విగ్రహారాధన - Vigraha Aaradhana

విగ్రహారాధన - Vigraha Aaradhana
విగ్రహారాధన..!!
భగవంతుడు అన్నిటా వున్నానని చెప్పినప్పుడు హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు..?

ఒకసారి వివేకానందుడు ఇప్పుడున్న రాజస్తాన్ లో వున్న అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళాడు. విగ్రహారాధనని వెక్కిరించడానికి ఆరాజు వివేకానందునితో నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు. రాయినీ, రప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు.. కేవలం సమయం వృధా చేసికుంటున్నారు అన్నాడు.

స్వామీజీ నవ్వుతూ స్పందించారు... రాజు సహాయకుడిని అక్కడ గోడకి వ్రేలాడుతూ వున్న రాజు చిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు. అయోమయంలో పడిన ఆ సహాయకుడు స్వామీజీ చెప్పినట్లే చేసారు. అప్పుడు స్వామీజీ ఆ పటం పై వుమ్మివేయమని రాజు సహాయకుడిని ఆదేశించారు.

నిర్ఘాంత పోయిన సహాయకుడు రాజు వైపూ.. స్వామీజీ వైపూ చూస్తూ ఉండిపోయాడు. స్వామీజీ మళ్ళీ, మళ్ళీ ఆదేశించారు. ప్రతీ సారీ మరింత తీవ్రంగా ఆదేశించ సాగారు, రాజు ఆగ్రహోద్రకుడవుతున్నాడు, సహాయకుడు వణికి పోతున్నాడు.

చివరికి సహాయకుడు నేను ఈ పటంపై ఎలా ఉమ్మగలను?
పటంలో వున్న చిత్రంలో మా రాజు వున్నారు అంటూ అరిచాడు. అప్పుడు స్వామీజీ ‘రాజు నీ ఎదురుగా వ్యక్తిగతంగా కూర్చుని వున్నారు. ఆ పటంలో వున్నది ఒక కాగితం మాత్రమె, అది మాట్లాడలేదు, వినలేదు, కదలలేదు. కానీ నువ్వు ఆ పటం పై ఉమ్మి వేయనంటున్నావు, ఎందుకంటే నువ్వు ఆ పటంలో నీరాజుని చూసుకుంటున్నావు కాబట్టి ఉమ్మి వేయనంటున్నావు. ఆ పటం మీద ఉమ్మితే నీ రాజు మీద ఉమ్మినట్లని నువ్వు అనుకుంటున్నావు’ అన్నారు.

స్వామీజీ ని చూసిన రాజు..స్వామీజీ ముందర సాష్టాంగ పడ్డాడు..స్వామీ చెప్పదలుచుకున్నది తనకి పూర్తిగా అర్ధమయిందని ఆ రాజు చెప్పాడు.

ఇదే విగ్రహారాధన యొక్క సారము, భగవంతుడు అన్నిచోట్లా వున్నాడు. 
కానీ మనం ఆయనని:- 
  • 🟔 పూజించాలనుకుంటాము, 
  • 🟔 కోరికలను కోరాలనుకుంటాము, 
  • 🟔 నివేదన చేద్దామను కుంటాము, 
  • 🟔 కధలు చెప్పాలని అనుకుంటాము, 
  • 🟔 స్నానం చేయించాలని అనుకుంటాము, 
  • 🟔 ఆడుకోవాలనుకుంటాము, 
మనం మన జీవితాలతో ఏమి చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము. విగ్రహం రూపంలో వున్న భగవంతుని ఆకారాన్ని మనం మన సహచరుడు గానూ, మార్గ దర్శకునిగానూ, స్నేహితుని గానూ, రక్షకునిగానూ,  ప్రసాదించే వానిగానూ,  సాటి మనిషి గానూ భావించుకుంటూ ఉంటాము.

విగ్రహము మనం చూడగలిగే యదార్ధ  ప్రతినిధి. నేను ఆ విగ్రహపు కన్నులలోనికి చూస్తున్నప్పుడు,  నాకది రాయిలాగానో, లోహం లాగానో కనిపించదు. మరొక జత కన్నులు  ప్రేమతో నన్ను  నవ్వుతూ  చూస్తున్నట్లు అనిపిస్తుంది.

రచన: అక్కిశెట్టి 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top