ఆగ్నేయ భాగంలో వచ్చేట్టు చూడాలి. ఆగ్నేయ భాగంలోకాక మరే దిశలోనైనా నిప్పు వెలగటం వల్ల ఆ ఇంటికి అగ్ని వేధా దోషం కలుగుతుంది. దాని వలన భార్యాపుత్రులకు హాని కలిగే అవకాశం ఉంది.

దహన వేధ: ఏదైనా ప్రమాదవశాత్తు ఇంటికి సంబంధించిన తలుపులు కాని కిటికీలు కాని పాక్షికంగా కాని పూర్తిగా కాని అగ్నిప్రమాదానికి గురైతే వాటిని వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి. సగం కాలినవే కదా అని ఉపేక్షించరాదు.దాని వలన దహన వేధా దోషం తగులుతుంది. అలాగే ఇంట్లో పగిలిన అద్దాలు రెండు రూపాలుగా కనిపించే అద్దాలు, విరిగిన తలుపులు కలిగిన కిటికీలు ఉండరాదు. తలుపులు కాని, కిటికీలు కాని అదే పనిగా కిర్రుమనే శబ్దాలు కాని కీచుమనే శబ్దాలు కాని సృష్టించకూడదు. కోడు, కాళ్లు విరిగిన కుర్చీలు, బల్లలు వాడుకలో ఉంచకూడదు. వాటి వలన వేధా దోషమే కాకుండా, ప్రమాద బాధలు కూడా కలుగుతాయి. సహజంగా పేదవారు అక్కడా ఇక్కడా దొరికిన కలపతో గుడిసెలు, ఇళ్లు ఏర్పరచుకుంటారు. అందులో కాలిన వస్తువులు ఉండకూడదు. నట్టింట్లో బొగ్గులు ఉంచకూడదు. తాత్కాలికంగానైనా పోయకూడదు.

చతుష్కోణ వేధ: సహజంగా ఇల్లు కట్టే సమయంలో సమ చతురస్రంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్మిస్తారు. ఆ సంబంధంగా నాలుగు భిన్న కోణాలు ఏర్పడతాయి. దాని వలన చతుష్కోణములుగా మూలలను వేధిస్తాయి. అది మంచిది కాదు.

రక్త వర్ణ వేధ: ఇంటికి వేసే రంగుల విషయంలో, ఫ్లోరింగ్ విషయంలో రక్త వర్ణం గల రంగును వాడకూడదు.

వాయు వేధ: ఇంటికి దక్షిణ, పడమర దిశలలో తప్పకుండా కిటికీలు ఉండాలి. దక్షిణ దిశ నుండి మలయ పర్వతం గాలులు, పడమటి వైపు నుండి పడమటి కనుమలల గాలులు వైద్య శాస్తర్రీత్యా చాలా ఆరోగ్యకరమైనవి.మలయ పర్వతాలే నల్లమల కొండలు. అక్కడ నుండి వచ్చే గాలులకే మలయానిలం అని పేరు. అందుకే దక్షిణ, పడమరలకు, ఇంటికి కిటికీలు ఉండాలని మన వాస్తు శాస్త్రం నిర్దేశించింది.

స్మశాన వేధ: ఇంటికి దగ్గరలో స్మశానం ఉండటం మంచిది కాదు. శవ దహనం చేసిన పొగను ప్రేత ధూమమంటారు. అది పారటం ఇంటిపైన కాని వ్యక్తిపైన కాని మంచిది కాదు.
గృహానికి ఆగ్నేయ, నైరుతి దిశలందు తూర్పు పడమరలలోనూ గోతులూ విపరీతమైన పల్లపు ప్రదేశమూ ఉండకూడదు.

ఉచ్చిష్ట వేధ: గృహావరణలో తూర్పు, ఉత్తర దిశలలో పెంటకుప్పలూ - ఉమ్ములూ, పేడకుప్పలూ, చెత్తకుప్పలూ ఉండకూడదు. ఈశాన్య దిశగా ఎప్పుడూ ఉమ్మివేయటం కానీ, మల మూత్ర విసర్జనలు కాని పనికి రావు. ఈ నియమం ఇంటికి మాత్రమే కాదు. బయటకు కూడా వర్తిస్తుంది. అలాగే సూర్యుడికి ఎదురుగా మల మూత్రాదులు చేయకూడదు. సూర్యుడు ఉన్న దిశ నుండి వ్యతిరేక దిశలో ఆగ్నేయ నైరుతి భాగాలను ఉపయోగించాలి.

భిన్నదేహళీవేధ: ‘దేహళి’ అంటే ‘కడప’ ద్వారం దాటడానికి వేసే ‘నడిమి పడిని’ కడప అంటారు. కడప పట్టణానికి ఆ పేరు రావడానికి అది తిరుపతి వెంకటేశ్వరస్వామి యొక్క దేవుని కడప కావటమే. ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కాని, దేవాలయంలోకి కాని వెళ్లకూడదు. దాటుతూ వెళ్లాలి. ఈ కడపను ద్వార ప్రమాణానికి అనుప్రమాణ రీతిలో నిర్మించాలి. అలా కాకుండా నిర్మిస్తే అది దేహళీ భిన్న వేధగా ఇంట్లో నివసించే వారికి అనేక రకములైన ఇబ్బందులకు గురి చేస్తుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Friday, September 14, 2018

వాస్తుశాస్త్ర పరముగా గృహమునందు బావులు,నూతులు ఉండవలసిన స్థానములు - Gruha Vastu, Bavulu, Nutulu

: వాస్తుశాస్త్రరీత్యా బావులు, నూతులు ఉండవలసిన స్థానములు :

వాస్తుశాస్త్ర పరముగా గృహమునందు బావులు,నూతులు ఉండవలసిన విధానములు తెలుసుకొనుటకు ఈ వ్యాసము ఉపయోగపడుతుందని తెలియచేస్తున్నాము.

గృహమునందు నివసించువారికి ఉదయము లేచినది మొదలు స్నానము, వంటకు, త్రాగుటకు, ఇతరమైన పనులకు నీటితోనే ముడిపడియున్నది. నీరు లేనిదే మన అవసరాలు తీరుటకు అవకాశము లేదు. అందుచేత మనిషి గృహావసరాల నిమిత్తం నీటిని ఏఏ దిశలలో ఉంచుకుంటే గృహస్తులకు ఉపయోగమో, వాస్తు శాస్త్రపరముగా ఎటువంటి లాభాలు కలుగుతాయో ఈ క్రింది విషయాల ద్వారా మనకి మనమే తెలుసుకోవచ్చును.

ముందుగా నీటికోసం త్రవ్వే బావులు లేక నూతులు ఎక్కడ వుంటే ఏఏ ఫలితాలు కలుగుతాయో చూద్దాం.

ఐశాన్యాం కూపపుష్టి: పూర్వాస్యా మైశ్వర్యమ్‌ । ఆగ్నేయ్యాం పుత్రనాశ: దక్షిణస్యాం స్త్రీ వినాశ: పీడాంఉత్తరస్యాం సుఖం గృహస్వామిన: ఇతి తథా।। అని శాస్త్ర ప్రమాణం, 
1. ఈశాన్యము నందు ఉంటే పుష్టి (శుభం),
2. తూర్పున ఉంటే ఐశ్వర్యము (శుభం),
3. ఆగ్నేయమున పుత్రహాని (అశుభం),
4. దక్షిణమున స్త్రీలకు హాని (అశుభం),
5. నైఋతిలో ఉంటే మరణము (అశుభం),
6. పడ మరలో ఉంటే సంపద (శుభం),
7. వాయవ్యంలో ఉంటే శతృపీడ (అశుభం),
8. ఉత్తరమున సౌఖ్యము అని చెప్పబడినది.

ఇంకనూ శాస్త్రము నందు గల విషయాలను పరిశీలిద్దాం. ‘‘ పూర్వోత్తరేశాన జలేశు దిక్షు కృతం జలం సౌఖ్య సుత ప్రదంచ ’’ అని కూడా కలదు. తూర్పు, ఉత్తరము, ఈశాన్యము, పడమర ఈ నాలుగు దిశలలో బావులు ఉంటే శుభములు కలుగునని చెప్పబడినది.

శ్రీముఖము, విజయము, ప్రాన్త, దుందుభి, మనోహర, చూడామణి, దిగ్బద్రము, జయము,  నందము, శంకరము అని పేర్లు కూడా ఉన్నవి, ఈ పేర్లు నేటి వాస్తు పండితులకు తెలియదు.
మరియు కాళిదాసు ‘‘సౌమ్య, ప్రాగ్జలాధీశ, కూపఖననం, కర్తూశ్ఛలక్ష్మీప్రదం అనగా ఉత్తరము, తూర్పు, పడమర దిశయందు నుయ్యి ఉన్నచో లక్ష్మీప్రదం అని చెప్పియున్నాడు అంటే కాళిదాసు మొదటిలో చెప్పుకున్న నాలుగు దిశలలో ఈశాన్యము ఉండగా ఇతని అభిప్రాయము ప్రకారము ఈశాన్యమున నుయ్యి చెప్పలేదు.
ఇదే విధానంలో మానసారము మొదలైన ప్రామాణిక గ్రంధములలో ఆగ్నేయ,వాయువ్యములందు కూడా బావులను నిర్మించుకోవచ్చని తెలుపబడినది. అంటే పై విషయములను గ్రహించగా దక్షిణ దిశయందు, నైఋతి దిశయందు కాకుండా మిగిలిన ఆరు దిశలయందు అనగా పడమర, వాయువ్య, ఉత్తర, ఈశాన్య, తూర్పు, ఆగ్నేయములయందు నూతులు, బావులు మొదలైనవి నిర్మించు కోవచ్చునని కొద్ది బేధాభిప్రాయముతో మహర్షులు అందరూ అంగీకరించినారు.

మరియు ‘‘ వీధీం బంధానుజే కూపస్ధానం ప్రకీర్తితం । తధాభావే కుత్ర చిద్వా వీధీ ముద్దిశ్య కల్పయేత్‌ అని చెబుతూ వీధికి చేరియున్న దిశలలో బావులను తవ్వుకోవచ్చని, అట్టి అవకాశము లేనిచో దక్షిణ దిశను విడచి మిగిలిన భాగములలో నూతులను తవ్వుకోవచ్చని స్పష్టమగుచున్నది. ఇలా చేయడం వలన ప్రక్క ఇళ్ల వార్కి కూడా నీటిని తోడు కుని వాడుకునే మంచి సంప్రదాయము మన పెద్దలు శాస్తప్రమాణంగా ఆలోచించి అంగీకరించినారు. (పూర్వం రోజు ల్లో మన పెరటిలోని నీరు ఇతర ఇండ్లవారు కూడా తీసుకువెళ్లేవారు గమనించండి. పరులకు నీటి దానం(సహాయం) వల్ల గతించిన పెద్దలు స్వర్గాన ఉండేవారు )

అంటే నైఋతి దిశయందు కూడా నూతులను త్రవ్వుకోవచ్చునని అర్థమవుతున్నది. నైఋతి దిశయందు నుయ్యి త్రవ్వే విషయమై చాలా మందికి చాలాచాలా అనుమానాలు రావచ్చును. దీని విషయమై అపరాజితపృచ్ఛ, సమరాంగణ సూత్రధారము అనే గ్రంధములో మహేంద్ర, ఇంద్ర, ఇంద్రజయ అనే వాస్తు పదములయందు బావి త్రవ్వినచో శుభప్రదమని తెలుపబడినది. అయితే ఈ విషయంలో విశేషమైన ఆలోచన చేయవలసియున్నది.
ఈ నైఋతి దిశ ఇంటికి నైఋతిదిశా? లేక స్థలమునకు నైఋతి దిశా? అనే ఆలోచన చేయవలసివస్తున్నది.
దీనికి వాస్తు పురుషుని పదవిన్యాస చిత్రమును అవలోకించవలసి వస్తుంది.
వాస్తు పురుషుని పద విన్యాస చిత్రంలో చెప్పినట్లుగా ఇంటి ఖాళీస్థలము యొక్క మొత్తం స్థలంలో 9వ వంతు స్థలాన్ని ఇంటిచుట్టూ విడిచిపెట్టగా మిగిలిన స్థలము ఇంటి స్థలము అగును.
అంటే ఇంటి చుట్టూ విడిచిపెట్టిన 9వ వంతు స్థలంలో నైఋతిదిశ నూతులకు పనికిరాదు.ఇంటికి ఉన్న స్థలంలో ఇంటిని ఆనుకుని నైఋతిదిశలో నూతులను తీసుకోవచ్చును అని స్ఫష్టముగా చెప్పబడినది.


ఇలా చాలా సందర్భాల్లో ఉన్న ఇళ్లు ఉన్నవి. కానీ కాల క్రమంలో శాస్త్ర ప్రమాణములు తెలియని వాస్తు పండితులు ఎక్కువగుటచే ప్రామాణిక విషయాలు మరుగున పడినవి. మరియు శాస్త్ర ప్రమాణం ఉన్న పుస్తకాలు లభ్యము కానం దున కూడా శాస్త్ర విషయాలు తెలియుటలేదు. ఈ పటంలో చూపిన విధముగా స్థలానికి నైఋతిలో నూయి దోషముగా భావించాలి. ఇంటికి ఆనుకుని ఉన్న బావిదోషము ఉండదు ఎందుకంటే ఇది శాస్త్ర ప్రమాణముగా వాస్తు పురుష పద విన్యాసమును బట్టి ఇంద్ర, ఇంద్రజయ అనే పదమునందు కట్టబడుతుంది కావున దోషములేదు. ఇటువంటి ఇళ్లు ప్రస్తుతము రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తిరుపతి మొదలైన పట్టణాల్లో ఇప్పటికీ కలవు.
ఇలా శాస్త్ర ప్రమాణంతో బావులు, నూతులు తీసుకున్నవార్కి ఏ విధమైన హాని జరగదు, మరియు శుభమైన ఫల ములు కలుగును.

ఈ మధ్య వాస్తు శాస్త్రం అనేక వెర్రివేషగాళ్లలో చిక్కి, దక్షిణం నుయ్యి ఉన్నా, లేక ఆగ్నేయం, వాయవ్యం, పడమర ఇలా దిశలలో నూయి ఉంటే పెళ్లాం వేరే వాడితో లేచిపోతుంది, మగపిల్లలకు రోగాలు, ఆడ పిల్లలకు పెళ్లి కాకపోవడం, లేచి పోవడం, అనారోగ్యాలు, గుండె జబ్బులు, ఆర్ధిక సమస్యలు ఇలా ఒకటేమిటి అనేక దోషాలు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు. ఇంకనూ ఎత్తు పల్లాలను చూపి పడమరలో నూయి ఉంటే పల్లము కనుక దోషమని చెప్పి వాది స్తున్నారే తప్ప ప్రమాణం చూపడం లేదు. ఎత్తు పల్లాలు అనేవి నేల యొక్క స్థితిగతులే తప్ప నిర్మాణ పరంగా ఉండే నూతలకు లేదు. నిర్మాణ పరమైన విశేషాలను గమనించుకుని నూతులను ఏర్పాటు చేసుకోవచ్చు.

వాస్తుపరంగా వ్యతిరేక దిశలలో ఏదైనా ఉంటే ఆరోగ్యవిషయాలలో లోపమే తప్ప పై చెప్పినదోషాలు ఏమీ జర గవు, ప్రతీ సమస్యను నూతులకు ఆపాదించరాదు, గృహ నిర్మాణంలో లోపాలు, ఇల్లు అర్వణం కుదరకపోయినా కొన్ని దోషాలు ఉంటాయే గాని ప్రత్యేకం నూతుల వల్లకాదు. నూతులు, బావుల విషయాలలో ఇంటి నిర్మాణ విషయంలో తగిన ప్రమాణము చూపే సిద్దాంతులను ఎన్నుకుని మాత్రమే గృహనిర్మాణంచు కోమని సలహాగా సూచిస్తున్నాము.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Sunday, June 3, 2018

వాస్తు శాస్త్రము - Vastu Sastram

వాస్తు శాస్త్రము - Vastu Sastra
1. (వాస్తు పురాణం): పూర్వ‌కాలంలో అంధ‌తాసుర‌డ‌నే రాక్ష‌సుడు ముల్లోకాల వాసుల‌ను ముప్ప‌తిప్పులు పెట్టుచుండెను. అప్పుడు లోక సంర‌క్ష‌ణార్థం ప‌ర‌మేశ్వ‌రుడు ఆ రాక్ష‌సునితో యుద్ధం చేశాడు. ఆ స‌మ‌యంలో శివుని ల‌లాటం నుండి రాలిన ఒక చెమ‌ట బిందువు భూమిపై ప‌డి దాని నుండి భ‌యంక‌ర‌మైన క‌రాళ వ‌ద‌నంతో ఒక గొప్ప భూతం ఉద్భ‌వించి క్ర‌మ‌క్ర‌మంగా భూమి, ఆకాశాల‌ను ఆవ‌రించి సాగింది. ఆ మ‌హాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవ‌త‌లు భయ‌భ్రాంతుల‌య్యారు. బ్ర‌హ్మ‌దేవుని శ‌ర‌ణువేడారు. స‌మ‌స్త భూత‌ముల‌ను సంభ‌వించువాడు, స‌ర్వ‌లోక పితామ‌హుడు అయిన బ్ర‌హ్మ దేవ‌త‌ల‌ను ఊర‌డించి ఆ భూత‌మును ఆధోముఖంగా భూమి యందు ప‌డ‌వేసి విధానం చెప్పాడు. బ్ర‌హ్మ‌దేవుని ఆన‌తి ప్ర‌కారం దేవ‌త‌లంద‌రూ ఏక‌మై ఆ భూత‌మును ప‌ట్టి అధోముఖంగా క్రింద‌కు ప‌డ‌వేశారు. ఆ భూతం భూమిపై ఈశ‌న్య కోణ‌మున శిర‌స్సు, నైరుతి కోణ‌మున పాద‌ములు, వాయువ్య‌, ఆగ్నేయ కోణాలందు బాహువులు వుండున‌ట్లు ఆధోముఖంగా భూమిపై ప‌డింది.
అది తిరిగి లేవ‌కుండా దేవ‌త‌లు దానిపై కూర్చున్నారు. ఇంత‌మంది దేవ‌త‌ల తేజస్ర్స‌ముదాయంతో దేదీప్య‌మానంగా వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిల‌కించిన బ్ర‌హ్మ దేవుడు దాన్నే వాస్తు పురుషుడుగా సృష్టిగావించాడు.

వాస్తు పురుషుడు భాద్ర‌ప‌ద బ‌హుళ త‌దియ‌, శ‌నివారం, కృత్రికా న‌క్ష‌త్ర‌ము, వ్య‌తీపాత యోగ‌ము, భ‌ద్ర‌నా క‌ర‌ణ‌ము గుళిక‌తో కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జ‌న్మించాడు. ఏ అప‌కారం చేయ‌ని నాపై అధిష్టించి ఈ దేవ‌త‌లు పీడించుచున్నారు. వీరి నుండి న‌న్ను కాపాడ‌మ‌ని వాస్తు పురుషుడు బ్ర‌హ్మ‌దేవున్ని వేడుకున్నాడు.అప్పుడు బ్ర‌హ్మ‌దేవుడు సంతోషించి వాస్తు పురుషా ! గృహ‌ములు నిర్మించున‌ప్పుడు, త్రివిధ‌మ‌యిన గృహ ప్ర‌వేశ స‌మ‌య‌ములందు, గ్రామ‌, న‌గ‌ర ప‌ట్ట‌ణ‌, దుర్గ దేవాల‌య‌, జ‌లాశ‌య, ఉద్యాన‌వ‌న నిర్మాణ స‌మ‌య‌ములందు ముందుగా నిన్నే పూజిస్తారు.

