సరిహద్దు లేక ప్రహరీ గోడ యొక్క వాస్తు విషయములు !

0
సరిహద్దు లేక ప్రహరీ గోడ యొక్క వాస్తు విషయములు - Vastu aspects of boundary or defensive wall
వాస్తు

సరిహద్దు లేక ప్రహరీ గోడ

 1. స్థలమును కొన్న తరువాత గృహమును నిర్శంచుకోవడానికి ముందు ఆ స్థలముయందు ప్రహారీ గోడను నిర్మించుకోవడం సర్వదా శుభకరము, శ్రేష్టము.
 2. తూర్పు వీధి స్థలమైనచో ఈ ప్రాంతములో ప్రహారీ గోడకు తూర్పు మధ్యమునుండి ఈశాన్య ప్రాంతము వరకు గోడలు కట్టకుండా మిగిలిన అన్ని దిక్కుల యందు గోడ నిర్మాణము సాగించాలి.
 3. ప్రహారీలో గృహమంతయు నిర్మితమైన తరువాత తూర్పు ఈశాన్య ప్రాంతములో ప్రహారీని గేట్లు మినహా మిగిలిన ప్రహారీని పూరించుకోవాలి.
 4. ముఖ్యముగా ప్రహారీ విషయములో కొన్ని మెళకువులు జాగ్రత్తలు తీసుకుంటే అమోఘమూన ఫలితములు పొందవచ్చు.
 5. పశ్చిమ, దక్షిణ ప్రాంత ప్రహారీ గోడలను చాలా ధృడముగా నిర్మించుకోవాలి.
 6. దక్షిణ, పశ్చిమ గోడలను ఉత్తర, తూర్పు గోడలకన్నా చాలా ఎత్తుగా నిర్మించాలి.
 7. ముఖ్య విషయము ఏమంటే దక్షిణ, పశ్చిమ ప్రహారీ గోడలు ధృడముగా వుంటే ఎన్నో విధములైన దోషములను హరిస్తాయని తెలుసుకోవాలి.
 8. ప్రహారీ నిర్మాణము వల్ల పరిసర ప్రాంత వాస్తు దోషములు గృహమునకు తగలవు.
 9. బలమైన పరిసర ప్రాంత అవాస్తు దోషములను నివారించుకోవడానికి ప్రహారీ గోడ నిర్మాణము ఓ చక్కటి ఉపాయమని గమనించాలి.
 10. మీ గృహమునకు దక్షిణ ప్రాంతములో పల్లమున్నను, గుంతలున్నను, బావులున్నను దక్షిణ ప్రహారీ గోడను బాగా ధృడంగా, బలంగా నిర్మించుకోవడం వల్ల ఆ దోషాలను హరిస్తాయనే విషయము గమనించాలి.
 11. మీ గృహమునకు పశ్చిమ ప్రాంతములో పల్లమున్నను, గుంతలున్నను, బావులున్నను పశ్చిమ ప్రహారీ గోడను బాగా ధృడంగా, బలంగా నిర్మించుకోవడం వలన ఆ దోషాలను హరిస్తాయి.
 12. ఈ ప్రహారీ గోడ వల్ల జరిగే ఇంకొక సత్పలితము ఏమంటే ఏదైనా చెడు వీధి పోటు గృహమునకు తగులుతున్నవో ఆ దోషమును ఈ ప్రహారీ గోడ చాలా భాగము అడ్డుకుంటుంది.
 13. లేకపోతే ఆ చెడు వీధి పోటుకు ఎదురుగా ఇంకొక చిన్నపాటి ప్రహారీని నిర్మించడం వల్ల చెడు వీధి పోటి ఫలితము అంతయూ ఆ రెండవ చిన్నపాటి ప్రహారీ హరిస్తుంది. తద్వారా గృహస్థులకు చెడు వీధిపోటు దోషములు తగలవు.
 14. దక్షిణ మరియు పళ్చిమ ప్రాంతములో ప్రహారీని బాగా ధృడంగా ఎత్తుగా, మందంగా నిర్మించుకోవడం వల్ల గృహస్థుల జీవనము భద్రముగా వుండును.
 15. ఇదే రీతిలో తూర్పు మరియు ఉత్తర ప్రహారీ గోడలను తక్కువ ఎత్తులో నిర్మంచుకోవడం వల్ల మరియు ఎక్కువ ధృడము కాకుండా తక్కువ మందముతో నిర్మించుకోవడం వల్ల అధిక ధనాదాయము, కీర్తి ప్రతిష్టలు గృహస్థులకు లభించును.
 16. ప్రహారీ గోడ పాతబడి కూలినచో ఏమాత్రము నిర్లక్ష్యము చేయక వెంటనే మరమ్మత్తులు చేయించుకోవడం వల్ల జీవన దోషములకు అద్దుకట్ట వేసిన వారమవుతాము.
 17. నైబుతి ప్రాంతముయందలి ప్రహారీ గోడ కూలినచో ఏమాత్రము అశద్ధ చూపక ఒక్క క్షణము ఆలస్యము చేయకుండా తక్షణమే యుద్ధ ప్రాతిపదికనా ఆ కూలిన ప్రాంతమును మరమ్మత్తు చేయించుకోవాలి. ఆలస్యము చేసినచో పాము కాటుకన్నా ఎక్కువ ప్రమాదాన్ని రుచి చూడవలసి వుంటుంది.
 18. నైబుతిలో ప్రహారీ గోడ కూలడమంటూ జరుగరాదు.
