స్వదేశీ ఆహారం, శ్రీ రామ రక్షం - Swadeshi Aaharame Sree Rama Raksha

స్వదేశీ ఆహారం, శ్రీ రామ రక్షం - Swadeshi Aaharame Sree Rama Raksha
స్వదేశీ ఆహారవేదం 
స్వదేశీ ఆహారం గురించి తెలుసుకోవలసి న అవనరం ఇవ్వుడే మొచ్చింది? ఇప్పుడు మనం తినేది స్వదేశీ ఆహరం కాదా? అసలు ఏ దేశపు ఆహార విధానాలు అనుసరిస్తే ఏమిటి? అనేకరకాల ప్రశ్నలు మనకు ఉదయించవచ్చు. ప్రశ్నలకు సమాధానమే ఈ వ్యాసం.

ఒక్కో దేశానికి, ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధమైన నాగరికత ఒక్కోవిధమైన వాకానరణం ఒక్కోవిధమైన  అహారపు అలవాట్లు వుంటయ్. ఆ వాతావరణ పరిస్థితులనుబట్టే ఆప్రాంత ప్రజల వేషము, అహారము, అచారము, నాగరికత ఏర్పడతయ్. ఈనాగరికతను విడనాడకుండ జీవించినంతకాలము ఆప్రాంత ప్రజలకు అరోగ్యము, ఆయువు సంపూర్ణంగా వుంటయ్.

అలాగాకుండ ఒక రకమైన వాతావరణ ప్రాంతంలో నివసించే ప్రజలు, వేరే వాతావరణానికి సంబంధించిన ఆహారవిధానాలను అనుసరిస్తే, అది దేశ విరుద్ధమై, క్రమంగా ఆహారవిరుద్ధమై. ఆచారబిరుద్ధమై, తీవ్రమైన అనారోగ్యానికి దారితీసి అకాల మృత్వువుకు గురిచేస్తుంది.

చిన్న చిన్న ఉదాహరణలతో ఈ నిజాన్ని మనం తెలుసుకోవచ్చు. ఒక ప్రాంతం ప్రజలు ఏదో ఒక పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ నీరు ఆహారం సేవించి తమ ప్రాంతానికి తిరిగి రాగానే అనారోగ్యానికి గురికావడం " రకరకాల నీళ్ళ్క తాగి రకరకాల భోజనంచేసి జలుబు పట్టిందని, జ్వరం వచ్చిందని విరేచనాలు తగులుకున్నయని". మాట్లాడటం, మంచాన పడటం మన నిత్య జీవితంలో చూస్తునే వున్నాం.

ప్రాంతీయ తేడా:
  • అలాగే ఉత్తర దక్షిణ భారత దేశాల్లో నివసించే ప్రజల ఆహార ఆచారాల్లో ఎంతో వ్యత్యాసముంది. చలి, అధికంగా వుండే ఉత్తరాది ప్రజలు కూరల తయారీకి ఆవనూనెను వంట నూనెగా వాడతారు. ఎందుకంటే ఆవనూనె వేడి కలిగిస్తుంది కాబట్టి, చలి ప్రాంతాల ప్రజలకు వేడి అవసరం కాబట్టి ఆవనూనెను వాడుకుంటారు.
  • అదే దక్షిణ భారత దేశంలో ఎక్కువ కాలం సమ శీతోష్ణంగా వుంటుంది కాబట్టి దక్షిణాది ప్రజలు ఆవనూనె వాడకుండ, సమశీతోష్ణాన్ని కలిగించే నువ్వుల నూనెను వంట నూనెగా వాడతారు. 
  • ఈ విధంగా ఒకదేశంలోనే వాతావరణాలను బట్టి ఆహార విధానాలు, ఆచార విధానాలు, వేషభాషలు, నాగరికత మారుతూ వుంటయ్.
వేదిశి విషాహారం అలవాట్లు
అలాంటప్పుడు ఏ అమెరికాకో, ఏ ఇంగ్లాడ్ కో సంబంధించిన ఆహారపు అలవాట్లు, ఆ వాతావరణానికి పూర్తి విరుద్దమైన మన దేశంలో ఎలా అక్కరకు వస్తయ్?. మంచు, చలి విపరీతంగా వుండే దేశాల్లో నివసించే ప్రజలకు, ఉదయం నిదర లేవగానే పాచిముఖంతోనే బెడ్కాఫీ తాగటం అవసరం కావచ్చుగానీ, వేడి, ఎండ అధికంగా వుండే ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో నివసించే మన దేశ ప్రజలకు బెడ్ కాఫీ తాగటం అవసరం కాకపోగా, అది విరుద్ధ ఆహారమై ఉదయం నిద్రలేవగానే మన ఆరోగ్య వినాశనానికి శ్రీకారం చుడుతుందని చెప్పక తప్పదు.

