వాస్తు మరియు పంచభూతాలు: ఐదు శక్తుల కలయిక - Panchabhutalu

పంచభూతాలు: ఐదు శక్తుల కలయిక - Panchabhutalu

పంచభూతాలు అనగా ఐదు శక్తుల కలయిక. ఐదు శక్తులు అంటే ఏమిటి? 

1. గాలి (వాయువు), 
2. నీరు, 
3. భూమి (పృథ్వి), 
4. ఆకాశము (గగనతలము), 
5. అగ్ని

1. గాలి (వాయువు) గురించి :- ఒక్క నిముషం ఐనా గాలిలేని జీవితాన్ని ఊహించగలమా? గాలి అంటే ప్రాణవాయువు. ఈ వాయువు లేనిదే మన జీవితం సాగడం అసాధ్యం. ఏ ప్రాణి కూడా గాలి పీల్చకుండా 'బ్రతకజాలదు. సముద్రం అడుగున కొన్ని చేపలు గాలి పీల్చకుండానే బ్రతుకుతాయని గాలి పీల్చని జీవులు ప్రపంచంలో ఉన్నాయని కొందరు శాస్త్రజ్ఞులు ముందుగా తెలుసుకొని విజయకేతనం ఎగురవేశారు. అయితే పరిశోధనలు జరుగగా నీటియందలి ప్రాణవాయువును పీల్చుకొని చేపలు బ్రతుకుతున్నాయని తరువాత తెలుసుకున్నారు. ఇక వారికి నోట మాట రాలేదు. ఒక్కటి మాత్రం సత్యం. ప్రాణవాయువు లేనిదే ఏ ప్రాణి కూడా బ్రతుకజాలదు. గాలికి అంతటి శక్తి ఉంది. ఈ గాలి వీచే విధానమును ఓ పద్ధతి ప్రకారముగా కట్టడి చేసుకుంటూ ఇంటిలోనికి వచ్చే విధంగా జరిగిన ఏర్పాటునే వాస్తులో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక భాగం. అందుకే ఈశాన్య భాగములో వాకిలి (ద్వారము) ఏర్పాటు చేసుకుంటాం. ఈశాన్య భాగం ద్వారా గృహంలోపలికి వచ్చే గాలి మంచి ఆరోగ్యాన్ని కలుగుజేస్తుంది. తూర్పు, ఉత్తరములలో కూడా వాకిళ్ళు (ద్వారములు), కిటికీలు ఉంచడం దీనిలో ఒక భాగమే.

2. ఇక నీటి గురించి :- నీరు ప్రాణం, త్రాగడానికి, ఆహారం చేసుకోవడానికి, శుభ్రపరచుకోవడానికి, ఇతరత్రా విషయాలకు నీరు మనకు తప్పనిసరిగా అందుబాటులో ఉండవలసినదే. హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ కలయికయే నీరు. ఆక్సిజన్‌ కాస్త తక్కువగా, హైడ్రోజన్‌ ఎక్కువగా కలిసి అనగా ఆక్సిజన్‌ 1 పాళ్ళు హైడ్రోజన్‌ 2 పాళ్ళు కలయికయే నీరు. ఈ నీటి పారుదల, గృహం నందు ఈ నీరు లభించే స్థానాన్ని నిర్ణయించడం వాస్తులో ఓ భాగం. ఉదాహరణకు ఈశాన్య భాగంలో బావి.

3. భూమి గురించి తెలుసుకుందాం :- భూమి పుట్టి ఎన్ని సంవత్సారా లయ్యింది ? భూమికి పుట్టుక, చావు అనేవి ఉన్నాయా ? శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం దాదాపుగా 500 కోట్ల సంవత్సరాల పైబడి భూమి ఏర్చడినదని అంచనా వేశారు. సూర్య గ్రహం తరువాత మూడవ గ్రహమే భూమి. ఒక పెద్ద అయస్కాంత క్షేత్రమే భూమి అని చెప్పుకోవచ్చు. అయస్కాంత క్షేత్రము అన్న తరువాత రెండు ధృవములు తప్పనిసరి. ఒకటి ఉత్తరము ఇంకొకటి దక్షిణము. అయస్మ్కాంతంలోని ఒక భాగము తప్పని సరిగా ఉత్తరాన్ని చూపిస్తుంది. మిగిలిన భాగము గతిలేక దక్షిణ భాగాన్ని చూపిస్తుంది, చూపించి తీరాలి. మీఅనుమానం నివృత్తి చేసుకోవా లంటే ఒక అయస్మాంతాన్ని దారానికి కట్టి ఒక చెక్కకు వేలాడదీసి చూడండి. తప్పనిసరిగా ఉత్తర దక్షిణాలుగానే అయస్కాంతం తిరుగుతుంది. ఉత్తర భాగానికి ఒక గుర్తు వేసుకోండి. తిరిగి అయస్మాంతాన్నితిప్పి ప్రయత్నంచేయండి. తిరగగా తిరగగా కాసేపు అయిన తరువాత అయస్కాంతం ఆగుతుంది. అప్పుడు మీరు పెట్టిన గుర్తు భాగం ఉత్తరానికే ఉంటుంది. దీని వల్లనే ఉత్తర దిక్కుగా తల పెట్టి నిద్రించవద్దని పెద్దలు, శాస్త్రజ్ఞులు, డాక్టర్లు చెప్పడం మీరు వినే ఉంటారు.
వాస్తులో భూమి పాత్ర :- ఒక్క మాటలో చెప్పాలంటే భూమి లేనిదే వాస్తు ఎక్కడిది? భూమిలేకుండా వాస్తు అనేది లేదు. ఒకవేళ ఉందని ఎవరైనా చెప్పినా అది పూర్తిగా అబద్ధం.అందుకే తిరిగే వాహనాలకు, రైళ్ళు, విమానాలకు, ఓడలకు వాస్తు లేదు. సంచరించే ఏ వాహనానికీ వాస్తు లేదు. అనగా వాస్తురీత్యా ఒక బస్సును (ఏ వాహనాన్నైనా) తయారుచేసుకోలేము.

