నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

8, మే 2020, శుక్రవారం

రహస్య ఆయుర్వేద ఆరోగ్య సూక్తులు - Ayurveda Suktulu

రహస్య ఆయుర్వేద ఆరోగ్య సూక్తులు - Ayurveda Suktulu
రహస్య ఆరోగ్య సూక్తులు
ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు - కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఆరోగ్యపరమైన సలహాలు అంతర్లీనంగా ఉన్నాయి . వాటిన్నింటిని నేను నా పరిశోధనలో భాగంగా సేకరించాను . వీటిని మీకు ఇప్పుడు తెలియచేస్తాను. రహస్య సూక్తులు -
  • 🟔 చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం
  • 🟔 మినుములు అతిగా వాడరాదు.
  • 🟔 వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు. 
  • 🟔 గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు. 
  • 🟔 పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.
  • 🟔 దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు. 
  • 🟔 మలమూత్ర వేగములను ఆపరాదు . 
  • 🟔 ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.
  • 🟔 హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది . 
  • 🟔 స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది . 
  • 🟔 విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.
  • 🟔 రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను. 
  • 🟔 ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను. 
  • 🟔 మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.
  • 🟔 నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను
  • 🟔 వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను
  • 🟔 పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .
  • 🟔 భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.
  • 🟔 గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.
  • 🟔 శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము. 
  • 🟔 ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను . 
  • 🟔 రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .
  • 🟔 అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.
  • 🟔 కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .
  • 🟔 అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరుచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును. 
  • 🟔 ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.
  • 🟔 విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.
  • 🟔 పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు. 
  • 🟔 ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .
  • 🟔 రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం . 
  • 🟔 అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం . 
  • 🟔 వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .
  • 🟔 నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.
  • 🟔 పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి . 
  • 🟔 ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .
  • 🟔 దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం . * ఫలములలో ద్రాక్ష శ్రేష్టం . 
  • 🟔 ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం . 
  • 🟔 గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .
సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »