గుడ్లగూబ శుభ శకునం - Gudlaguba Shuba sakunam

గుడ్లగూబ శుభ శకునం - Gudlaguba Shuba sakunam
 గుడ్లగూబ మీ ఇంట్లోకి ఆ సమయంలో వస్తే మంచి శుభ శకునం..
'గుడ్లగూబ'ను చాలామంది అశుభసూచిక పక్షిగా భావిస్తూ ఉంటారు. దానిని చూడటానికే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే అది మిగతా పక్షులకు భిన్నంగా కనిపించడమే కాకుండా, జరగనున్న కీడుకు అది సంకేతమని చిన్నప్పటి నుంచి వింటూ వస్తుండటమే అందుకు కారణమని చెప్పవచ్చు. ఇక గుడ్లగూబ రాత్రి వేళల్లో మాత్రమే కనిపించడం... దాని అరుపు వికృతంగా వుండటం.

అది ఇంట్లోకి వస్తే కొంత కాలంపాటు ఆ ఇల్లే వదిలి పెట్టాలని చెప్పుకోవడం... అది కనిపించిన పరిసరాలలో చావు మాట వినిపిస్తుందనే ప్రచారం జరగడం గుడ్లగూబపై ఎవరికీ సరైన అభిప్రాయం లేకుండా చేసింది.
లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ
లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ
శుభ శకునం
అయితే శాస్త్రం మాత్రం గుడ్లగూబను మించిన శుభ శకునం మరొకటి లేదని చెబుతోంది. సిరులు ఇచ్చే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ. లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసినప్పుడు గరుత్మంతుడి వాహనాన్ని, ఒంటరిగా ప్రయాణించ వలసి వచ్చినప్పుడు గుడ్లగూబను అధిరోహించేదని శాస్త్రాలు చెబుతున్నాయి. 'ఉల్లూక తంత్రం'లో గుడ్లగూబ దర్శనం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పబడింది.

రాత్రి నాల్గవ జాములో
రాత్రి నాల్గవ జాములో గుడ్లగూబ ఎవరింటి వాకిలిపై వాలినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. ప్రయాణ సమయాల్లో గుడ్లగూబ ఎడమవైపున కనిపిస్తే వెళుతోన్న పని తప్పనిసరిగా పూర్తి అవుతుంది. గర్భవతి అయిన స్త్రీని గుడ్లగూబ తాకడం వలన మంచి సంతానం లభిస్తుందట. గుడ్లగూబ ఇంటి ఆవరణలో గానీ... పశువుల శాలలో గాని, పొలంలోని చెట్లపై గాని నివాసముంటే, ఆ యజమానికి పాడిపంటలకు ... సుఖసంతోషాలకు కొదవ ఉండదట. మరి అలాంటి గుడ్లగూబ గురించి జనంలో ప్రచారం మరోలా ఉంది.

లక్ష్మీ దేవి వాహనంగా మారింది
ఇక ధైర్యం, సాహసం ఏ సమయంలో మనకు అవసరం? దీనికి జవాబు అంధకారం అలము కున్నప్పుడు. అటు వంటి అంధకారంలో ధైర్యంగా విజయం సాధించే ఏకైక పక్షి గుడ్ల గూబ. అందుకే ఆ పక్షి లక్ష్మీ దేవి వాహనంగా మారింది. ధైర్యం ఏ సమయంలో ఉండాలి. సాహసం ఏ విధంగా ఉండాలి. తన కుటుం బానికి తగిన ఆహారం దొరకక పోయినా చెదరని విశ్వాసంతో ఉండటం ధైర్యం. సాహసం అంటే తన చిన్న పక్షి పిల్లల గూడు మీదకు వెళ్తున్న ఒక తోడేలుని ఎదిరించి విజయం సాధించటం.

గుడ్ల గూబ ప్రయాణం
ఈ రెండు ఒక దాని తరువాత ఒకటి జరిగితే వచ్చేది లక్ష్మి. అదే ఆనందం. ఆహారం సంపాదించే సమయంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో గుడ్ల గూబ ప్రయాణం చేస్తుంది. ఆ పక్షిని వాహనంగా చేసుకున్న లక్ష్మీ అమ్మవారు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ధైర్య సాహసాలని ప్రదర్శిస్తే తప్పక ఇష్టపడుతుంది.

విశేష పూజ లు
ప్రతి రోజు ప్రదోష సమయంలో నిద్ర లేచి రోజును ప్రారంభించే ఈ పక్షి ద్వారా లక్ష్మీ దేవి మన దగ్గరకు వస్తుంది. ఈ పక్షికి ఉదయం సరిగ్గా కనపడదు. అందుకే రాత్రి సమయంలో ప్రయాణిస్తుంది. అందుకే అమా వాస్య రోజు లక్ష్మీ దేవికి మనం విశేష పూజ లు చేస్తూ ఉంటాం.

గమనించే శక్తి
గుడ్ల గూబలో మనం గమనించాల్సిన మరో గొప్ప లక్షణం ఎక్కడ చిన్న శబ్దం అయినా గమనించే శక్తి. విద్యార్థులు మధ్యాహ్న సమయంలో నిద్ర పోకూడదు. ఈ పక్షిని ఆదర్శంగా తీసుకొని ఉద్యోగం వైపుగా వచ్చే చిన్న చిన్న అవకాశాలను కూడా జాగ్రత్తగా గమనించి విజయం సాధించాలి. మన నెలసరి జీతాలు ఎంత మెల్లగా వస్తాయో అదే విధంగా లక్ష్మీ దేవి రాక కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.

లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వారు
అతి వేగంతో ఆవిడ దర్శనం ఉండదు. అతి వేగంగా ధనం ఎవరికీ లభించదు. లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వారు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి.వేట సమయంలో పక్షి తన శరీర బలం కంటే 12 రెట్ల వేగములో ఎలా అయితే ప్రయాణం చేసి ఆహారం సంపాదిస్తుందో అదే మార్గంలో ప్రతి ఒక్కరు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవా లంటే వారి వారి శక్తులకు పదింతలు కష్ట పడాలి.

అప్పుడే పరిపూ ర్ణ మైన లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. గుడ్లగూబ లేని ఖండం లేదు. ప్రపంచం అంతటా గుడ్ల గూబ జాతి ఉంది. అడవుల్లో ఉండే ఈ పక్షులను ఉపా సన ద్వారా పరిశుభ్రమైన మన ఇంటికి ఆహ్వానించాలి.

సంకలనం: భానుమతి అక్కిశెట్టి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top