అలా పూజించ‌ని వారికి ద‌రిద్ర‌ముతో పాటు అడుగ‌డుగునా విఘ్న‌ములు చివ‌ర‌కు మృత్యువు కూడా సంభ‌వించున‌ని వాస్తు పురుషునికి వ‌ర‌మిచ్చారు. అంతేకాక వాస్తు ప‌రుషునిపై అష్ట‌దిక్కుల‌లో వున్న దేవ‌త‌లు తృప్తి పొందు విధంగా ఆయా స్థ‌లాల‌లో నివ‌సించే దేవ‌త‌లు వారివారి విధులు నిర్వ‌హించుట వ‌ల‌న గృహ‌స్థుల‌కు స‌ర్వ‌సుఖ‌ములు, స‌త్ఫ‌లితులు క‌లుగున‌ట్లు ఆశీర్వ‌దించారు.
బ్ర‌హ్మ‌దేవుని ఆశీస్సులు ప్ర‌కారము:
 • ఈశాన్య‌మున – ఈశ్వ‌రుడు (ఈశ‌), 
 • ఆగ్నేయ‌మున – అగ్ని, 
 • నైరుతిన - ఆదిత్య‌డు, 
 • వాయువ్య‌మైన – వాయువు, 
 • తూర్పున – వ‌రుణుడు, 
 • ఉత్త‌ర‌మున – కుబేరుడు (సోమ‌), 
అష్ట‌దిక్కుల‌లో అధిష్టించిన ఈ దేవ‌త‌లు తృప్తి చెందే విధంగా నిర్మాణ క్ర‌మం వుంటే ఆ గృహంలో నివ‌సించే వాళ్లు స‌ర్వ‌సుఖ సంప‌ద‌ల‌ను పొందుతారు. ఇదీ వాస్తు – పురాణం.

ఈశాన్య‌ములో పూజ‌లు, ప‌విత్ర కార్య‌ములు అగ్నేయ‌మున అగ్నిదేవునికిసంబంధించిన వంటావార్పు నైరుతిన ఆయుధ సామాగ్రి, వాయువ్య‌మున స్వ‌తంత్రాభిలాష చిహ్న‌ములు, తూర్పున ఆధిత్యునికి ప్రీతిక‌ర‌మైన ప‌నులు,య‌మ‌స్థాన‌మైన ద‌క్షిణ‌ము శిర‌స్సు ఉంచి నిద్రించుట‌, కుబేర స్థాన‌మైన ఉత్త‌రాన్ని ద‌ర్శిస్తూ మేలు కొనుట‌, వ‌రుణ స్థాన‌మైన ప‌శ్చిమాన పాడి ప‌శువుల‌ను పెంచుట మొద‌లైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న దేవ‌త‌ల‌కు తృప్తిని క‌లిగిస్తాయి. ఈ సారాంశాన్ని వాస్తు శాస్త్రం నియ‌మాలు మ‌న‌కు వెళ్ల‌డిస్తున్నాయి.

గృహ నిర్మాణాలు చాలా ర‌కాలు వీటిలో మ‌న‌ష్యోప‌యుక్త‌ములు, ప‌శ‌వుల‌కు సంబంధించిన నిర్మాణాలు, ప‌క్షుల‌కు సంబంధించిన నిర్మాణాలు దేవ‌త‌ల‌కు సంబంధించిన నిర్మాణాలు ఇలాగ అనేక విధాలుగా వున్నాయి.

వాస్తుశాస్త్రక‌ర్త‌లు నిర్మాణాల‌ను ముఖ్యంగా 4 భాగాలుగా విభ‌జించారు. 
(1) సాధార‌ణ మ‌నుష్య నివాస‌ములు
(2) ప్ర‌భు నిర్మాణ‌ములు
(3) దేవ‌తా నిర్మాణ‌ములు
(4) స‌ర్వ‌సాధార‌ణ ప్ర‌జోప‌యోగ నిర్మాణాలు.
సామాన్యంగా ప్ర‌తి గృహ‌స్తుల‌కు అవ‌స‌ర‌మైన స‌దుపాయ‌ముల‌ను గురించి మార్పుల‌తో నిర్మాణాలు చెప్ప‌బ‌డియున్న‌వి.

ఏనాటిదీ వాస్తుశాస్త్రం?
వాస్తు ఈనాటిదికాదు.. రాజుల కాలం నుంచే ఉంది. ప్రతి రోజు కొలువులో ఒక జ్యోతిషునితో పాటు ఒక వాస్తు పండితుడు కూడా ఉండేవాడు. మహారాజు ఏ నిర్మాణం చేయాలన్నా వాస్తు పండుతుల సూచనలు పాటించినట్లు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. అంతేకాదు.... వాస్తు వేదకాలం నాటిది అని చెప్పేందుకు ఆధారంగా పలు తాళపత్ర గ్రంథాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

2. స్థలంలో దిక్కుల-సూచనలు:
స్థలంలో దిక్సూచినుపయోగించి ఉత్తర దక్షిణాలకు నిర్ధారించాకే తూర్పు, పడమరలను తదనుగుణంగా నిర్ణయించడం సులవవుతుంది. స్థలానికి నాలుగు దిక్కులే కాదు. నాలుగు మూలలు కూడా ఉంటాయి. వాటిని నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా, గ్రంథస్తంగా అందుతున్న పరిజ్ఞానాను సారంగా అయితే.... ఒక దిక్కును తొమ్మిది భాగాలుగా విభజించి, అటుపై మూలల నిర్ణయం చేయాలి. ఆ వివరాలు వివరంగా తెల్సుకుందాం.

తూర్పు దిక్కును '9' భాగాలు చేయండి. మీరు తూర్పుకు తిరిగి నిలబడినపుడు తూర్పు దిక్కులో మీ కుడిచేతి వైపు ఉన్న రెండు భాగాలు తూర్పు ఆగ్నేయంగా భావించాలి. అలాగే మీ ఎడమ చేతివైపు ఉన్న చివరి రెండు భాగాలు తూర్పు ఈశాన్యంగా.. ఈ రెంటి నడుమ ఉన్న అయిదు భాగాలను తూర్పు దిక్కుగా భావించాలి.

ఒక ఉత్తరం విషయానికొస్తే... మీరు ఉత్తరదిశగా తిరిగితే... మీ కుడిచేతి వైపున ఉండే చివరి రెండు భాగాలు ఉత్తర ఈశాన్యం, ఎడమచేతి చివరగా ఉండే రెండు భాగాలు ఉత్తర వాయువ్యం, వీటి నడుమ ఉన్న అయిదు భాగాలు ఉత్తర దిక్కుగా భావించాలి.

ఇక పడమర వియానికొస్తే... మీరు పడమర దిక్కుగా నిలబడినపుడు పడమర దిక్కులోని 9 భాగాలలో మీ కుడిచేతివైపు చివరగా ఉండే రెండు భాగాలు పశ్చిమ వాయువ్యంగాను, మీ ఎడమ చేతివైపు చివరగా ఉండే రెండు భాగాలు పశ్చిమ నైఋతిగాను వీటి నడుమ ఉండే అయిదు భాగాలు పశ్చిమ దిశగా గ్రహించాలి.

దక్షిణాన్ని కూడా ఇలానే గమనిస్తే.. మీరు దక్షిణ దిశగా తిరిగి నిలబడినపుడు.. మీకుడి చేతి చివరన ఉన్న రెండు భాగాలు... దక్షిణ నైఋతి. అలానే ఎడమచేతి వైపు చివరగా ఉండే రెండు భాగాలు దక్షిణ ఆగ్నేయం అని గ్రహించాలి. స్థలం ఏదయినా సరే దిక్కులు, మూలల్ని ఇలా నిర్ణయించుకోవాలి.

3. గృహ నిర్మాణ స్థల వైశిష్ట్యం:
గృహ నిర్మాణ సమయంలోనే వాస్తు నియమాలు పాటిస్తే సరిపోదు. గృహ నిర్మాణ నిమిత్తం స్తలాన్ని చేసుకునే తరుణంలో కూడా హండ్రెడ్‌ పర్సెంట్‌ ఆ స్థలం విషయంలో వాస్తు నియమాలు పాటించాలి. ఏ మాత్రం వాస్తుకు వ్యతిరేకంగా లేని స్థలాన్ని మాత్రమే సెలక్టు చేసుకుని... ఆ స్థలంలోనే పూజాది కార్యక్రమాలు నిర్వహించి వాస్తు పూజ విధిగా చేసి... అప్పుడు గృహ నిర్మాణం ప్రారంభించాలన్నది శాస్త్రం చేస్తున్న సూచన.
 1. మీరు తీసుకునే స్థలం బల్లపరుపుగా చదునుగా ఉండాలి.
 2. మీ స్థలానికి పడమర దిశలో కానీ, దక్షిణ దిశలో కానీ తటాకాలు, కాలువలు, జలాశయాలు, పెద్ద పెద్ద గోతులు ఏ మాత్రం ఉండకూడదు.
 3. పడమర, దక్షిణ దిశలలో స్థలం ఎత్తుగా ఉండవచ్చు. ఆనుకుని ఉన్నస్థలం మెరకగా ఉండవచ్చు. ఎత్తయిన కొండలు, గుట్టలు ఏవయినా ఉండవచ్చు. ఇది గృహ నిర్మాణానికి అనువైన స్థలంగా వాస్తు చెబుతుంది.
 4. మీరు సెలక్టు చేసుకున్న స్థలం... ఉత్తరం పల్లంగా ఉండవచ్చు... ఉత్తర భాగాన జలాశయాలు, కాలువలు ఉండవచ్చు.
 5. అలాగే తూర్పు దిశలో కూడా ఎలాంటి మెరలు, గుట్టలు లేకుండా మీ తూర్పుదిక్కున స్థలం పల్లంగా ఉండాలి. స్థలానికి తూర్పున తటాకం, జలాశయం, బావి, గొయ్యి, కాలువ ఇలాంటివి ఏవి ఉన్నా దాన్ని శుభప్రదమైన స్థలంగా పరిగణించాలి.
 6. మీరు నిర్ణయించుకున్న స్థలానికి నైఋతి దిశలో ఎంత ఎత్తయిన కట్టడాలువ ఉంటేవ మీకు అంత శుభప్రదం, నైఋతిలో మెరక, కొండలు, గుట్టలు ఉన్నా అది శుభాదయకమే.
 7. నైఋతి, ఆగ్నేయం, వాయువ్య దిక్కులతో పోల్చినపుడు... ఈశాన్య దిక్కు పల్లంగా ఉంటే అది ఎంతో మంచిది.
 8. ఒకవేళ ఇలా లేకున్నా.... ఈశాన్యాన్ని పల్లంగా చేసుకుంటే ఉత్తమం. పొరపాటున కూడా ఈశాన్యం కన్నా ఇతర మూడు మూలలు పల్లంగా ఉండరాదు.
 9. స్థలాన్ని సెలక్టు చేసుకునే సమయంలో... మీ స్థలానికి అతి చేరువలో స్మశానం, కర్మాగారాలు, అధిక ధ్వనిని కల్గించే రైల్వే మార్గాలు, స్టేషన్‌లు, విమానాశ్రయాలు లేకుండా తగు జాగ్రత్త పాటించాలి. ధ్వని కాలుష్యం మీరు నివశించే చోటుకు అతి చేరువగా ఉంటే... మీ ఆరోగ్యం పై ఈ ధ్వని కాలుష్యం ప్రభావం చూపుతుంది.
 10. స్థలానికి అతి చేరువలో మురుగు ప్రవహించే కాలువలు లేకుండా చూసుకోవాలి. అలానే నీరు నిలిచిపోయే గోతులు లేకుండా జాగ్రత్త వహించాలి.
 11. స్థలాన్ని త్రవ్వినపుడు ఎముకలు, దంతాలు బయటపడినా, పాము పుట్టలు, దిబ్బలు బయటపడినా అది నివాసయోగ్యం కాని స్థలంగా భావించి దాన్ని వదిలివేయాలి.
 12. ఉత్తరం కన్నా దక్షిణం మెరకగా అంటే ఎత్తుగా ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే... ఆ గృహంలో నివశించే వారి ఆర్ధిక పరిస్థితి ఉన్నతంగా ఉంటుంది.
 13.  ఇలా కాకుండా దక్షిణం పల్లం ఉత్తరం మెరకగా ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా పలురకాల సమస్యలు ఈ గృహంలో నివశించే వార్ని వేధిస్తాయి.
 14.  తూర్పు కన్నా, పడమర ఎత్తుగా ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేశారంటే... ఈ గృహంలో నివసించే వారికి చక్కని మనశ్శాంతి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ప్రశాంతంగా జీవించ గల్గుతారు.
 15. తూర్పు ఎత్తుగాను, పడమర పల్లంగాను ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే.. మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, పలురకాల ఇబ్బందులు వీర్ని వెన్నాడుతూనే ఉంటాయి.
 16. నైఋతి దిక్కుకన్నా ఈశాన్య దిక్కులో స్థలం పల్లంగా ఉన్నట్లయితే.. ఈ స్థలం గృహ నిర్మాణానికి ఎంతో శుభప్రదమైనదిగా వాస్తుశాస్త్రం చెబుతుంది. మంచి ఆరోగ్యం, మంచి గౌరవ ప్రతిష్ఠలు, పదుగురు అభినందించే సంతతి ఇలాంటి గృహంలో నివశించే వారికి లభ్యమవుతాయి.
 17. ఆగ్నేయం కన్నా వాయువ్యం పల్లంగా ఉండాలి. ఇలాంటి స్థలంలో గృహనిర్మాణం వాస్తు నియమానుసారం చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సమాజంలో మాంచి గౌరవ ప్రతిష్ఠలు పొందగల్గుతారు.
 18. వాయువ్యం ఎత్తుగా ఉండి... వాయువ్య కన్నా ఆగ్నేయం తక్కువ ఎత్తులో ఉండే స్థలంలో గృహ నిర్మాణం చేయరాదు.
 19. నైఋతి మూలకన్నా ఈశాన్యం మూల ఎత్తుగా ఉన్న స్థలంలో కూడా గృహనిర్మాణం చేయరాదు.
4. స్థలం - దాని ఆకారం:
అన్ని స్థలాలు చక్కగా చతురస్రంగానో, దీర్ఘ చతురస్రంగానో ఉంటాయనుకోవడం పొరపాటే రకరకాల ఆకారాల్లో స్థలాలు ఉంటాయి. ఆ స్థలం ఏ ఆకారంలో ఉంటే ఆ స్థలం నివాస యోగం అవుతుందో తెల్సుకుందాం.
 • ఘటాకార స్థలం... ఇది కుండను పోలి ఉంటుంది. 
 • విసనకర్ర ఆకారంలో ఉండే స్థలం అర్ధవృత్తాకారంలో ఉండే స్థలం, 
 • రోకలి ఆకారంలో ఉండే స్థలం, 
 • మద్దెల ఆకారం గల స్థలం, 
 • ఢమరుకాకార స్థలం, 
 • అండాకార స్థలం 
ఇలాంటి ఆకారాలలో ఉండే స్థలాలు గృహ నిర్మాణానికి యోగ్యమైనవి కావు, ఖచ్చితంగా వృత్తాకారంలో ఉన్నస్థలం అయితే ఇది వ్యాపార సంస్థల నిర్మాణానికి అనువైన స్థలం.

5. వీదిశూల విషయంలో..
వీధిశూల అని వీధి పోటు అని పిలువబడే వీటి విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. స్థలం తీసుకునే తరుణంలోనే ఈ వీధిపోట్లును గుర్తించాలి. వీధి ఫలితాలు తెల్సుకుని స్థలాన్ని కొనడం చేయాలి. మన స్థలానికి ఎదురుగా వీధి ఉంటే దానిని వీధిపోటు అంటాము. ఏ వీధిపోటు ఎలాంటి ఫలితాలనిస్తుందో సవివరంగా తెల్సుకుందాం.

తూర్పు ఈశాన్య వీధిపోటు:
 • ఇక్కడి చిత్రాన్ని గమనిస్తే చాలు.... ఈ వీధిపోటు ఎలా ఉంటుందో మీరు సులభంగా అర్ధం చేసుకోగల్గుతారు. 
 • తూర్పు ఈశాన్య వీధిపోటు ఆ గృహంలో నివశించే పురుషులపై ప్రభావం చూపుతుంది. 
 • ఇంటా బయటా వీరిదే పైచేయి అన్నట్లుంటుంది వీరి పరిస్థితి. 
 • ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మంచి గుర్తింపు, మన్నన వీరికి లభిస్తాయి. 
 • సమాజంలో మంచి గౌరవ ప్రతిష్ఠలు పొందగల్గుతారు. 
 • ఇది శుభప్రదమైన వీధిశూలే. 
 • ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలంలో గృహ నిర్మాణం ఆమోద యోగ్యమే.
ఉత్తర ఈశాన్యం వీధిపోటు:
 • ఉత్తర ఈశాన్యం వీధిపోటు... ఎంతో శుభప్రదం, లాభదాయకం, ఇంట సిరులు కురిపించే వీధిపోటు ఇది. 
 • ఈ ఇంట ధనమే కాదు, ఆరోగ్యం కూడా దండిగా ఉంటుంది. 
 • ఈ ఇంటో నివశించే దంపతులు ఎంతో అన్యోన్యంగా దాంపత్యాన్ని సాగిస్తారు. 
 • కుటుంబంలో సభ్యుల నడుమ మమతానురాగాలు పెనవేసుకుంటాయి. 
 • ఇంటా బయటా స్త్రీ పురుష బేధం లేకుండా ఈ ఇంట నివసించే వారికి మంచి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. 
 • ఇలా ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఉన్న స్థలం లభిస్తే... వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించి అయినా తక్షణం కొనేసుకోండి.
ఉత్తర వాయువ్యం వీధిపోటు:
 • ఈ వీధిపోటు శుభదాయకం కాదు. ముఖ్యంగా ఈ వీధిపోటు ఆ ఇంట నివశించే మహిళలపై ప్రభావం చూపుతుంది. 
 • మనశ్శాంతిగా ఉండలేరు. 
 • సంసారంలో సుఖ సౌఖ్యాలు కరువవుతాయి. 
 • ఆడపిల్లలకు చదువు అబ్బదు. 
 • వివాహాల సమయంలో కూడా ఎన్నోచిక్కులు ఎదురవుతాయి. 
 • ఇలాంటి స్థలాన్ని కానీ, ఇంటిని కానీ కొనకూడదు.
పశ్చిమ వాయువ్యం వీధిపోటు:
 • పశ్చిమ వాయువ్య దిశలో ఇంటికి ఎదురుగా వీధి ఉన్నట్లయితే దాన్ని పశ్చిమ వాయువ్య వీధిపోటుగా పరిగణించాలి. 
 • ఈ వీధిపోటు ఉన్న స్థలం కొనదగినది. 
 • గృహ నిర్మాణం చేయదగినది. 
 • ఈ వీధిపోటు పురుషులపై సత్ప్రభావం చూపుతుంది. 
 • రాజపూజ్యం, గౌరవ ప్రతిష్ఠలు, ఎల్లెడలా ఆధిపత్యం, రాజకీయాలలో నాయకులుగాను త్వరగా ఎదుగుతారు. 
 • మట్టి ముట్లుకున్నా బంగారం అన్నట్లుంటుంది ఈ ఇంటి నివశించే పురుషుల పరిస్థితి. 
 • ఇలాంటి స్థలాన్ని రెండో ఆలోచన లేకుండా కొనేయాలి.
పశ్చిమ నైఋతి వీధిపోటు:
 • ఈ వీధిపోటు ఆ ఇంట నివశించే పురుషులపై ప్రధానంగా ప్రభావం చూపుతుంది. 
 • జీవితం గొర్రెకు తోక బెత్తెడే అన్నట్లుంటుంది. కష్టానికి తగ్గ ఫలితం లభించదు. 
 • నిరాశా నిస్పృహలకు గురిచేస్తుంది. 
 • మనశ్శాంతిని హరిస్తుంది. 
 • జీవితం ఆపజయాల జాతర అన్నట్లు మారుతుంది. 
 • ఆపవాదులు, నిందలు, ఈ ఇంట మగవారిని బాధించి వేధిస్తాయి. 
 • విజయం చేతికందినట్లే అంది పరాజయాన్ని మిగులుస్తుంది. 
 • మగవారి పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆ కుటుంబం ఎలా ఉంటుందో మీరే అలోచించండి.
దక్షిణ నైఋతి వీధిపోటు:
 • దక్షిణ నైఋతికి ఎదురుగా వీధి ఉంటే.. దాన్ని దక్షిణ నైఋతి వీధిపోటుగా భావించాలి. 
 • ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలాన్ని, ఇంటిని కొనకూడదు. 
 • ప్రత్యేకించి ఈ వీధిపోటు ప్రభావవం ఆ ఇంట గృహిణిపైన ఉంటుంది. 
 • కాపురం కలతల కల్లోలంగా ఉంటుంది. 
 • దాంపత్యంలో అనురాగం కొరవడుతుంది. 
 • ఇంటి యజమానురాలి ఆరోగ్యం బాగుండదు.
 • ఏ కార్యం తలపెట్టినా ఎదురుతిరుగుతుంది. 
 • మనసు ఎప్పుడూ కల్లోల సాగరంలా ఉంటుంది. 
 • ఊరకే కృంగిపోతుంటారు. 
 • ఇంటా బయటా అవమానాలే.
దక్షిణ ఆగ్నేయ వీధిపోటు:
 • ఇలాంటి వీధిపోటు... ఉన్న స్థలాన్ని, ఇంటినీ నిశ్చింతగా కొనవచ్చు. 
 • ఈ ఇంట నివసించేవారు.. ఆనందప్రదమైన జీవితాన్ని అనుభవిస్తారు. 
 • డబ్బుకు కొదవే ఉండదు. 
 • అలానే ఈ ఇంట నివసించే వారికి ఆరోగ్యానికీ కొదవ ఉండదు. 
 • ఎప్పుడూ ఈ ఇల్లు ధన ధాన్యాలతో తులతూగుతుంటుంది. 
 • బంధుమిత్రులతో కళకళలాడుతుంటుంది. 
 • ఈ ఇంట నివశించే ఆడవారు, ఆడపిల్లల చదువుల్లో సరస్వతుల్లా రాణిస్తారు. 
 • మంచి ఉద్యోగాలను పొందగల్గుతారు. 
 • మంచి ఖ్యాతి విఖ్యాతులు సొంతం చేసుకుంటారు.
తూర్పు ఆగ్నేయ వీధిపోటు:
 • తూర్పు ఆగ్నేయ దిశలో వీధిపోటు ఉందంటే... ఆ ఇంట నివశించే వారి జీవితం... నిత్యం అల్లకల్లోలం అన్నట్లుంటుంది. 
 • జయాలు శూన్యం. 
 • అపజయాలు అపారం. 
 • జీవితంలో కష్టాలు కోకొల్లలు. 
 • సుఖాలు కోటి దివిటీలతో వెతికినా కన్పించవు. 
 • మనసు సునామీ నాటి సంద్రంటా ఉంటుంది. 
 • వేయి ప్రయత్నాలు చేస్తే 999 విఫలం అన్నట్లుంటుంది జీవితం. 
 • అటు వృత్తిలో అయినా, ఇటు వ్యాపారంలో అయినా విజయం ఎండమావే అవుతుంటుంది. తూర్పు ఆగ్నేయ వీధిపోటున్న ఇంటిని, స్థలాన్ని కొనకూడదు.
వీధిపోట్లు పట్ల నిర్లక్ష్యం:
 • వాస్తుశాస్త్రం రీత్యా వీధిపోట్లు విషయంలో చాలాచాలా అప్రమత్తంగా ఉండాలి. 
 • సుఖశాంతుల్ని, జీవితంలో సెక్సెస్‌లను మింగేసి... అశాంతిని మిగిలించే వీధిపోట్లు ఉన్నా ఇళ్ళు, స్థలాలు, వ్యాపార దుకాణాలు... వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 
 • శాస్త్రాన్ని, శాస్త్ర సూచనలను నిర్లక్ష్యం చేసి... కోరి కలతల్ని కొనితెచ్చుకోవలన్నదే మా విన్నపం.
6. దిక్కులు , మూలల:
వాస్తుశాస్త్ర విరుద్ధంగా మూలలు పెరిగిన స్థలాలను వాస్తు నియమాల రీత్యా సరిచేసుకుని అప్పుడు గృహనిర్మాణం చేసుకుంటే.. ఆ ఇల్లు సుఖశాంతుల నిలయం అవుతుంది. పారిజాతపు వనంలా సంతసంతో ప్రకాశిస్తుంది.

