దిక్కులు వాస్తు వివరము - Dikkulu Vastu Details

0
దిక్కులు వాస్తు వివరము - Dikkulu Vastu Details
దిక్కులు

దిక్కులు ఎలా తెలుసుకోవాలి

వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత సంపాదించుకున్నవి దిక్కులు. దిక్కులు నాలుగు. 
1 తూర్పు 2. పడమర 3. ఉత్తరం 4. దక్షిణము

తూర్పును ఎలా కనుక్కోవాలి. ఈ దిక్కులు కనుక్కోవడం చాలా సులభం. సూర్యునికి ఎదురుగా నిలబడండి. మీరు చూస్తున్నది తూర్పు. మీ వీపు భాగము పశ్చిమము లేదా పడమర. మీ ఎడమచేతి భాగము వైపు ఉన్న దిక్కు ఉత్తరం. మీ కుడిచేతి వైపు ఉన్న దిక్కు దక్షిణం. సాధారణంగా ఐదు, ఆరవ తరగతులలోనే పిల్లలకు గురువులు పాఠశాల యందు బోధిస్తారు. కాబట్టి ఈ దిక్కులు కనుక్కోవడం సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది.

ప్రతి ఒక చిన్న విషయాన్ని వివరముగా చెప్పడానికి కారణమేమంటే వాస్తు గురించి ఏ మాత్రమూ పరిచయం లేనివారు కూడా ఈ పుస్తకం చదివిన తరువాత ఇతర గృహాలకు వాస్తు చూసేంత జ్ఞానమును కలిగి ఉంటారు. అందువలననే ప్రత్యేకించి వాస్తు తెలియని వారికి మరియు స్త్రీలకు కూడా ప్రతి ఒక్క విషయం అర్థం కావాలనే సంకల్పంతో చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా వివరాతి వివరముగా తెలపడమైనది.

దిక్కులు వివరములు 

దిక్కుల గురించి దిక్కులను ఎలా కనుక్కోవాలి అనే విషయం ఇంతకు ముందే మనము తెలుసుకున్నాము. సూర్యోదయం సమయంలో సూర్యునికి మనం ఎదురుగా నిలబడి అనగా మనము సూర్యుణ్ణి చూస్తుండాలి. అప్పుడు మనము చూస్తునది తూర్పుదిక్కు అనగా సూర్యుడుదయించు స్టానాన్ని తూర్పు దిక్కుగా భావించుకోవాలి. మన వీపు భాగాన్ని అనగా మన వెనుక భాగాన్ని పశ్చిమ దిక్కుగా భావించాలి. మన ఎదమచేతివైపు భాగాన్ని ఉత్తర దిక్కు కుడి చేతి భాగాన్ని దక్షిణ దిక్కుగా భావించాలి.
  • ఈశాన్య మూల ఉత్తరము మరియు తూర్పు రెండూ కలిసిన ప్రాంతం.
  • ఆగ్నేయ మూల తూర్పు, దక్షిణ దిక్కులు రెండూ కలిసిన ప్రాంతం.
  • వాయువ్య మూల ఉత్తర, పశ్చిమ దిక్కులు రెండూ కలిసిన ప్రాంతం.
  • నైబుతి మూల పళ్చిమ, దక్షిణ దిక్కులు రెండూ కలిసిన ప్రాంతం.
చాలామంది అష్టదిక్కులను (8 దిక్కులు) మాత్రమే గుర్తిస్తారు. అయితే ఇక రెండు దిక్కులు ఉన్నాయి. దశదిశలు అంటారు. అవియే ఆకాశం, క్రింది భాగం భూమి.

ఆకాశం మరియు భూమి ఇవి రెండు దిక్కులు. మొత్తం పది దిక్కులు. దశదిశలు. అనగా ఈశాన్యం,
తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైబుతి, పడమర (పశ్చిమం) ॥ వాయువ్యం, ఉత్తరం, భూమి, ఆకాశం. ఒక్కొక్క దిక్కును మరియు ఒక్కొక్క మూలను ఒక్కొక్క గ్రహము ఆక్రమిస్తుంది. మరియు ఆ గ్రహ ప్రభావము ఆ దిక్కుపై ఉంటుంది. నలు దిక్కులు, నాలుగు మూలలు కలిపి 8, అయితే గ్రహాలు 9. 1 గ్రహం మిగిలిపోవును. అదియే కేతువు. ఇది గురుగ్రహముతో పాటుగా ఈశాన్య భాగమునందు నిలుచును. అందుకే జ్యోతిష శాస్త్రరీత్యా కూడా ఈశాన్యమును పెంచమని తెలుపుతారు. గురువుతోపాటు కేతువు వున్నందువల్ల ఈశాన్యము పెంచవలెనని జ్యోతిష శాస్త్రములో వున్నది.
    అలాగే వాస్తు శాస్త్రరీత్యా కూడా ఈశాన్యము తప్పనిసరిగా పెరగడం చాలా మంచిది.

వాస్తు నిపుణులు: సురేష్ 98481 14778

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top