4. ఆకాశము :- ఈ సృష్టికి మొత్తం ఆకాశమే సాక్షీభూతము. ఆకాశము క్రిందనే సమస్తమూ ఉన్నాయి.నవగ్రహాలు, ఇతర పాలపుంతలు, అనేక లక్షల కోట్ల నక్షత్రాలు దాగి ఉన్నాయి. ఆకాశము దైవరూపమే. మహాశక్తికి ప్రత్యక్ష సాక్ష్యము. పంచ భూతాలలో ఓ ప్రాముఖ్యత కలిగిన భాగమే ఆకాశము. వాస్తులో ఆకాశ ప్రాముఖ్యత. ఒక్క మాటలో చెప్పాలంటే భూమి లేనిదే వాస్తు లేదు. ఈ భూమి ఉండేదే ఆకాశం క్రింద.
5. అగ్ని గురించి :- సూర్యుడు, నిప్పు, తేజము, వెలుగు అని అగ్ని గురించి వివిధ విధాలుగా విశదీకరించుకోవచ్చు. సూర్యుడు లేనిదే మనం లేము. బుతువులు ఉండవు, వర్షాలు ఉండవు. వేడి ఉండదు. అతి శీతలమై ప్రాణి అనేది ఉండదు. అన్నిటికన్నా ముఖ్యం వెలుగు అసలుకే ఉండదు. వెలుగు లేనిది, నిప్పు లేనిది ఏం బ్రతుకు ? మన కంటికి కనిపించే దైవంలో ఓ భాగం ఈ అగ్ని. హిందూసంప్రదాయం ప్రకారం పెళ్ళైనవారిచే తప్పనిసరిగా అగ్నిచుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. పంచభూతాలలో ఓ ప్రముఖమైనస్థానాన్ని ఈ అగ్ని పెళ్ళైనవారిచే తప్పనిసరిగా అగ్నిచుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. పంచభూతాలలో ఓ ప్రముఖమైనస్థానాన్ని ఈ అగ్ని ఆక్రమించుకొని ఉంది. అగ్నివల్ల మంచి జరుగు తుంది, చెడూ జరుగుతుంది. మనం వాడుకునే విధానం బట్టి ఈ మార్పులు ఉంటాయి. చలికాలంలో చల్లగా ఉంటుందని నిప్పురాజేసుకుని వేడిని పొందుతాము. ఇంకాస్త వేడి కావాలంటే నిప్పును ఇంకొంచెం ఎక్కువగా వెలిగించుకుంటాము. అంతేగాని నిప్పు మీద కూర్చోముకదా! వాస్తులో అగ్నికి ప్రాముఖ్యత. గృహములో అగ్నికి ఆగ్నేయ భాగాన్ని కేటాయించడం జరిగినది. ఆగ్నేయ భాగంలో అగ్ని ఉన్నప్పుడు ఆ ఇంట ఆరోగ్యం బాగుండి తిన్నది చక్కగా అరిగి మనసు కులాసాగా ఉంటుంది. 
    ఇదే ఆగ్నేయ భాగం చెడితే ఇంట స్ర్రీలపైన, సంతానంలోని ఓ సంఖ్యపైన ప్రభావాన్ని చూపిస్తుంది. హోం మినిష్టర్‌ బాగోలేకపోతే మన బ్రతుకు గోవిందా! మన హోం మినిష్టర్‌, మన ఇంటి స్త్రీలే కదా! ఎక్కడ చెడినా ఇంట చెడకూడదు. బయట ఎన్ని వ్యవహారాలున్నా ఇంట మాత్రం మనఃప్రశాంతత ఉందవలసినదే. మనశ్శాంతి లేనివారు ఏం సాధించ గలరు? కోటీ శ్వరులైనా బికారులకిందే లెక్క చిన్నపని విషయంలో కూడా మనశ్శాంతి లేనివారు చాలా పొరపాట్లు చేస్తారు. అదే మనశ్శాంతి వున్నవారు పెద్దపనులనైనా అవలీలగా చేసుకోగలరు. ఈ విషయాలు మీ అనుభవంలో కూడా గమనించేవుంటారు. ఇక ఇంతకుమించి ఎక్కువగా పంచభూతాల గురించి తెలుసుకోవాలను కోవడం విషయరీత్యా అవసరంలేదని నా భావన. మీరు ఈ పంచభూతాల గురించి చదివారుగా! దైవ శక్తులలోని ఒక భాగాన్ని మీరు తెలుసుకున్నట్రే. మీకు శుభమగుగాక.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top