 19. కనీసం సంవత్సరమునకు ఒక్కపారైనా ప్రహారీ గోడను పరిశీలించడము మంచిది. తద్వారా ఏమైనా లోపములు వున్నచో బయటబడి సకాలంలో జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశము ఏర్పడును.
 20. నైబుతిలో ప్రహారీ గోడ కూలినచో ఈ విషయమును అషామాషిగా తీసుకొని నిర్ల నిర్తక్ష్యము చేయడం జరుగరాదు.
 21. గోడ కూలిన విషయము మీకు తెలిసిన తక్షణము స్పందించాలి. మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిని వెంటనే ఆపి కూలిన నైబుతి ప్రాంత ప్రహారీని మరమ్మత్తు చేయించుకోవటం చాలా మంచిది.
 22. నైబుతి ప్రాంత ప్రహారీని మరమ్మత్తు చేయించు సమయంలో ఇంటి యందలి ఎవ్వరు కూడాను ప్రయాణాలు చేయడం జరుగరాదు. ఈతకు వెళ్లడం చెట్లు ఎక్కడం భారీ భవంతులను ఎక్కడం తదితరములు చేయరాదు.
 23. అతి వేగంగా నడవడము కూడా తప్పే. బావుల దగ్గర వున్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం మేలు.
 24. నైబుతి ప్రాంత ప్రహారీ గోడ కూలిన విషయము ఇన్ని సార్లు చెప్పడానికి కారణం దీని ప్రాముఖ్యతే.
 25. గృహస్థులు దయచేసి ఆ విషయములో అజాగ్రత్త చేయకుండా నిర్లక్ష్యము ప్రదర్శించక తక్షణము స్పందించాల్సిందిగా కోరడమైనది.
 26. కరెంటు షాకు కొడితే ఎంత వేగంగా చేతిని వెనుకకు తీసుకుంటామో ఆ వేగమును నైబుతి ప్రహారీ గోడ మరమ్మత్తు విషయములో చూపించాలి.
 27. పూర్వము ప్రహారీని పునాది తీసుకొని నిర్మంచేవారు. నేడు పద్ధతి మారి భూమి యందు భీమ్‌ వేసుకొని దాని పై ప్రహారీని నిర్మిస్తున్నారు మంచిదే.
 28. ప్రహారీ ధృడంగా ఉండాలంటే ప్రతి పది అడుగులకు అర్ధఇంచు స్థలమును వదిలి నిర్మ్ణంచుకోవడం మంచిది. ధనికులు నేడు పిల్లర్‌ సిస్టమ్‌ను పాటిస్తూ ప్రహారీని నిర్మిస్తున్నారు.
 29. ప్రతి 10 అడుగులకు ఒక పిల్లర్‌ను వేసుకుంటూ మధ్యలో ప్రహారీని నిర్మించడం మంచి మార్గము. ఈ విధానం వల్ల ప్రహారీ ఎక్కువ కాలము ధృడంగా వుంటుంది. ఏదైనా ప్రకృతి విలయాలకు లేదా ఎక్కువ సంవత్సరముల సమయము గడచిన తరువాతను గోడ కూలడము అంటూ జరిగితే రెండు పిల్లర్ల్‌ మధ్య భాగము మాత్రమే గోడ కూలడము జరుగుతుంది. తద్వారా మరమ్మత్తు చేయించుకోవడం సులభము పైగా ఖర్చు చాలా తక్కువ అవుతుంది.
 30. ప్రహారీని గృహములో ద్వారములకన్నను ఎత్తు రాకుండగా నిర్మంచుకొవడం మంచిది. అనగా గృహ ముఖ్యద్వార యందు నిలబడినచో ప్రహారీ బయట భాగము కనిపించాలి. ఈ విధానము తూర్పు మరియు ఉత్తర వీధుల గృహములకు సరిపోవును.
 31. దక్షిణ మరియు పశ్చిమ వీధుల గృహములకు ప్రహారీని గృహ ముఖ్య ద్వారము కన్నను సమంగా లేదా ఎత్తు నిర్మించుకున్నదో దోషములేదని గమనించాలి.
 32. ప్రహారీ యందు గృహమును నైబుతి ప్రాంతములో నిర్మించడం ఉత్తమం. గృహం దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతమునకు ప్రహారీ దగ్గరగా వుంటుంది. గృహ తూర్పు మరియు ఉత్తర ప్రాంతమునకు ప్రహారీ దూరంగా వుంటుంది. తద్వారా ప్రహారీలో గృహమునకు దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతముల యందు తక్కువ స్థలమును, తూర్పు మరియు ఉత్తర ప్రాంతముల యందు ఎక్కువ స్థలము రావడం జరుగుతుంది. ఇది సరియైన విధానము.
వాస్తు నిపుణులు "సురేష్" - 098481 14778

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top