ఇక పెరిగిన మూలలు వాటిని సరిచేసుకునే విధానం తెల్సుకుందామా?

A. తూర్పు ఆగ్నేయం
ఈ మూల పెరగడం ఏ మాత్రం క్షేమదాయకం కాదు. ఆ మూలను సరిచేసుకున్నాకనే గృహ నిర్మాణం చేపట్టాలి. పెరిగిన మూలలో వున్న స్థలాన్ని కట్‌చేసి... గృహ నిర్మాణ స్థలంలో కలపకుండా వేరుగా ఉంచాలి. ఈ స్థలాన్ని మొక్కలు పెంచుకునేందుకు ఉపయోగించండే తప్ప... నిత్యం వాడుకునే విధంగా మాత్రం మలచుకోవద్దు. ఇక్కడి చిత్రంలో ఉన్న భాగాన్ని కట్‌చేసి వదిలివేయాలి.

B. తూర్పు ఈశాన్యం
తూర్పు ఈశాన్యం స్థలం పెరిగితే... తొలగించాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థలం అదృష్టదాయకం. ఆయురారోగ్య ధనధాన్యాభివృద్ధికి నిలయం అవుతుందీ స్థలం. ఎంత అదనపు సొమ్ము చెల్లించి అయినా ఇలాంటి స్థలాన్ని నిశ్చింతగా కానండి.

C. ఉత్తర ఈశాన్యం
ఇలా ఉత్తర ఈశాన్యం పెరిగి వున్న స్థలాన్ని కూడా మరో ఆలోచన చేయకుండా కొనుక్కోవచ్చు. ఇలా ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కట్‌చేసి తొలగించాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉంచుకోవచ్చు. ఈ ప్రదేశంలో బరువైన నిర్మాణాలు చేయకూడదు. ఈ స్థలాన్ని వదిలేస్తేనే వాస్తురీత్యా శుభప్రదం.

D. ఉత్తర వాయువ్యం
మీరు కొనే స్థలం ఉత్తర వాయువ్యం పెరిగి ఉంటే... పెరిగిన మేర కట్‌చేసి దానిని నిర్మాణాలకు ఏమాత్రం వినియోగించకుండా... మిగిలిన స్థలంలో గృహ నిర్మాణం చేసుకోవాలి.

E. పశ్చిమ వాయువ్యం
పశ్చిమ వాయువ్యం పెరిగి ఉండడం కూడా వాస్తు శాస్త్ర రీత్యా శుభ సూచకంకాదు. కనుక పశ్చిమ వాయువ్యంలో పెరిగి వున్న స్థలాన్ని కట్‌ చేసి తొలగించి... మిగిలిన స్థలంలో గృహ నిర్మాణం చేయాలి.

F. పశ్చిమ నైఋతి
పశ్చిమ నైఋతి పెరిగి ఉండటం కూడా వాస్తురీత్యా ఆమోదనీయం కాదు. జాగ్రత్తగా పెరిగిన పశ్చిమ నైఋతీ భాగాన్ని కట్‌చేసి, స్థలాన్ని చతురస్ర లేదా దీర్ఘ చతురస్రాకారంగా తయారు చేసుకుని ఆ స్థలంలో గృహ నిర్మాణం చేయాలి.

G. దక్షిణ నైఋతి
ఇక్కడి చిత్రాన్ని గమనిస్తే దక్షిణ నైఋతి పెరిగినట్లు అర్ధం అవుతుంది. దక్షిణ నైఋతి పెరిగి ఉండకూడదు. పెరిగిన మేర కట్‌ చేయాల్సిందే. తూర్పు, పడమర భుజాలు సమంగా ఉండేలా చూసుకుని దక్షిణ నైఋతిని కట్‌ చేయాలి.

H. దక్షిణ ఆగ్నేయం
దక్షిణ ఆగ్నేయం పెరగడం కూడా వాస్తు శాస్త్ర రీత్యా సమ్మతమైన విషయం కాదు. పెరిగిన దక్షిణ ఆగ్నేయాన్ని తప్పకుండా కట్‌చేసి తొలగించాల్సిందే. దక్షిణ ఆగ్నేయం పెరగటం అంటే.. నైఋతి తగ్గటం అన్నమాట. నైఋతి పెరిగినా, తగ్గినా అది శుభప్రదం కాదు.

కొన్ని స్థలాలు.. ఒకమూలే కాకుండా... రెండు మూలలు కూడా పెరిగి ఉంటాయి. వాటిని సరిచేసుకున్నాకనే గృహ నిర్మాణం కావించాలి. ముఖ్యంగా ఇలా మూలలు పెరిగిన వాటిని కరెక్టు చేయకుండా నిర్మాణాలు చేపట్టి ఉంటే.. ఒకవేళ అలాంటి నిర్మాణాలు మీరు కొనుగోలు చేయవలసి వస్తే... ఆ నిర్మాణం గావించబడిన స్థలం.. ఏ మూల పెరిగిందో తెల్సుకోండి. ఒకవేళ ఆ పెరుగుదల అశుభ సూచకం అయినట్లయితే.. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ మూలలలో అదనంగా ఉన్న స్థలాన్ని కట్‌ చేయడానికి అనువుగా గృహ నిర్మాణం జరిగి ఉంటే... మీరా ఇంటిని కొన్నాక అయినా.. ఇంటి స్థలంలో పెరిగిన భాగాన్ని కట్‌ చేయండి. దాన్ని ఏ మాత్రం వాడుకలో ఉండకుండా పూర్తి జాగ్రత్తలు వహించండి. ఒకవేళ పెరిగిన మూలలు సరిచేసేందుకు వీలుగా గృహ నిర్మాణం లేకపోయినట్లయితే ఆ గృహాన్ని కొనకుండా వదిలేయండి. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం పెరిగి వున్న స్థలాన్ని అలాంటి స్థలంలో నిర్మించబడిన గృహాలను నిశ్చింతగా కొనేయండి.

7. ప్రహరీ గోడ నిర్మాణం:
ముందుగా వాస్తుపరంగా మన ఇంటి ప్రహారీ ఎలా నిర్మంచుకోవాలో తెల్సుకుందాం. ప్రధానంగా ప్రహారిగోడ ఎత్తు విషయంలో వాస్తు నియమాలు తప్పని సరిగా పాటించాలి. తూర్పు ప్రహారీ గోడ కన్నా ఉత్తరం వైపు ప్రహారీగోడ తప్పకుండా కొంత ఎత్తుగా ఉండాలి. ఉత్తరం ప్రహారీ గోడకన్నా పడమర ప్రహారీగోడ కొంత ఎత్తుగానే ఉండాలి. ఇక పడమర ప్రహారీగోడకన్నా దక్షిణం ప్రహారీగోడ ఇంకొంత ఎత్తుగా ఉండాలి. అన్నింటికన్నా తక్కువ ఎత్తులో తూర్పు ప్రహారీగోడ, అన్నింటికన్నా ఎక్కువ ఎత్తులో దక్షిణ ప్రహారీగోడ ఉండాలి. అలానే తూర్పుకన్నా పడమర... ఉత్తరం కన్నా దక్షిణం ప్రహారి గోడలు పోల్చి చూసినపుడు ఎత్తుగా ఉండి తీరాల్సిందే.

ప్రహారిగోడకు గేట్లు నిర్ణయం: కాంపౌండ్‌ వాల్‌కు గేట్లు అమర్చుకునే విషయంలో వాస్తు చక్కని నియమాలను సూచించింది. ఆ నియమాలకు అనుగుణంగా ప్రహారీగోడకు గేట్లు ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు వైపు కాంపౌండ్‌ వాల్‌కు ఎక్కడ గేటు అరేంజ్‌ చేసుకోవాలో ముందుగా తెల్సుకుందాం. సహజంగా దక్షిణం కన్నా ఉత్తరం వైపు గృహ నిర్మాణ సమయంలో ఎక్కువ జాగా వదులుతాం. ఆ స్థలాన్ని కొలచి.. ఖచ్చితంగా దానికి మధ్యలో ఉంచేలా తూర్పు ఈశాన్యంలో కాంపౌండ్‌ వాట్‌ గేటు అమర్చుకోవాలి. ఇది సులవైన విధానం. ఇలానే తూర్పు కాంపౌండ్‌ వాల్‌ పొడవుఉ 9 భాగాలుగా విభజించి, ఉత్తరం నుండి మూడు నాల్గు భాగాలలో కూడా కాంపౌండ్‌ వాట్‌ గేటు అమర్చుకోవచ్చు. అలానే స్థలంలో గృహ నిర్మాణం జరిగినపుడు... ఇంటి సింహద్వారం ఎక్కడయితే వస్తుందో... దానికి ఎదురుగా కూడా తూర్పు కాంపౌండ్‌ వాల్‌కు మరో గేటు... వాహనాల రాకపోకలకు అనువుగా ఏర్పాటు చేసుకోవచ్చు.

ఉత్తరం ప్రహరీ గోడకు గేట్లు విషయంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలి. గృహ నిర్మాణానికి ఉపయోగించే స్థలం పోగా తూర్పున ఎంత స్థలం అయితే వదిలారో... ఆ స్థలానికి మధ్యలో వచ్చేలా ఉత్తర ఈశాన్యంలో గేటు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరం కాంపౌండ్‌ వాల్‌ను 9 భాగాలు చేసి తూర్పు నుండి 3,4 భాగాలలో కూడా గేట్‌ను అమర్చుకోవచ్చు.

పడమర కాంపౌండ్‌ వాల్‌కు గేటు అమర్చుకోవాలంటే కూడా ఇలాంటి నిబంధనలనే పాటించండి. సహజంగా దక్షిణం కన్నా ఉత్తర దిశలో ఇంటిని ఎక్కువ స్థలం వదులుతాము కనుక... ఈ ఖాళీ స్థలానికి మధ్యభాగంలో ఉండేలా పడమర కాంపౌండ్‌ వాల్‌కు పడమర వాయువ్యంలో గేట్‌ అమర్చుకోవాలి. అలానే పడమర కాంపౌండ్‌ వాల్‌ను తొమ్మిది భాగాలుగా విభజించి... మూడు, నాల్గవ భాగాలలో వచ్చేలా గేట్‌ను నిర్మించుకోవచ్చు.

ఇక దక్షిణ కాంపౌండ్‌ వాల్‌ విషయానికొస్తే... గృహ నిర్మాణానికి వినియోగించే స్థలం పోగా తూర్పున ఎలాగూ ఎక్కువ జాగా వదలడం జరిగి తీరుతుంది కనుక... ఈ తూర్పున ఉన్న ఖాళీ స్థలానికి మధ్యలో వచ్చేల దక్షిణ ఆగ్నేయంలో కాంపౌండ్‌వాలో గేటు అమర్చుకోవాలి. అలానే దక్షిణ ప్రహరీ గోడను 9 భాగాలుగా విభజించి తూర్పు వైపు నుండి 3,4 భాగాలలో కూడా ప్రహరీ గోడ గేట్‌ను అమర్చుకోవచ్చు.
 1. ప్రహరీ గోడకు అమర్చిన గేట్‌ పరికరాలు ఎప్పుడూ కాంతివంతంగా ఉండాలి. ఈ గేటు ఉన్న ప్రాంతంలో చీకటిగా ఉండకూడదు.
 2. గేట్‌ను లోపలకు తెరిచే విధంగా అమర్చుకోవాలన్న నిబంధనను తప్పక పాటించండి.
 3. కాంపౌండ్‌వాల్‌ గేటుకు ఎదురుగా కరెంటు స్తంభాలు, కరెంటు ట్రాన్స్‌ఫార్మర్స్‌ ఉండకూడదు.
 4. కాంపౌండ్‌వాల్‌ గేటుకు ఎదురుగా చెట్లు ఉండడం, గోతులు, గుట్టలు ఉండడం, పాడుబడిన ఇళ్ళు ఉండడం కూడా వాస్తుశాస్త్ర విరుద్ధమే.
 5. కాంపౌండ్‌వాల్‌ గేటు ఇంటి ప్రధాన సింహద్వారం కన్నా తక్కువ ఎత్తులో ఉండి తీరాలి. ఈ నిబంధనను కూడా విధిగా పాటిచాలి.
 6. కాంపౌండ్‌వాల్‌ గేటుకు ఎదురుగా చెత్తాచెదారం కుప్పలు, చెత్త కుండీలు, మురికినీరు నిల్వ ఉండడం వంటివి లేకుండా తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి.
 7. కాంపౌండ్‌వాల్‌కు అమర్చే గేటు ఇంట్లోని అన్ని తలుపుల కన్నా స్ట్రాంగ్‌గా, హెవీగా, పెద్దదిగా ఉండాలి.
 8. ప్రహరీ గోడ గేటు తీసే సమయంలో వేసే సమయంలో శబ్దం చేయకూడదు.
 9. మెయిన్‌గేట్‌కు ఎదురుగా దేవాలయం ఉండకూడదు.
8. ఉచ్చస్థానాలు - నీచస్థానాలు
ఖాళీస్థలం, గృహం రెండింటికీ ఉచ్ఛనీచ స్థానాలు ఉంటాయి. గేట్లు, ద్వారాలు కూడా అటు ఇంటికి, ఇటు కాంపౌండ్‌ వాల్స్‌కు ఉచ్ఛస్థానాలలో ఉండాలి. అలా ఉంటే నడక ఉచ్ఛస్థానంలో ఉంటుంది. ఇలా ఉచ్ఛస్థానంలో నడక సాగించడం వలన ఆ గృహంలో నివశించే వారికి ఎంతో మేలు జరుగుతుంది. నీచస్థానంలో ద్వారాలు, గేట్లు, నడక ఉండడం ఏ మాత్రం వాస్తు రీత్యా మంచిది కాదు. ఈ ఇంట నివశించే వారి జీవితాలలో మంచికన్నా కీడు అధికంగా ఉంటుంది.

కనుక ముందుగా గృహంలో, స్థలంలో ఉచ్ఛ నీచాలు ఏమిటన్నది వివరంగా తెల్సుకుందాం. కాంపౌండ్‌వాల్‌ను కానీ, ఇంటి గోడల్ని కానీ మూడు భాగాలుగా చేయండి.

ఈ వివరాలు మరింత వివరంగా తెల్సుకుందాం.
 1. తూర్పు గోడను తీసుకుందాం. మూడు భాగాలు చేద్దాం. ఉత్తరానికి దగ్గరగా తూర్పు ఈశాన్యాన్ని తాకుతూ ఉండే భాగం ఉచ్ఛస్థానం. అలానే దక్షిణానికి దగ్గరగా తూర్పు ఆగ్నేయాన్ని తాకుతూ ఉండే స్థానం నీచస్థానం.
 2. ఉత్తరపు గోడ విషయానికొస్తే... దీన్ని మూడు భాగాలుగా చేయండి. ఉత్తర ఈశాన్యాన్ని తాకుతూ తూర్పు దిశగా ఉండే భాగం ఉచ్ఛస్థానం. ఉత్తర వాయువ్యాన్ని తాకుతూ పడమర దిక్కున ఉండే స్థానం నీచస్థానం.
 3. పడమర గోడ విషయానికొస్తే... మూడు భాగాలతో పడమర వాయువ్యాన్ని తాకుతూ... ఉత్తరంలో ఉండే భాగం ఉచ్ఛస్థానం. అలానే దక్షిణాన్ని తాకుతూ పడమర నైఋతిలో ఉండే భాగం నీచస్థానం.
 4. దక్షిణం గోడను కూడా ఇలానే మూడు భాగాలు చేయండి. ఈ గోడలో... పడమర దిక్కుగా దక్షిణ నైఋతిని తాకుతూ ఉండే భాగం నీచస్థానం. అలానే తూర్పు దిశగా దక్షిణ ఆగ్నేయాన్ని తాకే భాగం ఉచ్ఛస్థానం. ఈ కారణంగానే.. కాంపౌండ్‌వాల్‌ గేట్లయినా.. ఇంటి గుమ్మాలయినా ఉచ్ఛస్థానాలలో ఉండేలా జాగ్రత్త వహించమంటుంది వాస్తుశాస్త్రం.
9. ఎవైపు స్థలం కల్పుకోవచ్చు?
ఆస్తులు కొనుక్కోవాలనుకున్నప్పుడు... ఉంటున్న చోటుకు దూరంగా పోయి కొనుక్కునే కన్నా.. ఆనుకుని ఉన్న ఇళ్ళు. స్థలాలు అమ్మకానికి వస్తే కొనేసుకుని తమ ఆస్తిలో కల్పుకుందా అనుకుంటారు. అలా కల్పుకునే సమయంలో ప్రధానంగా లే అవుట్లలో ఫ్లాట్లు కొన్నవారు ఎక్కువగా ఈ సమస్యలకు లోనవుతుంటారు. ఇలాంటివారు వాస్తు నియమ విరుద్ధంగా స్థలాలను కొని తమ స్థలంలో కల్పుకోకూడదు. ఆ నియమాలు ఏమిటో తెల్సుకుందాం. మీ స్థలానికి... మీ ఇంటికి తూర్పున, ఉత్తరాన ఉన్న స్థలాన్ని ఇంటిని ఆలోచించకుండా కొని మీ స్థలంతో, లేదా మీ ఇంటితో నిశ్చింతంగా కలుపుకోమంటుంది వాస్తు. ఇలా మీ ఆస్తిని ఉత్తరం వైపుకు తూర్పు వైపుకు పెంచుకోవడం వాస్తురీత్యా ఎంతో శుభకరం. ఆరోగ్యం, ఆయుష్షు, ధనం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి నట్టింట 'సిరి' నాట్యం చేస్తుంది. జీవితం మూడు పిందెలు... మూడొందల కాయలు అన్నట్లు ఉంటుంది.

