కరోనా నివారణకు పతంజలి మందును విడుదల చేసిన రాందేవ్ బాబా : 7 రోజుల్లో కరోనా ని కట్టడి - Baba Ramdev’s Patanjali launches Coronavirus treatment kit, claims 100% cure within a week


కరోనా నివారణకు పతంజలి మందును విడుదల చేసిన రాందేవ్ బాబా : 7 రోజుల్లో కరోనా ని కట్టడి - Baba Ramdev’s Patanjali launches Coronavirus treatment kit, claims 100% cure within a week

కరోనాకి పతంజలి మెడిసిన్ వచ్చేసింది..

కరోనా కి పతంజలి మందును విడుదల చేసిన రాందేవ్ బాబా : 7 రోజుల్లో కరోనా ని కట్టడి చేయవచ్చు అని వివరించిన రాందేవ్ బాబా.

కరోనాకి మందులు మార్కెట్లోకి బోల్డన్ని వచ్చేస్తున్నాయి. మరి ఇవి ఎంత వరకు కరోనాని కట్టడి చేస్తాయో చూడాలి. ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి.. తన ఆయుర్వేద ఉత్పత్తులను ఉపయోగించి కొరోనిల్ పేరుతో కరోనా వైరస్ కి మందును కనిపెట్టి మార్కెట్లోకి తీసుకువచ్చింది. సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ ఈ విషయాన్ని వెల్లడి చేస్తూ హరిద్వార్ లోని యోగ్ పీఠ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాందేవ్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.

ఇలాంటి విపత్కర సమయంలో ఆయుర్వేద మెడిసిన్ కొరోనిల్ తీసుకురావడం ఓ మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఈ మెడిసిన్ తో కరోనాను నయం చేయవచ్చు. మూడు రోజుల పరిశీలనానంతరం 69 శాతం మందికి నెగిటివ్ రావడం శుభపూచకం. అలాగే 7 రోజుల్లో వంద శాతం మంది కోలుకున్నారు. ఈ మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం అని రాందేవ్ అన్నారు. ఈ మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు.

ఎన్నో క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాతే ఈ మందును తీసుకువచ్చామని రాందేవ్ బాబా తెలియజేశారు. మందులు వాడిన వారు 69% మంది 3 రోజుల్లో కోలుకున్నారని, 100% వారం రోజుల్లో కోలుకున్నారని వివరించారు.

260 మందికి చేసిన ఈ ప్రయోగంలో ఒక్క రోగి కూడా మరణించకపోవడం పతంజలి ఔషధం యొక్క శక్తిని  తెలియజేస్తుంది.  వచ్చే సోమవారం నుంచి ఇది అన్ని పతంజలి దుకాణాలలో లో లభిస్తుంది.
మన పూర్వికులు ఆయుర్వేదాన్ని మరలా తీసుకువచ్చిన పతంజలి సంస్థకి, రాందేవ్ బాబా గారికి, అంజలి సంస్థకి హృదయపూర్వక అభినందనలు , ధన్యవాదాలు తెలియజేస్తుంది. _తెలుగు భారత్..

మూలము: opindia

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top