దశమహ విద్యా - Dashamaha Vidya


దశమహ విద్యా

దశమహా విద్యలలో ఒక్కో దేవత యొక్క మంత్రం, గాయత్రి, ఆ దేవత యొక్క బైరావ నామం , మంత్రం,ఒక్కొ రాసి వ్వారి కి వారి ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆ గ్రహం వారు ఏ దేవతను ఏ మంత్రాన్ని జపించాలి ఇందులో వివారంగా ఉంది గమనించండి.

దశ మహా దేవతల్లో:
కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి

1. కాళీ

శ్రీ కాళీ మంత్రం:
"ఓం క్రీం క్రీం క్రీం హ్రీ0 హ్రీ0 హుం హుం దక్షిణకాళికే క్రీం క్రీం క్రీం హ్రీ0 హ్రీ0 హుం హుం స్వాహా"

కాళీ గాయత్రి :
ఓం కాళికాయైన విద్మహే,
శ్మశాన వాసిన్యై చ ధీమహి,
తన్నో అఘోర ప్రచోదయాత్ ||

శ్రీ కాళీ మాత క్షేత్రపాలకుడు: కాలభైరవుడు
"ఓం క్రీం క్రీం కాళబైరవాయ ఫట్ స్వాహా"
or
"ఓం క్రీం క్రీం హ్రీ0 హ్రీ0 హుం హుం కాలభైరవాయ ఫట్"

గ్రహము: శని
"ఓం హ్రీ0 శ్రీ0 శనేశ్చరాయ గ్రహచక్రవర్తిన్యై క్లీం ఐం సః స్వాహా "

కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయ సంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2. తారా
శ్రీ తారా మంత్రం:
"ఓం హ్రీ0 త్రీ0 స్త్రీ0 హుం ఫట్ స్వాహా"
or
"ఐం ఓం హ్రీ0 క్లీ0 హుం ఫట్ ఐం"

శ్రీ తారా గాయత్రి :
"ఓం ఏక జటాయై చ విద్మహే,
నీల సరస్వత్యై చ ధీమహి,
తన్నో తారా ప్రచోదయాత్ ||"

శ్రీ తారా మాత క్షేత్రపాలకుఁడు : అక్షోభ్య బైరవుడు
"ఐం ఓం హ్రీ0 క్లీం అక్షోభ్య భైరవాయ హుం ఫట్ ఐం స్వాహా"
or
"మహా ఘోర విష హరయా లోకతారినే అక్షోభ్య భైరవాయ స్వాహా"

గ్రహము: గురుడు
"ఓం ఐం క్లీం బ్రు0 బృహస్పతయే నమః స్వాహా"
or
"ఓం హ్రీ0 శ్రీ0 బ్లీ0 ఐం గ్లౌ0 గ్రహాధిపతయే బృహస్పతయే వీం ఠ: శ్రీ0 ఠ: ఐం ఠ: స్వాహా"

దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల.. శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3. షోడశి( త్రిపురసుందరి )

శ్రీ షోడశీ మంత్రం :
" హాది,కాది "విద్య ఇందులో పంచదసి రాయకూడదు

శ్రీ షోడశీ గాయత్రి :
ఓం త్రిపురాయై చ విద్మహే ,
క్లీ0 కామేశ్వర్యై చ ధీమహి ,
తన్నో సౌస్తన్న : ప్రచోదయాత్ ||

క్షేత్రపాలకుడు: పంచవక్త్ర భైరవుడు
"ఓం హ్రీ0 హ్రీ0 సకలహ్రీ0 పంచవక్త్ర భైరవాయ నమః"
or
"ఓం పంచవక్త్రాయ పంచభూత సృష్టికర్తవే మహా భైరవాయ స్వాహా"

గ్రహం: శుక్రుడు
" ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః స్వాహా"
or
" ఓం శా0 శ్రీ0 శూ0 దైత్యగురో సర్వాన్ కామన్ పూరయ పూరయ స్వాహా"

అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆ సాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4. భువనేశ్వరీ గాయిత్రి

శ్రీ భువనేశ్వరీ మంత్రం :
" హ్రీ0 "

శ్రీ భువనేశ్వరీ గాయత్రి :
ఓం నారాయణ్ణ్యే చ విద్మహే ,
భువనేశ్వర్యై చ ధీమహి ,
తన్నో దేవీ ప్రచోదయాత్ ||

క్షేత్ర పాలకుడు : త్ర్యంబక భైరవుడు
" ఓం హ్రీ0 త్ర్యంబకాయ హ్రీ0 స్వాహా "
or
" ఓం త్ర్యంబకాయ భువనపాలకాయ మహా భైరవాయ స్వాహా "

గ్రహము: చంద్రుడు
" ఓం శ్రీ0 క్లీం హం రం చం చంద్రాయ నమః స్వాహా "

దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5. చిన్నమస్త దేవి

మంత్రం :
" శ్రీ0 హ్రీ0 క్లీ0 ఐ0 వజ్రవైరోచనియై హూ0 హూ0 ఫట్ స్వాహ "

శ్రీ ఛిన్నమస్తా మాతా గాయత్రి :
వైరోచనియై చ విద్మహే,
ఛిన్నమస్తాయై చ ధీమహి ,
తన్నో దేవీ ప్రచోదయాత్ ||

శ్రీ ఛిన్నమస్తా క్షేత్రపాలకుడు: కబంధ భైరవుడు
"ఓం శ్రీ0 హ్రఔ0 క్లీం ఐం కబంధ భైరవాయ హుం ఫట్ స్వాహా"
or
"కర్షణ బంధాయ ఛిన్నమస్తాయ వజ్రప్రధాతాయా కబంధ భైరవాయ స్వాహా"

గ్రహము: రాహు
" ఓం క్రీ0 క్రీ0 హుం హుం టం టం కధారిణే రాహవే రం హ్రీ0 శ్రీ0 భై0 స్వాహా "

దశమహావిద్యలలో 5వ మహా విద్య వేలసూర్యుల కాంతితో ప్రకాశించే ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.


6. త్రిపుర భైరవి

శ్రీ త్రిపుర భైరవీ మంత్రం :
" హసై హసకరి హసై "

శ్రీ త్రిపుర భైరవీ గాయత్రి :
త్రిపురాయై చ విద్మహే ,
భైరవియై చ ధీమహి,
తన్నో దేవీ ప్రచోదయాత్ ||

శ్రీ త్రిపుర భైరవీ క్షేత్ర పాలకుడు : కాళభైరవుడు
" ఓం క్రీ0 క్రీం కాలభైరవాయ ఫట్ స్వాహా "
or
" ఓం క్రీం క్రీం హ్రీ0 హ్రీ0 హుం హుం కాలభైరవాయ ఫట్ స్వాహా "

గ్రహము: బుధుడు
" ఓం హ్రా0 క్రో0 గం గ్రహనాదాయ బుధాయ స్వాహా "

దశ మహావిద్యలలో 6వ మహావిద్య భైరవి ఈ దేవిని ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీ సిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది దశ మహావిద్యలు -

7. ధూమవతీ గాయిత్రి

శ్రీ ధూమావతి మంత్రం :
" ధూం ధూం ధూమావతి ఠ: ఠ: "

శ్రీ ధూమావతి గాయత్రి :
ఓం ధూమావత్యై చ విద్మహే,
సంహారిన్యై చ ధీమహి,
తన్నో ధూమా ప్రచోదయాత్ ||

శ్రీ ధూమావతి క్షేతపాలకుడు : కాలభైరవుడు
" ఓం క్రీ0 క్రీ0 హుం హుం కాలభైరవాయ ఫట్ స్వాహా "
or
"ఓ ఓం క్రీ0 క్రీ0 హ్రీ0 హ్రీ0 హుం హుం కాలభైరవాయ ఫట్ స్వాహా "

