ఖడ్గమాల - Khadga Maalaఅసలు ఖడ్గమాల అంటే?
  • ⭄ ఖడ్గము అంటే కత్తి అని అర్థము. మాలా అంటే ఒక పద్దతిలో వరుసగ కూర్చబడినదని. శ్రీవిద్య రహస్య మైన విద్య అని అంటారు. ఈ నేపద్యములొ ఖడ్గమాల అంటే గల పర మార్థ మేమిటో తెలుసుకుందాము.
  • ⭄ కత్తి/ఖడ్గము తన సమీప ప్రత్యర్థిని నిగ్రహించడానికో లేక చంపడానికో ఉయోగ పడే ఆయుధం. మనలో అశాంతికి మూల కారణము కోరికలు. ఇవి తీరక పోవడమో, లేక తీరడమో వలన కలిగే అరిషడ్వర్గాల ప్రతి స్పందనే మన అంత: శత్రువులు. వాటిని తునుమాడే మంత్రాలే ఈ ఖడ్గాలు.
  • ⭄ ఒకొక్క ఖడ్గం ఒక్కో శక్తి రూపం. వీటి అండతో మన:శాంతిని పొందడమేకాక ఆతల్లిని చేరి ఆమెలో ఐక్యమై జనన, మరణ చక్రము నుండి ముక్తి పొందవచ్చునని నమ్మకము.
  • ⭄ శ్రీ పీసపాటి సబ్రహ్మమణ్యం గారు “శ్రీ విద్యా పరి భాషలో ఖడ్గమంటే త్రికోణమనీ” అందుచేత ఖడ్గమాల అంటే త్రికోణముల మాల అయిన శ్రీ చక్ర మని అభిప్రాయపడ్డారు.
దీనిని బట్టి ఖడ్గమాల పారాయణము శ్రీచక్రార్చనతో సమాన ఫలితమునిస్తుందని తెలుస్తోంది.

శ్రీచక్రమంటే?
సృష్టి మొదట్లో శ్రీమహాకామేశ్వరుడు మానవుల వివిధములయిన కోర్కెలను తీర్చుకొనడానకి 64యంత్రములను సృష్టించి ఇచ్చాడు. కానీ ఇందులో ఇహాన్ని ఇచ్చేవి పరాన్ని ఇవ్వలేవు. పరాన్ని ఇచ్చేవి ఇహాన్ని ఇవ్వలేవు.

అందుకే ఆ కరుణామూర్తి శ్రీ మహాకామేశ్వరి స్వామి వారిని ఇహ,పరాలను రెండింటిని ఇవ్వగలిగిన మహాయంత్రాన్ని సృష్టించవలసినదిగా కోరింది. తల్లి కోరికమేర శ్రీచక్రాన్ని సృష్టించాడు శ్రీ మహాకామేశ్వరుడు.

శ్రీ చక్రములో 4 ఊర్థ్వముఖ త్రికోణాలు 5 అథోముఖ త్రికోణాలు ఉన్నాయి. వీటి కలయికమూలంగా 43 త్రికోణాలు ఏరపడతాయి. ఇవిగాక, కేంద్రములో బిందువు,అష్టదళ పద్మ చక్రము, శోడశదళ పద్మ చక్రము, మూడు వృత్తములు, మూడు చతురస్రములు, నాలుగు ద్వారములు ఉన్నాయి.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top