ఇక దక్షిణక, పడమర దిశలో ఉన్న స్థలాలను కల్పుకోవడం లేదా ఇండ్లను కొనడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. దక్షిణ దిశలో స్థలం అయితే ఉచితంగా వచ్చినా కల్పుకోరాదన్నది వాస్తు పండితులు చేస్తున్న హెచ్చరిక.

అలానే ఆగ్నేయం మూలనున్న స్థలం, నైఋతి మూలనున్న స్థలం, వాయువ్యమూలనున్న స్థలం ఊడా ఆనుకుని ఉన్నాయి కదాని ఎట్టి పరిస్థితుల్లో కాని కల్పుకోకుడదు. కల్పుకున్నారంటే జీవితంలో అన్నీ అవాంతరాలే. ఎన్నో ఎదురు దెబ్బలు.. ప్రధానంగా నైఋతీ మూలనున్న స్థలం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరకే వచ్చినా అంగుళం కూడా కల్పుకోకుడదు.

10. ఇంటి చుట్టూ ఖాళీ స్ధలము ?
స్ధలాల ఖరీదులు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఇంటి చుట్టూ ఖాళీ వదలడానికి ఎక్కువ శాతం ఎవరూ అంగీకరించడం లేదు. స్ధలంలో వీలయినంత ఎక్కువగా గృహ నిర్మాణం కావించి, ఇంటిలోని అన్ని గదులూ పెద్దవిగా ఉండేలా ఆలోచిస్తురే తప్ప, ఇంటి చుట్టూ ఖాళీ స్ధలం వదలకపోతే గాలీ వెలుతురు కరువుతాయిని, ఆ కారణంగా ఆ ఇంట్లి నివశించే వారికి అరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్న దిశలో ఎవరూ అలోచించట్లేదు.
 • అపార్టుమెంటు అయినా, గృహం అయినా నాలుగు దిక్కులా ఖాళీ అన్నది ఉత్తమం. అయితే అపార్టుమెంట్స్‌ ఇలా నిర్మాంచడం చాలా కష్టం. కనీసం వీలయినంత మేరకు అపార్టుమెంటులోకి గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం చేయడం వాస్తు రీత్యా ఉత్తమం.
 • దక్షిణం కన్నా ఉత్తరం రాస్త ఎక్కువ ఉంటే చాలు. 
 • పడమర కన్నా తూర్పు కాస్త అధికం ఉంటే చాలు... శాస్త్రానికేగా... అనవసరంగా స్ధలం వేస్టు చేయకండి అనే గృహ యజమనులు ఈ మధ్య పెరిగిపోతున్నారు. 
 • ఇంటి చుట్టూ ఖాళీ వదిలే సమయంలో వాస్తుశాస్త్ర నియమాలను విధిగా పాటించండి.
 • ఆవరణంలో పడమర కన్నా కనీసం మూడురెట్లు ఆపైన అధికంగా తూర్పు దిశన ఖాళీ వదలి తీరాలి. ఇలా ఖాళీ వదిలి నిర్మితయమైన గృహం... సుఖశాంతుల నిలయం అవుతుంది. 
 • అలానే దక్షిణం వైపు కన్నా మూడు రెట్లు అంత కన్నా ఎక్కువ ఖాళీని ఉత్తర దిక్కులో వదలడం వలన ఆ ఇంట లక్ష్మీదేవి స్ధిరనివాసం ఏర్పరచుకుటుంది. 
 • స్ధిరాస్తుల రూపంలోనో, చరాస్తుల రూపంలోనో డబ్బుకు కొదవ లేకుండా ఉంటుంది.
 •  భవిష్యత్‌ విషయంలో దిగులు ఉండని అర్ధిక పరిస్ధితిలో ఆ కుటుంబం అలరారుతుంది.
11. నీటి ట్యాంక్‌:
గృహ నిర్మాణ సమయంలో మనం విధిగా పాటించవలసిన వాస్తు సూత్రాలు... ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. మెదట ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణం ఎలా చేయాలో తెల్సుకుందాం.
 • ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌.... పడమర వైపు లేదా, నైఋతి మూలన ఉండేలా చూసుకోవాలి.
 • ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌.... పై స్లాబ్‌కు రెండడుగుల ఎత్తులో నిర్మించుకోవాలి. పై స్లాబ్‌ను ఆనుకుని ఉండకూడదు.
 • ఈశాన్యంలో వాటర్‌ ఉండటం వాస్తురీత్యా సమంజసమే అయినా.. ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ వంటి బరువుల్ని ఈశాన్యం వైపు ఉంచకూడదు.
 • అగేయ దిక్కులో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను ఎట్టి పరిస్ధితిలో నిర్మించ తగదు. చాలా దుష్ప్రభావాలకు కారణం అవుతుంది.
 • పడమరదిక్కున ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను నిర్మించుకోవడం వాస్తు సమ్మతమే.
 • వాయువ్య దిశలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణం చేయకూడదు.
 • బిల్డింగ్‌ పైన మధ్య భాగంలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ ఎట్టి పరిస్ధితుల్లో నిర్మించకూడదు.
12. వంటగది - వాస్తు
వంటగది నిర్మాణ విషయంలో విధిగా వాస్త నియమాలను పాటించి తీరాలి. వంటగదిలో ఏర్పాట్లు ఎలా ఉండాలి.. ఈ విషయంలో వాస్తు ఏమి చెబుతుందో తెల్సుకుందాం.
 • విధిగా వంటగదిను అగ్నేయ ములనే ఏర్పాటు చేసుకోవాలి. వీలుకాని పక్షంలో వాయ్యుంలో మాత్రమే కిచెన్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
 • ఈశాన్యం, నార్త్‌ మధ్యలో, వెస్ట్‌ మధ్యలో, నైఋతిలో, దక్షిణం మధ్యలో, ఇంటికి నడుమ... ఎట్టి పరిస్ధితిలోనూ కిచెన్‌ నిర్మాణినికి అనువైనవి కావు.
 • కిచెన్‌లో అమర్చుకునే కుకింగ్‌ ప్లాట్‌ఫాం ఎట్టి పరిస్ధిలో తూర్పు గోడను లేదా ఉత్తరపు గోడను తాకుతు ఉండరాదు. ఈ నియమేల్లంఘన ఎల్లెడలా జరుగుతూనే ఉంది. అగ్యేయంలో వంటగది అంటే... ఖచ్చితంగా కిచెన్‌ ప్లాట్‌ఫాం... ఇంటి తూర్పు గోడకు తాకుతూ ఉంటుంది. కనీసం అంగుళం అయినా ఈ ప్లాట్‌ఫాంకు ఇంటి తూర్పు గోడకు మధ్య ఖాళీ వుంచండి. ఇదే నియమాన్యి ఉత్తరపు గోడ విషయంలో కూడా వాయువ్యంలో కిచెన్‌ నిర్మించుకునే సమయంలో విధిగా పాటించాలి.
 • వంట చేసే సమయంలో తూర్పు దిక్కును చూస్తూ ఉండేలా కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేసుకోవాలి.
 • స్టవ్‌ అతి చేరువగా సింక్‌, టాప్స్‌ ఉండకూడదు.
 • కిచెన్‌లో ఈశన్య మూల సింక్‌ ఏర్పటు చేసుకోవలి.
 • డిష్‌ వాషర్‌ ఉన్నట్లాయితే దీన్ని కిచెన్‌లో నైఋతి మూలన ఉంచలి.
 •  త్రాగునీరు కిచెన్‌లో ఈశన్య దిశలో ఉంచలి. మైక్రో ఓవెన్‌,ఫ్రీఙె వంటి అప్లయెన్సెస్‌...కిచెన్‌లో నైఋతి మూల ఉండడం మంచిది.
 • కిచెన్‌లో క్రస్‌ వెంటిలేషన్‌ విషయంలో వాస్తూ నియమాలు పాటించాలి.తూర్పు గోడకు పెద్ద సైజ్‌ కిటికిలు..దక్షణ గోడకు చిన్న సైజ్‌ కిటికిలు అమర్చుకోవలి.
 • కిచెన్‌కు అనుకోని, కిచెన్‌ క్రింద భాగంలో ఎట్టి పరిస్ధీతులో నిర్మాణం చేయకూడదు.
 • కిచెన్‌లో సరుకులు ఉంచుకునేందుకు వినియోగించే షెల్ఫలు అల్‌మరలు...దక్షణ , పడమర గోడలకు అమర్చుకోవాలి.
 • అపార్టుమెంట్స్‌లో ప్రత్యేక పూఙగది నిర్మాణనికి స్ధలం చాలక పూజాగది కిచెన్‌లోనే ఓ మూలన ఏర్పాటు చేయడం ప్రస్తుతం జరుగుతుంది.పలు అపార్టుమెంట్సలో దీన్ని చూస్తూన్నాం.వాస్తుశాస్త్రరీత్య ఇది శాస్త్ర విరుద్ధమైన విషయం.
 • కిచెన్‌లో డైనింగ్‌ టేబుల్‌ అమర్చుకోవడం శాస్త్ర విరుద్ధ విషయమే. కిచెన్‌ దోరకు ఎదురుగా గ్యాస్‌స్టవ్‌ ఉంచకూడదు.
13. పడక గది - వాస్తు
 • పడక గది విషయంలో వాస్తు చాలా నియమాలను తెలియఙేసింది.విధిగా ఈ నియమాలను పడక గది నిర్మాణ సమాయంలో పాటించారంటే...కుటుంబ వాతవరణం దంపతుల నడుమ ఆప్యాయతానురాగాలు బాగుంటాయి.బెడ్‌రూమ్‌లో నిర్మాణం విషయలలోనే కాకుండా బెడ్‌రూమ్‌ లోపల అరేంఙెమ్‌ంట్స్‌ విషయంలో కూడా ఎన్నో ఙాగ్రతలు తీసుకోవలి.
 • ఇంటిలో ప్రధన బెడ్‌రూమ్‌ నైఋతీమూల ఏర్పటు చేసుకోవలి.
 • పడక గదిలో బుక్‌ షెల్ఫలు, డ్రసింగ్‌ టేబుల్స్‌...బెడ్‌రూమ్‌లో పడమర వైపు లేదనైఋతి దిశలో అమర్చుకోవాలి. చతురస్ర, దీర్ఘచతురస్రాకార ఆకారంలోనే బెడ్‌రూమ్‌ల నిర్మాణం ఙరగాలి.అంతే తప్ప ఆడ్‌షేస్స్‌లో బెడ్‌రూమ్స్‌ నిర్మాణం ఙరకూడాదు.
 • పడక గది డోర్‌ మినిమం 90 డిగ్రీలు అయినా తెరచుకునేలా ఏర్పాటు చుసుకోవాలి.
 •  పడక గదిలో మిర్రర్స్‌ లేకూండా ఉండడమే సముచితం.ఒకవేళ ఉన్నా మీ బెడ్‌కు ఎదురుగా గోడకు అమర్చకూడదు.
 • పడక క్రింద.. బెడ్‌కు ఉంటున్న పెద్ద షెల్ఫ్‌లో చెత్తా చెదారం, పాత వస్తూవులూ, పనికిరాని వస్తూవులు. పనికిరాని దూస్తూలను ఉంచకండి.అలానే పాత పనికిరాని సామన్లు అంత పడక గదిలో బెడ్‌ దిగువకు నెట్టడం చేస్తూంటారు.ఇదీ వాస్తూరీత్యా మంచిది కాదు.మీకు సరయిన నీద్ర రాకూండ చేస్తూంది.
 • పడక గదిలో అక్వేరియాంను ఉంచకూడదు.
 • పడక గదిలో నిద్ర లేవగానే చూడలానో,నమస్కరించుకోవలనే దేవత విగ్రహలను ఉంచుతుంటారు.ఇది ఏ మాత్రం వాస్తూనమ్మకం కాదు.
 • ఇంట్లో నైఋతి దిక్కున ఏర్పటు చేసీన మాస్టర్‌ బెడ్‌రూమ్‌ను ఆ ఇంటి యఙమానులే వాడుకోవాలి తప్ప.. పిల్లలు, గెస్ట్‌లు, ఇతరత్రా మరెవరూ ఉపయోగించరాదు.
 •  మీరు నిద్రించే బెడ్‌పై భాగాన భీమ్‌లు ఉంచకూడదు.
 • పడక గదిలో బెడ్‌ ఎపూడు దక్షణం, పడమర గోడలకు ఆనుకునీ గానీ, లేదా పడమర గోడలకు అనూకోని గాని, లేదా వాటికి చేరువగా గాని ఆమర్చుకోవాలి.
 • అలాగే అల్‌మైరాలు, ఇనుప బీరవలు... బెడ్‌రూమ్‌లో దక్షణం లేదా పడమర గోడకు ఆనుకుని ఉండేలా అమర్చుకోవాలి.
 • పడక గదిలో ఎలాంటి ఎలక్ట్రనిక్‌ పరికరలు ఉంచరాదు.ఫోన్‌, టీ,విలను కూడా బెడ్‌రూమ్‌లో ఉంచకూడదు.
 • పడకగది డోర్‌కు ఎదురుగా పడక గదిలో బెడ్‌ను ఉంచరాదు.
 • డబల్‌ బెడ్‌ అయినప్పటికీ.. దానిపై సింగిల్‌ మేట్రెస్‌ మాత్రమే ఉండాలి. రెండు పరుపులు పెట్టి పరిస్థితిలోనూ ఉపయోగించకండి.
14. అతిధి గది - లివింగ్‌ రూమ్‌:
ఇంటికి వచ్చిన అతిధులకు ముందుగా దర్శనమిచ్చేది లివింగ్‌రూమ్‌. లివింగ్‌రూమ్‌ను తూర్పు, ఉత్తర దిశలలో ఏర్పాటు చేసుకోవడం వాస్తురీత్యా శుభకరం. ఆగ్నేయ దిక్కున లివింగ్‌రూమ్‌ నిర్మాణం జరపరాదు. అయితే దక్షిణం ఫేసింగ్‌ ఇళ్లకు మాత్రం.... ఆగ్నేయంలో లివింగ్‌రూమ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.
 • కుటుంబ సభ్యులంతా కల్సి కూర్చుని మాట్లాడుకునేందుకు, టి.వి, వీక్షించేందుకు, రిలాక్స్‌ అయ్యేందుకు ఈ లివింగ్‌రూమ్‌ ప్రధానంగా
 • ఉపయోగపడుతుంది. సహజంగా షాండిలియర్స్‌, క్రిస్టల్‌ లాంప్స్‌ ఏర్పాటు చేస్తారు. లివింగ్‌రూమ్‌లో లైటింగ్‌ ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవాలి. డిమ్‌ లైటింగ్‌ ఉండకూడదు. అందమైన సోపాలు, టీపాయ్‌లు, టి.వి వంటివి అమర్చుకుంటాం కనుక... లివింగ్‌రూమ్‌ ఎంత పెద్దదిగా ఉంటే అంత బాగుంటుంది.
 • వాస్తురీత్యా లివింగ్‌రూమ్‌లో లేవెట్రీ కానీ, బాత్‌రూమ్‌ కానీ హలుకు నైబుతీ మూల... పడమర, దక్షిణ గోడలకు ఆనుకుని ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.తూర్పు,ఉత్తర గోడలకు అనుకుని ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు, ఉత్తర గోడలకు ఆనుకొని ఉండకుండా గృహ నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు వహించాలి.
 • లివింగ్‌రూమ్‌ ఇంటకిి ఉత్తర దిక్కుగా ఉండడం ఎంతో శుభప్రదం.
 • వాయువ్యంలో కూడా లివింగ్‌రూమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
 • ఉత్తరంలో లివింగ్‌రూమ్‌ ఉంటే ఆ ఇల్లు సుఖశాంతులతో అలరారుతుంది.
 • నైఋతి దిశలో మాస్టర్‌ బెడ్‌రూమ్‌కు అనువైన స్ధలం. అయితే ఈ దిశలో కూడా లివింగ్‌రూమ్‌ నిర్మాణం వాస్తురీత్యా ఆమోద యోగ్యమే.
 • లివింగ్‌రూమ్‌లో ఫ్లోరింగ్‌ ఉత్తరం వైపుకు, వాలు కల్గి ఉండాలి. అంటే నీరు పోస్తే... అవి ఉత్తరం, తూర్పు దిశలలో పారాలి తప్ప, పడమరకు, దక్షిణానికి పారకూడదు.
 • లివింగ్‌రూమ్‌ ఏరియాలో నిర్మితమైన సీలింగ్‌ కూడా... తూర్పు, ఉత్తరాలకు కాస్త దిగి ఉండాలి.
 • లివింగ్‌రూమ్‌కు డోర్‌ తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పారచుకోవడం వాస్తు నియమాల రీత్యా అదృష్ట ప్రదం.
 • లివింగ్‌రూమ్‌కు పడమర వైపున ఎంట్రన్స్‌ ఉంటే.... మేథావులు, రీస్చెర్స్‌కు ఎంతో మేలు.
 • దక్షిణ, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం ఎంట్రర్స్‌లు లివింగ్‌రూమ్‌కు ఉంటే... మంచిదే కానీ జరిగే చాలా లేట్‌గా జరుగుతుంది.
 • లివింగ్‌రూమ్‌లో బరువైన ఫర్నిచర్‌ ఎప్పుడూ... దక్షిణ గోడలను ఆనుకుని, పడమర గోడలకు ఆనుకోని ఉండేలా తగు జాగ్రత్త వహించాలి. బరువైన సోఫాలు, దివాన్‌ సెట్స్‌ లాంటివి ఉత్తరపు గోడకు ఆనుకొని ఉండకుడదు. ఈ జాగ్రత్త లివింగ్‌రూమ్‌లో తప్పక పాటించాలి.
 • లివింగ్‌రూమ్‌లో ఇంటి యజమాని ఎప్పుడూ... తూర్పు లేదా ఉత్తర వైపు తిరిగి కూర్చోవాలి. అప్పుడే కుటుంబంలో ఆయన ఆథిపత్యంకు గౌరవం లభిస్తుంది.
 • టివిని ఎట్టి పరిస్ధితిలో ఈశాన్యం మూల ఉంచరాదు. టివి ఎప్పుడూ ఆగ్నేయ మూల ఉండడం వాస్తురీత్యా సమజసం.
 • నైఋతిలో టివి ఉంచితే దాని ప్రభావం గృహంలో నివశించే వారి మీదే కాదు.... టివి మీద కూడా ఉంటుంది. తరుచు అది రిపెరిగ్‌కు వస్తుంది.
 • లివింరూమ్‌లో ఫోన్‌ను తూర్పు, ఉత్తరం, ఆగ్నేయంలో ఉండేలా చూడండి.
 •  ఎయిర్‌కూలర్‌, ఎయిర్‌ కండీషనర్లను లివింగ్‌రూమ్‌లలో పడమర, వాయువ్యం, తూర్పు దిశలలో ఏర్పాటు చేయండి. పొరపాటు కూడా ఆగ్నేయంలో ఉంచరాదు.
 • లివింగ్‌రూమ్‌ ఈశాన్యం మూల దేవుని చిత్రాపటాలు హేంగ్‌ చేయండి.