గ్రహము : కేతువు
" ఓం హ్రీ0 కౄ0 కౄరరూపిణే కేతవే ఐం సౌ: స్వాహా "

దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8. భగళాముఖి గాయిత్రి

శ్రీ బగళా ముఖీ మాత మంత్రం :
" ఓం హ్ల్రీం బగళా ముఖీ సర్వ దుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వా0 కీలయ బుద్ధి0 వినాశయ హ్ల్రీం ఓం స్వాహా || "

 శ్రీ బగళా ముఖీ గాయత్రి :
బగళాయై చ విద్మహే,
స్తంభిన్యై చ ధీమహి,
తన్నో పీతాంబరీ ప్రచోదయాత్ ||

శ్రీ బగళా క్షేత్రపాలకుడు : ఏకవక్త్ర భైరవుడు
" ఓం హ్ల్రీం ఏకవక్త్ర భైరవాయ హ్ల్రీం ఓం స్వాహా "
or
" అనేక వక్త్రాయ విచింత్యాయ సర్వ స్వరూపిణే మహా భైరవాయ స్వాహా "

గ్రహము: కుజుడు
"ఓం ఐం హ్మౌ0 శ్రీ0 ద్రాం కం గ్రహాధిపతయే భౌమాయ స్వాహా "

దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీబగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9. మాతంగీ గాయిత్రి

శ్రీ మాతంగీ మంత్రం:
" ఓం హ్రీ0 క్లీం హుం మాతంగ్యై ఫట్ స్వాహా "

శ్రీ మాతంగీ గాయత్రి :
ఓం మాతంగ్యై చ విద్మహే,
ఉచ్చిష్ట చాండాలిన్యై చ ధీమహి,
తన్నో దేవి ప్రచోదయాత్ ||

శ్రీ మతంగీ క్షేత్రపాలకుడు: మతంగ భైరవుడు
" ఓం హ్రీ0 క్లీం హుం మతంగ భైరవాయ సం నమః స్వాహా "
or
" ఓం హృదయ విష్టవే మతంగ భైరవాయ వామ తంత్రేషు ఉచ్చిష్ట మహాత్మనే నమః "

గ్రహము : రవి
"ఓం హ్మౌ0 శ్రీ0 ఆ0 గ్రహాధిరాజాయ ఘృణి సూర్య ఆదిత్యాయ ఓం స్వాహా "

దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10. కమలాత్మిక గాయత్రి

శ్రీ కమలాత్మికా మంత్రం :
ఓం ఐం హ్రీ0 శ్రీ0 క్లీం జగత్ ప్రసూత్యై నమః ||
OR
ఓం శ్రీ0 హ్రీ0 శ్రీ0 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీ0 హ్రీ0 శ్రీ0 మహాలక్ష్మి యై నమః ||

శ్రీ కమలాత్మికా గాయత్రి :
ఓం కమలాయై చ విద్మహే,
జగత్ ప్రసూత్యై చ ధీమహి,
తన్నో దేవీ ప్రచోదయాత్ ||

శ్రీ కమలాత్మికా క్షేత్రపాలకుడు : సదాశివ భైరవుడు
" ఓం ఐం శ్రీ0 సదాశివ భైరవాయ సం నమః స్వాహా "
or
" శం కరోతి సదాశివాయ మహా భైరవాయ స్వాహా "

గ్రహము :శుక్రుడు
" ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః "

( మూలమంత్రం: ఓం క్లీం శ్రీం లక్ష్మీదేవ్యై నమః ) పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తి పొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్య తిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. శ్రీ లలితాంబికాయై నమః..

ఓం శ్రీ మాత్రే నమః.

సంకలనం: భానుమతి అక్కిశెట్టి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top