నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Tuesday, May 12, 2020

గో సంపదే దేశ సౌభాగ్యం - Govu, Go Sampade Desa Saubhagyam

గో సంపదే దేశ సౌభాగ్యం.

గోవర్థనగిరిని ఎత్తి గోపాలకృష్ణుడు ప్రళయ వర్షం నుండి వేల వేల గోవులను రక్షించాడు. గోవులంటే గోపాలకృష్ణునికి అమితమైన ప్రేమ. గోమాతను గౌరవించడం ప్రాచీన కాల సాంప్రదాయం. ‘గోవు’ అనగానే భారతీయులలో ఎక్కడాలేని పవిత్రభావం కలుగక మానదు.
కృష్ణ్భభగవానుడు గోవును పూజించుట
కృష్ణ్భభగవానుడు గోవును పూజించుట 
దాదాపు ఐదు వేల సంవత్సరాల కాలం నాడే కృష్ణ్భభగవానుడు గోవులను కాసేవాడు. పూజనీయమైనవి. పవిత్రమైనటువంటివి గోమాతలు. గోమాతను పూజించడం, గోమాతను గౌరవించడం మన విధి. అంతేగానీ గోవధ కిరాతకం. గోమాంస భక్షణ మహాపాపకార్యం. ఇటువంటివి నిషేధించాలి.

ఆరోగ్య ప్రదాయని:
 • 🝒 శిశువు పుట్టగానే తల్లి పాలు ఇస్తుంది. తల్లిపాలు లేకపోతే శిశవులకు ఆవుపాలే శరణ్యం. 
 • 🝒 ఆవుపాలల్లో సమృద్ధిగా పోషకాహరం అధికంగా వున్నాయి. 
 • 🝒 గోమూత్రం ఆయుర్వేదంలో ప్రాముఖ్యత వహించింది. 
 • 🝒 గోమాత సౌభాగ్యం సృష్టిలో శుభప్రదం.
 • 🝒 మానవుని ఆరోగ్యమునకు ఉపయోగపడు దేవతా స్వరూపం కల జంతువు ‘గోమాత’
 • 🝒 ఆవుపాలు, నెయ్యి, పెరుగు, మజ్జిగ, మూత్రము లేదా పంచికం - ఇవన్నీ మానవునికి ఆరోగ్యకారిగా ఉపయోగపడతాయి. 
 • 🝒 వృద్ధులకు ఆరోగ్యం క్షీణించినవారికి ఆవుపాలు శ్రేష్టమైనవి
 • 🝒 ఆయుర్వేదంలో ఆవుపాల విశిష్టత వివరించడం విదితమే.
శ్రీమద్భవగద్గీతంలో:
శ్రీకృష్ణుడు శ్రీమద్భవగద్గీతలో 11వ అధ్యాయంలో ఎక్కడ గోవులు రక్షించబడతాయో అక్కడ సౌభాగ్యం వెల్లివిరుస్తుందని, స్వర్గలోక యోగం సంప్రాప్తిస్తుందన్నారు.

వేయి అశ్వమేధ యాగాల ఫలితం ఒక్క గోవును కాపాడడం ద్వారా లభిస్తుంది. అందుకే అందరూ గోమాతను రక్షించాలి. గోమాతను గౌరవించాలి. గోమాతను పూజించాలి. గోమాత సౌభాగ్యమే మన దేశ సౌభాగ్యంగా భావించాలి.  శ్రీకృష్ణుడు గోమాత రూపంలో కనిపించే ప్రత్యక్షదైవం. క్షీర సాగర మథనంలో కామధేనువు గోమాత గనుక మనం ప్రతినిత్యం గోమాతను పూజించాలి.
కామధేనువు , kamadenuvu
కామధేనువు 
'గో'సంరక్షణ:
గో'సంరక్షణ బాధ్యతలు తీసుకున్నవారికి శుభప్రదం కాగలదని పెద్దల అభిప్రాయం. గోమాత రూపంలో కనిపిస్తున్న కామధేనువు మనకు కల్పతరువు లాంటిది. ఎక్కడ గోహత్యలు జరిగి శుభాశుభాలు జరుగవో.. అక్కడ మానవుల అభివృద్ధి కూడా క్షీణిస్తుందంటారు.
 • 🝒 సమస్త ప్రజలు తమ వంతు కర్తవ్యంగా గోమాతను పవిత్ర దేవతగా పూజించాలి. 
 • 🝒 అటువంటి పుణ్యకార్యంలో మానవులు పాలు పంచుకోవాలి. 
 • 🝒 గోమాత సంరక్షణ మన కర్తవ్యంగా భావించాలి. 
 • 🝒 సమస్త దేవతా స్వరూపమైన గోమాత విశిష్టతను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. 
 • 🝒 గోశాలలు విరివిగా ఏర్పాటు చేసి గోవులను పెంచాలి. 
 • 🝒 ఎక్కడ గోవులు పూజింపబడతాయో అక్కడ శుభములు సౌభాగ్యములు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. 
 • 🝒 అనాథ ఆశ్రమాలలో, వృద్ధాశ్రమాల్లో గోవులను పెంచి గోశాలలు ఏర్పాటుచేయడంవలన ప్రయోజనమే కదా. 
గోమాత శరీరములో దేవతా స్వరూపాలు అనేకం వున్నాయి. గోమయం ఆవుపేడలో రోగక్రిముల్ని చంపే గుణం వుంది. చర్మ సౌందర్యానికి, దంతధావనానికి దీనిని ఉపయోగిస్తారు. గోమూత్ర సేవనం వలన అనేక రోగాలు నశిస్తాయి. ఆవు నెయ్యి యజ్ఞాలకు, హోమాలకు ఉపయోగిస్తారు. ఆవు నెయ్యి పవిత్రమైనది. గోరక్షణ, గోమహత్మ్యం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. గోమాత సౌభాగ్యమే మన కర్తవ్యంగా భావించాలిసంకలనం: ఓంకార్ హిందూ
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com