 • లివింగ్‌రూమ్‌లో వార్‌, క్త్రెమ్‌, బాథాకరమైన, మరణించిన పెద్దల పటాలను ఉంచరాదు.
 • లివింగ్‌రూమ్‌లో రెడ్‌ కలర్‌ను వాల్స్‌కు వేయకండి. వైట్‌, లైట్‌ ఎల్లో, బ్లూ, గ్రీన్‌ రంగులు లివింగ్‌రూమ్‌లో వాల్స్‌కు వేసుకోవచ్చు.
 • లివింగ్‌రూమ్‌లో చతురస్త్రకారం, దీర్ఘచతురస్రాకార ఫర్నిచర్సనే వాడండి.రౌండ్‌, ఓవల్‌ ఇతరత్రా ఏ షేప్‌ ఫర్నీచర్స వాడకండి.
 • డూప్లేక్స్‌ అయితే మెట్లు హలు నుండి ఏర్పటు చేసుకోవలసి వస్తే దక్షణ దిశలో , పడమరలో నైఋతి మూలా ఏర్పటు చేసుకోవచ్చు.
 • ఈశన్యం మూలన ఉన్న విండోస్‌కు ఎప్పూడు లైటు వెయాట్‌ కర్టన్స్‌ మాత్రమే వాడలి.డోర్‌ కర్టన్స్‌ విషయంలో కూడా ఈ నియమం పాటించండి.ఇతరత్ర ఏ విండో అయినా డోర్‌ అయినా హెవీ కర్టన్స్‌ వాడవచ్చు.
 • లివింగ్‌రూమ్‌లో ఈశన్యం మూలన ఖాళీగా ఉంచండి.
 • లివింగ్‌రూమ్‌లో ఆర్టిఫిషీయల్‌ ఫ్లవర్స్‌, ఎండిపోయిన పూలు, సూదులుగా ఉండే ఆకులు గల చెట్లు, బోనసాయ్‌గా పిలువబడే మరుగుఙూ మొక్కలు ఉంచకూడాదు. వాస్తూరీత్యా ఇది శుభకరం కాదు.
 • లివింగ్‌రూమ్‌ ఏరియాలో ..పడమర లేదా, దక్షణంకు దగ్గరగా షాండీలియర్‌ వ్రేలాడ తీయవచ్చు.షాండిలియర్‌ను లివింగ్‌రూమ్‌ మధ్యలో వ్రేలాడ తీయకూడదు.
 • లివింగ్‌రూమ్‌ ఉత్తర దిశలో వాటర్‌ ఫౌంటెయిన్‌ ఏర్పటు చేసూకోవాలి.
 • ఉత్తరం, తూర్పు, ఈశన్య దిశలో అక్వేరియం ఉంచడం ఎంతో శుభదాయకం.
15. బావి లేదా బోర్‌ స్తానం ఎక్కడ?
బావి, బోర్‌ ఏర్పరచుకునే సమయంలో వాస్తు నిబంధనలు విధిగా పాటించాలి.
 • స్థలానికి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యంలోనే బావి కానీ బోర్‌కానీ ఉండాలన్నది వాస్తు నియమం, నీరు పడలేదు కదాని స్థలంలో వేరే చోట్ల బావి గాని, బోర్‌ కానీ త్రవ్వేయటం వాస్తు నియం విరుద్ధంగానే భావించ బడుతుంది.
 • ఉత్తర ఈశాన్యంలో బోర్‌ పడకపోతే ఉత్తర సరిహద్దును రెండు బాగాలుగా చేసి, బావి కానీ బోర్‌ కానీ తూర్పు దిక్కుకు ఆనుకుని ఉన్న సగంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తర సరిహద్దుకు పడమర దిక్కువైపున ఉన్న అర్ధబాగంలో బావి, బోర్‌ నిర్మాణం జరగకూడదు.
 • అలానే తూర్పు ఈశాన్యంలో నీరు పడని పక్షంలో తూర్పు సరిహద్దులు రెండుగా విభజించి, ఈశాన్య దిక్కును ఆనుకుని ఉన్న భాగంలో ఎక్కడైన బావి, బోర్‌లు త్రవ్వుకోవచ్చు.
 • ఎట్టి పరిస్థితిలో తూర్పు ఆగ్నేయాన్ని ఆనుకుని ఉన్న అర్ధబాగంలో బావి, బోర్‌లు ఉండకుండా పూర్తి జాగ్రత్తపడాలి.
 •  తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం పడమర వాయువ్యం, పడమర నైఋతి, దక్షిణ నైఋతి, దక్షిణ ఆగ్నేయం, ఈ ప్రదేశాలలో బోర్‌ కానీ బావి కాని ఉండనే ఉండకూడదు. నీరు పడ్డాయి కదా అని సౌకర్యం కోసం స్థలంలోని ఈ ప్రదేశాలలో బావి త్రవ్వడం బోర్‌ వేయ్యడం చేశారంటే... ఆ ఇంట సుఖ శాంతులు ఉండవు. దరిద్రం ఆ ఇంటి తిష్ట వేసుకుంటుంది. కుటంబ సభ్యుల మద్య అనురాగ మమకారాలు కరువై గొడవలు, చికాకులు పెరిగిపోతాయి. తీవ్ర అనారోగ్యాలు ఆ ఇంట నివశించే వారిని వేధించి తీరుతాయి.
16. పూజమందిరం వాస్తు
పూజా మందిరం ఇంట్లో... ఈశాన్యంలో ఉండడమే ఉత్తమోత్తమం. కుదరని పక్షంలో ఉత్తరం, తూర్పు దిశలలో మాత్రమే పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో పూజా మందిరం దక్షిణం వైపు ఉండరాదు. సాధ్యమైనంత వరకు విధిగా మీ పనూజా మందిరాన్ని మీ ఇంటో గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసుకోవాలి తప్ప... పై ఫ్లోర్‌లో కాదు.
 • పూజా మందిరంలోని దేవతా విగ్రహాలు దేవతా చిత్రపటాలు తూర్పు దిక్కును లేదా పడమర దిక్కును చూసేలా ఉండాలి తప్ప ఉత్తర దక్షిణాల వైపు చూససే విధంగా అమర్చుకోరాదు.
 • పూజా గదిలో తూర్పు గోడకు ఆనించి దేవతా మూర్తుల్ని అమర్చుకోరాదు. తూర్పు గోడకు, దేవాతా మూర్తికి మినిమంగా అంగుళం గ్యాప్‌ అయినా ఉండాలి.
 • పూజామందిరానికి పై భాగంలో లేదా దిగువ భాగంలో టాయిలెట్స్‌ నిర్మాణం జరగకూడదు. పూజ గదిని దైవ సంబంధిత కార్యక్రమాలకు మినహా మరే ఇతర అవసరాలకు వినియోగించరాదు. మరణించిన ఆత్మీయుల ఫోటోగ్రాఫ్స్‌ కూడా పూజ మందిరంలో ఉంచరాదు.
 • ఇంటి పూజ మందిరంలో బాగా వెయిట్‌ ఉన్న దేవతా మూర్తుల్నిఉంచకండి. ఎంత లైట్‌వెయిట్‌ అయితే అంత మంచిది. దేవాలయాల నుంచి, ప్రాచీన మందిరాల నుంచి తెచ్చుకున్న విగ్రహాలను పూజ మందిరంలో ఉంచకూడదు.
 •  పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరని కొందరు... తూర్పున లేదా ఈశాన్యంలో ఓ అరుగు నిర్మించి దానిపై దేవతా మూర్తుల్ని ఉంచి పూజలు చేస్తుంటారు. అరుగు రూపంలో తూర్పుమీద బరువు పడుతుంది కనుక ఇదీ శాస్త్ర సమ్మతం కాదు.
 • ఈశాన్యంలో, తూర్పున పూజామందిరం ఏర్పాటు చేయడానికి సౌలభ్యం లేనప్పుడు ఒక మాస్టర్‌ బెడ్‌రూమ్‌ను మినహాయించి వేరు గదుల్లో ఈశాన్యం మూలన దేవతా విగ్రహాలనుంచి పూజ చేసుకోవచ్చు.
17. స్నానాల గది - బాత్‌రూమ్‌ - లావేట్రీ వాస్తు
 • గతంలో స్నానాల గది లేవట్రీలను విడివిడిగా నిర్మించుకోవడం జరిగేది. ప్రస్తుత కాలంలో ఈ రెంటినీ కల్పి నిర్మించడమే అధిక శాతం జరుగుతోంది. సాధ్యమైనంత మేర బాత్‌రూమ్‌, లావెట్రీలు మరీ ఇరుకుగా ఉండకుండా చూసుకోవాలి. వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి.
 • బాత్‌రూమ్‌, లేవెట్రీలు ఆగ్నేయం, నైఋతీలలో నిర్మించుకోవడం శ్రేష్ఠం. వాయువ్యంలో కూడా బాత్‌రూమ్‌, లేవెట్రీలను నిర్మించుకోవచ్చు. ఎట్టి పరిస్థితులలో ఇంటికి ఈశాన్య దిశలో బాత్‌రూమ్‌ లావెట్రీలు నిర్మించడం తగదు. బయటవైపున బాత్‌రూమ్‌లు లేవెట్రీలు ఏర్పాటు చేసుకునే సమయంలో ఇవి ఉత్తరం, తూర్పు గోడల్ని తాకకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. పడమర, దక్షిణ గోడలకు ఆనించి బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేసుకోవడం చేయవచ్చు.
 • బాత్‌రూమ్‌లో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసుకోవడం మంచి పద్ధతి. వెంటిలేటర్స్‌ ఉన్నా ఎగ్జాస్ట్‌లు బాగా పనిచేసి, బాత్‌రూమ్‌ లేవెట్రీలను దుర్వాసన రహితంగా ఉంచగుల్గుతాయి.
 • బాత్‌రూమ్‌ లేవెట్రీల విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే, ఆర్ధికంగా ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవని వాస్తు చెెబుతుంది.
 • దక్షి నైఋతి, పడమర నైఋతి బాత్‌రూమ్‌ లేవెట్రీల నిర్మాణానికి నెంబర్‌వన్‌ ప్లేస్‌. ఇక ఉత్తర వాయువ్యం, పడమర వాయువ్యంలు కూడా బాత్‌రూమ్‌ నిర్మాణానికి సెకండ్‌ బెస్ట్‌గా భావించాలి.
18. ఇంటికి సింహద్వారం
కాంపౌండ్‌వాల్‌కు నిర్మించుకున్న గేటు తర్వాత ఇంటికి ప్రధానమైన ద్వారానే సింహద్వారం అంటారు. ఇంట్లోకి ప్రధాన రాకపోకలను ఈ ద్వారం ద్వారానే జరుగుతాయి.
 • సింహద్వారం నిర్మించుకునే సమయంలో వాస్తు నియమలు విధిగా నిర్మించుకోవాలి.
 • సింహద్వారం......... ఇంట్లోని అన్ని ద్వారల కన్నా కొలతలలో పెద్దదిగా ఉండాలి. దీనికిఅమర్చే తలుపు కూడా బలిష్ఠంగా, దృఢంగా ఉండాలి. సింహద్వారం ఎట్టి పరిస్ధితిల్లో ఇంటికి ఉచ్ఛస్ధానంలో ఉండాలి. ఒకవేళ నిర్మాణ రీత్యా వీలుచిక్కక పోతేనే కనీసం మధ్యమ స్ధానంలో ఉండేలా జాగ్రత్త పడాలి.
 • నార్త్‌ఫేసింగ్‌ హౌస్‌కు సింహద్వారం నార్త్‌ఈస్ట్‌లోనే ఉండాలి. ఎట్టి పరిస్ధితిల్లో వాయువ్యంలో ఉండకూడదు.
 •  సింహద్వారం మూలకు అమర్చకూడదు.మూల నుండి అడుగు, అడుగున్నర దూరంలో అమర్చకోవాలి.
 • వెస్ట్‌ఫేసింగ్‌ హౌస్‌కు పశ్చిమ వాయువ్యంలో సింహద్వారం ఏర్పరచుకోవాలి. పశ్చిమ నైఋతిలో ఎట్టి పరిస్ధితిలో సింహద్వారం ఏర్పాటు చేసుకోకూడదు.
 •  సౌత్‌ ఫేసింగ్‌ ఇంటికి దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం అమర్చకోవాలి. దక్షిణ నైయుతిలో ఎట్టి పరిస్ధితిలో సింహద్వారం ఏర్పాటు చేసుకోకూడదు.
 • ఈస్ట్‌ఫేసింగ్‌ హౌస్‌కు సింహద్వారం తూర్పు ఈశాన్యంలో ఉండాలి. తూర్పు ఆగ్నేయంలో ఉండకూడదు.
 • సింహద్వారం ముందు ఎలాంటి అడ్డంకులు ఉండరాదు. కనీసం పూలకుండీలు కానీ, క్రీపర్స్‌ కానీ... సింహద్వారం ఎదురుగా ఉండకూడదు అలానే చెట్టు నీడలు కూడా సిం
 • హద్వారం పై పడకూడదు.
 • సింహద్వారం ఎప్పుడూ రోడ్‌ లెవల్‌కు ఎత్తులో ఉండి తీరాలి.
 • మెయిన్‌డోర్‌ వద్దకు చేరుకునేందుకు మెట్లు ఉన్నట్లయితే ఈ మెట్లు బేసి సంఖ్యలో ఉండాలి.
 • మెయిన్‌డోర్‌కు ఎదురుగా పాడుబడిన, వాడకుండా వదిలి వేయబడిన గృహాలు లేకుండా చూసుకోవాలి.
 • మన ఇంటి మెయిన్‌డోర్‌... ఎదుటి ఇంటి మెయిన్‌డోర్‌కు ఖచ్చితంగా ఆపోజిట్‌గా ఉండరాదు.
 •  సింహద్వారం ... కాంపౌండ్‌వాల్‌కు అమర్చిన గేటు ఒకే దిశలో ఉండడం వాస్తు రీత్యా మంచిది.
 • సింహద్వారం యొక్క ఎత్తులో సగం వరకు వెడల్పు ఉండేలా సింహద్వారాన్ని తయారు చేసుకోవాలి. సింహద్వారం చెక్కతప్ప... ఇనుమువంటి లోహాలు వాడకూడదు.
 • మెయిన్‌డోర్‌ పై భాగంలో బాత్రూమ్‌ లావేటరీ వచ్చేలా పై అంతస్తులో నిర్మాణాలు చేయకూడదు.
 •  సింహద్వారానికి స్లయిడింగ్‌ డోర్‌ వాడకూడదు.
 • ఇల్లంతా ఊడ్చి సింహద్వారం దగ్గర పోగు పెట్టడం... డస్ట్‌బిన్‌ సింహద్వారం దగ్గరలో ఉంచటం, చీపుర్లు, బూజు ర్రలు సింహద్వారం వెనుక ఉంచడం వాస్తురీత్యా మంచిదికాదు.
 • మెయిన్‌డోర్‌కు ఎదురుగా పాదరక్షలు విడువరాదు.
 •  సింహద్వారం... పగుళ్ళుచ్చినా... తీసివేసేటపుడు కిర్రు శబ్దాలు చేసినా అది ఆ గృహంలో నివసించే వారికి మంచిది కాద.
 •  మెయిన్‌డోర్‌కు సెల్ఫ్‌ క్లోజింగ్‌ సిస్టమ్‌ అమర్చకూడదు.
 • మీ సింహద్వారం ఎదురుగా దేవాలయం ఉండకూడదు.
19. మురుగు కాలువ - డ్రైనేజీ - వాస్తు
డైనేజీ విషయంలో సైతం వాస్తు ఎన్నో నియమాలను వివరించింది. పాటించామా జీవితాంతం... ఆనంద ప్రమోదాలే. . నిర్లక్ష్యం చేశామా... పలురకాల బాధలు.
 • ఇంల్లో అన్నిరకాల ఉపయోగించిన నీరు, వర్షపు నీరు, తూర్పు ఈశాన్యం నుంచి గానీ ఉత్తర ఈశాన్యం నుంచి గానీ బలయటకు వెళ్ళేలా ఏర్పాటు చేసుకోవాలి. డ్రైనేజీని ఏర్పాటు చేసే సమయంలో ఈ నియమాన్ని విధిగా పాటించి తీరాలి.
 • పశ్చిమ నైఋతి ఉత్తర దిశ మీదుగా నీరు ఈశాన్యం పైపు నడిచి బయటకు వెళ్ళాలి. అలానే దక్షిణ నైఋతి నుండి దక్షిణం, తూర్పులగుండా ప్రవహించి ఈశాన్యం నుంచి బయటకు వెళ్లేలా డ్రైనేజీలు నిర్మించాలి.
 • ఈ విధంగా నీరు ఫ్రీగా నడిచి ఈశాన్యానికి నడిచే రీతిగా కాలవలు నిర్మించాలి. నైఋతిలోని నీరు ఆగ్నేయానికి వాయువ్యాయానికి ఫ్రీగా నడిచేందుకు వీలుగా నైఋతి నుండి వాయువ్యానికి, ఆగ్నేయానికి వాటం ఉండేలా జాగ్రత్తపడాలి.
 •  వాయువ్యానికి చేరిన నీటిని ఈశాన్యం వైపు నడవాలంటే వాయువ్యం కన్న ఈశాన్యం పల్లంగా ఉండాలి. ఇదే రీతిగా ఆగ్నేయ మూలకన్న కలువ ఈశాన్యంలో పల్లంగా ఉండాలి. అప్పుడే నైఋతి నుండి ఆగ్నేయానికి చేరిన నీరు ఫ్రీగా ఈశాన్యానికి వెళ్తాయి.
 • ఇంట్లో కాలకృత్యాలకు ఇతర ఇతర అవసరాలకు వినియోగించిన నీటిని ఎలా అయితే ఈశాన్యం గుండా బయటకు పంపామో అదే రీతిగా ఇంటి స్లాప్‌లు కూడా ఈశాన్యంలో పల్లంగా ఉండేలా జాగ్రత్త వహించి వర్షపు నీరు స్లాబ్‌ పై నిలువ ఉండకుండా ఈశాన్యంలో ఏర్పాటు చేసిన తూము ద్వారా బయటకు వెళ్ళేలా స్లాబ్‌ నిర్మాణం సమయంలో పూర్తి జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో స్లాబ్‌పైన వర్షపు నీరు నిలచి పోయి, స్లాబ్‌ లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది.
 • 6. ఈశాన్యం గుండా డ్రైనైజ్‌ వాటర్‌ను బయటకు పంపడం కుదరని పక్షంలో... వాయువ్యం మీదుగా లేదా, ఆగ్నేయం గుండా డ్రైనేజీ వాటర్‌ను బయటకు పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
20. ఇంట్లో మెట్లు-వాస్తు నిబంధన:
 • మెట్లు అంటేనే బరువుతో కూడినవి కనుక మెట్లను ఏర్పాటు చేసుకోనే సమయంలో బరువు
 • వేయతగని ప్రాంతంలో మెట్లు నిర్మించకుండా ఎన్నో జాగ్రత్తలు వహించాలి.
 • దక్షిణ దిశ,పడమర దిశలో మెట్లు ఏర్పాటు చేసుకోవడం వాస్తురీత్యా సముచితం.
 •  ఇంటి బయట ఏర్పాటు చేసుకోనే మెట్లు.... తూర్పున అయితే ఆగ్నేయంలో ఉత్తరంలో అయితే వాయువ్యంలో పడమర అయితే నైయుతిలో, దక్షిణంలో అయితే నైయుతిలో నిర్మించుకోవాలి.
 •  మెట్లు తూర్పు నుంచి పడమరకు ఎక్కేలా, ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కేలా ఉండాలి. మధ్యలో లభించిన ఖాళీకి అనుగుణంగా మెట్లును వేరే దిశకు మళ్ళించవచ్చు.
