వర్షాకాలంలో చిక్కులు లేకుండా వాస్తుతో గృహ నిర్మాణము - Vastu

0

వర్షాకాలంలో చిక్కులు లేకుండా వాస్తుతో గృహ నిర్మాణము - Vastu
వర్షంతో చిక్కులు లేకుండా చూసుకోండి, శ్లాబులు, ట్యాంకుల వాస్తు జాగ్రత్తలు, పరిష్కారాలు

వానాకాలం వచ్చిందంటే నీటి సమస్య తీరిపోతుంది. కానీ ఇంట్లో కొత్త సమస్య మొదలవుతుంది. కొన్ని ఇళ్ల శ్లాబుల నుంచి బొట్లుబొట్లుగా కారుతుంటుంది. గోడలు చెమ్మగిల్లి రంగు వెలిసిపోయి వికారంగా మారడం.. డ్రైనేజీ సమస్యలు వంటివి ఉంటాయి. నిజానికి ఇంటి నిర్మాణ సమయంలోనే నీటి ప్రవాహం, ట్యాంకుల నిర్మాణానికి సంబంధించి అటు వాస్తు విషయంలోనూ, ఇటు నిర్మాణశాస్త్ర పరంగానూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.
 • ➣ సాధారణంగా తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణ దిశల అభిముఖంగా ఇళ్లను నిర్మిస్తారు. నీటి ప్రవాహం మాత్రం ఈశాన్య దిక్కుకే ఉండేలా చూసుకుంటారు. తూర్పు దిశగా ఇంటిని నిర్మించే వారు నీటి వాటం తూర్పు ఈశాన్యం వైపు.. ఉత్తరదిశ ఇంటి వారు ఉత్తర ఈశాన్యం.. పడమర దిశ ఇంటివారు పడమర వాయవ్యం, దక్షిణ దిక్కు ఇంటి వారు దక్షిణ ఆగ్నేయం మూల నుంచి వర్షపు నీరు, డ్రైనేజీలైను ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం. నీటి ట్యాంకు నిర్మాణం ఎటువైపు ఉండాలన్నదీ ముఖ్యమే. ఈశాన్య దిశలో వీటి నిర్మాణం నిషిద్ధం. నైరుతి, దక్షిణ, పడమర దిక్కుల్లో ఏర్పాటు అనుకూలమే.
 • ➣ నీళ్ల ట్యాంకును శ్లాబుకు కనీసం అడుగున్నర ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం అనుకూలం. శ్లాబుకు ఆనుకొని ఏర్పాటుచేస్తే లీకేజీ ప్రమాదం ఉంటుంది. తర్వాత శ్లాబు బలహీనమవుతుంది.
 • ➣ శ్లాబుపై చెత్తా చెదారం లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.
 • ➣ నీళ్ల ట్యాంకు చుట్టూ పేరుకుపోయిన మట్టి, చెత్త, పిచ్చి మొక్కలను తీసేయాలి. శ్లాబుపై పడిన నీరు లైన్‌ పైపుల నుంచి వెళ్లేలా చూసుకోవాలి.
 • ➣ పైపులలో చేరిన చెత్త, కాగితాలను శుభ్రం చేయాలి. పగలిన పైపులు మార్చుకోవాలి. జాయింట్ల వద్ద సరిచేసుకోవడం అవసరం. లైన్‌ పైపుల వెనక నీరు కారి నాచు ఏర్పడుతుంది. ఆ భాగమంతా నల్లగా చూసేందుకు అసహ్యంగా కన్పిస్తుంది. వీటిని ఎప్పటికప్పుడు బాగు చేయించుకోవాలి.
 • ➣ గోడలకు పగుళ్లు ఉంటే పిచ్చి మొక్కలు పెరుగుతాయి. వాటిని వేళ్లతో సహా తీసేసి మరమ్మతు చేసుకోవాలి.
 • ➣ వంటగది నుంచి బయటకు కడిగిన నీరు వెళ్లే పైపులో కూరగాయల వ్యర్థాలు, అన్నం మెతుకులు అడ్డుపడి సాఫీగా పోదు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసి అవసరమైతే తగిన మరమ్మతులు చేయించుకోవడం ఉత్తమం.
 • ➣ స్నానాల గదుల నుంచి బయటకు వెళ్లే పైపులలో షాంపూ కవర్లు అడ్డుపడి నీరుపోదు. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి.
 • ➣ ఇంటి బయట రోడ్డుపైన ఉన్న మ్యాన్‌హోల్స్‌ పైపులు కూడా మనవంతుగా చూసుకోవడం మంచిది. వాటిలో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే కష్ట
భూగర్భ జలాలు పెరిగేలా
 • ➣ వాననీటిని సంరక్షించుకుంటేనే భూగర్భ జలాలు పెరిగి వేసవిలో కొరత ఉండకుండా చూసుకోవచ్చు. దీనికోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. వీటిని ఎలా ఏర్పాటుచేసుకోవాలన్నదీ కీలకమే.
 • ➣ ఇంకుడు గుంతలు బోరు బావికి దగ్గరగా ఉండడం మంచిది. ఇల్లు నిర్మాణం ప్రారంభించేటప్పుడే ప్రణాళికాబద్ధంగా తూర్పు వైపుగాని ఉత్తరం దిశలో గాని వీటిని ఏర్పాటు చేసుకోవాలి. శాస్త్ర రీత్యా ఏ ఇంటికైనా తూర్పు, ఉత్తర దిశలలో ఎక్కువ స్థలం వదులుతారు. కాబట్టి రెండు విధాలా ప్రయోజనకరమే.
 • ➣ తూర్పు, ఉత్తర దిక్కులలో నీరు పడనప్పుడు ఇంకుడుగుంతల ఏర్పాటులో మార్పులు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో సమస్యలు కొద్దికాలం తర్వాత వస్తుంటాయి. ముందే జాగ్రత్తలవసరం. ఇంటి నిర్మాణం గురించి అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, వాస్తునిపుణుల సలహాలు తీసుకోవాలి.

సంకలనం: వెంకు ఈనాడు - 80084 55788

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top