బీహార్: ఏప్రిల్ 5 న లైట్లు ఆర్పివేసినందుకు వృద్ధ హిందూ మహిళ హత్య, పరారీలో సులైమాన్, ఖలీల్ మరియు ఇతరులు: Bihar: Elderly woman killed by neighbours after fight over switching off lights on 5 April, Sulaiman, Khalil and others abscondinబీహార్: ఏప్రిల్ 5 న లైట్లు ఆర్పివేసినందుకు వృద్ధ హిందూ మహిళ హత్య, పరారీలో సులైమాన్, ఖలీల్ మరియు ఇతరులు: Bihar: Elderly woman killed by neighbours after fight over switching off lights on 5 April, Sulaiman, Khalil and others abscondin
బీహార్: కరోనావైరస్ పై పోరాటంలో సంపూర్ణ సంకల్పం మరియు సంఘీభావం చూపించడానికి, పిఎం మోడీ పిలుపు మేరకు లైట్లు ఆర్పీవేసినందుకు ఒక హిందూ మరియు ముస్లిం కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది వృద్ధ హిందూ మహిళ హత్యకు దారితీసింది.

వాగ్వాదం జరుగుతున్న సమయంలో 70 ఏళ్ల హిందూ వృద్ధురాలు అయిన" కైలీ దేవిని" గొంతు కోసి చంపిన నిందితులు సులైమాన్ నదాఫ్, ఖలీల్ నడాఫ్, మలీల్ నదాఫ్, జలీల్ నదాఫ్ తదితరులు ఇప్పుడు పరారీలో ఉన్నారు. మృతురాలి కుమారుడు సురేంద్ర మండల్ నిందితులందరిపై హత్య కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ఈ సంఘటన ఏప్రిల్ 5 (ఆదివారం) రాత్రి 9 గంటల సమయంలో బీహార్‌లోని మధుబనిలోని బిస్ఫీ శాసనసభ పరిధిలోని రాహికా బ్లాక్‌లోని సత్లఖా మణి దాస్ టోల్‌లో జరిగింది. నరేంద్ర మోడీ పిలుపుకు మద్దతు తెలిపేందుకు 70 ఏళ్ల కైలీ దేవి లైట్లు ఆర్పివేయగ,  ఇరుగుపొరుగువారు అందుకు  నిరాకరిస్తూ లైట్లు వెలిగించాలని ఆదేశించారు.

ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాహికా ఎస్‌హెచ్‌ఓ రాహుల్ కుమార్ మాట్లాడుతూ “నిందితులు పరారీలో ఉన్నారు. మరణించిన కుమారుడి ఫిర్యాదు స్వీకరించి నిందితులపై సెక్షన్ 302 కింద కేసు చేశామని. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు, ”ఇద్దరు పొరుగువారి మధ్య లైట్లు ఆపివేయడంపై వివాదం ఈ సంఘటనకు దారితీసిందని తెలిపారు.

మూలము: Opindia
అనువాదము: కోటేశ్వర్

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top