 •  మెట్లు సంఖ్య ఎప్పుడు బేసి సంఖ్యలోనే ఉండాలి. సంఖ్య చివర జీరో వుండకూడదు.
 • ఈశాన్యంలో ఇంటి మధ్యలో మెట్లు ఎట్టి పరిస్ధితిలో నిర్మించుకూడదు. ఆర్ధికంగా చాలా వేతలు పడాల్సి వస్తుంది. స్టెయిర్‌ కేస్‌ దిగువన.... కిచెన్‌,బాత్‌రూమ్‌,పూజ గది వంటివి నిర్మించుకోకుడదు. మెట్లు క్రింద భాగం స్లోరేజ్‌కు ఉపయోగించుకోవచ్చు.
 •  పై అంతస్తుకు వెళ్ళెందుకు దిగువ సెల్లార్‌కు కానీ బేస్‌మెంట్‌కు కానీ వెళ్ళేందుకు ఒకే స్టెయిర్‌ కేస్‌ను ఉపయోగించకండి.సెల్లార్‌కు వెళ్ళేందుకు వేర్‌ స్టెయిర్‌కేస్‌ ఏర్పాటు చేసుకోమని సూచిస్తుంది వాస్తు.
 •  స్టెయిర్‌ కేస్‌లో టర్నింగ్‌లు ఎప్పుడూ క్లాక్‌వైజ్‌ డైరెక్షన్‌లోనే ఉండాలి. యాంటీక్లాక్‌వైజ్‌ డైరెక్షన్‌లో మెట్లు టర్నింగ్‌లు ఉండడం వాస్తు విరుద్ధం.
 • సాధ్యమైనంత వరకు స్పిరల్‌,సర్క్యులర్‌ కేస్‌లను ఏర్పాటు చేసుకోవద్దు.
 • పై అంతస్తు లేదా టెర్రాస్‌ పైకి వెళ్ళే స్టెయిర్‌ కేసుకు రూఫ్‌ ఉండి తీరాలి.
 •  స్టెయిర్‌ కేస్‌కు డోర్స్‌ ఉంటే.... లోయర్‌ డోర్‌ కన్నా అప్పర్‌డోర్‌ 10 అంగుళాల వరకు తక్కువ ఎత్తులో ఉండాలి.  స్టెయిర్‌ కేస్‌ దిగువన సేఫ్టీలాకర్స్‌,విలువైన సంపదతో కూడిన అల్‌మైరాలు ఉంచకూడదు.
 •  ఇంటి చుట్టూ తిరిగి వచ్చేలా స్టెయిరకేస్‌ను అమర్చడం బహుళ అంతస్తుల బిల్డింగ్స్‌లో చూస్తుంటాం. వాస్తు శాస్త్ర రీత్యా ఇవి ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది.
 •  దక్షిణం నుండి ఉత్తరానికి, పడమర నుండి తూర్పుకు మేడమెట్లు ఎక్కేలా ఏర్పాటు చేసుకోవడం శాస్త్ర విరుద్ధం. ఇలాంటి గృహంలో అభివృద్ధి లోపిస్తుంది. అనేక రకాల శారీరక మానసిక బాధలు చుట్టుముడతాయి.
 •  పడమర, దక్షిణ గోడలకు ఆనుకుని మెట్లు నిర్మించవచ్చు. తూర్పు, ఉత్తర గోడలకు దూరంగా ఉండేలా మెట్లు నిర్మించుకోవాలి.
 •  మెట్లు వాలు 30 నుండి 45 డిగ్రీల నడుమ ఉండాలి. అంతకు మించి ఉంటే మెట్లు ఎక్కడం శ్రమ అవుతుంది. మోకాళ్ళు నడుం నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది.
21. వాహనాల మరమ్మత్తు కర్మాగారము - గ్యారేజ్‌ విషయంలో వాస్తు:
 • కార్‌ గ్యారేజ్‌ విషయంలో ఎంతో మంది వాస్తు నియమలను ఉల్లఘింస్తున్నారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గ్యారేజ్‌ నిర్మించుకోవడమో..... ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ కార్‌ను ఉంచుకోవడమో చేస్తున్నారు. కార్‌ గ్యారేజ్‌ అనగా వాహనాలు నిలిపే విషయంలు కూడా వాస్తు ఎన్నో నియమలను సూచించింది.
 • గ్యారేజ్‌ నిర్మాణానికి వాయువ్యం, ఆగ్నేయం, రెండు దిక్కులే ది బెస్ట్‌.
 • గ్యారేజ్‌లో ఫ్లోరింగ్‌,ఈస్ట్‌, నార్త్‌ దిక్కులు పల్లంగా ఉండేలా చూసుకోవాలి.
 • కార్‌ గ్యారేజ్‌లో పార్కింగ్‌ చేశాక....రెండు మూడూ అడుగులు మినిమంగా చుట్టూ ఖాళీ ఉండేలా గార్యేజ్‌ నిర్మాణం జరగాలి.
 • .కార్‌ షెడ్‌ ఎట్టి పరిస్ధితిలో కాంపౌండ్‌వాల్‌కు గానీ, మెయిన్‌ హౌస్‌కు కానీ తగలకుండా నిర్మించుకోవాలి.
 • ఈశాన్యంలో కార్‌ పార్క్‌ చేయడం కానీ, గ్యారెజ్‌ నిర్మించుకోవడం కానీ చేయనే చేయకూడదు.
 • ఒకవేళ బేస్‌మెంట్‌లో అయితే..... ఈశాన్యం మూలన కూడా కార్‌ పార్క్‌ చేసుకోవచ్చు.
 • కార గ్యారేజ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.
 • ఆగ్నేయంలో కార్‌ పార్క్‌ చేస్తే తరుచు కార్‌ రిపెయిర్‌ వస్తుంది.తక్కువగా తిరుగుతుంది.
 •  వాయువ్యంలో గార్యేజ్‌లో కార్‌ పార్క్‌ చేస్తే తిరుగుడు పుల్‌గా ఉంటుంది. అయితే రిపెయిర్స్‌ చాలా తక్కువగా ఉంటాయి.
 •  గ్యారేజ్‌కు యొక్క గేటు తూర్పు లేదా ఉత్తర దిక్కుకు తిరిగి ఉండాలి.
 •  గ్యారేజ్‌కు ఏర్పాటు చేసే గేటు.... ఇంటి సింహద్వారం కన్నా ఎత్తుగా ఉండకూడదు. అలాగే కాంపౌండ్‌ వాల్‌ కన్నా ఎత్తుగా ఉండకూడదు.
 • గ్యారేజ్‌లో చెత్త చెదారం ఉంచకూడదు.త్వరగా ఫైర్‌ అయ్యే ఎలాంటి పదార్ధాలు గ్యారేజ్‌లో ఉంచకూడదు.
22. సెప్టిక్‌ ట్యాంక్‌-వాస్తు నియమాలు
 • సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించడం చాలా అవసరం.
 • సెప్టిక్‌ ట్యాంక్‌ను ఈశాన్యం,నైఋతి, ఆగ్నేయ మూలల్లో ఏర్పాటు చేయకూడదు.
 • ఉత్తరం గోడలను తొమ్మిది భాగాలు చేసి వాయువ్య మూల నుండి మూడవ భాగంలో సెప్టిక్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
 • గృహం యెక్క ప్లింత్‌కు, కాపౌండ్‌వాల్‌కు టచ్‌ కాకుండా మినిమం 2 అడుగుల దూరంలో ఉండేలా సెప్టిక్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
 • ఇంట్లో వున్న మరుగుదొడ్ల సంఖ్యకు అనుగుణంగా సెప్టిక్‌ ట్యాంక్‌ను ఏర్పాటుచేసుకోవాలి.
 • సెప్టిక్‌ ట్యాంక్‌ నుంచి వెలువడే దుర్గంధం బయటకు పోవడానికి తప్పకుండా పైప్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.
 • స్ధలాభావం వలన సెప్టిక్‌ ట్యాంక్‌ ఉత్తరం దిక్కులోని 3వ భాగంలో పైన చెప్పినట్లు ఏర్పాటు చేసుకోలేకపోతే సెప్టిక్‌ ట్యాంక్‌ను వాయువ్య దిశలో కాంపౌండ్‌ వాల్‌కు ఇంటిప్లింత్‌కు దూరంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
23. తలపులు-కిటికీలు
 • ఇంటిలో తలుపులు కానీ, కిటికీలు కానీ తూర్పు,ఉత్తర దిశలలో ఎక్కువగా, దక్షిణం,పడమర దిశలో తక్కువగాను ఉండేలా చూసుకోవాలి.
 • తలుపులన్నింటి కన్నా సింహద్వారం తలుపు పెద్దదిగా ఉండాలి.మిగిలిన తలపులన్నీ ఒకే పరిమాణంలో ఉండాలి. ఒకవేళ కొన్ని తలపులు పెద్దదిగా ఏర్పాటు చేసుకోవాలినిపిస్తే.... ఇలాంటి పెద్ద తలుపులు,దక్షిణం-పడమరలలో మాత్రమే ఉండేలా ఉత్తరం,తూర్పు దిశలో ఉండకుండా జాగ్రత్త వహించాలి.
 • తలుపులు,కిటికీలు ఎప్పూడూ సరిసంఖ్యలో మాత్రమే ఉండాలి.
 • తలుపులు, కిటికీలు ఏర్పాటు చేసుకునే సమయంలో క్రాస్‌ వెంటిలేషన్‌ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.అంటే ఒకదానికొకటి ఎదురు బొదురుగా ఉండేలా జాగ్రత్తా వహించాలి.
 • ఇంట్లో ఏ గదికైనా గుమ్మాలు.... ఉత్తర ఈశాన్యం,తూర్పు ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏ గదికైనా..... ఉత్తర వాయువ్యం,తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైఋతి,పడమర నైఋతిలో గుమ్మాలు ఉండకుండా గృహ నిర్మాణ సమయంలో జాగ్రత్తలు వహించాలి.
 • సెయిర్‌ కేస్‌కం ప్రారంభంలో, ఎండింగ్‌లో డోర్స్‌ ఏర్పాటు చేసుకోవడం వాస్తురీత్యా మంచిది.
 • కిటికీలు వెడల్పు విషయంలో తేడాలున్నా ఎత్తు విషయంలో ఒకేలా ఉండేలా జాగ్రత వహించాలి.
24. వాస్తు పరంగా తోట - గార్డెన్‌
 • గార్డెన్‌ ఏర్పాటులో మంచిగా వాస్తు నిబంధనలు పాటిస్తే... మానసికంగా ఆనందం, ప్రశాంతత, ఉల్లాసం లభిస్తాయి.   గార్డెన్‌, లాన్‌, డెకరేటివ్‌ ప్లాంట్స్‌ ఎల్లప్పుడూ తూర్పుదిశలలో ఉండేలా చూసుకోండి.
 • కుక్కలకు పెట్‌ హౌస్‌, పక్షుల కోసం ఏర్పాటు ఎప్పుడూ వాయువ్యంలోనే చేయాలి.
 • గార్డెన్‌లో చెత్తా చెదారం లేకుండా ప్రతి రోజూ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌లా చేసుకోవాలి.
 • మెయిన్‌ గేట్‌ నుంచి ఇంటిలోకి వెళ్ళే దారిక ఇరువైపులా చిన్నచిన్న పూల మొక్కలు వంటివి పెంచుకోవచ్చు.
 • గార్డెన్‌తో పాటు స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మించుకోవాలంటే కేవలం ఈశాన్య దిశలో తప్ప.. మరే దిక్కులో స్విమ్మింగ్‌ఫూల్‌ నిర్మాణం చేయకూడదు.
 • గార్డెన్‌లో ఫౌంటెయిన్స్‌, గార్డెన్‌ మధ్యలో ఏర్పాటు చేయకూడదు. ఈశాన్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి.
 • ఇంటిలోపల నిమ్మ, జీడిమామిడి, నేరేడు, తుమ్ము, ఈత, జిల్లేడు, కుంకుడు, మామిడి, మారేడు, చింత చెట్లు పెంచకూడదు.
 • పనస, అశోక, వేప, కొబ్బరి, మర్రి, రావి, జామ, వంటి చెట్లను ఇంటిలో పెంచుకోవచ్చు.
25. వాస్తు పరంగా నిర్మాణ క్రమము
 • వాస్తు బలం గల స్థలం, కాస్తయినా చాలు - గృహస్థుకు చేస్తుంది ఎంతో మేలు.
 • మొదట స్థలశుద్ధి చేయండి - పిదప ఇల్లు కట్టేందుకు సిద్ధం కాండి.
 • స్థలానికి ఈ శాన్యంలో శంఖుస్థాపన చేయడం - పంచభూతాలకు ఆహ్వానం పలకడం.
 • ముందు ఇంటి చుట్టూ ప్రహారి పునాది నిర్మించు - మీడట అన్ని విధాల అది నిన్ను రక్షించు.
 • నైఋతిని మూలమట్టానికి సరిచేసి కట్టడం - సక్రమమైన సిరులను పొందడం.
 • పునాది త్రవ్వకం ఈశాన్యం నుండి ప్రారంభించు - అదియే నిర్మాణాన్ని సత్వరం ముగించు.
 • పునాది గోడ నైరృతి నుంచి మొదలు పెట్టి కట్టడం - అనేక శుభాలకు హారతి పట్టడం.
26. నుయ్యి (బావి, బోరింగ్‌)
 • తూర్పున బావి - మార్పులేని సుఖాల తావి. (తావి = పరిమళం)
 • అగ్నేయ కూపం - అతివల అవర్ధాలకు ప్రతిరూపం.
 • దక్షిణంలో బావి - తరుణులకు మరణాల దీవి.
 • నైరృతిలో నుయ్యి - మృత్యువు చాచిన చెయ్యి.
 • పడమట బావి - పురుషుని ఆరోగ్యానికి ఎండమావి.
 • వాయవ్యంలో బావి - జగడాల కొరివి.
 • ఉత్తరంలో నుయ్యి - ఉత్తమ దీవెనలిచ్చు చెయ్యి.
 • ఈశాన్యలో నుయ్యి - విశేష శుభ ఫల ప్రదాయి.
 • మొదట ఈశాన్యంలో త్రవ్విన బావి - ఆ నీటితో కట్టినిల్లు బంగారు దీవి.
27. ఆవరణంలో వాటర్‌ ట్యాంక్‌
 • తూర్పు మరియు తూర్పు ఈశాన్యలలో వాటర్‌ పంప్‌ - ఆరోగ్యాన్ని ఇంట
 • నిలిపే లక్కీ స్టాంప్‌.
 • ఉత్తరం మరియు ఉత్తర ఈశాన్యలలో భూమిలో వాటర్‌ ట్యాంక్‌ - సంపదల
 • రాబడికి స్విస్‌ బ్యాంక్‌.
 • ఆగ్నేయంలో భూమిపై ట్యాంకుతో నీరు నిలువ - అన్ని విధాల సుఖశాంతులకు విలువ.
 • దక్షిణ పశ్చిమాలలో భూమిపై ట్యాంకుతో నీరు నిలువ వుంచటం - సుఖ శాంతులను పెంచటం.
 • నైరృతి వాయవ్యాలలో భూమిపై ట్యాంకుతో నీరు నిలువ వుంచడం - సాటిలేని
 • శాంతికి పట్టం కట్టడం.
 • ఆగ్నేయ నైరృతులలో భూమిలో నీటి నిలువ - దీర్ఘ రోగమరణాలకు చేరువ.
 • దక్షిణ పశ్చిమాలలో భూమిలో నీరు నిలువ చేయడం - మృత్యు ముఖద్వారానికి చేరుకోవడం.
 • వాయవ్యాలలో భూమిలో నీటి సంప్‌ - లౌకిక వ్యవహారల తెగదెంపు.
28. ఖాళీ స్థలాలు వాస్తు
 • పడమటి కన్నా తూర్పున ఎక్కువ ఖాళీ స్థలం వుండటం - పురుషుని కీర్తి కిరీటం.
 • దక్షిణం కన్నా ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్థలం - సిరులకు, స్త్రీల సుఖాలకు ఆలవాలం.
 • తూర్పు కన్నా పడమట ఎక్కువ ఖాళీ స్థలం - పరుషుల యోగ్యత విఫలం.
 • ఉత్తరం కన్నా దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం - అన్ని అనర్ధాలకు మూలం.
 • ఈశాన్యంలో ఖాళీ లేని గేహం - శ్వాస నిలిచిపోయే దేహం (గేహం = ఇల్లు).
 • విదిక్కుల స్థలం ఇంటికి ఆగ్నేయ వాయవ్యాలలో సమాన ఖాళీ వుంచు - అది నీ ప్రతిష్ఠను పెంచు.
 • విదిక్కుల స్థలం ఇంటికి అన్నింటికన్నా ఈశాన్యంలో ఖాళీ ఎక్కువ - ఉంటే
 • ధన, కనక వస్తు వాహనాలకు ఉండదు తక్కువ.
 • తూర్పు స్థలాన్ని కలుపుకో - కీర్తి సంపదలను గెలుచుకో.
 •  ఆగ్నేయ స్థలాన్ని కలపుకోవద్దు - ఆపదలను దాపునకు పిలుచుకోవద్దు.
 • దక్షిణ స్థలాన్ని కలుపుకోకు - రక్షణ కవచాన్ని కోల్పోకు.
 • నైరృతి స్థలం వూరకవచ్చినా కలుపుకోకు - కష్టాలను కొని తెచ్చుకోకు.
 • పశ్చిమ స్థలాన్న కలుపుకోవడం - పచ్చని ఆరోగ్యానికి చిచ్చు పెట్టుకోవడం.
 • వాయవ్య స్థలాన్ని కలుపుకున్నవారు - మనశ్వాతిని కోల్పోతారు.
 • ఉత్తర స్థలాన్ని కలుపుకో - ఉత్తమ ఫలాన్ని అందుకో.
 • ఈశాన్యంలోని స్థలాన్ని కొనడం - విశేష ఐశ్వర్యాలతో వృద్ధిచెందడం.
 • ఈశాన్యంలో స్థలంపోతే - ఇంట్లో ఇనుపగజ్జెల మోతే (ఇనుపగజ్జెలుదరిద్రానికి గుర్తులు)
29. భూగృహం (సెల్లార్‌)
 • తూర్పు, తూర్పు ఈశాన్యంలో భూగృహ నిర్మాణం - కలిగించును నిత్యకల్యాణం.
 • దక్షిణాన భూగృహ నిర్మాణం - ఆయుక్షీణతకు కారణం.
 • పడమట భూగృహ నిర్మాణం - కడతేరని కష్టాలతో రణం. (రణం = యుద్ధం)
 • ఉత్తరం, ఉత్తర ఈశాన్యంలో భూగృహ నిర్మాణం - స్త్రీలకు ముత్యాల ఆభరణం.
30. ద్వారాలు
 • ఉదయం లేవగానే తూర్పు వాకిలి తెరవటం - ఆరోగ్యసంపదలనాహ్వానించడం.
 • తూర్పు వాకిలి లేనప్పుడు ఉత్తరం వాకిలి తెరవాలి - ఉత్తమోత్తమ గాలులతో మీ ఇల్లు నింపాలి.
 • తూర్పు ద్వారం - శుభకరమైన వరం.
 • తూర్పు ఆగ్నయ ద్వారం - అగ్నికి, వ్యాధులకు, చోరులకు స్థావరం.
 • దక్షిణ ఆగ్నేయ ద్వారం - స్త్రీలకు చేస్తుంది ఉపకారం.
 • దక్షిణ ద్వారం - గృహస్థులకు శుభకరం.
