పచ్చి మిర్చి ఆరోగ్యానికి మంచిదా లేక పండు మిర్చి మంచిదా ? - Mirchi, Mirapa & Health, Red Chilli and Green Chilli


పచ్చి మిర్చి ఆరోగ్యానికి మంచిదా లేక పండు మిర్చి మంచిదా ? - Mirchi, Mirapa & Health, Red Chilli and Green Chilli

పచ్చి మిర్చి ఆరోగ్యానికి మంచిదా లేక పండు మిర్చి మంచిదా ?

పచ్చి మిర్చి మంచిదా ,పండు మిర్చి మంచిదా అంటే రెండూ మంచివే.ఏ కాలంలో దొరికేవి ఆ కాలంలో తినడం మంచిదన్నది తెలిసిందే.ఆకుపచ్చని మిర్చి,పసుపు రంగు మిర్చిలతో పోలిస్తే పండు మిర్చిలో విటమిన్ సి,బీటా కెరోటిన్ ల శాతం ఎక్కువ,ఎ,బి,సి విటమినులతో పాటు ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.క్యాన్సర్ తోనూ పోరాడగలడు.ముఖ్యంగా ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు ఇది సాయపడుతుందట.పొట్టలో హానికర బ్యాక్టీరియాని నివారిస్తుంది.

పండు మిర్చి రంగు చూస్తేనే నోరూరుతుంది.అంటే ఆకలిని పెంచినట్లే కదా..అలాగే ఇది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది.ముఖ్యంగా రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వుని సైతం కరిగించే గుణాలు ఇందులో ఉంటాయి.

జలుబూ,జ్వరాలు గట్రా రాకుండా నిరోధించే గుణాలూ ఇందులో ఎక్కువే.నొప్పులకి కారణమయ్యే ఇంఫ్లమ్మేషన్ ని తగ్గిస్తుంది. దాని ఫలితంగానే ఆర్థ్రైటిస్, సొరియాసిస్, డయాబెటిక్న్యూ రోపతి...వంటి వాటి కారణంగా తలెత్తే నొప్పుల్ని తగ్గించే గుణం పండు మిర్చిలో ఎక్కువ.దీన్ని తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణశక్తినీ,జీవక్రియనీ పెంచడంతో పాటు బరువు పెరగకుండానూ చేస్తుంది.ఇది తిన్నాక పుట్టే వేడి కారణంగా వ్యాయామంలో మాదిరిగా కెలొరీలు కరుగుతాయి.

ఆస్తమా,సైనస్,జలుబులతో బాధ పడేవాళ్లు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఊపిరితిత్తులు,గొంతు,ముక్కుల్లో శ్లేష్మం,మ్యూకస్ పేరుకోకుండా ఉంటుంది.పండు మిర్చి వాసన తలనొప్పుల్నీ తగ్గిస్తుంది.

గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సంకలనం: కోటేశ్వర్ 

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top