అలాగే ఆ దేశాల్లో చలి నుంచి మంచునుంచి కాపాడుకోవటానికి వారు ధరించే సూటు, టైలు, షూస్, వారు రోజూ క్రమం తప్పకుండ సేవించే బ్రాంటీ, విస్కీలాంటి మత్తు పదార్థాలు వారికి అవసరమేమోగానీ పూర్తి విరుద్ధమైన వాతావరణంలో నివసించే మనకు మాత్రం హానికరమని ఘంటాపధంగా చెప్పవచ్చు

అంతేగాకుండా ఈనాడు పాశ్చాత్య నాగరికతను ప్రతిబింబించే స్టార్ హోటళ్ళలో, ఫాస్ట్పుడ్ సెంటర్లలో రుచికోసం, రంగులకోసం కలిపే వివిధ రసాయనాలతో కలిసిన ఆహారాన్ని సేవించటం, అర్ధరాత్రి వరకు బార్లలో పీకలదాకా తాగటం, మనలో చాలామందికి గొప్ప ఫ్యాషన్ గా మారింది. అది గొప్ప హోదాగా హైసొసైటీకి నిదర్శనంగా భావించ బడుతూ, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, సంపన్న వర్గాలవారి నుంచి మధ్య తరగతి వాళ్లకు కూడా ఈ జాడ్యం అంటువ్యాధిలా అంటుకుంది.

ఇలా కాల, వాతావరణ విరుద్ధమైన ఆహారాలు సేవించటం వల్ల ఏమి కొంపనునిగిపోయింది ? అని పై అలవాట్లున్న పెద్దలు మనమీద రుసరుసలాడవచ్చు. వారికి కనువిప్పుగా ఏవి జరుగుతుందో చెప్పుకుందాము. 
  • ➣ ఆహారాలు తీసుకోవటం వల్ల శరీరంలో సమంగా వుండే వాత, పిత్త, కఫాలనే మూడు మూల ధాతువులు దోషాలుగా మారి, శరీరాన్ని రక్షించే మిత్రరూపాన్ని విడిచి, శరీరాన్ని భక్షించే శత్రురూపాలుగా మారి వివిధ రోగాలకు కారణభూతమౌతయ్. 
  • ➣ ఈ నగ్నసత్యం ఈనాటి మన అనారోగ్యపు జీవితాల్లో అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది. 
కాబట్టి మా ప్రియమైన పాఠక సోదరీసోదరులంతా ఆహార విజ్ఞానాన్ని సంపాదించి తాము ఆరోగ్యవంతులై, తమ చుట్టూ వున్న సమాజాన్ని కూడా ఆరోగ్యవంతం చేయటానికి కంకణ ధారులు కావలసిందిగా పిలుపునిస్తున్నాము.

"అందరికి ఆయుర్వేదం  - న్వదేశీ! ఆహారవేదం"

రచన: పండిత ఏల్చూరి వెంకట్రావు - శ్రీ స్వామి అయ్యప్ప సొసైటీ - భాగ్యనగరం.
ఫోన్ నెంబర్: 040-42408568

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top