 • దక్షిణ నైరృతి వాకిలి - సుదతుల సుఖాలను నలుగదంచు రోకలి.
 • పశ్చిమ నైరృతి వాకిలి - పురుషుల జీవితాలకు ఘోరకలి.
 • పశ్చిమ ద్వారం - గృహస్థులకు క్షేమకరం.
 • పశ్చిమ వాయవ్య ద్వారం - పలు శుభాలకు పసిడి హారం.
 • ఉత్తర వాయవ్య ద్వారం - నిరంతర చంచల వ్యవహారం.
 • ఉత్తర ద్వారం - ఉత్తమ ప్రగతికి రత్నహారం.
 • ఉత్తర ఈశాన్య ద్వారం - విత్త ప్రాప్తికి, స్త్రీ సౌభాగ్యానికి ఆధారం.
 • తూర్పు ఈశాన్యద్వారం - యజమాని కీర్తికి, సంతతి పురోగతికి మందారం. (మందారం = కల్పవృక్షం).
 • ఈశాన్యం గదికి తూర్పున నిష్క్రమణ ద్వారం - శుభాలు అపారం.
 • ఆగ్నేయం గదికి తూర్పులో నిష్క్రమణ ద్వారం - ఇంటికి నీచమైతే ఆరోగ్యానికి హానికరం.
 • ఆగ్నేయం గదికి దక్షిణ ఆగ్నేయంలో నిష్క్రమణ ద్వారం - స్రీలకు సౌభాగ్యకరం.
 • నైరృతి గదికి దక్షిణంలో నిష్క్రమణ ద్వారం - ఇంటికి నీచమైతే ఇంతులకు ప్రాణాపాయకరం.
 • నైరృతి గదికి పశ్చిమంలో నిష్క్రమణ ద్వారం ఇంటికి నీచంలో వున్న - పురుషులకు ఆరోగ్యం సున్న.
 • వాయవ్యం గదికి ఉత్తరంలో నిష్క్రమణ ద్వారం - ఇంటికి నీచంలో వున్నస్త్రీలకు అశాంతి మిన్న.
 • ఈశాన్యం గదికి ఉత్తరాన నిష్క్రమణ ద్వారం - సిరులకు ఆకరం.
31. ఇంటిలోని నడకలు
 • తూర్పు నుండి దక్షిణ నైరృతి ద్వార గమనం - స్రీలకు సంకటాల ఆగమనం. (ఆగమనం = రాక)
 • తూర్పు నుండి పశ్చిమ నైరృతి ద్వార గమనం - పురుషులకు అరిష్టాల ఆగమనం.
 • తూర్పు నుండి పడమటికి వరుస వాకిళ్ళ నడక - వరించును కీర్తి పురుషులకు వీడక.
 • తూర్పు నుండి పశ్చిమ వాయవ్యానిక గమనం - ఆనారోగ్యాల ఆగమనం.
 • తూర్పు ఆగ్నేయం నుండి పశ్చిమ ద్వారగమనం - యజమానిని చేస్తుంది పతనం.
 • దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర వాయవ్యానికి నడక - కడలేని కలహాలకు పుట్టుక.
 • దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర ఈశాన్యానికి నడక - కమ్మని కలల తీరాలకు చేరిక.
 • దక్షిణం నుండి ఉత్తర వాయవ్య ద్వార గమనం - స్త్రీలకు కలిగించున దుర్వర్తనం.
 • దక్షిణం నుండి ఉత్తర ఈశాన్య ద్వారగమనం - వనితలకు సౌభాగ్య జీవితానికి విహారవనం. (వనిత = స్త్రీ).
 • పశ్చిమం నుండి తూర్పు, ఉత్తర ఈశాన్యద్వారాల నడక - నిశ్చయంగా శుభాలనిస్తుంది తప్పక.
 • పశ్చిమం నుండి తూర్పు ఈశాన్యానికి ద్వార గమనం - పురుష సంతానానికీ, విజ్ఞానికీ సోపానం.
 • ఉత్తరం నుండి దక్షిణానికి ద్వార గమనం - తరగని సిరులకు ఆహానం.
 • ఉత్తరం నుండి దక్షిణానికి ఆగ్నేయానికి నడక - కలహాగ్నికి రాచుకునే పిడక.
 • ఉత్తరం నుండి దక్షిణ నైరృతి నడక - ఆడవారికి అశుభాల పడక.
 • దక్షిణానికి వాకిలి ఉన్న యింటికి - తప్పక ఉండాలి వాకిలి ఉత్తరానికి.
 • ఇంటికి పశ్చిమాన వుంటే వాకిలి - తూర్పున కూడా తప్పక ఉండాలి వాకిలి. కాపురం లేని దక్షిణ ద్వారమున్న కొట్లకు ఉత్తరంలో ద్వారం ఉంటే ఫరవలేదు లేక పోయినా యే బాధా లేదు. కాపురు చేయని పశ్చిమ ముఖద్వారమున్న కొట్లకు తూర్పుకు ద్వారం ఉండటం మంచిది - లేకున్న లేదు ఇబ్బంది. ఇంటికి తూర్పు ద్వారం లేకుంటే - పురుషుల జీవితాలకు తంటే.
 • ఇంటికి ఉత్తర ద్వారం లేకుంటే - ఇంతల జీవితాలకు మంటే.
 • స్థలం దిక్సూచికి వున్నప్పుడు నాలుగు దిక్కులకు పెట్టు ద్వారాలు - సాటిలేని రీతిలో కలుగు భోగభాగ్యాలు.
A. పడక గది
 • వీలులేనప్పుడు శయ్యవెయ్యి తూర్పు గదిలో సుఖ నిద్ర, ఉత్సాహము కల్గు మదిలో.
 • ఆగ్నేయంలో రెండవ సంతానం నిద్రించడం - ఆనందపు విందులు నెప్పుడు పొందడం.
 • దక్షిణం గదిలో పడక - ఆరోగ్యానిస్తుంది వీడక.
 • నైరృతి గదిలో యజమాని పడక - అభివృద్ధి దిశలకు గృహస్థుసాగించే నడక.
 • పడమటి గదిలో పడక - ఒడిదుడుకులు లేని సుఖాల కూడిక.
 • వాయవ్యంలో మూడవ సంతానం నిద్రించడం - వివాదాలకు తావుండక జీవించడం.
 • ఉత్తరాన పిల్లల నిదుర గదులు - ఉత్తమ ప్రగతికి మూలికలు.
 • ఈశాన్యం గదిలో బార్యాభర్తల పడక - నశింపజేయు వ్యాధులు కూడిక.
 • తూర్పు తలాపి నిద్ర - ఆరోగ్య భద్రతకు ముద్ర.
 • దక్షిణం వైపు తలవుంచి నిద్రించడం - ఆరోగ్య ధవళ పతాకాన్ని ఎగిరించడం. (ధవళ = తెల్లని, నిర్మలము).
 • నిదురించునపుడు పడమటికి వుంచిన తల - ఉవ్వెత్తున చేలే పీడకలల అల.
 • ఉత్తరంగా తలవుంచి నిద్రించడం - తత్తరపాటును కలిగించు వ్యాధి విషాలను చిందించడం.
B. పొయ్యి
 • తూర్పు ముఖంగా ఆగ్నేయంలో వంట - ఇంట ఎడతెగని సుఖాల పంట.
 • ఆగ్నేయంలో పొయ్యి - అమరించును శుభాల వెయ్యి.
 • దక్షిణ ముఖంగా వండు వంట - దరిద్రాన్ని కొని తెచ్చుకొనే తంట.
 • నైరృతి ఉపగృహంలో పొయ్యి - వీలులేనప్పుడు వెయి.
 • తూర్పు, పశ్చిమ గదుల్లో వంట - పురుషుల ఆరోగ్య, యశస్సుల దహించే మంట.
 • దక్షిణ, ఉత్తర గదుల్లో పొయి - సిరికి, స్త్రీ ఆరోగ్యానికి గొయ్యి.
 • పశ్చిమ ముఖంగా వండే వంట - వాయవ్య గదిలో చేసుకో ఇంట.
 • ఉత్తర వాయవ్యంలో పొయ్యి - కత్తెర బోనులో పెట్టిన చెయ్యి.
 • ఉత్తర ముఖంగా చేయి వంట - ఉపద్రవాల ఊబి గుంట.
 • ఈశాన్యంలో పొయి - ఐశ్వర్యాలను మంచు నుయ్యి.
C. ఆటవిడుపు గది - స్టోర్‌ రూమ్‌
 • స్టోర్‌ రూమ్‌ ఈశాన్యం - శుభాల ప్రగతి శూన్యం.
 • స్టోర్‌ రూమ్‌ నైరృతి ఉపగృహంలో - నిత్య పురోగతి ఆ యింటిలో.
 • స్టోర్‌ రూమ్‌ ఆగ్నేయం వంట గదికి పశ్చిమాన - ఉత్తమ ఫలితాలు స్థిరపడును ఆ ఇంటిలోన.
 • దక్షిణ పశ్చిమాల్లో స్టోర్‌రూమ్‌లు - ధన ధాన్య సమృద్ధికి నిలయాలు.
 • ఉత్తరంలో స్లోర్‌రూం - వాస్తుకెప్పుడూ విరుద్ధం.
D. పూజగది
 • ఇంటిలో పూజగది ఏ దిశలో వున్నా - ఎలాంటి లోటు కలుగదన్నా!
 • ఈశాన్య గదిలో స్థిర నిర్మాణం - వాస్తుబల నివారణం. (స్థిర నిర్మాణం = రాయి, సిమెంటు అరుగు)
 • పశ్చిమ, దక్షిణాన పూజ గదులు స్థిర నిర్మాణం - వాస్తు బలపోషణం (పోషణం = పెంచటం)
 • తూర్పుముఖంగా దేవుని అర్చించు - ఆరోగ్య భాగ్యాలను ఆర్జించు.
 • పశ్చిమ ముఖంగా అర్చన - శుభాలను చేర్చు నిచ్చెన.
 • భువికి రవియే ఆధారం - అందుకే తూర్పు పడమర ముఖంగా పూజలకు అంత ప్రాచుర్యం.
E. స్నానం గది
 • తూర్పున స్నానం గది - సుఖశాంతులకు విడిది.
 • దక్షిణాన గొయ్యిలేని స్నానం గది - సకల శుభాల రథసారథి.
 • పశ్చిమాన గొయ్యిలేని స్నానం గది - సుఖాలకు పెన్నిధి.
 • ఉత్తరాన స్నానం గది - ఉత్తమ సుఖాలు కలిగిస్తుంది.
F. లెట్రిన్‌ - సెప్టిక్‌ ట్యాంక్‌
 • తూర్పు ముఖంగా లెట్రిన్‌లో కూర్చోకండి - అది ఆరోగ్యానికి గండి.
 • తూర్పున సెప్టిక్‌ ట్యాంకు - ఉన్నతికి మంచి లింకు.
 • ఆగ్నేయంలో మరుగు దొడ్డి - ఆరోగ్య ధనానికి చక్రవడ్డి (శుభం)
 • ఆగ్నేయంలో గొయ్యితో ఉన్న మరుగుదొడ్డి - ఆరోగ్యాన్ని చితుకగొట్టు ఇనుప కడ్డి.
 • దక్షిణ ముఖంగా లెట్రిన్‌లో కూర్చొనండి - నిత్యం ఆనందంగా ఉండండి.
 • సెప్టిక్‌ ట్యాంక్‌ దక్షిణం - సెప్టీలేని బ్రతుకే అనుక్షణం (సెఫ్టీ = క్షేమం)
 • నైరృతిలో గొయ్యితో పాయిఖానా - వేస్తాయి ఇంటిలో రోగాలు ఠికానా.
 • పడమర ముఖముంచి లెట్రిన్‌లో కూర్చోకండి - ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.
 • సెప్టిక్‌ ట్యాంక్‌ పడమట వుంచడం - ఇంటిలోనికి రోగాలను రప్పించడం.
 • వాయవ్యంలో పాయిఖానా - సుఖాలకు పరచిన జంబుఖానా.
 • యవ్యంలో గొయ్యితో మరుగుదొడ్డి - వాడులాటకు చిచ్చుబుడ్డి.
 • ఉత్తరంలో సెఫ్టిక్‌ ట్యాంక్‌ - ఉత్తమ ఫలితాలకు ఫస్ట్‌ ర్యాంక్‌.
 • ఉత్తర ముఖంగా లెట్రిన్‌లో కూర్చొనండి - ఉత్తమ ఆరోగ్యాన్ని కూర్చుకొనండి.
 • ఈశాన్యంలో మరుగుదొడ్డి - అంతులేని అరిష్టాల మడ్డి. (మడ్డి = మలినం)
 • ఈశాన్యంలో సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మాణం - అనారోగ్యానికి సోపానం.
 • తూర్పు ఉత్తర సరిహద్దులనంటి నిర్మించే మరుగుదొడ్లు - వంటిమీదకెగజిమ్మే చిచ్చుబుడ్లు.
G. అటకలు
 • తూర్పు గోడకు వుండే అటక - భయపెట్టే పటాక.
 • దక్షిణం గోడకు ఉండే అటక - స్త్రీకి బంగారు పటకా (పటకా = వడ్డాణం).
 • పడమటి గోడకు ఉండే అటక - శుభఫలితాలకు పీఠిక.
 • ఉత్తరం గోడకు ఉండే అటక - ఉపద్రవాల పుట్టుక.
 • దక్షిణ, పశ్చిమాలలో అటకలు వున్నప్పుడు - తూర్పు, ఉత్తరాలలో అటకలున్నా తప్పులేదప్పుడు.
H. మెట్లు (తాపలు)
 • తూర్పు నుండి పడమటికి తాపలు కట్టుకో - కీర్తి కిరీటం పెట్టుకో.
 • ఉత్తరం నుండి దక్షిణానికి మెట్లు కట్టుకో - ప్రీతిగా ధనాన్ని ఆకట్టుకో.
 • ఈశాన్య, నైరృతి గదుల్లో మెట్లు నిర్మించడం - సుఖాన ఉన్న ప్రాణాన్ని దు:ఖాలపాలు చేయుకోవడం.
 • దక్షిణం, పశ్చిమగదుల్లో మెట్ల నిర్మాణం - శుభాల తోరణం.
 • ఇంటి లోపల ఈశాన్యంలో మెట్లు నిర్మించడం - ఈశాన్యం తెగి బరువైనందుకు పురోగతి స్తంభించడం.
 • ఇంటిలోపల నైరృతిలో మెట్లు నిర్మించకు - కోరికోరి కష్టాలు తెచ్చుకోకు.
 • ఇంటి వెలుపల దక్షిణ నైరృతి మెట్ల ల్యాండింగ్‌ క్రింద గదుల నిర్మాణం - నైరృతి పెరిగి పల్లమై స్త్రీల ప్రగతికి పడుతుంది గ్రహణం.
 • ఇంటి వెలుపల పశ్చిమ నైరృతి మెట్ల ల్యాండింగ్‌ క్రింద గదులు వేయడం - పల్లమై పెరిగిన నైరృతితో పురుషుని నిర్వీర్యం చేయడం.
 • ఇంటి బయట ఉత్తర వాయవ్యంలో మెట్ల ల్యాండింగ్‌ క్రింద గదులు వేసినప్పుడు - ఈశాన్యంలో ఇంటి పారుకు పిల్లరు వేయాలి అప్పుడు.
 • ఇంటి బయట తూర్పు ఆగ్నేయంలో మెట్ల ల్యాండింగ్‌ క్రింద గది వేసిన - ఇంటి పారుకు పిల్లరు వేయాలి ఈశాన్యంలోన.
I. వాలు వరండా
 • తూర్పు వాలు వరండా - పురుషుల ఆరోగ్యానికి అండ.
 • దక్షిణం వాలు వరండా - సిరికి, స్త్రీకి గుండెల మీద బండ.
 • పశ్చిమం వాలు వరండా - పురుషుల ఆరోగ్యానికి ఎర్రజెండా (అపాయం)
 • ఉత్తరం వాలు వరండా - స్త్రీల సుఖాలకు, ఐశ్వర్యాలకు గెలుపుదండ.
J. వరండాలో గదులు
 • తూర్పు వరండాలో ఆగ్నేయాన గది - సుఖశాంతులను ఇచ్చు నిధి.
 • దక్షిణ వరండాలో ఆగ్నేయాన గది - స్త్రీలను బాధల పాలు చేయు ముళ్ళ గుది.
 • దక్షిణ వరండాలో నైరృతి అర - స్త్రీలకు ప్రశాంతిని చేకూర్చే సితార.
 • పశ్చిమ వరండాలో పశ్చిమ నైరృతి గది - పురుషులకు సుఖాలనిచ్చే జీవనది.
 • పశ్చిమ వరండాలో వాయవ్యం అర - పురుషుని అభివృద్దిని చించి వేయుకత్తెర.
 • ఉత్తర వరండాలో వాయవ్యాన గది - అతివల ఆర్ధిక శుభాలకు ప్రోది. (ప్రోది = పెంపు)
 • ఉత్తర వరండాలో ఈశాన్యన గది - ఉవిదల శుభలాభాలను చేస్తుంది బూది. (బూది = బూడిద).
 • తూర్పు వరండాలో ఈశాన్యన గది - పురుష పురోగతిని క్రుంగదీయు గుది (గుది = పశువుల మెడలో వేసేబండకొయ్య).
K. పై మేడ
 • ఇంటిపైన తూర్పున కట్టిన మేడ - పురుషులకు పీడ.
 • ఆగ్నేయంలో మేడ ఇంటిపైన - అది దించుకోలేని కుంపటి తలపైన.
 • దక్షిణ భాగంలో మీది సాధం - ధనాభివృద్ధికి లక్ష్మీపాదం.
 • ఇంటిపైన నైరృతిలో సౌధం - గృహస్తునకు కలిగించు ప్రమోదం.
 • పశ్చిమంలో పైనున్న మేడ - పురుషుల పురోభివృద్ధికి జాడ.
 • ఇంటిపైన మేడ వాయువ్యంలో - అస్థిరత సుస్థిరం ఆ గృహంలో.
 • ఉత్తరాన పై మేడ - ధనాభివృద్ధికి అడ్డుగోడ.
 • ఈశాన్యంలో ఇంటిపైన మేడ - గృహస్థులపై కూలిన రాతి గోడ.
L. ఇంటిపైన నీటి ట్యాంక్‌
 • ఇంటిపై తూర్పున నీటితొట్టి నిర్మాణం - పురుషుల పలుకుడిని గ్రుచ్చుకొను పదును బాణం.
 • వీలులేనప్పుడు ఇంటిపైన ఆగ్నేయంలో నీటి తొట్టిని వుంచు - కాని నైరృతిలో దానిని మంచిన కట్టడం నిర్మించు. 
 • దక్షిణంలో ఇంటిపైన నీటి ట్యాంక్‌ కట్టించుకో - భోగభాగ్యాలను ఇంటిలో పెంచుకో.
 • ఇంటిపై నైరుతిలో నీటి ట్యాంక్‌ - రెట్టింపు సిరులకు బ్యాంక్‌.
 • పడమటి దిక్కున ఇంటిపై నీటి ట్యాంక్‌ నిర్మించుకో - ఆరోగ్యాన్ని ఇంటిలోనికి రప్పించుకో.
 • అనుకూలం లేనప్పుడే ఇంటిపై వాయవ్యలో నీటితొట్టిని పెట్టుకో - కానీ ఆగ్నేయంలో, నైరృతిలో, ఒకదాన్ని మించి ఒకటి ఎత్తైన కట్టడాలు కట్టుకో.
 • ఉత్తరంలో ఇంటిపైన నీటి ట్యాంక్‌ కట్టడం - ఉన్న ధనాన్ని బయటకు నెట్టడం.
 • 183. ఇంటిపైన ఈశాన్యంలో నీటిట్యాంక్‌ - ఇంటిలోన ఖాళీ ట్రంక్‌.
M. సరిహద్దు నిర్మాణం
 • తూర్పు సరిహద్దులో చేసిన నిర్మాణం - కూర్చుకొన్న శుభాల నిర్మూలనం.
 • దక్షిణం రోడ్డు ఎత్తు వున్నప్పుడు సరిహద్దుపై చేసిన నిర్మాణం - భోగభాగ్యాలిచ్చు రవి కిరణం.
 • పశ్చిమం రోడ్డు ఎత్తు ఉన్నప్పుడు సరిహద్దు మీద నిర్మాణం - గృహస్తు మెడలో మణిహారం.
 • ఉత్తర సరిహద్దు మీద చేసిన నిర్మాణం - సిరికీ, స్త్రీ పురోగతికీ విషబాణం.
