గృహము, దేవాలయాలలో చేయబడుతున్న పూజలకు అర్థం - Gruhamu, Devalayalalo chestunna pooja ku ardham

గృహము, దేవాలయాలలో చేయబడుతున్న పూజకు అర్థం - Gruhamu, Devalayalalo chestunna pooja ku ardham
ళ్ళలోనూ, దేవాలయాలలోనూ చేయబడుతున్న పూజకు అర్థం ఏమైనా ఉందా? దీనికేమైనా నిర్దిష్టమైన పద్ధతి ఉందా?

మనం ప్రేమించే బంధువులు, మిత్రులు మన ఇంటికి వస్తే వారిని మనం ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తాము. అలాగే దేవుడు మన ఇంటికి వచ్చినట్లు భావించి మనం చేసే ఉపచారమే పూజ.

ఆహ్వానం లేక ఆవాహనం, కూర్చోవటానికి 'ఆసనం, కాళ్లు చేతులు కడుక్కోవటానికి నీళ్లు, స్నానం లేక అభిషేకం, గంధచందనాలు, పుష్పం, ధూపం, కర్పూర హారతి, దీపహారతి సమర్పించడం, నైవేద్యం, వీడ్కోలు మొదలైనవి పూజలో ముఖ్యాంగాలు. దేవాలయాలలో అభిషేకం, అలంకరణ ఇత్యాదులు వైభవోపేతంగా విశేషరీతిలో చేయబడతాయి.

  శ్రద్ధతో చేయబడే పూజ వల్ల మనస్సుకు సుఖశాంతులు లభిస్తాయి. విధ్యుక్తంగా, శాస్ట్రోక్తంగా ప్రతిష్ఠించబడిన విగ్రహాలలో, ఉపయోగించబడే ప్రతీకలలో భగవంతుని ప్రతిరూపం విశేషంగా ఆవిర్భవించి నెలకొంటుందని ఆగమశాస్త్రాలు వచిస్తున్నాయి.

రచన: స్వామి హర్షానంద, రామకృష్ణ మఠం - భాగ్యనగరం

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top