నరకలోకంలో శిక్షలు - Narakam lo Shikshalu

0
నరకలోకంలో శిక్షలు
ఈలోకంలో మనుష్యులు తమక్షణిక సుఖాలకోసం అనేక దుష్కర్మలను చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మనపురాణాలు బోధిస్తున్నాయి.

ఈ భోగదేహం రెండు రకాలు:
 • ➣ ఒకటి సూక్ష్మ శరీరం. ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గ లోకాలకు చేరుతుంది. 
 • ➣ రెండవది యాతనా దేహము. ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరక లోకాలకు చేరుతుంది. 
మృత్యువు తరువాత వెంటనే కొత్త దేహం ధరించటం వీలుకాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి సుకృత, దుష్కృత సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది.

శ్రీమద్భాగవతంలో యాతనాదేహం అనుభవించే వివిధశిక్షలు వాటిని అమలు చేసే 28 నరకాల వర్ణన వున్నది. వాటి సంక్షిప్త వివరణ:
 •  1. తామిస్ర నరకం: పరధనాపహరణ, పరస్త్రీ, పర పుత్ర హరణం వలన ఈ నరకం పొందుతాడు. ఇక్కడ అంధకార బంధురమున పడవేసి ఇనుప కర్రలచే బాదుదురు.
 •  2. అంధతామిశ్ర నరకం: మోసగించి స్త్రీల ధనమును తీసుకున్నవారు కండ్లు కనిపించని చీకటిలో నరికిన చెట్ల వలె నరకబడుదురు.
 •  3. రౌరవ నరకం: ఇతర ప్రాణులను చంపి తన కుటుంబమును పోషించుకున్న వారిని ఇక్కడ రురువులు అను జంతువులు పాముల కన్న ఘోరముగా హింసించును.
 •  4. మహారౌరవ నరకం: ఇతర ప్రాణులను బాధించి తన శరీరాన్ని పోషించుకునేవాడు ఈ నరకానికి చేరుతాడు. పచ్చి మాంసము తిను రురువులు వారి మాంసమును కండలు కండలుగా పీక్కుతినును.
 •  5. కుంభీపాకనరకం: సజీవంగా వున్న పశుపక్ష్యా దులను చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు ఈ నరకాన్ని పొందుతాడు, సలసల కాగే నూనెలో పడవేసి, గారెలవలె వేపుదురు.
 •  6. కాలసూత్ర నరకం: తల్లిదండ్రులకు, సద్క్బాహ్మణులకు వేదాలకు ద్రోహం తలపెట్టినవారు ఈ నరకానికి వెళతారు. బాగా కాలిన రాగిలాంటి నేలపై నడిపిస్తూ ఉంటే! సూర్యుడు అగ్నిజ్వాలలు కురిపిస్తూ మాడ్చి వేయును.
 •  7 అసిపత్ర నరకం:  వేదములను ధిక్కరించిన వారు ఈ నరకాన్ని పొందుతారు. కొరడాలతో గొడ్డును బాదినట్లు బాదుచూ సర్వాంగములను కత్తులతో కోసి ఈ శిక్షలను అమలుపరుస్తారు.
 •  8. సూకర ముఖ నరకం: నేరము చేయకపోయినా, నేరం చేశారని దండించిన రాజులను అధికారులను చెరకు గడలవలే గానుగలో పెట్టి తిప్పుదురు.
 •  9. అంధకూప నరక: చిన్న చిన్న ప్రాణులను చంపిన వానిని పాములు, నల్లులు, దోమలు, చీమలు మూకుమ్మడిగా దాడిచేసి హింసించును.
 • 10. క్రిమి భోజన నరకం: అతిథులకు అనాదలకు అన్నం పెట్టక తన పొట్ట నింపుకొన్నవాడు క్రిములతో నిండిన లక్షయోజనముల కుండలో పడవేయుదురు.
 • 11. సందంశ నరకం: ఇతరుల ధనధాన్యాలను, బంగారము రత్నములు దోచుకున్న వారిని మండుతున్న ఇనుపకడ్డీలతో పొడుస్తూ, పటకారుతో చర్మము పీకుట వంటి శిక్షలు వేస్తారు.
 • 12. తప్తోర్మి నరకం: సంభోగించరాని స్త్రీలతో సంభోగించిన మగవారు, అట్టి మగవారితో సంభోగించిన స్త్రీలు మండుచున్న ఇనుప స్త్రీ, పురుష ప్రతిమలచే కౌగిలింప చేయబడుదురు. 
 • 13. వజ్ర కంటక నరకం: పశువులతో ఇతర జంతువులతో సంభోగించిన వాడిని ఇనుప చవ్వులలాంటి ముళ్ళున్న బూరుగుచెట్టు మీదకి ఎక్కించి కిందకు లాగుదురు.
 • 14. శాల్మలి నరకం: కులమర్యాద పాటించని రాజు లేక రాజోద్యోగి, చీము, నెత్తురు, తలవెంట్రుకలు, గోళ్ళచే నిండి ఉన్న నదిలో త్రోయబడుదురు.
 • 15. వైతరణీ వుయోద నరకం: శౌచము మొదలైన ఆచార ములను పాటించని వారిని మలమూత్రాలచే నిండిన చెరువులో పడవేయుదురు.
 • 16. ప్రాణరోధ నరకం: కుక్కలను, గాడిదలను పెంచి వాటినే వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులను అంపకోలలచే వేటాడి హింసించెదరు.
 • 17. విశవిశస నరకం: దంభ యజ్ఞములు చేసి పశుపక్ష్యాదులను హింసించు వార్ని ప్రాణాంతకమైన రకరకాల హింసలకు గుర్తిచేసి హింసించెదరు.
 • 13. లాలాభక్షణ నరకం: కుల భార్యచే వీర్యపానము చేయించినవారిని, వారిచే వీర్యపానము చేయించి అతి కిరాతకంగా హింసించెదరు.
 • 14. సారమోయోదన నరకం: ఇండ్లు తగుల పెట్టుట విషముపెట్టుట, బిడార్లు దోచుట, గ్రామములను దోచుకొను వారిని వజ్రములవలే కరకుగా వున్న కోరలు గల ఏడు వందల జాగిలములు ఒకేసారి పీక్కొని తినును.
 • 15. అలీచారయ నరకం: అబద్ద సాక్ష్యాలను చెప్పి, లావా దేవీలలో మోసం చేసిన వారిని వంద యోజనముల ఎత్తయిన పర్వత శిఖరముల నుండి పడద్రోసి పచ్చడి పచ్చడిగా చేయబడుదురు.
 • 16. రేతః పాన నరకం: ప్రతనిష్ఠలో వుండి మద్యపానము చేసిన బ్రాహ్మణులు సోమపానము చేసిన క్షత్రియ, వైశ్యులను బాగా కరిగిన ఇనుమును వారిచే త్రాగింతురు.
 • 17. క్షాంకర్డ నరకం: తన కన్న అధికులను, పెద్దలను తిరస్కరించు వారిని తల క్రిందులుగా ప్రేలాడ దీసి నానా బాధలు పెట్టి హింసించెదరు.
 • 18. రక్షో గణభోజన నరకం: నరమేధములు చేయువారిని, నరమాంసము, పశువుల మాంసము తిను స్త్రీ పురుషులను వాడిగల ఆయుధములచే ముక్కలు ముక్కలుగా నరికివేసెదగ
 • 19. శూల ప్రోతస నరకం: నిరపరాధులైన అడవి జంతువులను ఊర పశువులను నమ్మించి పొడిచి చంపిన వారిని శూలములచే పొడుస్తూ కంబములకు ప్రేలాడదీయుదురు.
 • 20. దండశూత నరకం: ప్రాణికోటికి భయము కలిగించు ఉగ్రస్వభావులను అయిదు, ఏడు తలల పాములు అనేకం కలిసి ఎలుకలను హింసించినట్లు హింసిస్తాయి.
 • 21. మలనిరోధన నరకం: ఇతరులను, ఏ నేరము చేయని వారిని, గదులలోనూ, నూతులలోనూ బంధించిన వారిని విషాగ్నులు మండించి విషపు పొగలు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేయుదురు.
 • 22. పరావర్తన నరకం: అతిథులను, అభ్యాగతులను మోసంతో హింసించినవారిని కనుగ్రుడ్లను కాకులచే, గ్రద్దలచే పొడిపింతురు.
 • 23. సూచిముఖ నరకం: ధన మదాంధముతో అందరిని చిన్న చూపు చూచిన వానిని శరీరమును దబ్బలం లాంటి సూదులతో బొంతను కుట్టినట్టు కుట్టెదరు.
సంకలనం/రచన: గాజుల సత్యనారాయణ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top