N. ఇంటి ఆవరణలో ఉపగృహం
 • ఆగ్నేయంలో తూర్పు సరిమద్దును, ఇంటిని అంటని ఉపగృహం - అతివలకు అనంత శుభాల అనుగ్రహం.
 • ఆగ్నేయంలో తూర్పు సరిహద్దును, తాకిన ఉపగృహం - ఉవిదలకు అశుభాల ఆగ్రహం.
 • నైరృతిలో ఇంటినంటని ఉపగృహం - నిత్య శుభాల సంగ్రహం. (సంగ్రహం = కూడబెట్టు).
 • వాయువ్యంలో ఉత్తర సరిహద్దుపై ఉపగృహం - శుభాలకు నిగ్రంహం. (నిగ్రహం =
 • అడ్డగించడం). వాయువ్యంలో ఉత్తర ప్రహరిని, ఇంటిని అంటని ఉపగృహం దివ్య సుఖాలను ఇచ్చును అహరహం. (అహరహం = ఆనుదినం)
 • ఈశాన్యంలో ఉపగృహం - నాశనం చేయు మద్యపాన దాహం.
O. బరువులు
 • తూర్పు భారం - ఐశ్వర్య, కీర్తులు దూరం.
 • దక్షిణాన భారం - ధన, ధైర్యాలకు వరం.
 • పశ్చిమంలో భారం - నిరంతర సుఖాల తీరం.
 • ఉత్తర దిశలో బరువు - విత్తం, చిత్తశాంతి కరువు.
 • ఈశాన్యంలో బరువు - ఇక వుండదు సుఖమైన బ్రతుకు దెరువు.
P. బీరువాలు
 • గదికి తూర్పున బీరువావుంచకు - వచ్చే నీ రాబడిని త్రుంచకు.
 • గదికి ఆగ్నేయంలో బీరువా - ధనాన్ని తన్నుకుపోయే బోరువ. (బోరువ = పెద్దపెద్ద)
 • గదికి దక్షిణాన బీరువా - ధనం రావడానికి వరవ. (వరవ = తూము)
 • నైరృతిలో ఉత్తరాభిముఖంగా వుంచిన బీరువా - పెరిగిపోవు సిరుల కరువ. (కరువ = కొండ) గదికి నైరృతిలో తూర్పు ముఖంగా వుంచిన డబ్బు మందసం సిరులకు నిరంతరావాసం (మందసం = పెట్టె)
 • గదికి పశ్చిమంలో దూర్పు ముఖంగా వుంచిన బీరువా - సిరులకు చొరవ. (చొరవ = ప్రవేశం)
 • గదికి ఉత్తర వాయవ్యంలో బీరువా - సిరి చలనానికి త్రోవ.
 • గదికి ఉత్తరాన వుంచిన డబ్బు మందసం - ఎప్పుడూ తారాడవలసిందే డబ్బుకోసం.
 • గదికి ఈశాన్యంలో బీరువా - దరిద్రానికి చేరువ.
Q. ఇంటి ముందు అరుగులు
 • తూర్పున పల్లపు అరుగులు - జీవిత నౌకను సుఖశాంతులు తీరానికి చేర్చు సరంగులు. (సరంగులు = నావికులు) తూర్పు అరుగులు మెర - పురుషులకు కొరడా చురక.
 • ఆగ్నేయంలో నైరృతికన్నా ఎత్తైన అరుగు - ఇంటిలోని వారికి ఆరోగ్యం కనుమరుగు.
 • దక్షిణాన పల్లపు అరుగులు - ధనోన్నతికి మెరుగులు.
 • దక్షిణాన పల్లపు అరుగులు - ధనానికి తీరని తరుగులు.
 • నైరృతిలో ఎత్తైన అరుగులు - ఐశ్వర్యాన్ని పెంచు బంగారు మురుగులు. (మురుగులు = చేతి అభరణాలు)
 • పశ్చిమాన ఎత్తైన అరుగులు - అభివృద్ధి దిశకు పరుగులు.
 • పల్లపు అరుగులు పశ్చిమం వైపు - యజమాని నడకలు పతనం వైపు.
 • పశ్చిమ వాయవ్యంలో పల్లపు అరుగులు - ఐశ్వర్యానికి విరుగులు.
 • ఉత్తరాన ఎత్తైన ఆరుగులు - స్రీల శుభాలను పిండిచేయు తిరుగళ్ళు. (తిరుగలి = విసురురాయి).
 • ఉత్తరాన పల్లపు అరుగులు - సుఖాలకు పట్టు చెరుగులు.
 • ఉత్తర ఈశాన్యంలో ఎత్తైన అరుగులు - స్త్రీల శుభాలకు చిరుగులు.
 • తూర్పు ఈశాన్యంలో ఎత్తైన అరుగులు - పురుషుల ఘనతను క్రుళ్ళజేయు పురుగులు.
R. తులసికోట
 • తూర్పు పల్లంలో తులసి మొక్క - స్త్రీల ఆరోగ్యమునకు సుఖమైన పక్క.
 • దక్షిణాన తులసికోట - స్త్రీల ఆరోగ్యానికి కంచుకోట.
 • పడమట తులసికోట కట్టండి - ఆరోగ్యానికి పట్టం కట్టండి.
 • ఉత్తరాన ఎత్తులో తులసికోట - ఉత్తమ ఫలితాలివ్వడం వుత్తమాట.
 • ఈశాన్యంలో తులసికోట - ఇంతులకు ఆరోగ్యమివ్వదు యే పూట.
S. చెట్లను పెంచడం
 • తూర్పున చెట్లను పెంచకు - వాస్తు బలాన్ని త్రుంచి కష్టపడకు.
 • తూర్పు ఆగ్నేయంలో పూల మొక్కలను పెంచు - శుభఫలితాలను అనుభవించు.
 • దక్షిణ ఆగ్నేయంలో చెట్లను పెంచు - అవి శుభాలను నీఇంటవుంచు.
 • దక్షిణ దిశలో వృక్షపోషణ - ఇంటికి అన్ని విధాల రక్షణ.
 • దక్షిణ నైరృతిలో చెట్లపెంపు - స్త్రీలను ఆరోగ్యంతో నింపు.
 • పశ్చిమ నైరృతిలో చెట్లను పెంచడం - పురుషులకు ఆరోగ్యం కలిగించడం.
 • పశ్చిమంలో చెట్లను పెంచడం - ఆరోగ్యాన్ని పోషించడం.
 • పశ్చిమ వాయువ్యంలో పెంచుకొను చెట్లు - ఉన్నతికి, ఆరోగ్యానికి బంగారు మెట్లు.
 • ఉత్తర వాయవ్యంలో పూల మొక్కలు - అభివృద్దిని మోసుకొచ్చు రెక్కలు.
 • ఉత్తరాన వృక్షపోషణం - విత్తము క్షీణం అనుక్షణం (విత్తం = ధనం).
 • ఉత్తర ఈశాన్యంలో చెట్లు - స్త్రీల ఆరోగ్యానికి పాము కాట్లు.
 • తూర్పు ఈశాన్యంలో చెట్లు - పురుషుల ఆరోగ్యానికి విషపు బొట్లు.
T. పల్లం (తగ్గు)
 • తూర్పున పల్లం - సుఖశాంతులకు అరచేతనున్న తరగని బెల్లం.
 • ఈశాన్యం కన్నా ఆగ్నేయం పల్లం - ఆరోగ్యానికి కళ్ళెం.
 • దక్షిణం పల్లం - అదృష్టాన్ని అడ్డుకొనే గొళ్ళెం.
 • నైరృతి పల్లం - మరణానికి మూలం.
 • పశ్చిమం పల్లం - సుఖాలను పొడుచు శూలం.
 • ఈశాన్యం కన్నా వాయవ్యం పల్లం - వ్యవహారంలో చెల్లం.
 • ఉత్తరం పల్లం - బంగారు పళ్ళెం.
 • ఈశాన్యం పల్లం - ఐశ్వర్య, ఆరోగ్యాలకు హారతిపళ్ళెం.
 • నైరృతికన్నా ఆగ్నేయం, వాయవ్యం, ఈశాన్యం పల్లం - సంతృప్తినిస్తుంది ఉల్లం. (ఉల్లం = మనస్సు)
U. మెరక (ఎత్తు)
 • తూర్పు మెరక - ఆరోగ్య, ధనాలను గ్రుచ్చు గొరక. (గొరక = ఇనుపబాణం).
 • దక్షిణంలో మెరక - పాడిపంటలిచ్చు ఏరువాక.
 • నైరృతి ఉన్నతి - నరులకు అభ్యున్నతి.
 • పశ్చిమం ఎత్తు - గృహస్థుల పాలిటి బంగారు సొత్తు.
 • ఆగ్నేయం కన్నా వాయవ్యం ఎత్తు - గృహస్తులను దిగువకు ఒత్తు. (ఒత్తు = అదుము)
 • నైరృతికన్నా ఆగ్నేయ, వాయవ్య, ఈశాన్యాలు ఎత్తు - చేస్తాయి యజమానిని తొత్తు. (తొత్తు = బానిస).
 • ఉత్తరం మెరక - దరిద్రానికి పడక.
 • 254. ఈశాన్యం మిఱ్ఱు - ఐశ్వర్యానికి కొఱ్ఱు. (కొఱ్ఱు = శూలం)
V. నీటి వాటం
 • వాన నీరు, వాడుకనీరు తూర్పు ఈశాన్యానికి పారనిమ్ము - నిరంతరంగా శుభాలు రానిమ్ము.
 • ఈశాన్యంగా జల ప్రవాహం - సకల సంపదలకు ఆధారం.
 • ఇంటిలోని నీరు తూర్పున పారించు - నీ ఇంటిల్లిపాదని శుభాలు వరించు.
 • ఇంటిలోని నీరు దక్షిణానికి పోవడం - ఇంతులు అనారోగ్యవతులు కావడం.
 • ఇంటిలోని నీరు దక్షిణ నైరృతి నుండి వెళ్ళడం - స్త్రీల ఆరోగ్యం చెడడం.
 • వాన నీరు వాడుక నీరు పశ్చిమ నైరృతి నుండి పోవడం - పురుషులు అనారోగ్యానికి గురికావడం. 
 • నైరృతిలో జల ప్రవాహం -వికృత ఫలితాల నివహం. (నివహం = గుంపు) వర్షపు నీరు, వాడుక నీరు పడమటికి పారడం - పురుషుని ఆరోగ్యం దిగజారడం.
 • ఇంటిలోను నీరు ఉత్తరానికి పారడం - ఇంతులకు ఆరోగ్యం చేకూరడం. ఇంటిలోని నీరు, ఆవరణంలోని నీరు ఉత్తర ఈశాన్యానికి పారనిమ్ము - కలకంఠిదరికి ఆరోగ్యం చేరనిమ్ము (కలకంఠి = స్త్రీ)
 • తూర్పు దిశలో తూము - సుఖశాంతులకు నోము.
 • తూర్పు ఆగ్నేయం తూము - పిల్లలకు భయం కలిగించే మోము.
 • దక్షిణం వైపు తూము వుంచడం - సుకశాంతులను త్రుంచడం.
 • దక్షిణ నైరృతి తూము - స్త్రీల ఆరోగ్యానికి కత్తిమీద సాము.
 • పశ్చిమ నైరృతి తూము - పురుషుల ప్రతిభకు ధూము.
 • పశ్చిమ దిశలో తూము - పలు సుఖాలను కాటు వేయు పాము.
 • ఉత్తర వాయువ్యంలో తూము - నిత్యం జగడాల గీము. (గీము = ఇల్లు)
 • ఉత్తర దిశలో తూము - ఉత్తమ దశకు మూలము.
 • ఉత్తర ఈశాన్యంలో తూము వుంచడం - సిరులకు నివాసం కల్పించడం.
 • తూర్పు ఈశాన్యంలో తూము - పురుషులు ఆరోగ్య పంటకు నీరు తోడు ఏతాము.
W. ప్రహారీ గోడలు
 • తూర్పు గోడకన్నా పడమటి గోడ ఎత్తు - తరుగులేని సౌభాగ్యాలను వీడని పొత్తు.
 • పడమటి గోడకన్నా తూర్పు గోడ ఎత్తు - అనారోగ్యానికి పొత్తు.
 • దక్షిణం గోడకన్నా ఉత్తరం గోడ ఎత్తు - ఐశ్వర్యానికి విపత్తు.
 • ఉత్తరం గోడకన్నా దక్షిణం గోడ ఎత్తు - అష్టైశ్వర్యాలు నీ సొత్తు.
 • తూర్పు గోడ వక్రం - పురుషులకు గోడు కలిగించే చక్రం (వక్రం = వంకర).
 • దక్షిణం గోడ వక్రం - స్రీల ఆరోగ్యాన్ని కబళించే నక్రం (నక్రం = మొసలి).
 • పడమటి గోడ వక్రం - అరిష్టాల క్రమం. (క్రమం = వరుస)
 • ఉత్తరం గోడ వక్రం - స్త్రీకి, సిరికి హానికరం.
X. గేట్లు
 • తూర్పు గేటు - ఇంటిలోనికి రానివ్వదు యే లోటు.
 • తూర్పు ఆగ్నేయం గేటు - శుభాలకు బల్లెం పోటు.
 • దక్షిణ ఆగ్నేయం గేటు - శుభాలకు రక్షణయిచ్చే వల్లెవాటు.
 • దక్షిణాన గేటు వుంచడం - శుభాలకు రాచబాట నిర్మించడం.
 • దక్షిణ నైరృతి గేటు - కాలనాగు కాటు.
 • పశ్చిమ నైరృతిలో గేటు వుంచడం - అకాల మరణాన్ని ఆహ్వానించడం.
 • పడమర గేటు - పురుషుల కీర్తికి సీటు.
 • పశ్చిమ వాయవ్యం గేటు - పలు శుభాలకు చోటు.
 • ఉత్తర వాయవ్యం గేటు - ఇంట్లో వారికి నిత్యం చేటు.
 • ఉత్తరంలో గేటు - సంతోష తంత్రులు మీటు.
 • ఉత్తర ఈశాన్యంలో గేటు - ఉత్తమ శుభాలకు తోడ్పాటు.
 • తూర్పు ఈశాన్యంలో గేటు వుంచడం - సుఖశాంతులకు బాటను వేయడం.
 • ఆగ్నేయం బ్లాకునకుతూర్పుతో పాటు వుండాలి దక్షిణంలో గేటు తప్పక - అప్పుడే గృహంలో స్థిరపడుతుంది శుభ వీచిక.
 • నైరృతి బ్లాకునకు గేటు పరిసరాలను బట్టి దక్షిణం లేదా పశ్చిమంలో - అప్పుడే అది సుఖాలకు ఆటపట్టు.
 • వాయవ్యం బ్లాకునకు ఉత్తరంతో పాటు గేటు పశ్చిమంలో - పురోగతికి ఆగ్రాసనం ఆ గృహంలో.
 • ఈశాన్యం బ్లాకులో తూర్పు, ఉత్తరాలలో గేట్లు, అవి అభివృద్ధికి మెట్లు.
Y. గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌
 • తూర్పు వైపు గొయ్యితో గోబర్‌గ్యాస్‌ ప్లాంట్‌ - ఇంట భోగభాగ్యాల గ్రాంట్‌
 • దక్షిణాన గొయ్యితో గోబర్‌గ్యాస్‌ ప్లాంట్‌ - ఇంట్లో శుభాలకు డిస్కౌంట్‌.
 • పడమటి గొయ్యితో గోబర్‌గ్యాస్‌ ప్లాంట్‌ - ఇంట్లో అశుభాల అకౌంట్‌.
 • ఉత్తరాన గొయ్యితో గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ - ఇంట నిత్యం శుభాల ప్రజంట్‌.
Z. ద్విశాల నిర్మాణాలు (కూ ఆకారం)
 • ఆగ్నేయ ద్విశాల నిర్మాణం - చోరాగ్నులకు ప్రేరణం.
 • నైరుతి ద్విశాల నిర్మాణం - సౌఖ్యానికి చంద్రశాలావరణం.
 • వాయువ్య ద్విశాల నిర్మాణం - వ్యవహారాల్లో విజయాలు శూన్యం.
 • ఈశాన్య ద్విశాల నిర్మాణం - అరిష్టాలకు స్థానం.
A1. త్రిశాల (ఖ ఆకారం)
 • త్రిశాలకు తూర్పున ఖాళీస్థలం - పురుషుల పలుకుబడికి బలం.
 • త్రిశాలకు దక్షిణాన ఖాళీస్థలం - స్త్రీల సుఖాలను నరకు కరవాలం.
 • త్రిశాలకు పడమట బయలు - పురుషుల ఆరోగ్యానికి తప్పును హొయలు. (హొయలు=విలాసం).
 • త్రిశాలకు ఉత్తరాన ఖాళీజాగా - స్త్రీల సౌభాగ్యాలను పెంచును బాగా.
A2. మూలల పెంపు
 • తూర్పు ఆగ్నేయం పెంపు - అనర్థాలను నింపు.
 • దక్షిణ ఆగ్నేయం కోణంగ పెంపు - అనేక తగవులతో తలవంపు.
 • రోడ్డు లేనప్పుడు దక్షిణ ఆగ్నేయం స్థలం మూలమట్టంతో పెరుగుదల ఆ ఇంటివారి కీర్తికి మెరుగుదల.
 • దక్షిణ నైరుతి పెరుగుదల - తరుణుల శుభాల అరుగుదల. (తరుణులు=స్త్రీలు)
 • పశ్చిమ నైరుతి పెంచడం - పురుషుని జీవితాన్ని త్రుంచడం.
 • పశ్చిమ వాయువ్యం కోణంగా పెంపు - చపలత్వాన్ని నింపు.
 • రోడ్డు లేనప్పుడు పశ్చిమ వాయువ్య స్థలం మూలమట్టంగా పెరుగుదల - శుభఫలితాలకు ఎదుగుదల.
 • ఉత్తర వాయువ్యం పెరుగుదల - వంశాభివృద్ధికి తరుగుదల.
 • ఉత్తర ఈశాన్యం పెంపు - ఐశ్వర్యాన్ని ఇంట నింపు.
 • తూర్పు ఈశాన్యం పెంచు - పురుషుల ఆరోగ్యభాగ్యాలను ప్రతిష్ఠించు.
A3. మూలల తెంపు
 • ఆగేయం తెంపు - ఉండబోదు తలవంపు.
 • నైరుతి తెంపు - రాబోదు ముంపు.
 • వాయువ్యం తెంపు - మైత్రికి ఇంపు.
 • ఈశాన్యస్థలం తెంచుకోకు - వంశాభివృద్ధిని త్రుంచుకోకు.
 • అనవసరంగా స్థలం తెంచుకోకు - అనుమానాలను పెంచుకోకు.
A4. కప్పు(మూత)
 • తూర్పు కప్పు - మగసంతతికి ముప్పు.
 • తూర్పు ఆగ్నేయం హద్దుపై కప్పు వేయుట - సంతతి సుఖశాంతులను నిప్పులలో త్రోయుట.
 • రోడ్డు ఎత్తు ఉన్నప్పుడు దక్షిణం కప్పు - తరుణుల సౌభాగ్యానికి మెప్పు.
 • రోడ్డు ఎత్తు ఉన్నప్పుడు నైరుతి, కప్పు వేసుకో - సిరులను కుప్పపోసుకో!
 • రోడ్డు ఎత్తు ఉన్నప్పుడు పశ్చిమం కప్పు - గృహస్థు ప్రతిష్ఠను చాటిచెప్పు. 
 • ఉత్తర వాయవ్యం కప్పు - స్థిరత్వానికి త్రుప్పు. (త్రుప్పు = చిలుము).
 • ఉత్తరం కప్పు - విత్తమునకు నిప్పు.
 • ఈశాన్యం కప్పు వేసికొనడం - యమపాశాన్ని గొంతుకు బిగించుకొనడం.
ముగింపు వాక్యం

వాస్తులో ఫండ్‌మెంటల్స్‌ను ఇప్పటిదాకా అధ్యయనం చేశారు. పుస్తకాలు చదివి వాస్తు నిర్ణయాలు తీసుకొనే ముందు వాస్తు సిద్దాంతులను సంప్రదించడం మంచిది. ఇందులో కేవలం కొంత వరకు మాత్రమే శాస్త్రం ఇవ్వడం జరిగింది. ఈ ఆప్‌ ద్వారా సమాచారం అందించడమే మా లక్ష్యం. మీ నిర్ణయాలకు కష్ట నష్టాలకు మేము బాధ్యత వహించం అని వినయంగా మనవి చేసుకుంటున్నాము.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com