నేపాల్ పామువంటిదా, ఆ పాములకు పాలు పోసి పెంచుతున్నామా....?? - Nepal vs Bhaarath


పాములకు పాలు పోసి పెంచుతున్నామా....??

అగ్రరాజ్యం అమెరికాను సైతం కాదని ఏప్రిల్ 20వ తేదీన మిత్రధర్మం పాటించి నేపాల్‌కు 23 టన్నుల హైడ్రాక్సీక్లోరోక్విన్ మరియు పారాసెట్మాల్ పంపిన భారత్..

సరిగ్గా నెల రోజుల తరువాత మే 20న భారత్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన నేపాల్ ప్రధాని కె.పి.ఓలి .. కారణం రాబోయే ప్రమాదాన్ని ముందే ఊహించిన చైనా గత రెండు మాసాలుగా భారత్‌ను బ్రతిమలాడుతోంది.

UNO, WHO తదితర వేదికల్లో మాకు సహాయంగా మీరు రావాలి, లేదా కనీసం తటస్థంగా అయినా ఉండాలి అని.

అందుకు మోదీ సర్కార్ ససేమిరా అంది. అంతేకాకుండా అన్ని దేశాలకన్నా ముందుగా చైనా మన దేశంలోని కంపెనీల్లో వాటాలు కొనకుండా మోదీ సర్కార్ అడ్డుకున్నది. ఇటీవల ఆత్మనిర్భర్ భారత్ పేరుతో స్వదేశీ ఉద్యమాన్ని మోదీజీ చాపకింద నీరులా వ్యాపింపజేస్తున్నారు.. ఇది వ్యాపిస్తే చైనా ఎకానమీ ఢమేల్ అవడం ఖాయం..

దీనితో చేసేదేమీ లేక పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేత భారత్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించాడు జిన్‌పింగ్‌. దీన్ని ప్రపంచ దేశాలు అస్సలు పట్టించుకోలేదు..

ఆ తర్వాత సిక్కిం ప్రాంతంలో చైనా సైనికులు చొరబాటుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకుని మన సైనికులు వారి దవడలు పగులగొట్టారు..

ఇదీ లాభం లేదని ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో హెలికాప్టర్లతో చొరబాటుకు ప్రయత్నించారు. రాఫేల్‌ను బిగించుకుని ఏకంగా మన సుఖోయ్ యుధ్ద విమానాలు క్షణాల్లో అక్కడ వాలాయి..

దానితో ఏంచేయాలో పిచ్చెక్కి #కమ్యూనిస్టు ప్రేమికుడైన నేపాల్‌ ప్రధానిని భారత్‌కు వ్యతిరేకంగాను రెచ్చగొట్టి ప్రకటనలు ఇప్పిస్తోంది చైనా..

సంకలనం: Dr C L Venkata Rao BJP Gudiwada

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top